
'వార్2' విడుదల కోసం పాన్ ఇండియా రేంజ్‌లో అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ వార్త వారిని కాస్త ఇబ్బందిపెట్టొచ్చు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అయితే, తాజాగా తారక్, హృతిక్ రోషన్ మధ్య ఒక సాంగ్‌ను మేకర్స్ ప్లాన్ చేశారట. ఈ పాట రిహార్సల్స్ చేస్తున్నప్పుడు హృతిక్ గాయపడినట్లు బాలీవుడ్‌లో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయన అభిమానులతో పాటు తారక్ ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందుతున్నారు.
హృతిక్ రోషన్–ఎన్టీఆర్ కాంబినేషన్‌లో ఇప్పటికే కొన్ని భారీ యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించారు. అయితే, తాజాగా ఫైనల్ సాంగ్ కోసం షెడ్యూల్‌ను మేకర్స్ ఏర్పాటు చేసుకున్నారు. అందుకోసం ముంబయిలోని యశ్‌రాజ్ స్టూడియోస్‌లో భారీ సెట్‌ను వేశారట. ఈ పాటలో వారిద్దరితో పాటు దాదాపు 500మంది డ్యాన్సర్లు పాల్గొంటున్నారని గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో హృతిక్ గాయపడటంతో షూటింగ్‌ను ఆపేశారట. ప్రస్తుతం ఆయన ప్రముఖ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది. వైద్యుల సూచనల మేరకు నెల రోజులు రెస్ట్ తీసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది ఆగష్టు 14న ఈ చిత్రం విడుదల చేస్తామని మేకర్స్ ప్లాన్ చేసుకున్నారు. ఈ ఘటనతో వార్2 మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అయితే, ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
‘వైఆర్‌ఎఫ్’ (యశ్‌రాజ్ ఫిలింస్) స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ సినిమాను ఆదిత్యా చోప్రా నిర్మిస్తున్నారు. 2019లో విడుదలైన హిట్ మూవీ ‘వార్’ కి సీక్వెల్‌గా ‘వార్ 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో జాన్ అబ్రహాం, కియారా అద్వానీ కీలక పాత్రలలో నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment