సాక్షి, విశాఖపట్నం : టిట్కో గృహాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ' సీఎం జగన్ 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిర్ణయించారు. 30 లక్షల ఇళ్ల స్థలాలతో పాటు300 చదరపు అడుగుల టిట్కో ఇల్లు కూడా పేదలకు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. చంద్రబాబు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లారు. మేము ఇల్లు ఇస్తామని చెప్పిన తరువాత చంద్రబాబు టిట్కో గృహాల్లో గృహ ప్రవేశం చేయిస్తామంటున్నారు. టిట్కోలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. చదరపు అడుగుకు 1200 ఖర్చు అయితే 2 రెండు వేల ఖర్చు చేశారు.30 లక్షల ఇళ్ళతో పాటు టిక్కో 300 చదరపు అడుగుల ఇళ్లు ఈవ్వాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు హయాంలో 3 లక్షల ఇళ్ళు పునాది వేశారు..2 లక్షల 6216 ఇళ్లకు బేసిమెంట్ వేశారు. 81048 ఇల్లులు 95 శాతం నిర్మాణం అయ్యాయి. ప్రభుత్వం ఇల్లులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న తరువాత చంద్రబాబు ధర్నా అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఇళ్లు నిర్మాణం పూర్తి కాకుండానే టిక్కో కాంట్రాక్టర్లకు రూ. 3200 కోట్లు బకాయిలు పెట్టారు. 365, 430 చరదరపు అడుగులు వారికి అర్హత పత్రాలు ఇస్తాము. అర్హత లేని వారు ఉంటే డబ్బులు వెనక్కి ఇవ్వమని చెప్పాము.షేర్ వాల్ టెక్నాలజీ ద్వారా ఆరు నెలల్లో ఇళ్ళు పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పారు. మూడు ఏళ్ళు అయిన ఒక్క ఇల్లు కూడా పూర్తిస్థాయిలో నిర్మాణం చేయలేకపోయారు.
చంద్రబాబు దోపిడీ వలన పోలవరం నిధులు తగ్గాయని.. ఈ దుస్థితికి ఆయనే కారణం.కాసుల కక్కుర్తి కోసం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు తాకట్టు పెట్టారు. పోలవరంలో కమిషన్ల కోసం చంద్రబాబు కాంట్రాక్టు తీసుకున్నారు. మీరే పోలవరం కట్టుకోండి అనే పరిస్థితి వచ్చింది. మాకు కాంట్రాక్టుల మీద ఆసక్తి లేదు. కేంద్రాన్ని ఒప్పించి పోలవరం పూర్తి చేస్తాము.అవసరమైతే పోలవరం నిధుల కోసం కోర్టుకు కూడా వెళ్తాము. కోర్టుకు వెళ్లకుండానే సమస్య పరిష్కరం అవుతుందని భావిస్తున్నా.' అంటూ బొత్స వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment