అప్‌డేట్స్
11:30AM
ముగిసిన పీఎం ప్రధాని మోదీ విశాఖ పర్యటన
10:44AM
ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం
►తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
►ప్రియమైన సోదరీ సోదరమణులకు స్వాగతం
►కొద్ది రోజుల క్రితం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జన్మదిన వేడుకలో పాల్గొనే అదృష్టం కలిగింది
►ఈరోజు ఏపీకి, విశాఖకు గొప్పదినం
►విశాఖ దేశంలోనే విశేషమైన నగరం
►విశాఖ ఓడరేవు చారిత్రాత్మకమైనది
►ఇక్కడ నుంచి రోమ్ వరకూ వ్యాపరం జరిగేది
►ఈరోజు కూడా విశాఖపట్నం ప్రముఖ వ్యాపార కేంద్రం
►ఈరోజు ప్రారంభించే రూ. 10 వేల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులతో విశాఖ, ఏపీ ప్రజలకు ఎంతో అభివృద్ధి జరుగుతుంది
►ఈ ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధి కొత్త శిఖరాలకు చేరుతుంది
►దేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఏపీకి ప్రజలకు ప్రత్యేక గుర్తింపు ఉంది
►తమ స్వభావంలో సౌమ్యులైన ఏపీ ప్రజలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు
►కేవలం సాంకేతిక పరిజ్ఞానం, వృత్తిపరమైన గుర్తింపు మాత్రమే కాదు..తెలుగు ప్రజలకు స్నేహ శీలత సహద్భావం వల్లే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు
►తెలుగు ప్రజలు ప్రతి రంగంలో మెరుగైన మార్పు కోసం తపన పడతారు
►మౌలిక వసుతల కల్పనలో మేమెప్పుడూ వెనక్కి తగ్గలేదు
►మౌలిక వసతుల అభివృద్ధి అన్ని రంగాల పురోగతిని వేగవంతం చేస్తోంది
►ఒకవైపు విశాఖ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి పరుస్తూనే మరోవైపు ఫిషింగ్ హార్బర్‌ను ఆధునీకరిస్తున్నాం
►మౌలిక వసతుల కల్పనతోనే ఏపీ తీర ప్రాంతం వేగవంతమైన అభివృద్ధి సాధిస్తుంది
►విశాఖ ఫిషింగ్ హార్బర్ అభివృద్ధితో మత్స్యకారుల జీవితాల్లో మార్పు వస్తుంది
►ప్రపంచ వ్యాప్తంగా భారతదేశమే అందరికీ ఆశావహ దృక్పథం ఇస్తోంది
►మా ప్రతి నిర్ణయం సామాన్యుడి జీవితాన్ని మెరుగు పర్చడం కోసమే
►ఒక వైపు మేం చేసిన అభివద్ధితో దేశంలో పెట్టబడులు పెరుగుతున్నాయి
►మరోవైపు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలను మరింత విస్తరిస్తున్నాం
►రైతులకు ఏటా రూ. 6 వేల ఆర్థిక సాయం అందిస్తున్నాం
►అంతరిక్షం నుంచి సముద్ర గర్భం వరకు ప్రతి అవకాశాన్ని వెతికి పట్టుకుంటాం
10: 25AM
సీఎం వైఎస్ జగన్ స్పీచ్
►దేశ ప్రగతి రథసారథి ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్వాగతం
►ఏయూలో జన సముద్రం కనిపిస్తోంది
►ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల్లా జనం ఇక్కడికి తరలివచ్చారు
►వంగపండు పాట ఏం పిల్లడో ఎల్లమొస్తవా అనే పాటలా జనం తరలివచ్చారు
►జగన్నాథ రథచక్రాలు ఇక్కడికి కదిలి వచ్చాయి
►10,742 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రజలు, అశేష జనం తరఫున ధన్యవాదాలు
►కేంద్ర ప్రభుత్వంతో మా అనుబంధం రాజకీయాలకు అతీతమైంది
►మాకు మరో ఎజెండా లేదు.. ఉండబోదు
►రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకూ మీకు చేసిన విజ్ఞప్తులను పరిష్కరించాలని మరోసారి కోరుతున్నాం
►గత మూడున్నరేళ్లుగా రాష్ట్రంలో విద్య, వైద్యం, సంక్షేమం, మహిళా అభివృద్ధి, పారదర్శకమైన గడప వద్దకే పాలన ప్రాధాన్యతగా అడుగులు ముందుకు వేస్తున్నాం
►ప్రతి కుటుంబం నిలదొక్కుకునేందుకే మా ఆర్థిక వ్యవస్థలో ప్రతి రూపాయి ఖర్చు చేశాం
►పెద్దలు సహృదయలైన మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి
►ఎమిమిదేళ్ల క్రితం తగిలిన అతిపెద్ద గాయం ఇంకా మానలేదు
►మీరు మా రాష్ట్రానికి చేసే ప్రతి సాయం మా రాష్ట్రానికిచ్చే ప్రతి సంస్థ, ప్రతి రూపాయి, మా అభివృద్ధికి దోహద పడుతాయి
►విభజన హామీలైన పోలవరం, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు పూర్తి చేయాలని కోరుతున్నాం
10: 20AM
►నమస్కారం.. అంటూ తెలుగులో ప్రజలకు అభివాదం ద్వారా ప్రసంగం ప్రారంభించిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అద్భుత ప్రగతి సాధిస్తోంది. రైల్వే శాఖ ఆధునీకరణదిశగా దూసుకెళ్తోంది..
ప్రధాని మోదీకి శాలువ కప్పి గౌరవించిన సీఎం జగన్.. రాముడి చిత్రం బహుకరణ
10:18AM
►సభా వేదికపైకి చేరుకున్న ప్రధాని మోదీ, గవర్నర్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
10:14 AM
►రోడ్లు, రైల్వే ప్రాజెక్టుల నమునాలను పరిశీలించిన ప్రధాని మోదీ.
10:09 AM
► ఏయూ ప్రాంగణానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. వెంట ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ ఉన్నారు.
► కాసేపట్లో విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ సభా ప్రాంగణానికి చేరుకోనున్న ప్రధాని మోదీ.
► రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ఏయూలో నిర్వహించబోయే ఈ భారీ బహిరంగ సభకు జనం పోటెత్తారు.
► ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన నేపథ్యంలో నగరంలో భారీ భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. ఉదయం నుంచే ట్రాఫిక్ ఆంక్షలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. మరోవైపు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పహారా కాస్తున్నారు.
► సుమారు రూ.10,742 కోట్లతో చేపట్టనున్న వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులను జాతికి అంకితం.
ప్రాజెక్టుల వివరాలు..
► రూ. 460 కోట్లతో విశాఖ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు
► రూ. 3,778 కోట్లతో రాయిపూర్ విశాఖపట్నం ఎకనామిక్ కారిడార్ గ్రీన్ ఫీల్డ్ హైవే
► రూ. 566 కోట్లతో కాన్వెంట్ జంక్షన్ నుంచి షీలా నగర్ వరకు రోడ్డు నిర్మాణం
► రూ. 152 కోట్లతో విశాఖ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులు
► రూ. 2658 కోట్లతో గెయిల్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్లైన్ ప్రాజెక్టుకు నిర్మాణ పనులకు శంకుస్థాపన
► రూ. 211 కోట్లతో నరసన్నపేట పాతపట్నం రహదారి అభివృద్ధి పనులు జాతికి అంకితం
► రూ. 2,917 కోట్లతో నిర్మించిన ఓఎన్‌జీసీ యు ఫీల్డ్ ఆన్ షోర్ డీప్ వాటర్ బ్లాక్ ప్రాజెక్ట్ జాతికి అంకితం
Comments
Please login to add a commentAdd a comment