విషాదం.. యంగ్ టైగర్ వీరాభిమాని మృతి   | Junior NTR Die Hard Fan Shyam Passed Away | Sakshi
Sakshi News home page

Jr NTR Fan Died: జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని కన్నుమూత 

Jun 25 2023 5:59 PM | Updated on Jun 27 2023 9:17 AM

Junior NTR Die Hard Fan Shyam Passed Away - Sakshi

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయనకు రెండు తెలుగు రాష్ట్రాల్లో డై హార్డ్ ఫ్యాన్స్‌ ఉన్నారు. అలాంటి వారిలో యంగ్ టైగర్‌ను ప్రాణానికి ప్రాణంగా భావించే అభిమాని శ్యామ్ (23) కన్నుమూశాడు. చిన్నవయసులోనే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ సంఘటనతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషాదంలో మునిగిపోయారు. శ్యామ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని కొప్పిగుంట గ్రామం. కానీ శ్యామ్ చనిపోయింది మాత్రం చింతలూరు గ్రామం. అక్కడ తను ఉంటున్న రూమ్‌లో ఉరి వేసుకుని చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నిర్మాత మృతి )

కాగా.. గతంలో యంగ్ హీరో విశ్వక్ సేన్ మూవీ ధమ్కీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యాడు. ఆ సమయంలో వేదికపై వచ్చిన శ్యామ్ ఎన్టీఆర్‌ను హత్తుకున్నారు. ఆ సమయంలో ఆ వీడియో తెగ వైరలైంది. ప్రస్తుతం శ్యామ్ మృతి చెందడంతో ఆ వీడియోను షేర్ చేస్తూ అతని  ఆత్మకు శాంతి చేకూరాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. 

(ఇది చదవండి: టాలీవుడ్‌ డైరెక్టర్‌ ఇంట విషాదం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement