
మహేశ్ చంద్ర లడ్డా(పాత చిత్రం)
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై టీడీపీ నేతలు చేస్తున్న విషపూరిత ప్రచారంలో నిజం లేదని విచారణలో వెలుగుచూస్తుంది. వైఎస్ జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమేనని రిమాండ్ రిపోర్ట్ స్పష్టం చేసింది. తాజాగా విచారణకు సంబంధించి నగర పోలీసు కమిషనర్ మహేశ్ చంద్ర లడ్డా మాట్లాడుతూ.. నిందితుడు శ్రీనివాసరావు వినియోగించిన కత్తిని జనవరిలోనే కొనుగోలు చేశాడని వెల్లడించారు. దీని ద్వారా వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఓ పథకం ప్రకారమే జరిగిందని తేటతెల్లమవుతోంది.
ఇంకా కమిషనర్ మాట్లాడుతూ.. శ్రీనివాసరావు వద్ద నుంచి నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసకున్నట్టు తెలిపారు. ఈ కేసులో అతని సహచర ఉద్యోగులను కూడా విచారిస్తున్నట్టు పేర్కొన్నారు. అంతే కాకుండా అతనికి చెందిన మూడు బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్నామని అన్నారు.