
మూడు పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవడం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిలో ఉండడం.. ఆర్థికంగా పరిపుష్టమైన వనరులు ఉండడం.. అన్ని వ్యవస్థల నుంచి సహకారం అందడం వంటి అంశాలు టీడీపీకి కలిసివచ్చాయి. టీడీపీ+జనసేన+బీజేపీల గెలుపునకు గల కారణాలను విశ్లేషిస్తే..
టీడీపీ ఎక్కువగా ప్రచారం చేసిన అంశాలు:
లాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల మీ భూములు కొట్టేస్తారని బాబు పదే పదే ప్రకటించడం
సూపర్ సిక్స్ పేరుతో కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏపీలో ప్రకటించడం
వైఎస్సార్‌సిపి ప్రకటించిన ప్రతీ హామీకి అదనంగా కలిపి తామిస్తామని చెప్పడం
వలంటీర్ల వ్యవస్థను ముందు తప్పుబట్టిన వాళ్లే.. తర్వాత వాలంటీర్లకు 5వేల వేతనం బదులు పదివేలిస్తామని ప్రకటించడం
అమరావతిని అభివృద్ధి చేసి రాజధానిగా నిలబెడతామని చెప్పడం
మెగా డీఎస్సీతో పాటు ప్రతీ ఏటా జాబ్ కాలెండర్ ఇస్తామనడం
2014లో రైతు రుణమాఫీ తరహలో పెన్షన్‌ను ఏకంగా రూ.4000 చేస్తామనడం
50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ప్రకటించడం
Comments
Please login to add a commentAdd a comment