ప్రభాస్ బర్త్‌డే ఈవెంట్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వివాదంగా మారింది. ప్రభాస్ పుట్టిన రోజు (అక్టోబర్ 23)సందర్భంగా కొంతమంది ఫేక్ ఫ్యాన్స్‌తో కలిసి ప్రసన్న సాహో డబ్బులు వసూలు చేసి కమర్షియల్ ఈవెంట్స్ చేస్తున్నారని ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు ఆరోపించారు. ఆ ఈవెంట్‌ని కచ్చితంగా అడ్డుకుంటామని హెచ్చరించారు. అయితే తాను ఎలాంటి కమర్షియల్ ఈవెంట్ చేయడం లేదని ప్రసన్న సాహో వర్గం వివరణ ఇచ్చింది.
(చదవండి: రేణు దేశాయ్ ఇంట చండీ హోమం)
ఎవరి దగ్గర తాను డబ్బులు తీసుకోలేదని, కావాలనే తనను టార్గెట్ చేశారంటూ ప్రసన్న మండి పడ్డారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా మెగా బ్లడ్ బ్యాంక్ నిర్వహిస్తామని ప్రసన్న సాహో వర్గం వెల్లడించింది.
(చదవండి: టాప్ హీరో ఫ్యామిలీ నుంచి పూరీ జగన్నాథ్‌కు ఆఫర్)
కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్‌డేని గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసుకునేందుకు దేశ వ్యాప్తంగా ఆయన అభిమానులు సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 23న ఆయన కొత్త సినిమాల అప్‌డేట్స్ రావడంతో పాటు ఆయన నటించిన ఆరు సినిమాలు రీరిలీజ్ అవుతుండడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. బర్త్‌డే రోజు మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, ఛత్రపతి, ఈశ్వర్, రెబల్, సలార్ చిత్రాలు రీరిలీజ్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment