ప్రధాని నరేంద్ర మోదీ
విశాఖపట్నం: ప్రస్తుతం దేశమంతా టెన్షన్ వాతావరణం నెలకొన్న దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ సభకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని విశాఖ నగర సీపీ మహేష్ చంద్ర లడ్హా తెలిపారు. ఎస్పీజీకి చెందిన సుమారు 35 మంది ఐజీ, డీఐజీ స్థాయి అధికారులతో పాటుగా పెద్ద సంఖ్యలో బలగాలను సభా ప్రాంగణం పరిధిలో మోహరిస్తున్నట్లు వెల్లడించారు. ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌తో పాటు సుమారు 2,250 మంది రాష్ట్ర బలగాలను కేటాయించినట్లు వెల్లడించారు. సభ జరిగే ప్రాంగణంలోకి సెల్‌ఫోన్‌లు తప్ప మరే ఇతర వస్తువులను అనుమతించమన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి సభ జరిగే రైల్వే గ్రౌండ్స్‌కు ప్రధాని రోడ్డు మార్గం ద్వారా చేరుకోనున్నందున ఆ మార్గమంతా అదనపు బలగాలను కేటాయించామని చెప్పారు.
రేపు నాలుగున్నరకు రాక
భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రత్యేక విమానం ద్వారా త్రివేండ్రం ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి సాయంత్రం 6.30 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా బీజేపీ నిర్వహించే ప్రజా చైతన్య బహిరంగ సభ వద్దకు చేరుకుంటారు. రాత్రి 8 గంటలకు సభ ముగించుకుని తిరిగి రోడ్డు మార్గం ద్వారా ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీ వెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment