
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. మచిలీపట్నంలోని సిరి కృష్ణ, సిరి వెంకట థియేటర్‌కి జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్బంగా అభిమానులు పెద్దఎత్తున చేరుకున్నారు. అక్కడే రెండు మేకలను బలి ఇచ్చి వీరంగం సృష్టించారు. అంతే కాకుండా వాటి రక్తాన్ని ఎన్టీఆర్ బ్యానర్లపై చిందించారు.
(ఇది చదవండి: షాకింగ్.. నమ్మలేకపోతున్నాం.. రాజమౌళి, ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్)
ఈ క్రమంలో వారు పదునైన ఆయుధాలను బహిరంగంగా తీసుకురావడం.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై రాబర్ట్‌సన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. సింహాద్రి రీ-రిలీజ్ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు విజయావాడలో థియేటర్‌లో టపాసులు పేల్చడంతో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే.
కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర చిత్రంలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ చిత్రం జనతా గ్యారేజ్ తర్వాత వీరి కాంబినేషన్‌లో చిత్రం తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఫస్ట్‌లుక్, టైటిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించనున్నారు. అంతేకాకుండా అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన వార్ -2లో జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్‌తో జతకట్టనున్నారు.
(ఇది చదవండి: ఊర్వశి రౌతేలా నెక్లెస్.. ధరపై నెటిజన్స్ ట్రోల్స్!)
Comments
Please login to add a commentAdd a comment