తన పుట్టిన రోజు(మే 20) సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని..అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియాలో ఓ లేఖను పోస్ట్ చేశాడు.
‘నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు ధన్యవాదాలు. విషెస్ చెప్పడానికి చాలా దూరం నుంచి మా ఇంటికి వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపున్నాను. మీ రుణం ఎప్పుడూ తీర్చుకోలేను. మిమ్మల్ని కలవలేకపోయినందుకు క్షమాపణలు కోరుతున్నాను. మీ చూపించే ప్రేమకు ఎప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను. మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేను’అంటూ ఓ ఎమోషనల్ లేఖను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.
కాగా, తమ అభిమాన హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై హైదరాబాద్ పోలీసులు లాఠీ చార్జ్ చేసిన విషయం తెలిసిందే. గురువారం అర్థరాత్రి భారీ సంఖ్యలో అభిమానులు ఎన్టీఆర్ ఇంటికి వెళ్లారు.
ఆ సమయంలో ఎన్టీఆర్ ఇంట్లో లేకపోవడంతో.. ఆయన రాకకోసం రోడ్డుపైనే ఎదురుచూశారు. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు కేక్ కట్ చేసి.. జై ఎన్టీఆర్ అంటూ రోడ్డుపై హంగామ సృష్టించారు. పోలీసులు వారిని పక్కకు తరలించే ప్రయత్నం చేశారు. అయినప్పటకీ రోడ్డుపైనే డాన్స్ చేస్తూ రచ్చరచ్చ చేయడంతో లాఠీచార్జ్ చేశారు.
Thank you. pic.twitter.com/cDpTnBHeoR
— Jr NTR (@tarak9999) May 20, 2022
Comments
Please login to add a commentAdd a comment