జూనియర్ ఎన్టీఆర్‌ వీరాభిమాని.. ఆయన పేరుతో ఏకంగా! | Jr NTR Fan From Kurnool Uses Bricks With NTR Name To Build New House | Sakshi
Sakshi News home page

Jr NTR: ఎన్టీఆర్‌పై వినూత్నంగా ప్రేమ చాటుకున్న అభిమాని.. ఏం చేశాడంటే?

Published Sun, Nov 5 2023 9:02 AM | Last Updated on Sun, Nov 5 2023 10:45 AM

Jr NTR Fan From Kurnool Uses Bricks With NTR Name To Build New House - Sakshi

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ రేంజే వేరు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలోని నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వరించింది.  అందుకే ఎన్టీఆ‍ర్‌ అంటే అంతలా అభిమానిస్తారు. 

తాజాగా ఓ అభిమాని తన ప్రేమను వినూత్నంగా చాటుకున్నారు. ఏపీలోని కర్నూలుకు ఓ వీరాభిమాని తన కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు.  అయితే ఇంటి నిర్మాణానికి వినియోగించే ఇటుకలపై ఎన్టీఆర్ అని పేరును ముద్రించారు. ఈ విధంగా తన అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు.

కాగా.. జూనియర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం దేవర చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్‌రాజ్‌, జిస్సు సేన్‌గుప్తా, శ్రీకాంత్‌, టామ్‌ చాకో, నరైన్‌, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆ తర్వాత హృతిక్ రోషన్ మూవీ వార్‌-2లో ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దీనికి దర్శకత్వం వహించనున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement