MVP colony
-
విశాఖలో శ్రావణి అనే మహిళ ఆత్మహత్య
-
3 నెలల కిందటే ప్రేమ పెళ్లి.. పెట్రోల్ పోసుకొని వివాహిత ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ ముందు ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. శ్రావణి అనే మహిళ పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. మంటలార్పేందుకు ప్రయత్నించిన ఎస్సైకు గాయాలయ్యాయి. వివరాలు.. గుంటూరుకు చెందిన శ్రావణికి, విశాఖకు చెందిన వినయ్‌తో మూడు నెలల కిందటే ప్రేమ వివాహం జరిగింది. వినయ్‌కు మద్యం అలవాటు కారణంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో భర్త మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడని పోలీసులకు శ్రావణి ఫిర్యాదు చేసింది. భార్యభర్తలకు కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పోలీసులు గురువారం పోలీస్ స్టేషనకు పిలిపించారు. దంపతులకు ఎస్సై శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇస్తుండగానే ఇద్దరి మధ్య మళ్లీ గొడవ జరిగింది. మనస్తాపంతో స్టేషన్ బయటికి వచ్చిన శ్రావణి.. ఒంటిపై పెట్రోల్ పొసుకొని నిప్పంటించుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు మంటలు ఆర్పేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఎస్సై శ్రీనివాస్ చేతికి గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన శ్రావణిని పోలీసులు సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. పోలీసులు గుంటూరులోని శ్రావణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చి.. భర్తను అదుపులోకి తీసుకున్నారు. -
విశాఖలో అమానవీయం.. వృద్ధుడిని రోడ్డు పక్కన వదిలేసిన కుటుంబం
సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ఎంవీపీ కాలనీలోని వెంకోజిపాలెంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కదలేని పరిస్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని సొంత కుటుంబ సభ్యులు నడిరోడ్డుపై వదిలివెళ్లిపోయారు. కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేని ఆ వృద్థుడు కొద్ది రోజులుగా తీవ్రమైన చలిగాల్లోనే బతుకుపోరాటం చేస్తున్నాడు. తొలుత భిక్షాటన చేసుకునే వ్యక్తిగా భావించిన స్థానికులు అతనిని పట్టించుకోలేదు. అయితే రోజులు గడుస్తున్నా అతను అక్కడే ధీనంగా ఉండడం, కదల్లేక రాత్రిపూట చలికి తట్టుకోలేక వణికిపోవడాన్ని గమనించారు. దీంతో స్థానిక పోలీసులకు ఓ పాత్రికేయుడు సహకారంతో సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా తనది అప్పుఘర్ ప్రాంతమని, తన కుటుంబ సభ్యులే (కొడుకు, కోడలు) ఇక్కడ వదిలేసి వెళ్లినట్లు వెల్లడించాడు. అయితే పేరుతో పాటు పూర్తి వివరాలు తెలిపే స్థితిలో అతను లేకపోవడంతో పోలీసులు, స్థానికులు ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధి మురళీ, కానిస్టేబుల్ రవినాయక్ సహాయంతో సంస్థ ఆశ్రమానికి ఆయన్ను తరలించారు. పోలీసులకు, రెడ్‌క్రాస్ ప్రతినిధులను స్థానికులు అభినందించారు. చదవండి: ‘నేను రైస్‌మిల్ వద్దకు కాపలాకు వెళ్తున్న.. పొద్దున్నే వస్తా’ అని ఇంట్లో చెప్పి.. -
అనధికార షాపుల తొలగింపుపై రగడ
ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు): ఎంవీపీ కాలనీలో అనధికారిక షాపుల తొలగింపు వ్యవహారం ఆదివారం రచ్చకెక్కింది. కాలనీలోని పలు కూడళ్ల వద్ద కొందరు టీడీపీ నాయకులు తమ అనుచరులతో షాపులు ఏర్పాటు చేయించారు. వారి వద్ద నుంచి కొందరు నెలవారీ వసూళ్లు చేస్తుండగా.. మరికొందరు బినామీల ద్వారా యథేచ్ఛగా వ్యాపారం చేస్తూ లక్షలు దండుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. షాపుల ఆక్రమణతో దశాబ్దాలుగా ఈ కూడళ్ల వద్ద వాహనచోదకులు, పాదచారులు నానా అవస్థలు పడుతున్నారు. గతంలో పలుమార్లు ఆయా షాపులను తొలగించే ప్రయత్నం జీవీఎంసీ చేసినా ఎమ్మెల్యే వెలగపూడి అడ్డుతగులుతూ వచ్చారు. ఆ వ్యాపారులు వెలగపూడికి బినామీలు, అనుచరుల కావడంతో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని కట్టడి చేశారు. ప్రస్తుతం ఈ సమస్యపై జీవీఎంసీ మరోసారి దృష్టి సారించడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. రెండు రోజులుగా జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం కూడళ్ల వద్ద షాపుల తొలగింపు చేపట్టింది. దీంతో ఎమ్మెల్యే వెలగపూడి, వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ ఆదివారం ఆయా ప్రాంతాల్లో పర్యటించడంతో వివాదం ముదురింది. వెలగపూడి హల్చల్ ఎంవీపీలో పలు షాపుల తొలగింపు కార్యక్రమం జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆదివారం ఉదయం చేపట్టారు. ఇంతలో అక్కడికి ఎమ్మెల్యే వెలగపూడి చేరుకొని హల్చల్ చేశారు. తొలగింపు ప్రక్రియను అడ్డుకోవడంతో కొంత గందరగోళం నెలకొంది. ఆ షాపులు చాలా ఏళ్లుగా ఉంటున్నాయని వాటిని తొలగించడం కుదరదని ఎమ్మెల్యే వారించడంతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది మిన్నకుండిపోయారు. దీంతో ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా కూడలి, బీసీ స్టడీ సర్కిల్ కూడలి, టీటీడీ కూడళ్లలో పరిస్థితి చక్కబడుతుందని ఆశించిన స్థానికుల ఆశలు ఫలించలేదు. వెలగపూడి తన అనుచరుల వ్యాపారాలను కాపాడుకునేందుకు టౌన్‌ప్లానింగ్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగించారని పలువురు ఆరోపించారు. ఆయా కూడళ్లలో షాపులను తొలగించి ట్రాఫిక్‌కు ఆటంకం లేకుండా జీవీఎంసీ అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల అడ్డగింపు అనుచితం: వైఎస్సార్సీపీ జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులను ఎమ్మెల్యే వెలగపూడి అడ్డుకున్న విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ కొంత సేపటికి అక్కడికి చేరుకున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం అనధికార షాపుల తొలగింపు చేపట్టాల్సిందేనని, ఈ విషయంలో టౌన్‌ప్లానింగ్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉందని వంశీకృష్ణ స్పష్టం చేశారు. బతుకుదెరువు కోసం నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం చేసుకుంటున్న వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. వెంటనే టౌన్‌ప్లానింగ్ ఏసీపీ మహాపాత్రతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. వెలగపూడి బినామీ షాపులను తక్షణమే తొలగించాలన్నారు. టీడీపీ 7వ వార్డు అధ్యక్షుడు పోలారావుతో పాటు చాలా మంది వ్యాపారుల నుంచి అద్దెలు వసూళ్లు చేస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ 8వ వార్డు అధ్యక్షుడు రమణమూర్తి, యువజన విభాగం అధ్యక్షుడు లవనకుమార్, మహిళా అధ్యక్షురాలు జోషిల, తదితరులు పాల్గొన్నారు. -
పోలీసు వలపు వేధింపులు..!
పెదవాల్తేరు(విశాఖ తూర్పు): ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసు అధికారే లైంగిక వేధింపులకు పాల్ప డ్డారనే ఆరోపణలు నగరంలో కలకలం రేపాయి. ప్రేమించి మోసపోయిన తన సోదరి పెట్టిన కేసు పురోగతిపై వాకబు చేసేందుకు యత్నించిన బాధితురాలి సోదరితో ఫోన్లో ఎంవీపీ సీఐ అసభ్యకరంగా మాట్లాడారు. ఈ ఘటనపై బాధితులు, మహిళా చేతన సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఎంవీపీ కాలనీ సెక్టార్ – 9 గొల్లవీధిలో తల్లి, చెల్లితో నివసిస్తున్న పల్లా కృష్ణకుమారి ఆం ధ్రా యూనివర్సిటీ జియాలజీ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నారు. ఆమెను వరుసకు బావ అయ్యే విజయభాస్కర్ ప్రేమ పేరుతో వంచించి లైంగికంగా లొంగదీ సుకున్నాడని ఎంవీపీ పోలీస్ స్టేషన్లో ఇటీవల ఫిర్యా దు చేసింది. ఫిర్యాదు అందిన తరువాత సదరు యువకుడు విజయభాస్కర్‌ని సీఐ పిలి పించి చర్యలు తీసుకోలేదని, పైగా కృష్ణకుమారి సోదరి మీనాక్షికి ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడారని బాధితులు ఆరోపిస్తున్నారు. మీనాక్షికి సీఐ సన్యాసినాయుడు ఫోన్‌చేసి.. ఎక్కడ ఉంటున్నారు..?, ఏం చదువుతున్నావు..? ఇంటి అద్దె ఎంత అం టూ వ్యక్తిగత వివరాలు అడగారని, ఏ టైమ్‌లో ఫ్రీగా ఉంటావు..? బీచ్‌కి ఎప్పుడు వస్తావు, ఇద్దరం ఒకే కేస్ట్ కదా.. అంటూ సీఐ లైంగికంగా వేధించారని మీనాక్షి ఆరోపించింది. తన అక్కకి అలా జరిగిందని, తాను కూడా అలాంటిదాన్నే అని భావిస్తున్నారా అని సీఐని ప్రశ్నించినా చులకనగా మాట్లాడారని మీనాక్షి ఆరోపించారు. ఈ నేపథ్యంలో బాధితురాలు మహిళా చేతన కార్యదర్శి పద్మను ఆశ్రయించగా ఆమె సోమవారం ఎంవీపీ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని సీఐతో మాట్లాడారు. బాధితురాలు మీనాక్షితో కలిసి సీఐని నిలదీయగా... మొదట బుకాయించినప్పటికీ ఆడియో రికార్డింగ్‌ను వినిపించడంతో సీఐ కాళ్ల బేరానికి వచ్చాడని పద్మ మీడియాకు తెలిపారు. ఇటువంటి సీఐపై సీపీ మహేష్‌చంద్ర లడ్డా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ఆమె బాధితులతో కలిసి ద్వారకా సబ్ డివిజన్ ఏసీపీ వై.వి.నాయుడుని కలిసి ఫిర్యాదు చేశారు. బాధ్యతాయుతమైన పోస్టులో ఉండీ మహిళలతో చులకనగా మాట్లాడిన సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. సన్యాసినాయుడుపై సీపీ కొరడా ఎంవీపీ సీఐ ఎన్.సన్యాసినాయుడుపై సీపీ కొరడా ఝులిపించారు. ప్రేమించి మోసపోయానని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు సోదరి మీనాక్షి పట్ల ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదు అందడంతో సీపీ మహేష్‌చంద్రలడ్డా ఎంవీపీ సీఐని సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇక్కడి త్రీటౌన్ స్టేషన్ సీఐ బెండి వెంకటరావు కూడా ఒక బాధితురాలితో ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడారని ఫిర్యాదు రావడంతో అప్పటి సీపీ యోగానంద్ వెంటనే స్పందించి సీఐ వెంకటరావును సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తరువాత ఆయనకు శ్రీకాకుళంలో పోస్టింగ్ ఇచ్చారు. సీఐ సన్యాసినాయుడు మోసగాడిని అరెస్ట్ చేయాలి ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి మరో అమ్మాయితో వివాహానికి సిద్ధపడుతున్న మోసగాడిని అరెస్ట్ చేయాలని మహిళా చేతన కార్యదర్శి కె.పద్మ, బాధితురాలు కృష్ణకుమారి డిమాండ్ చేశారు. పద్మతో కలిసి ఎంవీపీ పోలీసు స్టేషన్ ఆవరణలో కృష్ణకుమారి మీడియాతో సోమవారం మాట్లాడారు. తాను ఆంధ్రా యూనివర్సిటీ జియాలజీ విభాగంలో పీహెచ్డీ చేస్తున్నానని, తల్లి, చెల్లితో కలిసి ఎంవీపీ కాలనీ సెక్టార్ – 9 గొల్లవీధిలో నివసిస్తున్నామని తెలిపారు. విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ జియ్యమ్మవలస మండలం పరసవాడు దరి లక్ష్మీపురం గ్రామానికి చెందిన మేనమామ మన్మథనాయుడు కుమారుడు తాడేల విజయభాస్కర్, తాను ఏడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నామన్నారు. తామిద్దరం ఢిల్లీ, బెంగళూరు, తిరుపతి పట్టణాలు తిరిగామన్నారు. విజయభాస్కర్ బెంగళూరులోని ఫార్చ్యూన్ సమ్మిట్ ట్రావెల్ సెంట్రిక్ టెక్నాలజీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడన్నారు. మీడియాతో మాట్లాడుతున్న మహిళా చేతన కార్యదర్శి పద్మ తాను ఇంట్లో ఒంటరిగా ఉన్నపుడు బావ తనను మభ్యపెట్టి లైంగికంగా లోబరుచుకున్నాడని ఆరోపించారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి విశాఖ, తిరుపతి పట్టణాలలోని హోటల్స్‌లో కూడా లోబరచుకున్నాడన్నారు. గత ఏడాది నుంచి తనకు ముఖం చాటేస్తున్నాడని విచారం వ్యక్తం చేశారు. తన మేనమామకు విషయం అంతా చెప్పినా సరే పెళ్లికి అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎంవీపీ కాలనీలో నివసిస్తున్న మరో యువతితో విజయభాస్కర్ వివాహ నిశ్చితార్థం చేసుకున్నాడన్నారు. ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మార్చి 9న వాయిదా పడిన నిశ్చితార్థం ఈ నెల 27న ఒక హోటల్లో రహస్యంగా నిర్వహించారన్నారు. తనకు అన్యాయం చేసిన విజయభాస్కర్‌ని అరెస్ట్ చేయాలని, మేనమామపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మహిళా చేతన నాయకులు కూడా పాల్గొన్నారు. -
68 కిలోల గంజాయి పట్టివేత
ఎమ్వీపీ కాలనీ (విశాఖపట్నం) : ఏజెన్సీ ఏరియా నుంచి అక్రమంగా గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న ఇద్దరు విద్యార్థులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. విశాఖపట్నంలోని పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుగా గంజాయి వ్యాపారం జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించి 68 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థి దశ నుంచే గంజాయికి బానిసైన శ్యాంకుమార్(21), రామకృష్ణ(27)లు పాడేరు నుంచి గంజాయిని తీసుకొచ్చి స్థానికంగా ఒక అద్దె ఇంటిలో ఉంచి విక్రయిస్తున్నారు. ఇది గుర్తించిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 68 కిలోల గంజాయి, రెండు బైక్‌లు, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. -
లాడ్జిలో పేకాట: ముగ్గురు అరెస్ట్
ఎంవీపీ కాలనీ (విశాఖపట్నం) : విశాఖ నగరంలోని ఓ లాడ్జిలో పేకాడుతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శనివారం వన్ టౌన్‌లోని ఓ లాడ్జిలో కొందరు పేకాడుతున్నారన్న సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ చిట్టిబాబు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు చేశారు. ఈ సందర్భంగా ముగ్గురిని అరెస్టు చేసి, మూడు సెల్ఫోన్లను, రూ.3,03,200 ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసును వన్ టౌన్ పోలీసులకు అప్పగించారు. -
బాణాసంచా గోదాము సీజ్: ఒకరి అరెస్ట్
ఎంవీపీ కాలనీ (విశాఖ) : విశాఖ నగరం గాజువాక ప్రాంతం బీసీరోడ్డులోని ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన బాణాసంచాను పోలీసులు పట్టుకున్నారు. వై.శ్రీనివాసరావు అనే వ్యక్తి తన ఇంట్లో రూ.1.50 లక్షల విలువైన బాణాసంచాను ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. బాణాసంచాను సీజ్ చేసి శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసును గాజువాక పోలీసులకు బదిలీ చేశారు. -
కూచిపూడి నృత్యానికి రూ. 100 కోట్లు
విశాఖపట్నం : కొప్పరపు కవుల జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చే ఆలోచన తమ ప్రభుత్వానికి ఉందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం విశాఖపట్నంలో గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... కూచిపూడి నృత్యానికి రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఎమ్వీపీ కాలనీలో రూ. 25 కోట్లతో కల్చరల్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. డిసెంబ్ 25న విశాఖ ఉత్సవ్ నిర్వహిస్తామని గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. -
సాక్షి మీడియా ఆధ్వర్యంలో ఆటోషో
-
ఒక కాలనీ.. ఎన్నో ప్రత్యేకతలు
మువ్వలవానిపాలెం... ఇది వినడానికి ఇప్పుడు కొత్తగా అనిపించినా విశాఖ అంతటికీ సుపరిచితమే. అదేనండీ.. మన ఎంవీపీ కాలనీ! నగరానికే తలమానికంగా నిలుస్తూ ఎందరికో తల్లో నాలుకగా ఉంటూ ఎన్నో ప్రత్యేకతల కలబోతగా, మరెన్నో విశిష్టతల వేదికగా నిలుస్తున్నదీ ప్రాంతం. ఇది ఆసియాలోనే పెద్దదయిన ఆధునిక కాలనీ అన్న విషయం తెలిసిందే. అందాల బృందావనం శివాజీ పార్కు కాలనీకి శోభను తీసుకువస్తోంది. అంతేకాదు ఇక్కడ ప్రతి సెక్టార్‌కు ఒక పార్కు ఉంది. పర్యాటకులకు విడిది కల్పించే ప్రభుత్వ యాత్రా నివాస్ ఇక్కడే ఉంది. తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక కౌంటర్లు, కల్యాణమండపం, ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్న సత్యసాయి సేవా సంస్ధల ప్రధాన కేంద్రం, ఆధునిక వసతులతో కూడిన మహత్మాగాంధీ కేన్సర్ ఆస్పత్రికి కేరాఫ్ ఎంవీపీయే. జిల్లా అభివద్ధిలో ఎంతో కీలకమైన బీసీ సంక్షేమ శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖల ప్రధాన కార్యాలయాలతో కూడిన ప్రగతి భవన్, గౌతులచ్చన్న ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్, తొలినాళ్లలోనే ప్రారంభించిన ప్రతిష్టాత్మక రైతుబజారు ఇక్కడే ఉన్నాయి. ఎందరో ప్రముఖ వైద్యులు, ప్రొఫెసర్లు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, కళాకారులు, సాహితీవేత్తలకు నిలయంగా నిలుస్తుందీ కాలనీ. హోటల్స్, ఫంక్షన్ హాల్స్, అపార్ట్‌మెంట్స్‌తో కళకళలాడే ఎంవీపీ.. విశాఖ వాకిట నిత్యనూతనమని, నగర కంఠాభరణమని అనడంలో అతిశయోక్తి లేదు. - విశాఖపట్నం -
రూ. 2కోట్లు ఇస్తేనే పెళ్లి చేసుకుంటా..
* పోలీస్ అధికారికే కట్న వేధింపులు *పెళ్లికొడుకు కుటుంబంపై ఫిర్యాదు విశాఖపట్నం: 'ఐస్ ఫ్యాక్టరీ పెట్టాలి... రూ. రెండు కోట్లు కట్నం, కేజీ బంగారం, అయిదు కేజీల వెండి ఇవ్వండి... ఇవి ఇస్తేనే వివాహం... లేదంటే మీ అమ్మాయిని వివాహం చేసుకోను... ప్రభుత్వం మాది..మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి...'అంటూ వివాహాన్ని ఆపేశాడో ప్రబుద్ధుడు. కుమార్తె వివాహం చేయడానికి కార్డులు పంచి, లక్షలు ఖర్చు పెట్టి నిశ్చితార్థ వేడుకలు చేసిన ఓ పోలీస్ ఉన్నతాధికారికే వేదనను మిగిల్చాడు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలివి. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురానికి చెందిన పసల పర్వేశ్ విశాఖనగరం పెందుర్తిలోని ఓ రొయ్యల కంపెనీలో పని చేస్తున్నాడు. ఎంవీపీకాలనీలో నివాసముంటున్న ఓ పోలీసు ఉన్నతాధికారి కుమార్తెతో పర్వేశ్‌కు పరిచయం ఏర్పడింది. ఆమె డెంటల్ విద్య చదువుతోంది. ఇరు కుటుంబాలు వివాహానికి అంగీకరించాయి. ఆడపడుచు కట్నం కింద ముందుగానే పర్వేశ్ కుటుంబ సభ్యులు రూ.పది లక్షలు తీసుకున్నారు. తర్వాత ఆగస్టులో విశాఖలోని ఆఫీసర్స్ క్లబ్లో నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్ 12న వివాహ ముహర్తం పెట్టుకున్నారు. అయితే పర్వేశ్ పని చేస్తున్న సంస్థకు ఐస్ అవసరం ఉంది. దీంతో సొంతంగా ఐస్ ఫ్యాక్టరీ పెట్టాలని భావించాడు. వధువు తండ్రి పోలీస్ ఉన్నతాధికారి కావడంతో కట్నం కింద రూ.రెండు కోట్లు కావాలని డిమాండ్ చేశాడు. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పడంతో మీ అమ్మాయిని వివాహం చేసుకోనని చెప్పాడు. ప్రభుత్వం మాది... మీరేం చేసుకుంటారో చేసుకోండని చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పర్వేశ్ స్నేహితుడైన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు కూడా బెదిరిస్తున్నాడని బాధితులు వాపోయారు. వివాహాన్ని నిలిపేయడంతో వధువు తల్లిదండ్రులు పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఆమేరకు కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు. నిందితుడిని పట్టుకోవడానికి ఒక పోలీస్ బృందం గాలిస్తోందని తెలిపారు. -
ఎస్సీలకు రూ.25 కోట్ల రుణాలు
విశాఖపట్నం : జిల్లాలో ఈ ఏడాది ఎస్సీలకు రూ.25కోట్ల రుణాలిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అహ్మద్ సలీంఖాన్ వెల్లడించారు. విశాఖ ఎంవీపీ కాలనీలోని సంస్థ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రుణాల మంజూరుకు త్వరలో కార్యాచరణ రూపొందిస్తామన్నారు. గతేడాది రూ.12కోట్ల రుణాలిచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసినా కొన్ని కారణాలతో రుణాలు ఇవ్వలేదన్నారు. అప్పట్లో 643 దరఖాస్తులు రాగా, 107 మందికి ప్రభుత్వం ఇప్పటికే రాయితీ మంజూరు చేసిందన్నారు. వీరందరికీ త్వరలోనే బ్యాంకులు రుణాలు మంజూరవుతాయన్నారు. ఈ ఏడాది నుంచి రుణపరిమితిని రూ.2 నుంచి రూ.5లక్షలకు పెంచినట్టు తెలిపారు. ఇందులో రూ.2లక్షలు రాయితీ, రూ.3లక్షలు బ్యాంక్ రుణంగా ఉంటుందన్నారు. లబ్ధిదారుడు వాటాగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. భూ కొనుగోలు పథకంలో నిరుపేద ఎస్సీలకు భూములు కేటాయిస్తామన్నారు. డ్వాక్రా సంఘాల మాదిరి ఎస్సీ పురుష, మహిళా సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు ఇస్తామన్నారు. మైనింగ్, ఎగుమతులు, దిగుమతులకు కూడా రుణాలు ఇవ్వనున్నామని తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో నిధుల కొరత వల్లే ఎస్సీ యువతీయువకులకు ఉచిత శిక్షణ కార్యక్రమాలు అమలు చేయలేకపోయామని ఒక ప్రశ్నకు సమాధానగా చెప్పారు. కార్పొరేషన్ రుణాల మంజూరులో అవినీతికి ఏమాత్రం ఆస్కారం లేకుండా ప్రభుత్వం విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేసిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ పరిపాలనాధికారి బివి రమణ,ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
విశాఖలో ప్రైవేట్ హాస్టల్లో అగ్నిప్రమాదం
విశాఖపట్నం: నగరంలోని ఎమ్వీపీ కాలనీ ప్రైవేట్ హాస్టల్లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, బట్టలు అగ్నికి ఆహూతైయినట్టు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. ప్రైవేట్ హాస్టల్లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో తమ పుస్తకాలు, బట్టలు కాలిపోయ్యాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్య్కూట్ కారణమని తెలుస్తోంది.