ఇటీవల ప్రతిరోజూ విలేకరుల సమావేశాలతో హడావుడిచేస్తున్న విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డాబుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రెస్‌తోమాట్లాడతారంటే.. ఏదో రొటీన్ క్రైమ్ స్టోరీ చెబుతారేమోననిజర్నలిస్టులు ఒకింత నిర్లిప్తతే ప్రదర్శించారు.సహజంగా సీపీ ప్రెస్‌మీట్ అంటే ముందుగా విషయంబ్రీఫ్ చేయడం పోలీస్ కమిషనర్ కార్యాలయ సిబ్బందికి పరిపాటి.కానీ బుధవారం అటువంటి సమాచారం ఏదీ రాలేదు.లీకులూ ఇవ్వలేదు.సరిగ్గా ఒంటిగంటకు క్రైం స్టోరీ తరహాలోనే మొదలైనసీపీ బ్రీఫింగ్‌లో.. వైఎస్ జగన్‌పై దాడి ప్రస్తావన రాగానే
అందరూ అలర్ట్ అయ్యారుప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతవైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గత అక్టోబర్ 25న ఎయిర్‌పోర్ట్‌లోజరిగిన హత్యాయత్నం కేసు విచారణ వివరాలతో ఏకంగాగంటంపావు సేపు.. ఎక్కడా తొట్రుపాటు లేకుండా... పక్కా స్క్రిప్ట్‌తోనడిచిన సీపీ ప్రసంగపాఠంలో మొత్తంగా తేలిందేమిటంటే..అది కుట్రే కాదట..!కేవలం సంచలనం, ప్రచారం కోసమే శ్రీనివాసరావు ఒక్కడేచేశాడట!!... ఇంకెవ్వరికీ సంబంధం లేదట!!!.. అని సీపీ ముక్తాయించారు.
ఇంటర్మీడియట్ కూడా చదవని, గతంలో నేర చరిత ఉన్న శ్రీనివాసరావు ఏకంగా వైఎస్ జగన్‌పై హత్యాయత్నమే లక్ష్యంగా.. నావికాదళం పర్యవేక్షణలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లోకి ఎలా వచ్చాడు.. ఎయిర్‌పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నాడు..ఎవరి అండదండ, ప్రోద్బలం లేకుండా ఏకంగా జనాకర్షణ కలిగిన నేత జగన్‌పై హత్యాయత్నానికి ఎలా కత్తి దూశాడు.. అనే సామాన్యజనం నుంచి ఉత్పన్నమైన ప్రశ్నలకు కూడా సీపీ సమాధానంచెప్పకుండా తాను చెప్పాల్సింది మాత్రం చెప్పిముగించేసిన తీరు అందరికీ విస్తు గొల్పింది.మరో వారం రోజుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిప్రజాసంకల్పయాత్ర చారిత్రాత్మక ఘట్టంగా ముగుస్తున్ననేపథ్యంలో హఠాత్తుగా సీపీ ఈ కేసును నిర్వీర్యం చేసే విధంగాప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.ఎంతో ట్రాక్ రికార్డ్ ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి లడ్డా... బాధ్యతాయుతంగా చేపట్టాల్సిన కేసు విచారణ తీరు, కేసు పురోగతిని హడావుడిగా వెల్లడించిన క్రమం ఇప్పుడు విమర్శలపాలవుతోంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: జననేత, ప్రధాన ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన హత్యాయత్నం కేసు విచారణ తీరుపై మొదటి రోజు నుంచి అనుమానాలు వెల్లువెత్తినా.. నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా ట్రాక్ రికార్డ్ ఎరిగిన వాళ్ళు మాత్రం ఎంతో కొంత నిబద్ధత పాటిస్తారని, వాస్తవాలు వెలుగులోకి రావొచ్చని భావించారు. అయితే అందరి అంచనాలనే తారుమారు చేస్తూ కేసును నిర్వీర్యం చేసేశారన్న వాదనలే ఇప్పుడు బహిరంగంగా వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్థాయిలో కలకలం రేపిన జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణపై ప్రభుత్వ పెద్దల ప్రభావం ఉందన్న వాదనలకు ఊతమిచ్చేలానే సీపీ సహా పోలీసు ఉన్నతాధికారుల విచారణ, ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు కొనసా...గుతూ వచ్చింది. జగన్‌ను హత్యచేయాలనే పన్నాగంతోనే దుండగుడు శ్రీనివాసరావు కత్తితో దాడికి తెగబడ్డాడని కోర్టుకిచ్చిన రిమాండ్ రిపోర్ట్‌లో స్పష్టంగా పేర్కొన్న పోలీసులు ఆ రిపోర్ట్‌లోనే హత్యాపథకం వెనుక కుట్రదారులెవరు, అసలు సూత్రధారులెవరు అనే కీలక విషయాలను కనీసంగా కూడా ప్రస్తావించలేదు. ఘటన జరిగిన మూడో రోజు రిమాండ్ రిపోర్ట్ రూపొందించడంతోనే విచారణ తంతును బట్టబయలు చేసిన పోలీసు అధికారులు ఈ రెండు నెలల కాలంలో దర్యాప్తు డ్రామాను రక్తి కట్టించారు.
అంతా ఒక్కడే చేశాడా...
పదోతరగతి వరకు మాత్రమే చదువుకున్న యువకుడు పక్కా వ్యూహం ప్రకారం రాష్ట్ర శాంతి భద్రతల పరిధిలోకి వచ్చే ప్రాంతంలో కాకుండా సునిశిత సమస్యగా మారే కేంద్ర బలగాల పరిధిలోని ఎయిర్‌పోర్ట్‌లో ప్రధాన ప్రతిపక్ష నేతపై దాడికి తెగబడటం మామూలు విషయం కాదు. ఒక్క వేటుతో గొంతులోకి కత్తి దించి ప్రాణాలు హరించడమే లక్ష్యంగా ఘాతుకానికి తెగించిన శ్రీనివాసరావుకు ఇదంతా చేయమని నూరిపోసిందెవరు..? అతన్ని ఆ విధంగా ప్రేరేపించి ఏం జరిగినా మేం చూసుకుంటాం... అని అండగా నిలిచిందెవరు.. పక్కా పథకం ప్రకారం పదినెలలుగా విశాఖ ఎయిర్‌పోర్టులోనే మకాం వేయించి ఉసిగొల్పిందెవరు.. అనే కీలక విషయాలవైపే పోలీసులు, సిట్ అధికారులు దృష్టి సారించలేదు. ఇక పోలీసు విచారణలో సైతం నిందితుడు లెక్కలేకుండా ఉన్నాడని, నేను చెప్పాల్సిందిందంతా లేఖలో రాసేశాను.. ఇంకేమీ లేదంటూ కనీసం భయం లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నాడని, విచారణకు సహకరించడం లేదని అప్పట్లో పోలీసు ఉన్నతాధికారులే బాహాటంగా అంగీకరించారు. అందుకు ఊతమిచ్చే విధంగానే సీపీ లడ్డా బుధవారం మాట్లాడారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావు పక్కా పథకంతోనే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడని, ఎటువంటి బెరుకు, భయం లేకుండా ముందుగానే కొందరికి ఫోన్లు చేసి చెప్పుకున్నాడని సీపీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇదంతా చూస్తుంటేనే శ్రీనివాసరావు వెనుక బడాబాబుల పాత్ర ఉందనేది ఎవరికైనా అర్ధమవుతుంది. కానీ సీపీ ఆ కేసులో ఇంకెవ్వరి పాత్ర లేదంటూ శ్రీనివాసరావు ఒక్కరికే పరిమితం చేస్తూ... దాదాపు కేసు క్లోజ్ అని అర్ధం వచ్చేటట్టు మాట్లాడటమే విస్తుగొలుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment