చంద్రబాబు దత్తత గ్రామంలో వైఎస్సార్‌సీపీ సత్తా  | YSRCP Gain High Votes In Chandrababu Adopt Village | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దత్తత గ్రామంలో వైఎస్సార్‌సీపీ సత్తా 

Published Sun, May 26 2019 7:54 AM | Last Updated on Fri, Jul 26 2019 5:58 PM

YSRCP Gain High Votes In Chandrababu Adopt Village - Sakshi

సాక్షి, విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు దత్తత గ్రామంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తిరుగులేని ఆధిక్యతను కనబర్చింది. 2014 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత చంద్రబాబు స్మార్ట్‌ విలేజ్‌ పథకాన్ని తీసుకొచ్చారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా అరకులోయ మండలం పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకున్నారు. రాష్ట్రంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానంటూ ప్రకటించారు. వరుసగా రెండేళ్లపాటు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను అరకులోయలోనే నిర్వహించి తాను దత్తత తీసుకున్న పెదలబుడు పంచాయతీకి లెక్కలేనన్ని వరాలు ప్రకటించారు. కానీ గడిచిన ఐదేళ్లలో ఇక్కడ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అనే చందంగా ఉండడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత పెల్లుబికింది. దత్తత పేరుతో తమను మోసగించిన చంద్రబాబుకు ఓట్ల రూపంలో గిరిజనులు బుద్ధి చెప్పారు.

పరిణామాలిలా..
2014 ఎన్నికల్లో అరకులోయతో పాటు పాడేరు నుంచి వైఎస్సార్‌సీపీ నుంచి గెలుపొందిన కిడారి సర్వేశ్వరరావు, గిడ్డి ఈశ్వరిలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి తీసుకున్నారు. సర్వేశ్వరరావు అధికారాన్ని అడ్డంపెట్టుకుని అవినీతి, అక్రమాలకు పాల్పడడంతో పలుమార్లు హెచ్చరించిన మావోలు చివరకు గతేడాది సెప్టెంబర్‌లో హతమార్చారు. తర్వాత ఆయన తనయుడు శ్రావణ్‌కుమార్‌ను చట్టసభల్లో సభ్యత్వం కల్పించకుండానే మంత్రిని చేశారు. ఆరు నెలల గడువు ముగియడంతో ఎన్నికలముందే శ్రావణ్‌కుమార్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికల్లో కిడారి శ్రావణ్‌కుమార్‌ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణ చేతిలో ఘోర పరాజయంపాలయ్యారు. మిగిలిన పంచాయతీల మాటెలా ఉన్నా కనీసం చంద్రబాబు దత్తత తీసుకున్న పంచాయతీ పరిధిలో కూడా టీడీపీకి మెజార్టీ ఓట్లురాని దుస్థితి నెలకొంది. పెదలబుడు పంచాయతీలోని 22 గ్రామాల్లోనూ వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యత లభించింది. పెదలబుడు పంచాయతీ పరిధిలోని 7 బూత్‌లలో పోలైన ఓట్లలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చెట్టి ఫల్గుణకు 1,176 ఓట్లు రాగా, టీడీపీ అభ్యర్థి శ్రావణ్‌కుమార్‌కు 806 ఓట్లు దక్కాయి. 25,495 ఓట్ల మెజార్టీతో చెట్టి ఫల్గుణ ఘన విజయం సాధించారు.

చంద్రబాబు దత్తత పంచాయతీ  పెదలబుడులో ఉన్నవి 22 గ్రామాలు
పెదలబుడు పంచాయతీలో ఓటర్లు 3,612 మంది +

బూత్‌ల వారీగా లభించిన ఓట్లు 
పెదలబుడు
బూత్‌    శ్రావణ్‌    ఫల్గుణ
216    71    134
217    58    89
208    88    140
209    104    113
210    109    196
211    216    343
పానిరంగిణి గ్రామం
235    160    161

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement