
సాక్షి, విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ను ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని విశాఖ నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కౌంటింగ్ కేంద్రాల్లోకి పాస్‌లు ఉన్న వారిని మాత్రమే మద్దిలపాలెం, త్రీ టౌన్ రోడ్‌లో ఉన్న గేట్ ద్వారా అనుమతినిస్తామని కమిషనర్ తెలిపారు. అంతేకాకుండా కౌంటింగ్ కేంద్రాల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ నేరచరితులను అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు వచ్చిన 1430 మంది ఏజెంట్ల జాబితాలో 40 మంది పైన కేసులున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల పరిశీలకులకు మినహా మరెవరికీ సెల్‌ఫోన్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమితి లేదన్నారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నామని కమిషనర్ అన్నారు. 1272 మంది సివిల్ సిబ్బందితో పాటు స్పెషల్ పార్టీలు, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌కు చెందిన కంపెనీలు, ఏపీఎస్పీకు చెందిన ప్రత్యేక బృందాలను విధుల్లో ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. 32 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక పికెట్లు ఏర్పాటు చేశామన్నారు. సెక్షన్ 144, 30 అమల్లో ఉన్నందున విజయోత్సవాలు, ఆందోళనలు, ధర్నాలు, సమావేశాలు, సభలు నిషేధమని కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
కౌంటింగ్ కేంద్రల వద్ద సివిల్, సీఆర్‌పీఎఫ్, సీఐఎస్‍ఎఫ్ భద్రత
Comments
Please login to add a commentAdd a comment