
సాక్షి, అమరావతి : ఎన్నికల కౌంటింగ్ రోజున పెద్ద ఎత్తున గొడవలకు తెరలేపేందుకు అధికార తెలుగుదేశం పార్టీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కౌంటింగ్ ఏజెంట్లకు టీడీపీ శిక్షణ ఇవ్వడంతో ఆ పార్టీ వ్యూహం బట్టబయలైందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఓట్ల లెక్కింపులో ప్రత్యర్థి అభ్యర్థికి మెజారిటీ వస్తే ప్రతిరౌండ్‌లోను రీకౌంటింగ్‌కు డిమాండ్ చేయాలని టీడీపీ తన కౌంటింగ్ ఏజెంట్లకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు కౌంటింగ్ అధికారులతో గట్టిగా ఒత్తిడి చెయ్యాలని టీడీపీ నేతలు ఏజెంట్లను ప్రేరేపిస్తున్నట్టు తెలుస్తోంది.
మూడు రోజుల పాటు కౌంటింగ్ ఏజెంట్లకు ఇచ్చిన శిక్షణలో ఇదే విషయాన్ని గట్టిగా టీడీపీ నాయకత్వం నూరిపోసినట్టు పార్టీ వర్గాల సమాచారం. ఏజెంట్ల బుక్‌లెట్‌లోనూ ఇదే విషయం ఉండటం టీడీపీ దురాలోచనను బయటపెట్టింది. ఓడిపోయేచోట కౌంటింగ్ ప్రక్రియ వివాదాస్పదం చేసి.. గొడవలకు తెరలేపాలని పార్టీ ఏజెంట్లకు టీడీపీ నాయకత్వం తప్పుడు సలహాలు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది.
సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
ఎన్నికల కౌంటింగ్ రోజున గొడవలకు టీడీపీ స్కెచ్
Comments
Please login to add a commentAdd a comment