Hrithik Roshan Send Birthday Wishes To Jr NTR In Telugu - Sakshi
Sakshi News home page

యుద్ధ భూమిలో కలుద్దాం తారక్‌.. ఎన్టీఆర్‌ని తెలుగులో విష్‌ చేసిన హృతిక్‌

Published Sat, May 20 2023 12:40 PM | Last Updated on Sat, May 20 2023 1:16 PM

Hrithik Roshan Pens A Birthday Note For Jr NTR In Telugu - Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 40వ బర్త్‌డే నేడు(మే 20). ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా  బర్త్‌డే విషెస్‌ తెలియజేస్తున్నారు. అయితే బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ మాత్రం అందరికంటే కాస్త భిన్నంగా బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశాడు.

(చదవండి: ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలకు దూరంగా జూ.ఎన్టీఆర్‌!)

త్వరలోనే వీరిద్దరు వార్‌ 2 చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని హృతిక్‌ పరోక్షంగా తెలియజేస్తూ.. ‘హ్యాపీ బర్త్‌డే తారక్‌. ఈ ఏడాది మరింత సంతోషంగా గడపాలని కోరుకుంటున్నా. నీ కోసం యుద్ధ భూమిలో వేచి చూస్తున్నాను. మనం కలిసేంతవరకు  నీ ప్రతి రోజు సంతోషంగా, శాంతియుతంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్‌ చేశాడు. అంతేకాదు చివర్లో ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు మిత్రమా’ అంటూ తెలుగు టచ్‌ కూడా ఇచ్చాడు. 

(చదవండి: జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫస్ట్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?)

ఇక వార్‌ 2 విషయానికొస్తే.. యశ్‌ రాజ్‌ ఫిలింస్‌ స్పై ఫ్రాంచైజీలోని ‘వార్‌’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రాబోతుంది. అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. అత్యంత భారీ బడ్జెట్‌తో ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది చివర్లో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement