కానిస్టేబుల్ సహకారంతో వృద్ధుడిని ఆశ్రమానికి తరలిస్తున్న రెడ్‌క్రాస్ ప్రతినిధి మురళి
సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖపట్నం): ఎంవీపీ కాలనీలోని వెంకోజిపాలెంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కదలేని పరిస్థితిలో ఉన్న ఓ వృద్ధుడిని సొంత కుటుంబ సభ్యులు నడిరోడ్డుపై వదిలివెళ్లిపోయారు. కనీసం మాట్లాడే స్థితిలో కూడా లేని ఆ వృద్థుడు కొద్ది రోజులుగా తీవ్రమైన చలిగాల్లోనే బతుకుపోరాటం చేస్తున్నాడు. తొలుత భిక్షాటన చేసుకునే వ్యక్తిగా భావించిన స్థానికులు అతనిని పట్టించుకోలేదు. అయితే రోజులు గడుస్తున్నా అతను అక్కడే ధీనంగా ఉండడం, కదల్లేక రాత్రిపూట చలికి తట్టుకోలేక వణికిపోవడాన్ని గమనించారు. దీంతో స్థానిక పోలీసులకు ఓ పాత్రికేయుడు సహకారంతో సమాచారం అందించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా తనది అప్పుఘర్ ప్రాంతమని, తన కుటుంబ సభ్యులే (కొడుకు, కోడలు) ఇక్కడ వదిలేసి వెళ్లినట్లు వెల్లడించాడు. అయితే పేరుతో పాటు పూర్తి వివరాలు తెలిపే స్థితిలో అతను లేకపోవడంతో పోలీసులు, స్థానికులు ఇండియన్ రెడ్‌క్రాస్ సంస్థకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న రెడ్‌క్రాస్ సంస్థ ప్రతినిధి మురళీ, కానిస్టేబుల్ రవినాయక్ సహాయంతో సంస్థ ఆశ్రమానికి ఆయన్ను తరలించారు. పోలీసులకు, రెడ్‌క్రాస్ ప్రతినిధులను స్థానికులు అభినందించారు.
చదవండి: ‘నేను రైస్‌మిల్ వద్దకు కాపలాకు వెళ్తున్న.. పొద్దున్నే వస్తా’ అని ఇంట్లో చెప్పి..
Comments
Please login to add a commentAdd a comment