
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ నూతన పోలీస్ కమిషనర్‌గా నియమితులైన ఇంటెలిజెన్స్ ఐజీ మహేష్‌చంద్ర లడ్డా సోమవారం నగరానికి వచ్చి బాధ్యతలు స్వీకరించనున్నారు. పోలీసు ఉన్నతాధికారుల బదిలీల్లో భాగంగా ఈనెల 17న నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ విజయవాడ అదనపు సీపీగా బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానంలో సీపీగా నియమితులైన లడ్డా ప్రస్తుతం పని చేస్తున్న నిఘా విభాగంలో శాఖాపరమైన పనుల కారణంగా అమరావతిలోనే కొనసాగుతున్నారు. మరోవైపు సెలవులో ఉన్న యోగానంద్ రెండు రోజుల్లో వచ్చి రిలీవ్ కానున్న నేపథ్యంలో ఈనెల 30న లడ్డా రానున్నారు. ఈ మేరకు బుధవారం సాక్షి ప్రతినిధితో ఆయన మాట్లాడి వివరాలు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment