నెయ్యి కల్తీపై థర్డ్‌పార్టీ విచారణ చేయించండి: బొత్స | Former Minister Botsa Satyanarayana Pressmeet On Tirupati Issue | Sakshi
Sakshi News home page

నెయ్యి కల్తీపై థర్డ్‌పార్టీ విచారణ చేయించండి: బొత్స సత్యనారాయణ

Published Sat, Sep 28 2024 3:36 PM | Last Updated on Sat, Sep 28 2024 7:50 PM

Former Minister Botsa Satyanarayana Pressmeet On Tirupati Issue

సాక్షి,విశాఖపట్నం:నెయ్యికల్తీపై చంద్రబాబు మాటలు చూస్తుంటే జాలేస్తోందని మాజీమంత్రి,వైఎస్‌ఆర్‌సీపీసీనియర్‌నేత బొత్ససత్యనారాయణ అన్నారు.విశాఖపట్నంలో శనివారం(సెప్టెంబర్‌28)బొత్స మీడియాతో మాట్లాడారు.

‘నెయ్యి ఎక్కడ కల్తీ జరిగిందో తెలియదని బాబు చెప్తున్నాడు.నెయ్యి కల్తీని చంద్రబాబు నిరూపించాలి. సుప్రీంకోర్టు జడ్జి లేదంటే సీబీఐతో విచారణ చేయించాలి. కల్తీ చేసిన వారిని శిక్షించాలి. చంద్రబాబుకు చిత్తశుద్ధిఉంటే థర్డ్‌పార్టీతో విచారణ జరిపించాలి. సీబీఐ విచారణ కోసం కేంద్రానికి ఎందుకు లేఖ రాయడం లేదు?

చంద్రబాబు తన అబద్ధాలను నిజం చేసుకోవడానికి తన మనుషులతో సిట్‌ వేసుకున్నారు.కల్తీ జరిగి ఉంటే ఎందుకు న్యాయవిచారణకు వెనుకాడుతున్నారు. దేవుడిని అడ్డుపెట్టుకుని స్వార్థరాజకీయలు చేస్తున్నారు.ఇంతటి దుర్మార్గానికి ఎవరైనా పాల్పడతారా..ఇది న్యాయమా..

మాజీ సీఎం తిరుమల వెళ్తానంటే అడ్డుకోవడం దారుణం. చంద్రబాబేమో ఎవరూ అడ్డుకోలేదంటున్నారు.తిరుమల వెళ్తామంటే నోటీసులు ఇచ్చారు.తిరుమల వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాయకులపై ఉంది.

చంద్రబాబు కుట్రపూరిత రాజకీయాలు చేస్తున్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. 20లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి ఇప్పుడు ఉద్యోగాలు తీసేస్తున్నారు. పరిపాలన చేయాల్సిందిగా అవకాశమిస్తే మీరు చేస్తున్నదేంటి. స్టీల్‌ప్లాంట్‌లో నాలుగు వేల మంది కార్మికులను తొలగిస్తే దానికి సమాధానం చెప్పే వారు లేరు. ఎన్నికలకు ముందు స్టీల్ ప్లాంట్ కోసం ఏం చెప్పారు. బియ్యం కూడా కొనుక్కొనే పరిస్థితి ప్రజలకు లేదు.

చారు అన్నం కూడా తినే పరిస్థితి కూడా ప్రజలకు లేదు.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 25 వేల కోట్లు అప్పు చేశారు. అప్పులు చేయడమేనా సంపద సృష్టి అంటే.సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారో సమాధానం చెప్పాలి.వెంకటేశ్వర స్వామి ప్రసాదంతో రాజకీయం చేయడం ధర్మనేనా.చంద్రబాబుకు మంచి బుద్ధి ప్రసాదించాలని పూజలు చేశాం ’అని బొత్స తెలిపారు.

ఇదీ చదవండి: పాపం చంద్రబాబుదే..సీబీఐ విచారణకు భూమన డిమాండ్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement