
కొత్తగా నియమితులైన పోలీస్‌కమిషనర్ మహేష్‌చంద్రలడ్డాకు స్వాగతం పలుకుతున్న డీసీపీ పకీరప్ప, ఏసీపీలు ప్రభాకర్, అర్జున్ తదితరులు
గోపాలపట్నం: విశాఖ నగర పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ఇంటెలిజెన్స్ ఐజీ మహేష్‌చంద్రలడ్డా నగరానికి చేరుకున్నారు. హైదరా బాద్ నుంచి ఇండిగో విమానంలో వచ్చిన ఆయనను విశాఖ విమానాశ్రయంలో ఆదివారం రాత్రి డీసీపీ పకీరప్ప, ఏసీపీలు కింజరాపు ప్రభాకర్, అర్జున్, సీఐలు మళ్ల శేషు, శ్రీనివాస్, ఇంకా పలువురు అధికారులు స్వాగతం పలికారు. ప్రస్తుత పోలీసుకమిషనర్ యోగానంద్ విజయవాడ జాయింట్ సీపీగా బదిలీ అయిన తరుణంలో ఆయన నుంచి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.
అప్పన్న సన్నిధిలో...
సింహాచలం(పెందుర్తి): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆదివారం రాత్రి విశాఖ కొత్త సీపీ మహేష్‌చంద్ర లడ్డా సతీసమేతంగా దర్శించుకున్నారు. ఆలయంలో జరిగిన రాత్రి ఆరాధన కార్యక్రమంలో దాదాపు గంటసేపు పాల్గొన్నారు.కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని అంతరాలయంలో అష్టోత్తరంపూజ నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి ప్రసాదాన్ని ఏఈవో ఆర్‌వీఎస్ ప్రసాద్ సీపీకి అందజేశారు. ఆలయ విశిష్టతను స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్ సిపి దంపతులకు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment