mahesh chandra laddha
-
Hyd: ప్రేమ విఫలమైందని రివాల్వర్‌తో కాల్చుకుని..
సాక్షి, హైదరాబాద్: సీఆర్పీఎఫ్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా ఇంట తుపాకీ పేలింది. ఆయన వద్ద పని చేసే ఓ జవాన్ సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం సికింద్రాబాద్ బేగంపేటలోని చికోటి గార్డెన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. మృతున్ని ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దేవేందర్ కుమార్‌గా గుర్తించారు. సీఆర్పీఫ్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా వద్ద విధులు నిర్వహిస్తున్నాడు దేవేందర్. సూసైడ్‌కు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: బెట్టింగ్‌లో భారీ నష్టం.. అయ్యో మధు! -
కౌంటింగ్ కేంద్రల వద్ద సివిల్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ భద్రత
-
‘నేరచరితులకు అనుమతి లేదు’
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి పాస్‌లు ఉన్న వారిని మాత్రమే మద్దిలపాలెం, త్రీ టౌన్ రోడ్లో ఉన్న గేట్ ద్వారా అనుమతినిస్తామని కమిషనర్ తెలిపారు. అంతేకాకుండా కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ నేరచరితులను అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు వచ్చిన 1430 మంది ఏజెంట్ల జాబితాలో 40 మంది పైన కేసులున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులకు మినహా మరెవరికీ సెల్ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమితి లేదన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ అన్నారు. 1272 మంది సివిల్ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీలు, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్కు చెందిన కంపెనీలు, ఏపీఎస్పీకు చెందిన ప్రత్యేక బృందాలను విధుల్లో ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. 32 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. సెక్షన్ 144, 30 అమల్లో ఉన్నందున విజయోత్సవాలు, ఆందోళనలు, ధర్నాలు, సమావేశాలు, సభలు నిషేధమని కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : కౌంటింగ్ కేంద్రల వద్ద సివిల్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ భద్రత -
పోలీసు వలపు వేధింపులు..!
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు అధికారే లైంగిక వేధింపులకు పాల్ప డ్డారనే ఆరోపణలు నగరంలో కలకలం రేపాయి. ప్రేమించి మోసపోయిన తన సోదరి పెట్టిన కేసు పురోగతిపై వాకబు చేసేందుకు యత్నించిన బాధితురాలి సోదరితో ఫోన్లో ఎంవీపీ సీఐ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ ఘటనపై బాధితులు, మహిళా చేతన సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఎంవీపీ కాలనీ సెక్టార్ – 9 గొల్లవీధిలో తల్లి, చెల్లితో నివసిస్తున్న పల్లా కృష్ణకుమారి ఆం ధ్రా యూనివర్సిటీ జియాలజీ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నారు. ఆమెను వరుసకు బావ అయ్యే విజయభాస్కర్ ప్రేమ పేరుతో వంచించి లైంగికంగా లొంగదీ సుకున్నాడని ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఇటీవల ఫిర్యా దు చేసింది. ఫిర్యాదు అందిన తరువాత సదరు యువకుడు విజయభాస్కర్‌ని సీఐ పిలి పించి చర్యలు తీసుకోలేదని, పైగా కృష్ణకుమారి సోదరి మీనాక్షికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడారని బాధితులు ఆరోపిస్తున్నారు. మీనాక్షికి సీఐ సన్యాసినాయుడు ఫోన్‌చేసి.. ఎక్కడ ఉంటున్నారు..?, ఏం చదువుతున్నావు..? ఇంటి అద్దె ఎంత అం టూ వ్యక్తిగత వివరాలు అడగారని, ఏ టైమ్‌లో ఫ్రీగా ఉంటావు..? బీచ్‌కి ఎప్పుడు వస్తావు, ఇద్దరం ఒకే కేస్ట్ కదా.. అంటూ సీఐ లైంగికంగా వేధించారని మీనాక్షి ఆరోపించింది. తన అక్కకి అలా జరిగిందని, తాను కూడా అలాంటిదాన్నే అని భావిస్తున్నారా అని సీఐని ప్రశ్నించినా చులకనగా మాట్లాడారని మీనాక్షి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మహిళా చేతన కార్యదర్శి పద్మను ఆశ్రయించగా ఆమె సోమవారం ఎంవీపీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐతో మాట్లాడారు. బాధితురాలు మీనాక్షితో కలిసి సీఐని నిలదీయగా... మొదట బుకాయించినప్పటికీ ఆడియో రికార్డింగ్‌ను వినిపించడంతో సీఐ కాళ్ల బేరానికి వచ్చాడని పద్మ మీడియాకు తెలిపారు. ఇటువంటి సీఐపై సీపీ మహేష్‌చంద్ర లడ్డా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆమె బాధితులతో కలిసి ద్వారకా సబ్ డివిజన్ ఏసీపీ వై.వి.నాయుడుని కలిసి ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉండీ మహిళలతో చులకనగా మాట్లాడిన సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. సన్యాసినాయుడుపై సీపీ కొరడా ఎంవీపీ సీఐ ఎన్.సన్యాసినాయుడుపై సీపీ కొరడా ఝులిపించారు. ప్రేమించి మోసపోయానని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు సోదరి మీనాక్షి పట్ల ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదు అందడంతో సీపీ మహేష్‌చంద్రలడ్డా ఎంవీపీ సీఐని సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడి త్రీటౌన్ స్టేషన్ సీఐ బెండి వెంకటరావు కూడా ఒక బాధితురాలితో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదు రావడంతో అప్పటి సీపీ యోగానంద్ వెంటనే స్పందించి సీఐ వెంకటరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తరువాత ఆయనకు శ్రీకాకుళంలో పోస్టింగ్ ఇచ్చారు. సీఐ సన్యాసినాయుడు మోసగాడిని అరెస్ట్ చేయాలి ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి మరో అమ్మాయితో వివాహానికి సిద్ధపడుతున్న మోసగాడిని అరెస్ట్ చేయాలని మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ, బాధితురాలు కృష్ణకుమారి డిమాండ్ చేశారు. పద్మతో కలిసి ఎంవీపీ పోలీసు స్టేషన్ ఆవరణలో కృష్ణకుమారి మీడియాతో సోమవారం మాట్లాడారు. తాను ఆంధ్రా యూనివర్సిటీ జియాలజీ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నానని, తల్లి, చెల్లితో కలిసి ఎంవీపీ కాలనీ సెక్టార్ – 9 గొల్లవీధిలో నివసిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ జియ్యమ్మవలస మండలం పరసవాడు దరి లక్ష్మీపురం గ్రామానికి చెందిన మేనమామ మన్మథనాయుడు కుమారుడు తాడేల విజయభాస్కర్, తాను ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నామన్నారు. తామిద్దరం ఢిల్లీ, బెంగళూరు, తిరుపతి పట్టణాలు తిరిగామన్నారు. విజయభాస్కర్ బెంగళూరులోని ఫార్చ్యూన్ సమ్మిట్ ట్రావెల్ సెంట్రిక్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడన్నారు. మీడియాతో మాట్లాడుతున్న మహిళా చేతన కార్యదర్శి పద్మ తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు బావ తనను మభ్యపెట్టి లైంగికంగా లోబరుచుకున్నాడని ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి విశాఖ, తిరుపతి పట్టణాలలోని హోటల్స్‌లో కూడా లోబరచుకున్నాడన్నారు. గత ఏడాది నుంచి తనకు ముఖం చాటేస్తున్నాడని విచారం వ్యక్తం చేశారు. తన మేనమామకు విషయం అంతా చెప్పినా సరే పెళ్లికి అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎంవీపీ కాలనీలో నివసిస్తున్న మరో యువతితో విజయభాస్కర్ వివాహ నిశ్చితార్థం చేసుకున్నాడన్నారు. ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మార్చి 9న వాయిదా పడిన నిశ్చితార్థం ఈ నెల 27న ఒక హోటల్లో రహస్యంగా నిర్వహించారన్నారు. తనకు అన్యాయం చేసిన విజయభాస్కర్‌ని అరెస్ట్ చేయాలని, మేనమామపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మహిళా చేతన నాయకులు కూడా పాల్గొన్నారు. -
విజయారెడ్డి దారుణ హత్య.. ఆ కిరాతకుడే చంపాడు!
సీతమ్మధార (విశాఖ ఉత్తర): నగరంలో సంచలనం సృష్టించిన మాజీ కౌన్సిలర్ విజయారెడ్డి హత్యకేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. పక్క వ్యూహంతోనే ఆమెను దుండగులు హత్య చేశారని, ఇల్లు కొనుగోలు చేయడానికి వచ్చిన వారే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు నిర్ధారించారు. విజయారెడ్డిని కోలా వెంకట హేమంత్‌కుమార్ అనే వ్యక్తి దారుణంగా హతమార్చగా.. నిందితుడికి రాధిక అనే మహిళ సహకరించిందని తేల్చారు. పోలీసుల కథనం ప్రకారం అసలు ఏం జరిగిందంటే.. అపార్ట్మెంట్లోని తన ఫ్లాట్‌ను రూ. కోటి 50 లక్షలకు విజయారెడ్డి అమ్మకానికి పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న హేమంత్, రాధిక గత శనివారం ఉదయం ఆమె దగ్గరికి వచ్చి.. 3 గంటలపాటు మంతనాలు జరిపారు. రెండోసారి అడ్వాన్స్ ఇస్తామని చెప్పి గత సోమవారం (ఫిబ్రవరి 25న) హేమంత్ ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో విజయారెడ్డి భర్త విష్ణునారాయణరెడ్డి ఇంట్లో లేకపోవడంతో దుండగుడి వ్యూహం ఫలించింది. దీంతో విజయారెడ్డిపై బలత్కారం చేసిన హేమంత్ అనంతరం ఆమెను కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం అదే ఇంట్లో స్నానం చేసి ఆమె భర్త దుస్తులను ధరించి బయటకు వెళ్లిపోయాడు. హత్య చేసిన అనంతరం ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకెళ్లిన నిందితుడు.. వాటిని జువెల్లరీ షాప్‌లో విక్రయించాడు. విజయారెడ్డి కారును, ఫోన్‌ను కూడా దుండగుడు ఎత్తుకెళ్లాడు. అతను తీసుకెళ్లిన ఫోన్‌నే నిందితుడిని పట్టించిందని, ఈ కేసులో హేమంత్ ఏ-1 నిందితుడు కాగా.. రాధికను ఎ-2గా నిర్ధారించామని పోలీసులు తెలిపారు. అలకనందా రియల్ ఎస్టేట్ కంపెనీలో నిందితులిద్దరు సహోద్యోగులని, వారి మధ్య అక్రమసంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడి.. డబ్బుకోసం వారు ఈ ఘాతుకానికి ఒడిగట్టారని విశాఖపట్నం పోలీసు కమిషనర్ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. చదవండి: కిరాతకులెవరో..? -
ప్రధాని సభకు కట్టుదిట్టమైన భద్రత
విశాఖపట్నం: ప్రస్తుతం దేశమంతా టెన్షన్ వాతావరణం నెలకొన్న దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ సభకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని విశాఖ నగర సీపీ మహేష్ చంద్ర లడ్హా తెలిపారు. ఎస్పీజీకి చెందిన సుమారు 35 మంది ఐజీ, డీఐజీ స్థాయి అధికారులతో పాటుగా పెద్ద సంఖ్యలో బలగాలను సభా ప్రాంగణం పరిధిలో మోహరిస్తున్నట్లు వెల్లడించారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌తో పాటు సుమారు 2,250 మంది రాష్ట్ర బలగాలను కేటాయించినట్లు వెల్లడించారు. సభ జరిగే ప్రాంగణంలోకి సెల్ఫోన్లు తప్ప మరే ఇతర వస్తువులను అనుమతించమన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి సభ జరిగే రైల్వే గ్రౌండ్స్‌కు ప్రధాని రోడ్డు మార్గం ద్వారా చేరుకోనున్నందున ఆ మార్గమంతా అదనపు బలగాలను కేటాయించామని చెప్పారు. రేపు నాలుగున్నరకు రాక భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా త్రివేండ్రం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా బీజేపీ నిర్వహించే ప్రజా చైతన్య బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు సభ ముగించుకుని తిరిగి రోడ్డు మార్గం ద్వారా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ వెళ్తారు. -
విశాఖ టీ20 మ్యాచ్‌కు 23వేల టికెట్లు కట్..!
సాక్షి, విశాఖపట్నం : భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరుగనుండడంతో క్రికెట్ అభిమానులతో విశాఖపట్నం హోరెత్తనుంది. ఆదివారం (ఫిబ్రవరి 24) సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 వరకు వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే 23 వేల టికెట్లు అమ్ముడు పోయినట్లు నిర్వాహకులు తెలిపారు. మ్యాచ్‌కు అదనపు భద్రతను కల్పించామని, 1400 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు. బయటి నుంచి ఎలాంటి వస్తువులను స్టేడియంలోకి అనుమంతించేది లేదని స్పష్టం చేశారు. మ్యాచ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయని స్టేడియం నిర్వాహక కమిటీ ప్రతినిధి, పోర్టు చైర్మన్ కృష్ణబాబు తెలిపారు. రేపు (శనివారం) ఇరు జట్ల మధ్య ప్రాక్టీస్ మ్యాచ్ జరుగనుంది. కాగా, రెండు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి టీ20 బెంగుళూరులో.. రెండో టీ20 విశాఖలో జరగాల్సి ఉండగా.. కర్ణాటక క్రికెట్ అసోషియేషన్ అభ్యర్థన మేరకు వేదికల తేదీలు మారాయి. ఆదివారం రోజున బెంగుళూరులో ఏరో ఇండియా షో జరగనుండడంతో ఈ మార్పు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ బెంగుళూరుకు రానుండడంతో శాంతిభద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో 27,500 సీట్ల సామర్థ్యం గల విశాఖ స్టేడియం తొలి టీ20కి వేదికైంది. 27వ తేదీన బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో రెండో టీ20 జరుగనుంది. (బెంగళూరులోనే ఏరో షో) -
సరిగ్గా అదే రీతిలో సీపీ లడ్హా..
యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. సరిగ్గా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసు దర్యాప్తును ఎన్ఐఏ చేపట్టిన ఉత్తరక్షణమే అలా సెలవులో వెళ్లిపోయిన ఆయన.. కేసు విచారణలో భాగంగా నిందితుడు నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావును విజయవాడ ఎన్ఐఏ కోర్టుకు.. అక్కడి నుంచి జైలుకు తరలించగానే.. లడ్హా ఇలా సెలవు ముగించుకుని వచ్చేశారు.వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్ర కోణాన్ని దాచేసి విచారణ మొత్తం ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు జరిగిందన్న వాదనలకు బలం చేకూర్చేలా.. లడ్హా వ్యవహారశైలి ఉండటం వివాదాస్పదమవుతోంది.కేసు ఎన్ఐఏ పరిధిలోకి వెళ్లిన తర్వాత సీపీ లడ్హా ప్రెస్‌మీట్ పెట్టి ఆ కేసులో శ్రీనివాసరావు తప్ప నిందితులెవ్వరూ లేరని చెప్పడం, కుట్ర కోణమే లేదని స్పష్టం చేయడం, ఆ వెంటనే సెలవులోకి వెళ్ళడం ద్వారా ఎన్నో అనుమానాలకు తావిచ్చారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసు దర్యాప్తులో మొదటి నుంచి విశాఖ పోలీసుల వ్యవహారశైలి అనుమానాస్పదంగానే ఉంది. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25వ తేదీన దుండగుడు శ్రీనివాసరావు ప్రతిపక్ష నేతపై కత్తిదూసి హత్యాయత్నం చేసిన క్షణం మొదలు.. కేసు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు బదలీ అయిన నేపథ్యం వరకు ఏ కోణంలో చూసినా పోలీసుల తీరు ఆరోపణలకు తావిచ్చే విధంగానే ఉంది. హత్యాయత్నం ఘటన దరిమిలా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేపట్టిన విచారణ క్రమం పరిశీలించిన ఎవ్వరికైనా.. ఆ కేసు నిర్వీర్యమైపోతుందని అర్ధమైపోతుంది. సరిగ్గా అదే రీతిలో సీపీ లడ్హా.. కేసులో ఎవ్వరి పాత్ర లేదని, శ్రీనివాసరావు ఒక్కడే ప్రచారం కోసం హత్యాయత్నానికి పాల్పడ్డాడని మొదటి నుంచి చెప్పుకొస్తూ వచ్చారు. ఆ క్రమంలోనే హైడ్రామా సృష్టించి విచారణ తంతు సాగించారు. నెల రోజుల తర్వాత సిట్ ఆఫీసును కూడా క్లోజ్ చేసేశారు. అంతా పక్కాగా కేసును నిర్వీర్యం చేసి క్లోజ్ చేసేశామని పోలీసు పెద్దలు, సర్కారు పెద్దలు భావిస్తున్న తరుణంలో హైకోర్టు విచారణతో కేసు కేంద్ర హోంశాఖ పరిధిలోకి వెళ్లింది. దీంతో విశాఖ పోలీసులకు, సర్కారు పెద్దలకు ఊహించని షాక్ తగిలింది. హైకోర్టు నిర్ణయంతో వెంటనే కేంద్ర హోంశాఖ కేసును ఎన్ఐఏకు అప్పగించడంతో ఆ సంస్థ జనవరి ఒకటో తేదీన కేసు నమోదు చేసింది. విషయం తెలుసుకున్న వెంటనే సీపీ లడ్హా హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టి కేసులో శ్రీనివాసరావు మినహా మరెవ్వరి పాత్ర లేదని తేల్చేశారు. మరుసటి రోజు ఎన్ఐఏ అధికారులు విశాఖ వచ్చి దర్యాప్తుకు రంగం సిద్ధం చేయగానే.. లడ్హా వ్యక్తిగత పనుల పేరిట సెలవుపై వెళ్ళిపోయారు. నాలుగు రోజులని చెప్పి.. వారం రోజులు నాలుగురోజుల పాటు వ్యక్తిగత పనులపై రాజస్థాన్ వెళ్ళారని పోలీసు వర్గాలు చెప్పుకొచ్చాయి. సరిగ్గా ఎన్ఐఏ రంగంలోకి దిగగానే ఆయన నాలుగురోజులంటూ వెళ్లి ఏకంగా వారంరోజుల పాటు.. కాదు కాదు.. కేసు విచారణ పర్వం విజయవాడకు బదిలీ అయ్యే వరకు.. శ్రీనివాసరావును విజయవాడ కోర్టుకు తరలించే వరకు.. సెలవు కొనసాగించడం చర్చనీయాంశమవుతోంది. నిజంగానే ఆయన సెలవు యాధృచ్ఛికమే అనుకున్నా... జాతీయస్థాయిలో కలకలం రేపిన ఓ ప్రధాన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం కేసు విచారణ జాతీయ దర్యాప్తు సంస్థ చేపట్టిన సందర్భంలో లడ్హా వ్యవహారశైలి వివాదాస్పదమైంది. సరిగ్గా గురువారం అర్ధరాత్రి నిందితుడు శ్రీనివాసరావును విజయవాడకు తరలించగానే.. శుక్రవారం నుంచి లడ్హా అందుబాటులో ఉన్నారని కమిషనరేట్ వర్గాలు చెప్పడం గమనార్హం. -
ఎన్ఐఏకు సహాయ నిరాకరణ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసును కుట్రపూరితంగా నిర్వీర్యం చేసిన విశాఖ పోలీసులు... ఇప్పుడు కేసు విచారణ చేపట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ)కు సహాయ నిరాకరణ చేస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ విమానాశ్రయంలో గతేడాది అక్టోబర్ 25న ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం ఘటనమీద దర్యాప్తును హైకోర్టు ఆదేశాల మేరకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఎ)కు అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఎన్ఐఎ జనవరి 1న ఎఫ్ఐఆర్ను నమోదు చేసి దర్యాప్తు కూడా మొదలుపెట్టింది. ఆ క్రమంలో ఎన్ఐఎ ప్రధాన దర్యాప్తు అధికారి(సీఐఓ) మహ్మద్ సాజిద్ఖాన్తోసహా ఐదుగురు అధికారులు శనివారం విశాఖకు చేరుకుని రంగంలోకి దిగారు. ఎన్ఐఎ అధికారులు ఇలా అడుగుపెట్టగానే విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్హా అర్ధంతరంగా సెలవులోకి వెళ్లడం గమనార్హం. వ్యక్తిగత పనుల పేరిట ఆయన శనివారం నుంచి నాలుగురోజులపాటు లీవులోకి వెళ్లడంతో సీనియర్ ఐపీఎస్ అధికారి రవిశంకర్ అయ్యన్నార్‌కు తాత్కాలిక సీపీ పర్యవేక్షణ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ప్రతిష్టాత్మక కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగగానే లడ్హా ఉద్దేశపూర్వకంగా సెలవు పేరిట సహాయ నిరాకరణ చేస్తున్నారన్న వాదనలు స్వయంగా పోలీసువర్గాల నుంచే వినిపిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వం సూచనల మేరకే లడ్హా సెలవుపై వెళ్లారని ఆ వర్గాలంటున్నాయి. మొదటినుంచీ లడ్హా తీరు వివాదాస్పదమే వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటన జరిగినప్పటి నుంచి విశాఖ సీపీ లడ్హా తీరు వివాదాస్పదంగానే ఉంది. ఘటన జరిగిన రోజైన గతేడాది అక్టోబర్ 25న ఆయన ఎవరికీ అందుబాటులోకి రాలేదు. అమరావతిలో ఉన్నతాధికారులతో సమావేశానికి వెళ్లినందువల్ల ఆరోజు కాస్త ఇబ్బందైందని చెప్పుకున్న లడ్హా ఆ తర్వాత విచారణ తంతును దగ్గరుండి నడిపించారు. కేసు విచారణకు ప్రత్యేకంగా ఏసీపీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను నియమించినప్పటికీ మొత్తం కథ లడ్హానే నడిపారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ శ్రీనివాసరావు ఒక్కడికే విచారణను పరిమితం చేసి... అతడి పోలీస్ కస్టడీ ముగియగానే సిట్ విచారణనూ బంద్ చేసేశారు. చివరికి సిట్ కార్యాలయానికి తాళం కూడా వేసేశారు. అయితే కేసు జనవరి 1న ఎన్ఐఎకి బదిలీ అయిన విషయం తెలుసుకుని హడావుడిగా సీపీ లడ్హా జనవరి 2న ప్రెస్‌మీట్ పెట్టి జగన్‌పై జరిగింది హత్యాయత్నమే కాదని, ప్రచారం కోసం శ్రీనివాసరావు గాయం చేశాడని ప్రకటించారు. ఈ ప్రకటనతో లడ్హా తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా ఇప్పుడు ఎన్ఐఎ రంగంలోకి దిగగానే నాలుగురోజులపాటు సెలవు పేరిట సెల్ స్విచాఫ్ చేసి ఎవరికీ అందుబాటులోకి రాకుండా వెళ్లిపోవడం వివాదాస్పదమవుతోంది. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దంటూ.. ఇదిలా ఉండగా, రంగంలోకి దిగిన ఎన్ఐఎ అధికారులు శనివారం ముందుగా ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్‌ను పరిశీలించి అక్కడి పోలీసు అధికారులతో మాట్లాడారు. పోలీసులు విచారణ చేపట్టిన క్రమాన్ని అడిగి తెలుసుకునేందుకు యత్నించారు. తర్వాత సిట్ అధికారులతోనూ సమావేశమయ్యారు. అయితే సదరు అధికారులెవ్వరూ ఎన్ఐఎ అధికారులకు ఏమాత్రం సహకరించలేదని తెలుస్తోంది. కనీసం సమాచారం కూడా అందించలేదంటున్నారు. అంతా పోలీస్ కమిషనర్ లడ్హా దగ్గరుండి చూశారు.. ఏదైనా ఉంటే మీరు ఆయనతో మాట్లాడండని ఎయిర్పోర్ట్ స్టేషన్ పోలీసులు, సిట్ వర్గాలు ఎన్ఐఎ అధికారులకు స్పష్టం చేసినట్టు సమాచారం. ‘‘దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి.. మీ దర్యాప్తు మీరు చేసుకోండి... మీకు సహకరించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో ఎక్కడా లేదు.. అలాగని రాష్ట్రప్రభుత్వం కూడా ఇప్పటివరకు మాకేమీ ఆదేశాలివ్వలేదు.. ప్రభుత్వాన్ని కాదని సమాచారమిచ్చినా.. సహకరించినా మాకు ఇబ్బంది.. మమ్మల్ని అర్థం చేసుకోండి’’ అంటూ పోలీసులు ఓ దశలో ఎన్ఐఎ అధికారుల్ని వేడుకున్నట్టు తెలుస్తోంది. అలా ఏమీ లేదు.. వాళ్ళడిగిన సమాచారం ఇస్తున్నాం ‘‘ఎన్ఐఎ అధికారులకు మేం సహకరించట్లేదనే వాదనల్లో నిజం లేదు. ఎన్ఐఎ సీఐఓ మహ్మద్ సాజిద్‌ఖాన్ నన్ను కలిశారు. కావాల్సిన సమాచారం అడిగారు. నా పరిధిలో నేను చెప్పాల్సింది చెప్పాను..’’ అని కేసు విచారణపై రాష్ట్రప్రభుత్వం నియమించిన సిట్ అధికారి ఏసీపీ నాగేశ్వరరావు సాక్షి ప్రతినిధితో అన్నారు. కాగా ఇప్పటివరకు ఎన్ఐఎ బృందం ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన దాఖలాల్లేవని విశాఖ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ప్రకాష్‌రెడ్డి చెప్పారు. – సిట్ అధికారి ఏసీపీ నాగేశ్వరరావు దర్యాప్తు మొదలుపెట్టాం.. అప్పుడే ఏమీ చెప్పలేం ‘‘దర్యాప్తు ఇవాళే మొదలుపెట్టాం... విచారణ ప్రాథమిక దశలో ఉంది.. అప్పుడే ఏమీ చెప్పలేం...’’ అని ఎన్ఐఎ ప్రధాన దర్యాప్తు అధికారి(సీఐఓ) మహ్మద్ సాజిద్‌ఖాన్ శనివారం రాత్రి సాక్షి ప్రతినిధితో అన్నారు. రాష్ట్ర పోలీసులు సహకరిస్తున్నారా? అనే ప్రశ్నకు.. నో కామెంట్ అని ఆయన సమాధానమిచ్చారు. – ఎన్ఐఎ సీఐఓ మహ్మద్ సాజిద్‌ఖాన్ -
మహేష్‘చంద్రం’.. ఇదేనా మర్మం!
ఔను.. మహేష్‘చంద్రం’లది డ్రామాయేనని తేలిపోయింది.పోలీసుల హైడ్రామా, పనితీరుపై ముప్పిరిగొన్న అనుమానాలు, అంచనాలను తాజా పరిణామాలు అక్షరాలా నిజమని రుజువు చేశాయి. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం ఘటన కేసు విచారణలోనే కాదు.. ఆ కేసును నిరుగార్చి.. క్లోజ్ చేసేయాలన్న తొందరలోనూ పోలీసులు కుట్రకు తెరలేపిన విషయం హైకోర్టు ఆదేశాలతో బట్టబయలైంది. కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)కి అప్పజెబుతూ హైకోర్టు కేంద్ర హోం శాఖకు ఆదేశాలు ఇచ్చిన విషయాన్ని ముందే పసిగట్టిన సర్కారు అప్పటికప్పుడు విశాఖ పోలీసులతో హడావుడిగా ప్రెస్‌మీట్ పెట్టించింది.రాష్ట్ర పోలీసుల విచారణపై నమ్మకం లేని వైఎస్సార్సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కేసునుఎన్ఐఏకు అప్పజెప్పాలని ఉన్నత న్యాయస్థానం డిసెంబర్ 31నే కేంద్ర హోమ్ శాఖను ఆదేశించింది.కేంద్ర హోమ్‌శాఖ ఆదేశాలతో జనవరి ఒకటో తేదీన కేసు తీసుకున్నహైదరాబాద్లోని ఎన్ఐఏ విభాగం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసింది. అంటే ఆ రోజు నుంచే కేసు ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్ళిపోయింది.ఈ ఉప్పందుకున్న సర్కారు ఆదేశాలతో విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్హా ఆ మరుసటి రోజు.. అంటేజనవరి 2న హడావుడిగా మీడియా సమావేశం పెట్టి ప్రతిపక్ష నేతపై హత్యాయత్నాన్ని చిన్నపాటి ఘటనగా తేల్చేశారు. విచారణ దాదాపు క్లోజ్ అయిందని, శ్రీనివాసరావు ఒక్కడే.. ఏదో ప్రచారం కోసం చేశాడనిచాలా తేలిగ్గా తీసిపారేశారు,వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ సందర్భంగా కేసును ఎన్ఐఏకు అప్పజెప్పిన విషయం హైకోర్టు స్పష్టం చేయడంతో విశాఖ పోలీసుల కుటిలత్వం, సర్కారు కుట్ర బట్టబయలయ్యాయి. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం ఘటన కేసు విచారణలో మొదటి నుంచి హైడ్రామాలకు తెరలేపిన విశాఖ పోలీసులు చివరికి కేసు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) పరిధిలోకి వెళ్ళిందని తెలిసిన తర్వాత కూడా అర్ధంతరంగా ప్రెస్‌మీట్ పెట్టి మరో కుట్రకు తెరలేపారు. వైఎస్ జగన్‌పై విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో అక్టోబర్ 25న జరిగిన హత్యాయత్నంపై విచారణ తొలి రోజు నుంచీ పోలీసుల తీరు అడుగడుగడునా అనుమానాలకే తావిచ్చింది. జగన్‌పై కత్తితో దాడి చేసిన ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ ఉద్యోగి శ్రీనివాసరావుకే విచారణను పరిమితం చేసిన పోలీసులు ఇంతవరకు అసలు కుట్రధారులు, సూత్రధారుల జోలికే పోలేదు. పలు కేసులున్నా.. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం థానేలంక గ్రామానికి చెందిన శ్రీనివాసరావుపై అక్కడి పోలీస్‌స్టేషన్‌లోనే ఎన్నో కేసులున్నాయి. నేర చరిత ఉన్న వారిని రక్షణశాఖ అధీనంలోని విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో పొరపాటున కూడా ఉద్యోగంలోకి తీసుకోరు. పోలీస్‌స్టేషన్ నుంచి ఎన్వోసీ(నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) ఇస్తేనే ఎయిర్పోర్ట్ ప్రాంగణంలో ఉద్యోగం చేసేందుకు అర్హులు. అయితే నేరచరిత ఉన్న శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా ప్రవేశించగలిగాడు.. అతనికి ఎన్వోసీ ఇప్పించిందెవరు.. అన్న ప్రశ్నలకు ఇంతవరకు పోలీస్ కమిషనర్ కూడా స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ? ∙శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని తొట్టెంపూడి హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి మొదటి నుంచి కరడుగట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడు. అప్పట్లో ఎన్టిఆర్ మొదలు ఇప్పటి సీఎం చంద్రబాబునాయుడు, లోకేష్‌లు వైజాగ్ ఎప్పుడొచ్చినా వెన్నంటే ఉండి హల్చల్ చేస్తుంటారు. ఇక దగ్గుబాటి పురంధేశ్వరి సిఫార్సుతో 2010లో వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో రెస్టారెంట్ లీజుకు తీసుకున్న హర్షవర్ధన్.. మొదటి నుంచి టీడీపీ నేతలు సిఫార్సు చేసిన వ్యక్తులనే రెస్టారెంట్లో ఉద్యోగంలోకి తీసుకున్నాడు. అలాంటిది శ్రీనివాసరావును ఎవరు సిఫార్సు చేశారు.. ఎవరు చెబితే ఉద్యోగంలోకి తీసుకున్నాడు.. ? అనే దిశగా పోలీసులు విచారణే చేయలేదు. బయటి నుంచి గుండుసూది కూడా తీసుకెళ్లలేని ఎయిర్‌పోర్ట్‌లోకి శ్రీనివాసరావు కత్తులు ఎలా తీసుకురాగలిగాడు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడ్డ రోజే కత్తులకు రెస్టారెంట్లోనే స్టెరిలైజ్ చేశాడని స్వయంగా సీపీనే ప్రకటించారు. అంత జరుగుతుంటే హర్షవర్ధన్ ఎందుకు అడ్డుకోలేదనే దానిపై సీపీ నుంచి సమాధానమే లేదు. ∙శ్రీనివాసరావుది మొదటి నుంచి రెస్టారెంట్లో సాయంత్రం నుంచి రాత్రి వరకు ఉండే బీ షిఫ్ట్ డ్యూటీ. జగన్‌పై దాడి చేసిన రోజు మాత్రం ఉదయమే విధుల్లోకి వచ్చినా రెస్టారెంట్లోనే ఉన్న హర్షవర్ధన్ ఎందుకు ప్రశ్నించలేదు. శ్రీనివాసరావు ఉద్యోగం అసిస్టెంట్ కుక్ అయితే సర్వీస్ అసిస్టెంట్ చేసే పని అతను చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదు..? పోనీ జగన్‌తో సెల్పీ కోసం అని శ్రీనివాసరావు చెప్పాడనుకున్నా అతని వద్ద కెమెరా ఫోన్ లేదని రెస్టారెంట్లో ఉన్న వారందరికీ తెలుసు. అప్పుడైనా కెమెరా ఫోన్ లేకుండా సెల్ఫీ ఏమిటని అడగాలి. కనీసం అప్పటి వరకు అక్కడే ఉన్న హర్షవర్ధనైనా ప్రశ్నించాలి.. కానీ అలా ఎవరూ అడగలేదు. ఈ చిన్న విషయాలు కూడా హర్షవర్ధన్ పట్టించుకునేంతటి పరిస్థితి లేదు అని చెబితే నమ్మశక్యం కాదు.. ఎందుకంటే ఆ రెస్టారెంట్లో పనిచేసే ఉద్యోగులు పదిమంది లోపే. రోజులో ఎక్కువసేపు హర్షవర్ధన్, ఆయన భార్య ఆ రెస్టారెంట్లోనే ఉంటుంటారు. కాబట్టి ఉద్యోగుల తీరును దగ్గరి నుంచి చూస్తుంటారు. అలాంటిది శ్రీనివాసరావును మేము కనిపెట్టలేకపోయామంటే.. అది నిజమే కాదు. ∙వైఎస్ జగన్ గత ఆగస్టు నెల నుంచి వారానికి దాదాపు రెండుసార్లు చొప్పున ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నారు. తొమ్మిది నెలలుగా అక్కడే పనిచేస్తున్న శ్రీనివాసరావు ఏరోజూ ఎందుకు జగన్‌ను కలవలేదు.? జగన్‌ను జనంలో కలవాలంటే కాస్త కష్టమైన పనేమో గానీ.. వాస్తవానికి ఎయిర్పోర్ట్ లోపల జగన్‌ను ఒకింత సాధ్యమయ్యే పనే, మరి వీరాభిమాని అని చెబుతున్న అతను జగన్‌ను అక్టోబర్ 25వ తేదీన కత్తి దూసే వరకు ఎందుకు కలవలేదు.? సీఎస్‌వో తీరూ అనుమానాస్పదమే గత రెండున్నర నెలలుగా జగన్ ఎయిర్‌పోర్ట్‌కు ఎప్పుడొచ్చినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థానిక వార్డు అధ్యక్షుడు శ్రీధర్ ఇంటి నుంచి కాఫీ వచ్చేది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఆయన విమానం దిగి నేరుగా బయటకు వచ్చి పాదయాత్ర జరిగే ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్ళేటప్పుడు మాత్రమే కాస్త సమయముంటే వీవీఐపీ లాంజ్‌కు వెళ్ళి పార్టీ నేతలతో భేటీ అవుతారు. అయితే ఘటన జరగడానికి వారం ముందే జగన్‌కు బయటి నుంచి కాఫీ తీసుకురావడం కుదరదని ఎయిర్పోర్ట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్(సీఎస్‌వో) వేణుగోపాల్ అడ్డుకున్నారు. కాఫీ ఫ్లాస్క్ కూడా స్వాధీనం చేసుకుని సీరియస్ అయ్యారు. పక్కనే ఉన్న రెస్టారెంట్ నుంచే తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించాడు. ఇలా అన్న రెండో వారమే ఆ రెస్టారెంట్ నుంచే శ్రీనివాసరావు వచ్చి కత్తి దూశాడు. రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగిందన్న అనుమానాలు ఇక్కడే బలపడుతున్నాయి. శేషప్రశ్నలతోనేకేసు చుట్టబెట్టేశారు పక్కా వ్యూహం ప్రకారం రాష్ట్ర శాంతి భద్రతల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో కాకుండా సునిశిత సమస్యగా మారే కేంద్ర బలగాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతపై దాడికి తెగబడటం మామూలు విషయం కాదు. ఒక్క వేటుతో గొంతులోకి కత్తి దించి ప్రాణాలు హరించడమే లక్ష్యంగా ఘాతుకానికి తెగించిన శ్రీనివాసరావుకు ఇదంతా చేయమని నూరిపోసిందెవరు..? అతన్ని అందుకు ప్రేరేపించి ఏం జరిగినా మేం చూసుకుంటాం.. అని అండగా నిలిచిందెవరు.. పక్కా పథకం ప్రకారం పదినెలలుగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే మకాం వేయించి ఉసిగొల్పిందెవరు.. అనే కీలక విషయాలను విశాఖ పోలీసులు కనీసంగా రాబట్టలేకపోయారు. ఇలా ఎన్నో ప్రశ్నలకు కనీసం సమాధానం చెప్పలేని పోలీసులు జనవరి 2న కేసు విచారణ క్లోజ్ అయిందని, శ్రీనివాసరావు ఒక్కడే ఏదో ప్రచారం కోసం చిన్నపాటి దాడి చేశాడని చెప్పడం వెనుక అసలు కుట్ర.. శుక్రవారం హైకోర్టు ఆదేశాలతో స్పష్టమైంది. -
ఇదేనా లడ్డా బడాయి!
ఇటీవల ప్రతిరోజూ విలేకరుల సమావేశాలతో హడావుడిచేస్తున్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డాబుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రెస్తోమాట్లాడతారంటే.. ఏదో రొటీన్ క్రైమ్ స్టోరీ చెబుతారేమోననిజర్నలిస్టులు ఒకింత నిర్లిప్తతే ప్రదర్శించారు.సహజంగా సీపీ ప్రెస్‌మీట్ అంటే ముందుగా విషయంబ్రీఫ్ చేయడం పోలీస్ కమిషనర్ కార్యాలయ సిబ్బందికి పరిపాటి.కానీ బుధవారం అటువంటి సమాచారం ఏదీ రాలేదు.లీకులూ ఇవ్వలేదు.సరిగ్గా ఒంటిగంటకు క్రైం స్టోరీ తరహాలోనే మొదలైనసీపీ బ్రీఫింగ్లో.. వైఎస్ జగన్‌పై దాడి ప్రస్తావన రాగానే అందరూ అలర్ట్ అయ్యారుప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతవైఎస్ జగన్మోహన్రెడ్డిపై గత అక్టోబర్ 25న ఎయిర్పోర్ట్లోజరిగిన హత్యాయత్నం కేసు విచారణ వివరాలతో ఏకంగాగంటంపావు సేపు.. ఎక్కడా తొట్రుపాటు లేకుండా... పక్కా స్క్రిప్ట్తోనడిచిన సీపీ ప్రసంగపాఠంలో మొత్తంగా తేలిందేమిటంటే..అది కుట్రే కాదట..!కేవలం సంచలనం, ప్రచారం కోసమే శ్రీనివాసరావు ఒక్కడేచేశాడట!!... ఇంకెవ్వరికీ సంబంధం లేదట!!!.. అని సీపీ ముక్తాయించారు. ఇంటర్మీడియట్ కూడా చదవని, గతంలో నేర చరిత ఉన్న శ్రీనివాసరావు ఏకంగా వైఎస్ జగన్‌పై హత్యాయత్నమే లక్ష్యంగా.. నావికాదళం పర్యవేక్షణలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా వచ్చాడు.. ఎయిర్‌పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నాడు..ఎవరి అండదండ, ప్రోద్బలం లేకుండా ఏకంగా జనాకర్షణ కలిగిన నేత జగన్‌పై హత్యాయత్నానికి ఎలా కత్తి దూశాడు.. అనే సామాన్యజనం నుంచి ఉత్పన్నమైన ప్రశ్నలకు కూడా సీపీ సమాధానంచెప్పకుండా తాను చెప్పాల్సింది మాత్రం చెప్పిముగించేసిన తీరు అందరికీ విస్తు గొల్పింది.మరో వారం రోజుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిప్రజాసంకల్పయాత్ర చారిత్రాత్మక ఘట్టంగా ముగుస్తున్ననేపథ్యంలో హఠాత్తుగా సీపీ ఈ కేసును నిర్వీర్యం చేసే విధంగాప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.ఎంతో ట్రాక్ రికార్డ్ ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి లడ్డా... బాధ్యతాయుతంగా చేపట్టాల్సిన కేసు విచారణ తీరు, కేసు పురోగతిని హడావుడిగా వెల్లడించిన క్రమం ఇప్పుడు విమర్శలపాలవుతోంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జననేత, ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ తీరుపై మొదటి రోజు నుంచి అనుమానాలు వెల్లువెత్తినా.. నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ట్రాక్ రికార్డ్ ఎరిగిన వాళ్ళు మాత్రం ఎంతో కొంత నిబద్ధత పాటిస్తారని, వాస్తవాలు వెలుగులోకి రావొచ్చని భావించారు. అయితే అందరి అంచనాలనే తారుమారు చేస్తూ కేసును నిర్వీర్యం చేసేశారన్న వాదనలే ఇప్పుడు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో కలకలం రేపిన జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణపై ప్రభుత్వ పెద్దల ప్రభావం ఉందన్న వాదనలకు ఊతమిచ్చేలానే సీపీ సహా పోలీసు ఉన్నతాధికారుల విచారణ, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు కొనసా...గుతూ వచ్చింది. జగన్‌ను హత్యచేయాలనే పన్నాగంతోనే దుండగుడు శ్రీనివాసరావు కత్తితో దాడికి తెగబడ్డాడని కోర్టుకిచ్చిన రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్న పోలీసులు ఆ రిపోర్ట్‌లోనే హత్యాపథకం వెనుక కుట్రదారులెవరు, అసలు సూత్రధారులెవరు అనే కీలక విషయాలను కనీసంగా కూడా ప్రస్తావించలేదు. ఘటన జరిగిన మూడో రోజు రిమాండ్ రిపోర్ట్ రూపొందించడంతోనే విచారణ తంతును బట్టబయలు చేసిన పోలీసు అధికారులు ఈ రెండు నెలల కాలంలో దర్యాప్తు డ్రామాను రక్తి కట్టించారు. అంతా ఒక్కడే చేశాడా... పదోతరగతి వరకు మాత్రమే చదువుకున్న యువకుడు పక్కా వ్యూహం ప్రకారం రాష్ట్ర శాంతి భద్రతల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో కాకుండా సునిశిత సమస్యగా మారే కేంద్ర బలగాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతపై దాడికి తెగబడటం మామూలు విషయం కాదు. ఒక్క వేటుతో గొంతులోకి కత్తి దించి ప్రాణాలు హరించడమే లక్ష్యంగా ఘాతుకానికి తెగించిన శ్రీనివాసరావుకు ఇదంతా చేయమని నూరిపోసిందెవరు..? అతన్ని ఆ విధంగా ప్రేరేపించి ఏం జరిగినా మేం చూసుకుంటాం... అని అండగా నిలిచిందెవరు.. పక్కా పథకం ప్రకారం పదినెలలుగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే మకాం వేయించి ఉసిగొల్పిందెవరు.. అనే కీలక విషయాలవైపే పోలీసులు, సిట్ అధికారులు దృష్టి సారించలేదు. ఇక పోలీసు విచారణలో సైతం నిందితుడు లెక్కలేకుండా ఉన్నాడని, నేను చెప్పాల్సిందిందంతా లేఖలో రాసేశాను.. ఇంకేమీ లేదంటూ కనీసం భయం లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడని, విచారణకు సహకరించడం లేదని అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులే బాహాటంగా అంగీకరించారు. అందుకు ఊతమిచ్చే విధంగానే సీపీ లడ్డా బుధవారం మాట్లాడారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు పక్కా పథకంతోనే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడని, ఎటువంటి బెరుకు, భయం లేకుండా ముందుగానే కొందరికి ఫోన్లు చేసి చెప్పుకున్నాడని సీపీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇదంతా చూస్తుంటేనే శ్రీనివాసరావు వెనుక బడాబాబుల పాత్ర ఉందనేది ఎవరికైనా అర్ధమవుతుంది. కానీ సీపీ ఆ కేసులో ఇంకెవ్వరి పాత్ర లేదంటూ శ్రీనివాసరావు ఒక్కరికే పరిమితం చేస్తూ... దాదాపు కేసు క్లోజ్ అని అర్ధం వచ్చేటట్టు మాట్లాడటమే విస్తుగొలుపుతోంది. -
ఓ పథకం ప్రకారమే కుట్రరచన
-
అల్లిన కథే.. మళ్లీ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ సాక్షి, అమరావతి బ్యూరో: ఊహించిందే జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో సంచలనం సృష్టించిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం ఘటన వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదని విశాఖ పోలీసులు తేల్చేశారు. టీడీపీ నేత హర్షవర్ధన్ చౌదరి సహా ఇంకెవరి ప్రమేయమూ లేదని చెప్పేశారు. నిందితుడు శ్రీనివాసరావు కేవలం సంచలనం కోసం, పబ్లిసిటీ కోసం తాను రాసిన, రాయించిన లేఖను వైఎస్ జగన్ చదవాలనే ఉద్దేశంతో కోడి కత్తితో ఆయనపై చిన్న పాటి దాడి చేశాడని.. ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు మొదటి రోజు నుంచీ చెబుతున్న కథనే మూడు నెలల విచారణ తర్వాత కూడా అక్షరం పొల్లుపోకుండా వల్లె వేశారు. చివరకు కేసును శ్రీనివాసరావు ఒక్కడికే పరిమితం చేసిన వైనం వివాదాస్పదమవుతోంది. విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్‌లో అక్టోబర్ 25న వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పక్కనే ఉన్న ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. రక్షణశాఖకు చెందిన తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ దారుణ ఘటన వెనుక భారీ కుట్ర దాగి ఉందనేది ఒక్క రాష్ట్ర ప్రభుత్వం మినహా కేంద్రం మొదలు అన్ని రాజకీయ పక్షాలూ అనుమానిస్తూ వచ్చాయి. ఎయిర్పోర్ట్ భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం (సీఐఎస్ఎఫ్) ఉన్నతాధికారులు కూడా ప్రాథమిక విచారణలో ఇదే నిర్ధారణకు వచ్చారు. అయితే ఘటన జరిగిన మరుక్షణం నుంచే కేసును నిర్వీర్యం చేసేందుకు, పక్కదారి పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆరాటపడుతూ వచ్చింది. ఆ క్రమంలోనే సీఎం చంద్రబాబు మొదలు, డీజీపీ ఠాకూర్, మంత్రులు, టీడీపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడారు. వైఎస్ జగన్‌పై సానుభూతి కోసమే శ్రీనివాసరావు దాడి చేశాడని ఏకపక్షంగా ప్రకటనలు చేశారు. ఏదో చిన్నపాటి ఘటనగా చిత్రీకరించేందుకు యత్నించారు. అయితే..నిందితుడు శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని టి.హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి సీఎం చంద్రబాబుకు, మంత్రి లోకేష్‌కు అత్యంత సన్నిహితుడు కావడం, పక్కా ప్రణాళిక ప్రకారం నేరచరిత్ర ఉన్న శ్రీనివాసరావుకు తప్పుడు ఎన్వోసీ ఇప్పించి రెస్టారెంట్లో ఉద్యోగంలో పెట్టడం, ఆగస్టు నుంచి దాదాపు ప్రతివారంలో రెండుసార్లు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న వైఎస్ జగన్‌కు పార్టీ కార్యకర్త ఇంటి నుంచి వస్తున్న కాఫీని అడ్డుకుని ఆ రెస్టారెంట్ నుంచే తీసుకోవాలని నిబంధన పెట్టడం, అక్టోబర్ 25 గురువారం మధ్యాహ్నం ఆ రెస్టారెంట్ నుంచి కాఫీ తీసుకురావడం, అదే రోజు శ్రీనివాసరావు జగన్‌పై కత్తి దూయడం, ఘటన జరిగిన వెంటనే సీఎం చంద్రబాబు, డీజీపీ అసలు అది దాడే కాదని ప్రచారం చేయడం.. సదరు దుండగుడు వైఎస్సార్ పార్టీ అభిమాని అని ప్రచారం పుట్టించడం, ఇందుకు అనుగుణంగా ఓ లేఖ సృష్టించడం... ఇవన్నీ దీని వెనుక ఉన్న కుట్రను దాచలేకపోయాయి. కుట్రపూరితంగానే ఇదంతా జరిగినట్టు స్పష్టమవుతున్నా విశాఖ పోలీసులు మాత్రం ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు విచారణ డ్రామాను రక్తికట్టించారు. జగన్‌పై హత్యాయత్నం వెనుక కుట్ర కోణం లేదని తేల్చేశారు. శ్రీనివాసరావుతో చెప్పించిన స్క్రిప్టే.. రెండు నెలల క్రితం పోలీస్ కస్టడీలో ఉన్న శ్రీనివాసరావుతో ఏదైతే చెప్పించారో అవే విషయాలను విశాఖ సీపీ మహేశ్ చంద్ర లడ్హా బుధవారం విలేకరుల సమావేశంలో మరోసారి వల్లెవేయడం గమనార్హం. ఆరు రోజుల పోలీసు విచారణలో శ్రీనివాసరావుతో ‘నేను జగన్ అభిమానినే..’అని పదే పదే చెప్పించేందుకు పోలీసులు నానా తంటాలు పడ్డారు. అవే మాటలు నేరుగా శ్రీనివాసరావుతోనే మీడియాకు చెప్పించేందుకు అతనికి వైద్యసేవల పేరిట ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. ఇప్పుడు సీపీ కూడా అవే మాటలు వల్లెవేయడంతో అసలు ఈ కేసు విచారణ ఏపాటిగా జరిగిందో ఇట్టే అర్థమవుతోంది. కత్తులకు పదును పెడుతుంటే హర్షవర్ధన్ ఎందుకు అడ్డుకోలేదు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం చేసిన అక్టోబర్ 25న ఉదయమే శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌కు చేరుకున్నాడని, ఉదయం 9 గంటల సమయంలో కత్తులను రెస్టారెంట్లోనే వేడినీళ్ళలో స్టెరిలైజ్ చేశాడని సీపీ చెప్పుకొచ్చారు. ఆ సమయంలో రెస్టారెంట్ యజమాని, టీడీపీ నేత హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరి అక్కడే ఉన్నారు. తాను ఆ రోజు తెల్లవారుజాము నుంచి జగన్‌పై హత్యాయత్నం జరిగే పదినిమిషాల ముందువరకు అక్కడే ఉన్నానని చౌదరి ఇప్పటికి ఎన్నోసార్లు మీడియాకు చెప్పారు. ఈ లెక్కన తన రెస్టారెంట్లో పనిచేసే యువకుడు కత్తులకు పదును పెడుతుంటే ఎందుకు అడ్డుకోలేదు? కనీసం ఎందుకోసం అని ఎందుకు అడగలేదన్న దానిపై సీపీ నుంచి సమాధానమే లేదు. రెస్టారెంట్ మొత్తం సీసీ టీవీ ఫుటేజ్ పరిధిలోనే ఉంటుంది. అతను ఎక్కడ స్టెరిలైజ్ చేసినా కనపడుతుంది. మరి అంతమంది కళ్ళుగప్పి అతను కత్తులను ఎలా దాచాడు?, అదే రోజు ధైర్యంగా ఎలా పదును పెట్టాడన్న ప్రశ్నలకు కూడా పోలీసుల వద్ద సమాధానం లేదు. రిమాండ్ రిపోర్ట్‌కు భిన్నంగా సీపీ ప్రకటనలు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని, ఆ కత్తి గొంతులో దిగి ఉంటే ప్రాణాలు పోయేవని కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో ఎయిర్పోర్ట్ పోలీస్‌స్టేషన్ పోలీసులు పేర్కొన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కుట్ర కోణం దాచి రిమాండ్ రిపోర్ట్ రాసినప్పటికీ ప్రభుత్వ పెద్దల నుంచి వారికి తీవ్రస్థాయిలో అక్షింతలు పడినట్టు అప్పట్లోనే ప్రచారం జరిగింది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేవిధంగా రిమాండ్ రిపోర్ట్ రూపొందించారంటూ ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారన్న వాదనలు వినిపించాయి. అయితే ఇప్పుడు రిమాండ్ రిపోర్ట్‌కు భిన్నంగా సీపీ మహేష్ చంద్ర లడ్హా ప్రకటనలు చేయడం గమనార్హం. సీపీ తాజా ప్రకటనలు చూస్తుంటే చార్ట్షీట్లో... అసలు హత్యాయత్నమే జరగలేదంటూ కేసు నిర్వీర్యం చేసే విధంగా పొందుపరచడం ఖాయంగా కనిపిస్తోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇలాగేనా హర్షవర్ధన్‌ను విచారించేది? కేసులో కీలకంగా అందరూ అనుమానిస్తున్న టీడీపీనేత, ఎయిర్‌పోర్ట్‌లోని రెస్టారెంట్ యజమాని హర్షవర్ధన్ చౌదరిని పలుమార్లు విచారించామని సీపీ చెప్పుకొచ్చారు. కానీ పోలీస్‌స్టేషన్ వద్దనే పడిగాపులు కాసి విచారణ క్రమం తెలుసుకునేందుకు ప్రయత్నించిన ప్రతి ఒక్కరికీ హర్షవర్ధన్ విచారణ ఏ విధంగా జరిగిందో క్షుణ్ణంగా తెలుసు. కేవలం కేసు విచారణ పేరిట కాలయాపన చేసేందుకు రెస్టారెంట్లో పనిచేసే సిబ్బందిని, నిందితుడు శ్రీనివాసరావు స్నేహితులను విచారించిన సందర్భాల్లో... వారిని తిరిగి ఇళ్ళకు తీసుకువెళ్లేందుకు మాత్రమే హర్షవర్ధన్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చేవాడు. ఆ సందర్భాల్లో కూడా పోలీస్స్టేషన్లలో దర్జాగా తిరుగుతుండటం, పోలీసులంటే లెక్కలేనట్టుగా ప్రవర్తించడం ప్రతిఒక్కరూ గమనించారు. తన వాహనాన్ని పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలోనే నో పార్కింగ్ బోర్డ్ ఎదురుగా సీపీ మహేష్ చంద్ర లడ్హా వాహనం ఎదురుగా పార్క్ చేసే వాడంటేనే అతనికున్న అండదండలు ఎలాంటివో అర్ధం చేసుకోవచ్చు. ఫ్లెక్సీపై సీపీ హాస్యాస్పద వ్యాఖ్యలు చివరికి శ్రీనివాసరావు ఆ ఊళ్ళో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ విషయంలోనూ సీపీ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఫ్లెక్సీపై గరుడ పక్షి ఫొటో ఉండటం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గతేడాది అక్టోబర్ 25న జగన్‌పై హత్యాయత్నం ఘటనతో ఆర్నెల్ల క్రితం హాస్యనటుడు శివాజీ చెప్పిన గరుడ పురాణంలో మాదిరిగానే ప్రతిపక్షనేతపై హత్యాయత్నం జరిగిందన్న వాదనలు, అనుమానాలు ఒక్కసారిగా బయలుదేరాయి. కాగా శ్రీనివాసరావు వేయించిన ఫ్లెక్సీలో గరుడ పక్షి ఉండటంతో ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగిందన్న ప్రచారం జరిగింది. ఆ మేరకు వైఎస్సార్సీపీ నేతలు అనుమానం వ్యక్తం చేసి ఈ దిశగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అవేమీ పట్టించుకోని సీపీ లడ్హా ఫ్లెక్సీలోని గరుడ పక్షి బొమ్మపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. శ్రీనివాసరావుకు గరుడ పక్షి అంటే ఇష్టమని, అందుకే దానిపై ఆ బొమ్మ వేయించుకున్నాడని చెబుతూ తేలిగ్గా తీసిపారేయడం చూస్తుంటే.. రాష్ట్ర ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కేసు విచారణ ఏ విధంగా కొనసాగిందో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు. సిట్ ఆఫీసుకు తాళం వేసేస్తే ఇంకేం విచారణ హత్యాయత్నం వెనుక ఎటువంటి కుట్ర కోణం లేదంటూ విచారణ మొదలుపెట్టకుండానే తేల్చేసిన సీపీ మహేష్ చంద్ర దర్యాప్తు ఇంకా కొనసాగిస్తామని చెప్పారు. నిజమైన విచారణను హత్యాయత్నం జరిగిన రోజే గాలికొదిలేసిన పోలీసులు కొన్నాళ్ళు సిట్ కార్యాలయం తెరిచి పబ్లిసిటీ స్టంట్ నడిపారు. దానికి కూడా ఇటీవల తాళం కూడా వేసేశారు. విచారణ ముగిసిందని, తాము ఎవరి పనుల్లో వారు ఉన్నామని సిట్ అధికారి ఒకరు ఈమధ్య చెప్పారు. వాస్తవం ఇలావుంటే సీపీ మాత్రం కేసు విచారణ కొనసాగుతుందని చెప్పడం గమనార్హం. కోర్టు ధిక్కారం..! నిందితుడు శ్రీనివాసరావు పథకం ప్రకారమే హత్యాయత్నానికి పాల్పడ్డాడని సీపీ లడ్హా చెప్పారు. ఈ కేసు వెనుక ఇంకెవరూ లేరన్నట్లుగా చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఈ కేసును రాష్ట్ర పోలీసులు నిష్పక్షపాతంగా విచారించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రజలూ భావిస్తున్నారు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ నిర్వహించాలని పార్టీ న్యాయస్థానాన్ని కోరింది. ఆ మేరకు కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ దశలో పోలీస్ కమిషనర్ ఏకపక్షంగా మీడియాకు ప్రకటనలు చేయడం కోర్టు ధిక్కారమే అవుతుందని, అయినా అదేమీ పట్టించుకోకుండా సీపీ లడ్హా ఆ విధంగా ప్రకటనలు చేస్తున్నారంటే వారిపై ప్రభుత్వ పెద్దల ఒత్తిడే కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పెద్దల వ్యాఖ్యలను సమర్థించేలా మరోసారి.. శ్రీనివాసరావు తాను ఉపయోగించిన కత్తిని హత్యాయత్నానికి ముందు రెండుసార్లు వేడి నీటిలో మరిగించాడని సీపీ చెప్పడంపై విస్మయం వ్యక్తమవుతోంది. కత్తితో పొడిచినా ఏమీ కాకుండా శ్రీనివాసరావు జాగ్రత్త తీసుకున్నాడన్న అర్థం స్ఫురించేలా సీపీ వ్యూహాత్మకంగా మాట్లాడారు. ఆ విధంగా మాట్లాడటం ద్వారా సానుభూతి కోసమే శ్రీనివాసరావు ఈ హత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీజీపీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలనే సీపీ మరోసారి సమర్థించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలోనూ ఇదే తీరు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో విశాఖపట్నం సీపీ గతంలోనూ వివాదాస్పదంగా వ్యవహరించారు. హర్షవర్థన్‌కు చెందిన రెస్టారెంట్లో పనిచేసేందుకు నిందితుడు శ్రీనివాసరావుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్వోసీ) ఉందని చెప్పారు. కానీ అతని స్వస్థలం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పోలీసులు తాము ఎన్వోసీ ఇవ్వలేదని తెలిపారు. సీపీ వెంటనే స్పందిస్తూ విశాఖ ఎయిర్పోర్ట్ పీఎస్ నుంచి శ్రీనివాసరావు ఎన్వోసీ పొందాడని ప్రకటించారు. ఢిల్లీలోని బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) డీజీ కుమార్ రాజేష్ చంద్ర అసలు విషయాన్ని వెల్లడించడంతో ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది. విమానాశ్రయంలో పనిచేసేందుకు అవసరమైన ఏరోడ్రోమ్ ఎంట్రీ పర్మిట్ (ఏఈపీ) కోసం శ్రీనివాసరావుగానీ అతని తరఫున రెస్టారెంట్ యజమాని గానీ దరఖాస్తు చేయనేలేదని స్పష్టం చేశారు. ఏఈపీ కోసం దరఖాస్తు చేయనప్పుడు ఎన్వోసీ అవసరమే తలెత్తదని, శ్రీనివాసరావు పేరిట ఎన్వోసీ లేనే లేదని స్పష్టం చేశారు. స్క్రిప్ట్‌ను ముందే వెల్లడించిన సాక్షి వాస్తవానికి సిట్ స్క్రిప్ట్‌ను రెండు నెలల ముందే సాక్షి బట్టబయలు చేసింది. హత్యాయత్నం జరిగిన రోజు నుంచి పోలీసుల విచారణ తంతును పరిశీలించిన సాక్షి ముందే నివేదిక సారాంశాన్ని గ్రహించింది. గత నవంబర్ మూడవ తేదీన ‘‘బాస్‌ల నివేదిక సిద్ధం.. ఇదే స్క్రిప్ట్ ’’శీర్షికన గత నవంబర్ 1న ప్రచురించింది. ఇప్పుడు అందు లోని అంశాలనే సీపీ లడ్హా చెప్పుకురావడం గమనార్హం. -
ఎవరి ప్రమేయమూ లేదు: లడ్హా
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై విశాఖ ఎయిర్‌పోర్టులో దాడి వెనుక టీడీపీ నేత హర్షవర్థన్ చౌదరి సహా ఇంకెవరి ప్రమేయం గానీ, కుట్ర గానీ లేదని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్హా చెప్పారు. శ్రీనివాసరావు పది నెలల ముందు 2017 డిసెంబర్లోనే దాడికి పథకాన్ని రచించాడని తెలిపారు. పబ్లిసిటీ, సానుభూతి కోసమే ప్రతిపక్ష నేతపై దాడికి పాల్పడ్డాడని, తాను జగన్ అభిమానినని చెప్పాడని పేర్కొన్నారు. హైకోర్టు అనుమతించాక ఈ కేసుపై చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో పురోగతిని కమిషనర్ బుధవారం విలేకరులకు వివరించారు. సీపీ ఏమన్నారో ఆయన మాటల్లోనే.. పక్షులంటే ఇష్టమని ఫ్లెక్సీపై ముద్రించాడు ‘తూర్పు గోదావరి జిల్లా థానేలంకకు చెందిన జనుపల్లి శ్రీనివాసరావు మూలపాలెం ఎన్‌పీఎం కాలేజీలో ఇంటర్మీడియట్ మధ్యలో ఆపేశాడు. 2009–16 మధ్య గోవా, కర్ణాటక, కువైట్, హైదరాబాద్‌లో వెల్డర్, వంట పని చేశాడు. 2017లో రాజమండ్రి బాలాజీ బేకరీలో కేక్ మాస్టర్‌గా కొన్నాళ్లు, అమలాపురంలో కుక్‌గా కొన్నాళ్లు చేశాడు. అదే ఏడాది డిసెంబర్ 27న తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరంలోని అఖిల్ స్టూడియోలో ఫోటో దిగాడు. 30న పి.గన్నవరం లేపాక్షి ఫ్లెక్సీలో వైఎస్ జగన్‌తో తన ఫోటో ఉండేలా ఫ్లెక్సీ ప్రింటింగ్‌కు ఆర్డరిచ్చాడు. పక్షులంటే తనకు ఇష్టమని గరుడ పక్షిని కూడా ముద్రించాడు. ఆపరేషన్ గరుడ కాదు. 31 రాత్రి థానేలంకలో ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. 2018 జనవరిలో రాజుపాలెంలో కోడిపందాలు చూడటానికి వెళ్లి అక్కడ రెండు కత్తులు కొనుగోలు చేశాడు. అదే నెల 28న విశాఖ ఎయిర్‌పోర్టులో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో కుక్‌గా చేరాడు. అప్పట్నుంచి తన స్వగ్రామానికి వెళ్లి వస్తున్నాడు. అక్టోబర్ మొదటి వారంలో తన ఇంటికెళ్లినప్పుడు తన సమీప బంధువు విజయదుర్గతో తొమ్మిది పేజీలు, తన గదిలో ఉంటున్న రేవతీపతితో ఒక పేజీ లేఖ రాయించాడు. 17న తిరిగి విశాఖ వచ్చి తానుంటున్న గదిలో కత్తిని స్టెరిలైజ్ (వేడినీటిలో మరిగించడం) చేశాడు. ఈ కత్తి ఎందుకుని సహోద్యోగులు శిరీష, ప్రసాద్‌లు అడగ్గా రెస్టారెంట్లో కూరగాయలను అందమైన ఆకృతిలో మలచడానికని చెప్పాడు. అక్టోబర్ 18నే దాడికి ప్లాన్ తొలుత అక్టోబర్ 18న జగన్‌పై విశాఖ విమానాశ్రయంలో దాడికి ప్లాన్ వేశాడు. కానీ దసరా సందర్భంగా ఒకరోజు ముందు అంటే 17నే జగన్ హైదరాబాద్ పయనమవడంతో ఆ ప్రయత్నం ఫలించలేదు. తర్వాత 25 మధ్యాహ్నం జగన్ విశాఖ విమానాశ్రయానికి వస్తున్నారని విశాఖ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆఫీస్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కృష్ణకాంత్ అనే వ్యక్తి నుంచి రెస్టారెంట్లో పనిచేస్తున్న హేమలత ద్వారా తెలుసుకున్నాడు. 25 ఉదయం 4.55కి కోడిపందాల కత్తిని పర్స్‌లో పెట్టుకుని తన ఇంటి నుంచి ఎయిర్‌పోర్టుకు బయల్దేరాడు. 9 గంటల సమయంలో కత్తిని మరోసారి స్టెరిలైజ్ చేశాడు. జగన్ మధ్యాహ్నం 12.21–25 గంటల మధ్య ఎయిర్‌పోర్టుకు చేరుకుని వీఐపీ లాంజ్‌కు వెళ్లారు. శ్రీనివాస్ బ్యాగులో రాసి ఉంచిన లేఖతో పాటు రెండు మంచినీళ్ల బాటిళ్లు వెంట తీసుకుని జగన్ దగ్గరకు ఫోటో దిగే నెపంతో వెళ్లాడు. కత్తితో జగన్ భుజంపై పొడిచాడు. అక్కడే ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిలు అతని వద్ద నుంచి కత్తిని లాక్కున్నారు. దాడికి పాల్పడిన వెంటనే పోలీసు, సీఐఎస్ఎఫ్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్ష నేతకు ఎయిర్‌పోర్టులో ఉన్న వైద్యురాలితో ప్రాథమిక చికిత్స అందించారు. విమానం బయలుదేరే సమయం కావడంతో జగన్ హైదరాబాద్ వెళ్లిపోయారు. కత్తి దాడితో జగన్ భుజంపై ఒక సెంటీమీటరు వెడల్పు, 3.5 సెంటీమీటర్ల లోతులో గాయమైంది. అంతకుముందు తాను జగన్‌పై దాడి చేసి సంచలనం సృష్టించబోతున్నానని, టీవీల్లో కనిపిస్తానని తనకు పరిచయం ఉన్న ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన షేక్ అమ్మాజీతో అక్టోబర్ 14, 15 తేదీల్లో శ్రీనివాస్ ఫోన్లో చెప్పాడు. 17న మరోసారి ఆమెకు అదే విషయాన్ని చెప్పడంతో తాము వెటకారమని నవ్వుకున్నట్టు అమ్మాజీ చెప్పింది. శ్రీనివాస్ వద్ద 11 పేజీల లేఖ ఉంది. అందులో తొలి తొమ్మిది పేజీలు సమీప బంధువు విజయదుర్గ, పదో పేజీ రూమ్మేట్ రేవతీపతి, 11వ పేజీ శ్రీనివాస్ రాశాడు. ఈ పేజీల దస్తూరీ వీరిదేనని ఎఫ్ఎస్ఎల్ తేల్చింది. ఎయిర్‌పోర్టులో ఉద్యోగంలో చేరడానికి అవసరమైన ఎన్ఓసీని 2018 జనవరి 28, ఏప్రిల్ 6న విశాఖ పరిధిలో పోలీసులు ఇచ్చారు. ఫ్యూజన్ఫుడ్స్కు అన్ని అనుమతులూ ఉన్నాయి. శ్రీనివాసరావు డిపార్చర్ ఏరియాలో తిరగడానికి అనుమతి ఉంది. కుట్రకోణం లేదు..పబ్లిసిటీ కోసమే.. ఈ కేసులో 92 మంది సాక్షులను విచారించాం. వారి నుంచి వివరాలు సేకరించాం. నిందితుడి తన ఫోన్ నుంచి 1,110 కాల్స్ చేసినట్టు గుర్తించాం. కుట్రకోణంలో కూడా దర్యాప్తు చేశాం. ఇందులో అలాంటిదేమీ లేదు. ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్ హర్షవర్థన్ చౌదరిని కూడా విచారించాం. శ్రీనివాస్ పబ్లిసిటీ కోసమే జగన్‌పై కత్తితో దాడి చేశాడు. దాడి సమయంలో ఎయిర్‌పోర్టులో వైఎస్సార్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, నాయకులు రామన్నదొర, కొండా రాజీవ్‌గాంధీ, ఎస్.సుధాకర్ ఉన్నారు. బ్యాగులో ఉన్నందున లేఖ నలగలేదు శ్రీనివాసరావు తమ ప్రాంతంలో నాలుగెకరాల భూమి కొనుగోలుకు ప్రయత్నించిన విషయం మాకు తెలియదు. నిందితుని వద్ద ఉన్న లేఖ బ్యాగులో ఉంచడం వల్ల నలగలేదు. శ్రీనివాసరావు, ఆయన కుటుంబ అకౌంట్లను పరిశీలించి అతని సోదరికి రమాదేవి అనే సహోద్యోగిని అకౌంట్ ద్వారా రూ.40 వేలు, 22 వేల చొప్పున బదలాయించినట్టు గుర్తించాం. ఘటన జరిగిన గంటలోనే ఫ్లెక్సీ బయట పడడం వెనక ఎలాంటి ముందస్తు వ్యూహం లేదు. ఈ కేసు పూర్తయ్యే వరకు సిట్ విచారణ కొనసాతుంది..’ అని సీపీ చెప్పారు. విలేకరుల సమావేశంలో సిట్ ఇన్చార్జి బీవీఎస్ నాగేశ్వరరావు, ఏసీపీ అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
హత్యాయత్నం వెనుకున్న కుట్రను వెలికితీయాలి
-
కుట్రదారులను తప్పించేందుకు యత్నం
విజయవాడ సిటీ: ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో అసలు కుట్రదారులను తప్పించే ప్రయత్నం తీవ్రంగా జరుగుతోందని వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. ఈ కేసును కేవలం నిందితుడు జనపల్లి శ్రీనివాస్‌కే పరిమితం చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. ఎన్ఐఏ పరిధిలోని కేసును రాష్ట్ర పరిధిలో విచారణ చేపట్టి నీరుగారుస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో డీజీపీ చేసిన వ్యాఖ్యలు తప్పుడువనే విషయం బుధవారం విశాఖపట్నం సీపీ లడ్డా ప్రెస్‌మీట్‌తో వెల్లడైందన్నారు. విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాస్ ఒక్కడినే కర్త, కర్మ, క్రియ అని చెప్పే విధంగా విశాఖపట్నం పోలీసు కమిషనర్ లడ్డా ప్రయత్నించారన్నారు. కేసు రిజిస్టర్ చేసే సమయంలో ఐపీసీ సెక్షన్ 120 బి లేకుండా ఈ కేసులో కేవలం సెక్షన్ 307 మాత్రమే ఎందుకు నమోదు చేశారని నిలదీశారు. వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే మధ్యాహ్నం 2 గంటలకు డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి..‘జగన్ అభిమానే దాడి చేశాడని’ వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. అది తప్పని మాత్రమే ఈ రోజు లడ్డా చెప్పారన్నారు. ఎన్ఐఏతో ఎందుకు విచారణ చేయించరు? ఎయిర్‌పోర్టులో ఏ నేరం జరిగినా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చట్టం పరిధిలోకి వస్తుందన్నారు. ఎన్ఐఏ పరిధిలోకి వచ్చే కేసు ఎందుకు రాష్ట్ర పరిధిలో పెట్టుకున్నారని నిలదీశారు. కేంద్ర పరిధిలో ఉన్న స్థలంలో జరిగిన ఘటనపై సెక్షన్ 61 ఎన్ఏఐ యాక్ట్ 2008 ప్రకారం, అలాగే సివిల్ ఏవియేషన్ యాక్ట్ 1982 సెక్షన్ 3ఏ కింద కేసు నమోదు చేసి దానిని ఎన్ఐఏకి బదిలీ చేయాలన్నారు. పాడేరు ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోముపై మావోయిస్టులు దాడి చేసి హత్య చేస్తే వెంటనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ)కి బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. వైఎస్ జగన్ కేసును ఎందుకు అప్పగించడం లేదని నిలదీశారు. పై రెండు చట్టాలు డీజీపీకి తెలియవా? లేక కావాలనే తొక్కిపట్టారా? అని ప్రశ్నించారు. విచారణను చంద్రబాబు ప్రభావితం చేశారని, ఈ కేసును ఆలస్యం చేస్తే ఇందులో సాక్ష్యాలు ఆవిరవుతాయని హైకోర్టులో ఫిర్యాదు చేశామన్నారు. ‘జగన్‌పై ఉన్న కేసుల నుంచి తప్పించుకునేందుకే ప్రధానిని ఆశ్రయించారని, మోదీ తలచుకుంటే జగన్ జైలుకే అని’ కుప్పంలో బుధవారం జరిగిన జన్మభూమి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమని చెప్పారు. చంద్రబాబు మీద 27 కేసులు ఇవాల్టికీ స్టే రూపంలో ఉన్నాయంటే...ఆ కేసులు ముందుకు వెళ్లకుండా ఆయన కోర్టును మేనేజ్ చేశారా? అని ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థ అంటే బాబుకు అంత చులకన భావమా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన వ్యాఖ్యలను కోర్టు ధిక్కారం కింద పరిగణించాలన్నారు. వైఎస్ జగన్‌పై ఉన్న కేసులు గాలి బుడగ లాంటివని, ఎవరి కుట్రతో కేసులు పెట్టారో అందరికీ తెలిసిందేనని సుధాకర్‌రెడ్డి అన్నారు. -
ప్లాన్ ప్రకారమే వైఎస్ జగన్‌పై దాడి: సీపీ లడ్డా
-
వైఎస్ జగన్ హత్యకు రెండుసార్లు యత్నం: లడ్డా
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పక్కా పథకం ప్రకారమే హత్యాయత్నం జరిగిందని విశాఖపట్నం పోలీసు కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై దాడికి నిందితుడు శ్రీనివాస్ రెండుసార్లు కుట్ర పన్నాడని వెల్లడించారు. ‘నిందితుడు 2017 డిసెంబర్ నుండే వైఎస్ జగన్ హత్యపై కార్యాచరణ ప్రారంభించాడు. అక్టోబర్ 18నే దాడికి పథక రచన చేశాడు. అక్టోబర్ 17నే వైఎస్ జగన్ విశాఖ నుంచి వెళ్లిపోవడంతో అతడి పథకం ఫలించలేదు. శ్రీనివాస్ గతంలో వెల్డర్, కేక్ మాస్టర్, కుక్‌గా పనిచేశాడు. జనవరి 2018 కర్ణాటకలో తనతో పనిచేసిన వెంకటపతి అనే వ్యక్తి ద్వారా ఫ్యూజన్ ఫుడ్స్ లో చేరాడు. 164 సీఆర్ పీసీ కింద ఇప్పటి వరకు 92 మంది సాక్షులను విచారించి, స్టేట్మెంట్లు రికార్డ్ చేసాం. దాడికి ఉపయోగించిన కోడిపందేల కత్తికి నిందితుడు రెండుసార్లు పదును పెట్టాడు. (అది హత్యాయత్నమే) ముందుగానే ఓ లేఖను విజయదుర్గతో రాయించాడు. ఈ లేఖను ఆమె జిరాక్స్ కూడా తీయించింది. హేమలత, షేక్ అమ్మాజీ అనే మహిళలకు శ్రీనివాస్ ముందురోజు ఫోన్ చేసి రేపు నా పేరు టీవీలో చూస్తారంటూ చెప్పాడు. అక్టోబర్ 25న ఉదయం 4.55 గంటలకు ఎయిర్‌పోర్టుకు బయలు దేరాడు. ఎయిర్‌పోర్టు క్యాంటీన్లో ఉదయం 9 గంటలకు కత్తికి మరోసారి పదును పెట్టాడు. దాడికి పక్కా పథకం ప్రకారం సిద్ధమయ్యాడు. వీఐపీ లాంజ్‌లో వేచివున్న వైఎస్ జగన్ వద్దకు హేమలతను తీసుకెళ్లాడు. కరణం ధర్మశ్రీతో జగన్ మాట్లాడుతుండగా శ్రీనివాస్ దాడికి తెగబడ్డాడు. రాష్ట్రంలో ఎక్కడ ఘటన జరిగిన రాష్ట్ర పోలీసులే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అప్పగించాలి లేదా కేంద్రం కోరాలి. స్థానిక పోలీసులకు అధికారం లేదు. నిందితుడి దగ్గర దొరికిన లేఖలో ముగ్గురి చేతి రాతలు ఉన్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చింది. కేసులో ఇప్పటివరకు శ్రీనివాస్ మాత్రమే నిందితుడు. దాదాపుగా విచారణ పూర్తి అయింది. ఛార్జి షీట్ దాఖలుకు హైకోర్ట్ అనుమతి రావాల్సి ఉంద’ని లడ్డా వివరించారు. అనుమానాలెన్నో..? పోలీసు కమిషనర్ హడావుడిగా విలేకరుల సమావేశం పెట్టి కేసు వివరాలు వెల్లడించడంపై వైఎస్సార్ సీపీ నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు చెప్పిందే మళ్లీ చెప్పారని, కొత్తగా ఏం చెప్పలేదని పేర్కొన్నారు. సూత్రధారులను తప్పించేందుకే రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని వ్యాఖ్యానించారు. కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అప్పగించేందుకు చంద్రబాబు సర్కారు ఎందుకు భయపడుతోందని ప్రశ్నిస్తున్నారు. -
ఆ ఫోన్లలో ఏమీ లేదట!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావు, అతని స్నేహితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో అనుమానించదగ్గ అంశాలేమీ లేవని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు తేల్చేశారు. విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఫ్యూజన్ ఫుడ్స్‌లో చేరినప్పటి నుంచి నిందితుడు తొమ్మిది సెల్ఫోన్లు, రెండు సిమ్‌లు వాడినట్లు.. ఏడాదిలో పదివేల కాల్స్ మాట్లాడినట్టుగా గుర్తించారు. ఈ కాల్స్ ద్వారా దాదాపు 321మందితో సంభాషించినట్లు నిర్ధారణకు వచ్చిన అధికారులు వారి స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. నిందితుడు వాడిన సెల్ఫోన్లతో పాటు తన సిమ్‌కార్డులు వేసి మాట్లాడిన వేరే సెల్ఫోన్లలో ఒకటి మినహా మిగిలిన ఎనిమిదింటినీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే, నిందితుడితో కలిసి పనిచేస్తున్న రమాదేవి, రేవతిపతి, హేమలత సెల్ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని వాటిని వారం రోజులపాటు విశ్లేషించారు. గడిచిన ఏడాది కాలం నాటి డేటాను పరిశీలించారు. ఇందులో అనుమానించదగ్గ, అభ్యంతరకరమైన అంశాలేమీ లేవని సిట్ అధికారి ఒకరు “సాక్షి’కి తెలిపారు. మరోవైపు.. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం దేవాంగనగర్‌కు చెందిన ముస్లింలతో మాత్రమే వైఎస్ జగన్‌పై తాను చేయబోయే హత్యాయత్నాన్ని ప్రస్తావించినట్టుగా గుర్తించారు. వేరొకరి ఫోన్లలో తన సిమ్ ద్వారా కాల్స్ కాగా, శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన వారి ఫోన్లను తీసుకుని అందులో తన సిమ్ కార్డు వేసుకుని మాట్లాడేవాడని.. అనంతరం తన సిమ్ తీసుకుని వారి ఫోన్లకు వారికి ఇచ్చేసేవాడని సిట్ అధికారుల పరిశీలనలో తేలింది. ఆరు రోజుల కస్టడి అనంతరం కూడా శ్రీనివాసరావు నుంచి పోలీసులకు దీనిపై స్పష్టత రాలేదు. పోలీస బాస్ సూచనల మేరకే నివేదిక? ఇదిలా ఉంటే.. కేసు పురోగతిపై వచ్చే మంగళవారం హైకోర్టుకు సీల్డ్ కవర్లో దర్యాప్తు నివేదికను సమర్పించాల్సి ఉన్నందున సిట్ అధికారులు శనివారం పూర్తిగా ఆ నివేదిక తయారీలో నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు శ్రీనివాసరావును దాటి విచారణ ముందుకు సాగనందున పోలీస్ బాస్ సూచనల మేరకు నివేదిక తయారవుతోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఎల్లుండి హైకోర్టుకు నివేదిక : సీపీ వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణకు సంబంధించిన అన్ని విషయాలూ న్యాయస్థానానికి మంగళవారం నివేదిస్తామని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్హా తెలిపారు. మీడియాతో శనివారం ఆయన మాట్లాడారు. ఈ కేసులో ఒక్క శ్రీనివాసరావునే నిందితుడిగా చూపిస్తున్నారు.. ఇతరులెవర్నీ ఇంకా గుర్తించలేదా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానమివ్వలేదు. ఈ కేసు దర్యాప్తు అంశాలపై ప్రస్తుతం స్పందించలేనని చెప్పారు. ఆ వివరాలను సీల్డ్ కవర్లో హైకోర్టుకు నివేదించిన అనంతరం మీడియాకు వెల్లడిస్తానన్నారు. అలాగే, జగన్‌కు పూర్తి భద్రత కల్పిస్తామని.. అదనపు భద్రత అడిగితే పరిశీలిస్తామని లడ్హా చెప్పారు. -
ఫ్లెస్కీ కథలో ఎవరిది నిజం?
-
తూతూమంత్రంగా సిట్ విచారణ పూర్తి
-
ఊహించిందే జరిగింది
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/ సాక్షి, విశాఖపట్నం: ఊహించిందే జరిగింది. జాతీయ స్థాయిలో కలకలం రేపిన ఏపీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం కేసులో కుట్రకోణం బయట పడకుండానే విచారణ ముగిసింది. కుట్రదారుల ప్రస్తావన లేకుండానే పోలీసులు రిమాండ్ రిపోర్ట్ తయారుచేశారు. ఆరు రోజులు పోలీసు కస్టడీకి తీసుకుని ఏమీ రాబట్టలేకపోయారు. అత్యధిక ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నేతపై హత్యాయత్నానికి ఒడిగట్టిన వ్యక్తినుంచి కుట్ర సమాచారాన్ని రాబట్టలేక పోవడం పోలీసుల వైఫల్యాన్ని, ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని ఎత్తి చూపుతోందని జనం కోడై కూస్తున్నా పోలీసులు మాత్రం ప్రభుత్వ పెద్దల స్క్రిప్ట్ మేరకే విచారణ జరిపారు. హత్యాయత్నం జరిగిన గంటలోపే డీజీపీ ఠాకూర్ చేసిన ప్రకటనలకు ఊతమిచ్చే విధంగా ఆరు రోజుల విచారణ డ్రామాను సిట్ బృందం రక్తి కట్టించింది. ఫోన్‌కాల్స్ ఆధారంగా శ్రీనివాసరావు స్నేహితులు, అతను పని చేస్తున్న ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ సిబ్బంది, యజమాని విచారణతోనే కాలయాపన చేసి సూత్రధారులు, పాత్రదారులుల ప్రస్తావన లేకుండానే విచారణ డ్రామాకు తెరవేశారు. విశాఖ విమానాశ్రయంలో గత నెల 25వతేదీ మధ్యాహ్నం వీవీఐపీ లాంజ్‌లో వైఎస్ జగన్‌పై ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న శ్రీనివాసరావు కత్తితో హత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కనీసం ప్రాధమిక విచారణ చేపట్టకముందే డీజీపీ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. జగన్‌పై దాడి చేసింది ఆయన అభిమానే... ఓ చిన్నపాటి ఘటనే.. అని ప్రకటించేశారు. డీజీపీ ప్రకటన అందిపుచ్చుకుని సీఎం చంద్రబాబు మొదలు రాష్ట్ర మంత్రులు, టీడీపీ నేతలు నోటికొచ్చిన రీతిలో మాట్లాడారు. ఇక సిట్ అంటే సిట్..స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు గానే ఆరురోజుల కస్టడీ నాటకాన్ని విశాఖపట్నంలో సిట్ బృందం రక్తికట్టించింది. చివరి రోజు రికార్డువర్కుకే పరిమితం చివరి రోజైన శుక్రవారం విచారణ జోలికి వెళ్లని సిట్ అధికారులు పూర్తిగా రికార్డు వర్కుకే పరిమితమయ్యారు. దర్యాప్తు వివరాలను క్రోడీకరిస్తూ రిపోర్టు తయారు చేయడానికే గడిపేశారు. నిందితుడ్ని కేజీహెచ్ నుంచి రప్పించిన వైద్యులతో పరీక్షలు నిర్వహించి మధ్యాహ్నం 3.20 గంటలసమయంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కస్టడీ ముగియడంతో శ్రీనివాసరావును మూడో మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ మళ్లీ జ్యూడిషియల్ కస్టడీకి తరలించాలని ఆదేశించారు. కస్టడీ సమయంలో నిందితుడు పూర్తి స్థాయిలో సహకరించలేదంటూనే మరో ఆరురోజుల కస్టడీ కోరుతూ దాఖలు చేసిన పిటీషన్‌ను పద్ధతి ప్రకారం ఫైల్ చేయలేదంటూ మేజిస్ట్రేట్ డిస్మిస్ చేశారు. కస్టడీలో నిందితుణ్ని న్యాయవాది సమక్షంలోవిచారించలేదని, పోలీసులే సొంతంగా చేసుకున్నారని, ఇది చట్టవిరుద్దమంటూ మరో వైపు అబ్దుల్ సలీమ్ అనే న్యాయవాది నిందితుడి తరపున 41డీ, సీఆర్ సీపీ కింద మెమో ఫైల్ చేశారు. కానీ ఈ మెమోలో నిందితుడి సంతకం లేకపోవడంతో దాన్ని కూడా మేజిస్ట్రేట్ తిరస్కరించారు. మరోవైపు కోర్టులో నిందితుడు శ్రీనివాసరావు మెజిస్ట్రేట్ ముందు హిందీ, ఉర్ధూ భాషల్లో ఏదో మాట్లాడేందుకు యత్నించినా పోలీసులు నిలువరించారు. నివేదిక సమర్పించని సిట్ ఘటన జరిగినప్పటి నుంచి నేటి వరకు సాగిన దర్యాప్తు నివేదికతో పాటు కస్టడీ సమయంలో నిందితుడ్ని విచారించిన తీరుపై వేర్వేరుగా రిపోర్టులు కోర్టుకు సమర్పించాల్సి ఉంది. కానీ వాటిలో ఏ ఒక్కటి సమర్పించ కుండానే నిందితుడ్ని కోర్టు ముందు హాజరుపర్చారు. హర్షవర్ధన్‌ను కనీసంగా విచారించని పోలీసులు పక్కా వ్యూహం ప్రకారం రాష్ట్ర శాంతి భద్రతల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో కాకుండా సునిశిత సమస్యగా మారే కేంద్ర బలగాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతపై దాడికి తెగబడటం మామూలు విషయం కాదు. ఒక్క వేటుతో గొంతులోకి కత్తి దించి ప్రాణాలు హరించడమే లక్ష్యంగా ఘాతుకానికి తెగించిన శ్రీనివాసరావుకు ఇదంతా చేయమని నూరిపోసిందెవరు..? అతని ప్రేరేపించి, ఏం జరిగినా మేం చూసుకుంటాం... అని అండగా నిలిచిందెవరు.. పక్కా పథకం ప్రకారం పదినెలలుగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే మకాం వేయించి ఉసిగొల్పిందెవరు.. అనే కీలక విషయాలను కనీసంగా రాబట్టలేకపోయారు. ఇక కుట్రకు కేంద్రంగా భావిస్తున్న శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ యజమాని, సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు హర్షవర్ధన్ ప్రసాద్ చౌదరిని వరుసగా మూడు రోజుల పాటు చుట్టపుచూపుగా పిలిపించడం, పంపించడం తప్ప అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించిన పాపాన పోలేదు. ఆరురోజులూ హైడ్రామానే.. మొదటిరోజు సీఐఎస్ఎఫ్ అధికారులనుంచి స్థానిక పోలీసులు నిందితుడిని స్వాధీనం చేసుకునే ముందు 11 పేజీల లేఖ పేరుతో నాటకం మొదలు.. కస్టడీలో మూడోరోజు డాక్టర్లు ఆరోగ్యంగానే ఉన్నాడని ధ్రువీకరించినా..మీడియాతో మాట్లాడించేందుకు ఉద్దేశ్యపూర్వకంగా వైద్య పరీక్షల నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. నేను జగన్ అభిమానినే.. ఇదంతా ప్రజల కోసమే చేశా.. నా వెనుక ఎవరూ లేరు.. నన్ను చంపి రాజకీయం చేయాలని చూస్తున్నారు.. ఒకవేళ నేను చనిపోతే నా అవయవాలు దానం చేయండని నిందితుడితో చెప్పించారు. కేసు పురోగతి పట్టని సీపీ కేసు ఫైల్ చేసిన వెంటనే హడావుడి చేసిన విశాఖ పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా కస్టడీ మూడో రోజు నుంచే విచారణ వైపుకన్నెత్తి చూడలేదు. కాల్‌డేటా విశ్లేషణలో విశేష అనుభవం ఉందంటూ విచారణ బాధ్యతలను అప్పగించిన ఫకీరప్పను ఉన్నట్టుండి తప్పించి.. బదలీపై కొత్తగా వచ్చిన డీసీపీ నయీమ్‌కు అప్పగించారు. తల్లిదండ్రులు, స్నేహితులు, సహచర ఉద్యోగులు, కాల్‌డేటా ఆధారంగా 52 మందిని విచారించి స్టేట్మెంట్స్ రికార్డు చేయడం మినహా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. సీసీ ఫుటేజ్ విశ్లేషణలో ఏం తేలిందో తెలియదు. హై సెక్యూరిటీ బ్లాక్‌లో నిందితుడు ఆరిలోవ (విశాఖ తూర్పు): పోలీసు కస్టడీ ముగిసిన నిందితుడు శ్రీనివాసరావును విశాఖ కేంద్రకారాగారంలో అధికారులు హై సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచారు. శ్రీనివాసరావు ప్రత్యేక ఖైదీ కావడంతో హై సెక్యూరిటీ బ్లాక్‌లో ఉంచామని, అతనితో ఇతర ఖైదీలు మాట్లాడే అవకాశం కూడా ఉండకుండా వార్డర్లను సెక్యూరిటీ ఉంచినట్లు జైల్ అధికారులు తెలిపారు. -
నిజాలు దాస్తున్నాడు
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడ్డ జనుపల్లి శ్రీనివాసరావు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని, నిజాలు దాచిపెడుతున్నాడని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా తెలిపారు. గత మూడు రోజులుగా ఎన్ని విధాలుగా విచారిస్తున్నా నిందితుడి నుంచి ఎలాంటి నిజాలు రాబట్టలేకపోతున్నామని అన్నారు. నిందితుడు కొన్ని విషయాలు చెప్పడానికి ఎంతమాత్రం అంగీకరించడం లేదని, కావాలనే దాచేస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. కేసు విచారణలో కత్తి, లేఖ విషయంపై ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేయాల్సి ఉందని వెల్లడించారు. నిందితుడు సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నాడని వైద్యులు చెప్పారని పేర్కొన్నారు. మూడో రోజు విచారణలో పెద్దగా పురోగతి లేదని, ఆరోగ్యం బాగోలేదంటూ నిందితుడు సహకరించకపోవడం వల్ల కేజీహెచ్‌కు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. మహేష్‌చంద్ర లడ్డా మంగళవారం ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. శ్రీనివాసరావును పోలీసు కస్టడీకి ఇచ్చే సమయంలో కోర్టు కొన్ని నిబంధనలు పెట్టిందని, ఆ మేరకు నిందితుడికి 48 గంటలకోసారి వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉందన్నారు. కస్టడీలో ఉన్న నిందితుడిని వైద్య పరీక్షల నిమిత్తం తరలించే సమయంలో కొద్దిగా హడావుడి జరిగిందన్నారు. సాధారణ వైద్య పరీక్షల్లో బాగంగానే అతడికి వైద్య పరీక్షలు చేయించామని చెప్పారు. ఏడు సెల్ఫోన్లు సీజ్ నిందితుడు వాడిన 9 సెల్ఫోన్లలో 7 ఫోన్లను సీజ్ చేశామని కమిషనర్ లడ్డా తెలిపారు. ఒకటి యానాంలో పోగోట్టుకున్నట్టు చెబుతున్నాడని, మరొకటి ఎవరి వద్ద ఉందని ప్రశ్నిస్తే ఇద్దరు వ్యక్తుల పేర్లు చెప్పాడని, వారు దొరకడం లేదని వివరించారు. నిందితుడికి ఉన్న 3 బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ముమ్మిడివరంలోని ఎస్బీఐ, అమలాపురంలోని విజయబ్యాంకు, ఆంధ్రాబ్యాంకుల్లో ఖాతాలున్నట్టు నిర్ధారణ అయ్యిందన్నారు. సహ ఉద్యోగి రమాదేవి ఖాతా నుంచి ఒకసారి రూ.50,000, మరోసారి రూ.20,000 నిందితుడి ఖాతాకు జమైనట్లుగా గుర్తించామన్నారు. జమ అయిన వెంటనే ఈ సొమ్మును తన సోదరుడి కోసమంటూ శ్రీనివాసరావు డ్రా చేసినట్టుగా గుర్తించామని పేర్కొన్నారు. ఎస్బీఐలో రూ.55, విజయాబ్యాంకులో రూ.357, ఆంధ్రా బ్యాంకులో జీరో బ్యాలెన్స్ ఉందన్నారు. ఇప్పటివరకు 35 మందిని విచారించామన్నారు. రెస్టారెంట్లో కుక్‌గా పనిచేసిన వ్యక్తి సెల్‌ఫోన్ శ్రీనివాసరావు వాడాడని తెలియడంతో ఆ మేరకు విచారణ నిమిత్తం ఓ బృందాన్ని కుక్ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌కు పంపామన్నారు. కాల్ డేటా ఆధారంగా మరో బృందాన్ని ఒడిశాకు పంపించామన్నారు. మరోవైపు ఈ కేసును పర్యవేక్షిస్తున్న డీసీపీ ఫకీరప్ప కర్నూలు ఎస్పీగా బదిలీ అయినందున ఆయనను బుధవారం రిలీవ్ చేస్తున్నామన్నారు. ఆయన స్థానంలో డీసీపీ జోన్–2గా నియమితులైన నయీం ఈ కేసును పర్యవేక్షిస్తారని తెలిపారు. విచారణ నిమిత్తం 160 సెక్షన్ కింద వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు పంపించామని, వారిలో జియాని శ్రీధర్, కృష్ణకాంత్‌లు మినహా మిగిలిన వారు విచారణకు హాజరు కాలేదన్నారు. ఎలాంటి ఒత్తిళ్లు లేవు నిందితుడి విచారణ విషయంలో ఎలాంటి ఒత్తిళ్లు లేవని సీపీ స్పష్టం చేశారు. ప్రాణహాని ఉందని నిందితుడు చేస్తున్న ఆరోపణలను సీపీ వద్ద ప్రస్తావించగా... అలాంటిదేమీ లేదని కొట్టిపారేశారు. తనను చంపి రాజకీయం చేయాలని నిందితుడు చెబుతున్న విషయం ప్రస్తావించగా... ఆ అవసరం ఎవరికుందని సీపీ ఎదురు ప్రశ్న వేశారు. నిందితుడు ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడో తెలియడం లేదన్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిన వెంటనే సీఐఎస్ఎఫ్ అధికారులు ఫిర్యాదు చేయడంలో జాప్యం జరిగిన విషయాన్ని ప్రస్తావించగా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగిందని లడ్డా అంగీకరించారు. జాప్యానికి గల కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు. బాధితుడు జగన్ విచారణకు సహకరించే విషయమై 160 నోటీసు జారీ చేసామని, న్యాయపరమైన సలహాలు తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని తెలిపారు. నిందితుడికి నిరభ్యంతర పత్రం(ఎన్ఓసీ) జారీ చేయడంపై కమిషనర్ స్పందిస్తూ... ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్ పరిధిలో అతడిపై ఎలాంటి కేసులు లేనందున ఎన్ఓసీ జారీ చేశారన్నారు. -
‘శ్రీనివాసరావు విచారణకు సహకరించడం లేదు’
-
‘శ్రీనివాసరావు విచారణకు సహకరించడం లేదు’
సాక్షి, విశాఖపట్నం: ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం ఘటనకు సంబంధించి జరుగుతున్న విచారణపై విశాఖ పోలీస్ కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. నిందితుడు శ్రీనివాసరావుకు ఎలాంటి అస్వస్థత లేదని ఆయన తెలిపారు. అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. ఈ రోజు జనరల్ చెకప్ మాత్రమే చేశామని అన్నారు. అతనికి మూడు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయని.. ఎస్బీఐ, విజయ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ ఘటనతో సంబంధమున్న 35 మందిని విచారించినట్టు వెల్లడించారు. శ్రీనివాసరావు మాత్రం విచారణకు సహకరించడం లేదని తెలిపారు. పోలీస్ కస్టడీలో శ్రీనివాసరావు సురక్షితంగా ఉంటాడని.. కస్టడీలో ఉండగా అతనికి ఎలాంటి ముప్పు ఉండదని లడ్డా అన్నారు. శ్రీనివాస్ స్నేహితులు మధ్యప్రదేశ్, ఒడిశాలలో ఉండటంతో.. పోలీసు బృందాలను అక్కడికి పంపినట్టు తెలిపారు. కాగా, ఈ రోజు శ్రీనివాసరావును వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు కేజీహెచ్‌కు తరలించారు. ఆ సమయంలో నిందితుడు తనకు ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్యలు చేశాడు.