చంద్రబాబు ప్రభుత్వం నిర్వాకం
వైఎస్ జగన్ పెంచిన రూ.10 లక్షల ప్యాకేజీకి మంగళం
ఇందులో రూ.3.50 లక్షలకు కోత
ఎనిమిదేళ్ల క్రితం ప్యాకేజీనే ఇస్తామంటున్న బాబు
నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.550 కోట్లకు ఎసరు
ఆందోళనలో పోలవరం నిర్వాసితులు
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితల సొమ్ముకు సీఎం చంద్రబాబు ఎసరు పెట్టారు. వారికి వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రకటించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రూ.10 లక్షలు కాదని, ఎనిమిదేళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన ప్యాజీనే అమలు చేసే యోచనలో బాబు ప్రభుత్వం ఉంది. ఈమేరకు అధికారులు బిల్లులు సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీని ప్రకారం ఇప్పుడు ప్రతి నిర్వాసితుడికి దాదాపు రూ.3.5 లక్షల కోత పడుతుంది. దీనిపై నిర్వాసితులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. – వేలేరుపాడు
2017లో ప్యాకేజీ ఇలా..
ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 41.15 కాంటూర్ పరిధిలో ఎనిమిది మండలాల్లో 90 రెవెన్యూ గ్రామాల్లో 38,060 మంది పోలవరం నిర్వాసితులున్నారు. ఇందులో ఏడు మండలాలు తెలంగాణ నుంచి కలుపుకున్నవి కాగా మరో మండలం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉంది. 2017లో 2013 భూసేకరణ చట్టం ప్రకారం గిరిజనేతరులకు రూ.6.36 లక్షలు ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో వారి æజీవితాంతం ఉపాధికి రూ.5 లక్షలు, అలవెన్స్ రూ.36,000, రవాణా చార్జీలకు రూ.50 వేలు, పునరావాస అలవెన్స్‌గా రూ.50 వేలు ఉన్నాయి. ఎస్టీలు, ఎస్సీలకు రూ.50 వేలు అదనంగా ఇచి ప్యాకేజీ రూ.6.86 లక్షలుగా నిర్ణయించారు.
లబ్ధిదారులు, ప్యాకేజీని పెంచిన జగన్
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నిర్వాసితులు అందరినీ ప్యాకేజీలోకి తీసుకొచ్చారు. ఏలూరు జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాల్లోని 36 గ్రామాలకు చెందిన మరో 13,937 మంది నిర్వాసితులను లబి్ధదారులుగా చేర్చారు. దీంతో మొత్తం నిర్వాసితుల సంఖ్య 44,797కు పెరిగింది. నిర్వాసితుల కష్టాలు కళ్లారా చూసి, వారి ఆరి్థక స్థితిగతులను పరిగణనలోకి తీసుకొన్న వైఎస్ జగన్ పెరిగిన ధరలకనుగుణంగా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి మరో రూ.3.64 లక్షలు కలిపి రూ.10 లక్షలకు పెంచారు. అదనంగా రూ.550 కోట్లు కూడా కేటాయించారు. వైఎస్ జగన్ మరోసారి ముఖ్యమంత్రి అయి ఉంటే నిర్వాసితులకు పెరిగిన ప్యాకేజీ లభించేది. నిర్వాసితుల త్యాగాలకు అర్థం ఉండేది.
నిర్వాసితులకు అన్యాయం చేస్తున్న బాబు
ఏ ప్రభుత్వమైనా ఓ ప్రాజెక్టు కోసం భూములిచ్చి త్యాగం చేసిన వారికి న్యాయం చేయాలి. కానీ, చంద్రబాబు ప్రభుత్వం మాత్రం పోలవరం నిర్వాసితులకు తీరని అన్యాయానికి ఒడిగట్టింది. వాస్తవంగా ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా నిర్వాసితలకు ప్యాకేజీని సవరిస్తే రూ.13 లక్షల వరకు ఇవ్వాల్సి ఉంది. ఈమేరకు పెంచకపోగా, గత ప్రభుత్వం పెంచిన ప్యాకేజీని కాదని 2017లో ప్రకటించన మేరకే ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తోంది. నిర్వాసితులకు ఇవ్వాల్సిన రూ.550 కోట్లకు ఎసరు పెడుతోంది.
నిర్వాసితుల త్యాగాలను గుర్తించిన జగన్
పోలవరం నిర్వాసితుల త్యాగాలను గుర్తించి మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జారీ చేసిన రూ.10 లక్షల జీవోను ప్రస్తుత సీఎం చంద్రబాబు అమలు చేయాలి. పెరిగిన ధరలను దృష్టిలో ఉంచుకొని, పార్టీలకతీతంగా నిర్వాసితులకు న్యాయం చేయాలి.
రూ.13 లక్షలు ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ఆర్ అండ్ ఆర్ వ్యక్తిగత ప్యాకేజీ రూ.13 లక్షలు ఇవ్వాలి. ప్రాజెకు నిర్మాణ వ్యయాన్ని ఏటా పెంచుతున్నారు. నిర్వాసితులకు మాత్రం 2017లో ప్రకటించిన పాత ప్యాకేజీ ఇస్తామంటున్నారు. ఇదెక్కడి న్యాయం?
– కుంజం మురళి, ఎంపీపీ, దేవీపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లా
మా త్యాగాలకు విలువ లేదా?
నిర్వాసితులు త్యాగమూర్తులంటూ వేదికలపై సీఎం చంద్రబాబు చెబతారు. ప్యాకేజీ విషయానికొస్తే ఉపాధి కూలీలకు ఇచ్చే రోజువారీ వేతనమంత కూడా లేదు. ఉపాధి కూలీలకు 2017లో రోజువారీ వేతనం రూ.150 ఉంటే ప్రస్తుతం రూ.300కు పెరిగింది. మాకు మాత్రం ఎనిమిదేళ్ల క్రితం ప్యాకేజీ ఇవ్వడం అన్యాయం. మా త్యాగాలకు గుర్తింపు ఇదేనా? – గుజ్జా విజయ, జెడ్పీటీసీ సభ్యురాలు, కూనవరం మండలం, అల్లూరి సీతారామరాజు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment