పోలీసు వలపు వేధింపులు..! | Cop Suspended For Molestation Allegations In Vizag | Sakshi
Sakshi News home page

పోలీసు వలపు వేధింపులు..!

Published Tue, Apr 30 2019 10:58 AM | Last Updated on Tue, Apr 30 2019 11:12 AM

Cop Suspended For Molestation Allegations In Vizag - Sakshi

కృష్ణకుమారి, విజయభాస్కర్‌   

పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు అధికారే లైంగిక వేధింపులకు పాల్ప డ్డారనే ఆరోపణలు నగరంలో కలకలం రేపాయి. ప్రేమించి మోసపోయిన తన సోదరి పెట్టిన కేసు పురోగతిపై వాకబు చేసేందుకు యత్నించిన బాధితురాలి సోదరితో ఫోన్‌లో ఎంవీపీ సీఐ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ ఘటనపై బాధితులు, మహిళా చేతన సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఎంవీపీ కాలనీ సెక్టార్‌ – 9 గొల్లవీధిలో తల్లి, చెల్లితో నివసిస్తున్న పల్లా కృష్ణకుమారి ఆం ధ్రా యూనివర్సిటీ జియాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ఆమెను వరుసకు బావ అయ్యే విజయభాస్కర్‌ ప్రేమ పేరుతో వంచించి లైంగికంగా లొంగదీ సుకున్నాడని ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల ఫిర్యా దు చేసింది.

ఫిర్యాదు అందిన తరువాత సదరు యువకుడు విజయభాస్కర్‌ని సీఐ పిలి పించి చర్యలు తీసుకోలేదని, పైగా కృష్ణకుమారి సోదరి మీనాక్షికి ఫోన్‌ చేసి అసభ్యకరంగా మాట్లాడారని బాధితులు ఆరోపిస్తున్నారు. మీనాక్షికి సీఐ సన్యాసినాయుడు ఫోన్‌చేసి.. ఎక్కడ ఉంటున్నారు..?, ఏం చదువుతున్నావు..? ఇంటి అద్దె ఎంత అం టూ వ్యక్తిగత వివరాలు అడగారని, ఏ టైమ్‌లో ఫ్రీగా ఉంటావు..? బీచ్‌కి ఎప్పుడు వస్తావు, ఇద్దరం ఒకే కేస్ట్‌ కదా.. అంటూ సీఐ లైంగికంగా వేధించారని మీనాక్షి ఆరోపించింది. తన అక్కకి అలా జరిగిందని, తాను కూడా అలాంటిదాన్నే అని భావిస్తున్నారా అని సీఐని ప్రశ్నించినా చులకనగా మాట్లాడారని మీనాక్షి ఆరోపించారు.

ఈ నేపథ్యంలో బాధితురాలు మహిళా చేతన కార్యదర్శి పద్మను ఆశ్రయించగా ఆమె సోమవారం ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని సీఐతో మాట్లాడారు. బాధితురాలు మీనాక్షితో కలిసి సీఐని నిలదీయగా... మొదట బుకాయించినప్పటికీ ఆడియో రికార్డింగ్‌ను వినిపించడంతో సీఐ కాళ్ల బేరానికి వచ్చాడని పద్మ మీడియాకు తెలిపారు. ఇటువంటి సీఐపై సీపీ మహేష్‌చంద్ర లడ్డా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆమె బాధితులతో కలిసి ద్వారకా సబ్‌ డివిజన్‌ ఏసీపీ వై.వి.నాయుడుని కలిసి ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉండీ మహిళలతో చులకనగా మాట్లాడిన సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

సన్యాసినాయుడుపై సీపీ కొరడా 
ఎంవీపీ సీఐ ఎన్‌.సన్యాసినాయుడుపై సీపీ కొరడా ఝులిపించారు. ప్రేమించి మోసపోయానని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు సోదరి మీనాక్షి పట్ల ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదు అందడంతో సీపీ మహేష్‌చంద్రలడ్డా ఎంవీపీ సీఐని సస్పెండ్‌ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడి త్రీటౌన్‌ స్టేషన్‌ సీఐ బెండి వెంకటరావు కూడా ఒక బాధితురాలితో ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదు రావడంతో అప్పటి సీపీ యోగానంద్‌ వెంటనే స్పందించి సీఐ వెంకటరావును సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే. తరువాత ఆయనకు శ్రీకాకుళంలో పోస్టింగ్‌ ఇచ్చారు.

సీఐ సన్యాసినాయుడు 

మోసగాడిని అరెస్ట్‌ చేయాలి
ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి మరో అమ్మాయితో వివాహానికి సిద్ధపడుతున్న మోసగాడిని అరెస్ట్‌  చేయాలని మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ, బాధితురాలు కృష్ణకుమారి  డిమాండ్‌ చేశారు. పద్మతో కలిసి ఎంవీపీ పోలీసు స్టేషన్‌ ఆవరణలో కృష్ణకుమారి మీడియాతో సోమవారం మాట్లాడారు. తాను ఆంధ్రా యూనివర్సిటీ జియాలజీ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నానని, తల్లి, చెల్లితో కలిసి ఎంవీపీ కాలనీ సెక్టార్‌ – 9 గొల్లవీధిలో నివసిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్‌ జియ్యమ్మవలస మండలం పరసవాడు దరి లక్ష్మీపురం గ్రామానికి చెందిన మేనమామ మన్మథనాయుడు కుమారుడు తాడేల విజయభాస్కర్, తాను ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నామన్నారు. తామిద్దరం ఢిల్లీ, బెంగళూరు, తిరుపతి పట్టణాలు తిరిగామన్నారు. విజయభాస్కర్‌ బెంగళూరులోని ఫార్చ్యూన్‌ సమ్మిట్‌ ట్రావెల్‌ సెంట్రిక్‌ టెక్నాలజీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడన్నారు. 

మీడియాతో మాట్లాడుతున్న మహిళా చేతన కార్యదర్శి పద్మ

తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు బావ తనను మభ్యపెట్టి లైంగికంగా లోబరుచుకున్నాడని ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి విశాఖ, తిరుపతి పట్టణాలలోని హోటల్స్‌లో కూడా లోబరచుకున్నాడన్నారు. గత ఏడాది నుంచి తనకు ముఖం చాటేస్తున్నాడని విచారం వ్యక్తం చేశారు. తన మేనమామకు విషయం అంతా చెప్పినా సరే పెళ్లికి అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎంవీపీ కాలనీలో నివసిస్తున్న మరో యువతితో విజయభాస్కర్‌ వివాహ నిశ్చితార్థం చేసుకున్నాడన్నారు. ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మార్చి 9న వాయిదా పడిన నిశ్చితార్థం ఈ నెల 27న ఒక హోటల్‌లో రహస్యంగా నిర్వహించారన్నారు. తనకు అన్యాయం చేసిన విజయభాస్కర్‌ని అరెస్ట్‌ చేయాలని, మేనమామపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్‌ చేశారు. మీడియా సమావేశంలో మహిళా చేతన నాయకులు కూడా పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement