ఒక కాలనీ.. ఎన్నో ప్రత్యేకతలు | Many of the specifics of a colony | Sakshi
Sakshi News home page

ఒక కాలనీ.. ఎన్నో ప్రత్యేకతలు

Published Fri, Feb 13 2015 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

ఒక కాలనీ.. ఎన్నో ప్రత్యేకతలు

ఒక కాలనీ.. ఎన్నో ప్రత్యేకతలు

మువ్వలవానిపాలెం... ఇది వినడానికి ఇప్పుడు కొత్తగా అనిపించినా విశాఖ అంతటికీ సుపరిచితమే. అదేనండీ.. మన ఎంవీపీ కాలనీ! నగరానికే తలమానికంగా నిలుస్తూ ఎందరికో తల్లో నాలుకగా ఉంటూ ఎన్నో ప్రత్యేకతల కలబోతగా, మరెన్నో విశిష్టతల వేదికగా నిలుస్తున్నదీ ప్రాంతం. ఇది ఆసియాలోనే పెద్దదయిన ఆధునిక కాలనీ అన్న విషయం తెలిసిందే. అందాల బృందావనం శివాజీ పార్కు కాలనీకి శోభను తీసుకువస్తోంది. అంతేకాదు ఇక్కడ ప్రతి సెక్టార్‌కు ఒక పార్కు ఉంది. పర్యాటకులకు విడిది కల్పించే ప్రభుత్వ యాత్రా నివాస్ ఇక్కడే ఉంది.

తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రత్యేక కౌంటర్లు, కల్యాణమండపం, ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లుతున్న సత్యసాయి సేవా సంస్ధల ప్రధాన కేంద్రం, ఆధునిక వసతులతో కూడిన మహత్మాగాంధీ కేన్సర్ ఆస్పత్రికి కేరాఫ్ ఎంవీపీయే. జిల్లా అభివద్ధిలో ఎంతో కీలకమైన బీసీ సంక్షేమ శాఖ, ఎస్సీ సంక్షేమ శాఖల ప్రధాన కార్యాలయాలతో కూడిన ప్రగతి భవన్, గౌతులచ్చన్న ప్రభుత్వ బీసీ స్టడీ సర్కిల్, తొలినాళ్లలోనే ప్రారంభించిన ప్రతిష్టాత్మక రైతుబజారు ఇక్కడే ఉన్నాయి. ఎందరో ప్రముఖ వైద్యులు, ప్రొఫెసర్లు, రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, కళాకారులు, సాహితీవేత్తలకు నిలయంగా నిలుస్తుందీ కాలనీ. హోటల్స్, ఫంక్షన్ హాల్స్, అపార్ట్‌మెంట్స్‌తో కళకళలాడే ఎంవీపీ.. విశాఖ వాకిట నిత్యనూతనమని, నగర కంఠాభరణమని అనడంలో అతిశయోక్తి లేదు.                   - విశాఖపట్నం
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement