మాట్లాడుతున్న కలెక్టర్ కర్ణన్
ఖమ్మంసహకారనగర్: పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. ఈనెల 23వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుపై గురువారం నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో కౌంటింగ్ సూపర్‌వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ విధి విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండి.. ఎలాంటి పొరపాట్లు లేకుండా చూడాలన్నారు. అధికారులు, సిబ్బంది పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
అలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియలో భాగంగా కంట్రోల్ యూనిట్‌లోని ఓట్ల వివరాల లెక్కింపు, అందులోని దశలు, ప్రతి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్‌లలో గల వీవీప్యాట్ స్లిప్పుల లెక్కింపు తదితర అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ట్రైనర్ కొండపల్లి శ్రీరామ్ శిక్షణ ఇచ్చారు. అనంతరం మైక్రో అబ్జర్వర్లకు సైతం శిక్షణ నిర్వహించారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హన్మంతు కొడిం బా, కలెక్టరేట్ ఏఓ మదన్‌గోపాల్, ఎన్నికల డీటీ రాంబాబు, ఈడీఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment