కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ అన్నారు. 1272 మంది సివిల్ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీలు, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కంపెనీలు, ఏపీఎస్పీకు చెందిన ప్రత్యేక బృందాలను విధుల్లో ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. 32 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. సెక్షన్ 144, 30 అమల్లో ఉన్నందున విజయోత్సవాలు, ఆందోళనలు, ధర్నాలు, సమావేశాలు, సభలు నిషేధమని కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు.