Fans Fight At Prabhas Adipurush Pre Release Event - Sakshi
Sakshi News home page

Adipurush: ఆదిపురుష్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో కొట్లాట.. ఓ వ్యక్తి చెంప పగలగొట్టిన ప్రభాస్‌ ఫ్యాన్స్‌

Published Wed, Jun 7 2023 11:58 AM | Last Updated on Wed, Jun 7 2023 1:37 PM

Fans Fight At Prabhas Adipurush Pre Release Event - Sakshi

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో టాలీవుడ్‌ హవా సాగుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో తెలుగు చిత్రాలకు భారీ ఆదరణ లభిస్తోంది. దేశం మొత్తం మన హీరోల గురించి మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్‌లో ఉంటే ఫ్రెండ్లీ వాతావరణంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. స్టార్‌ హీరోలు సైతం ఎలాంటి ఈగోలకు వెళ్లకుండా ఇతర హీరోల సినిమాలకు తగినంత సహాయం చేస్తున్నారని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదంతా నిజమే. ఈ మధ్య మన హీరోలతో చాలా మార్పు వచ్చింది. కానీ వారి అభిమానుల్లో మాత్రం ఆ మార్పు రాలేదు. ఇప్పటికీ నా హీరో గొప్పంటే.. నా హీరో గొప్పంటూ కొట్లాడుకుంటున్నారు. 

(చదవండి: ఏడాది రెండు మూడు సినిమాలు చేస్తా, పెళ్లి తిరుపతిలోనే : ప్రభాస్‌ )

తాజాగా ఆదిపురుష్‌ ప్రిరీలీజ్‌ ఈవెంట్‌లో కూడా ప్రభాస్‌ ఫ్యాన్స్‌.. మరో స్టార్‌ హీరో అభిమానిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. మంగళవారం సాయంత్రం తిరుపతిలో ఆదిపురుష్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ జరిగిన సంగతి తెలిసిందే. భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చి ఈవెంట్‌ని గ్రాండ్‌ సక్సెస్‌ చేశారు. అయితే ఇక్కడ ప్రభాస్‌ అభిమానులు ఓ వ్యక్తిపై దాడికి పాల్పడ్డారు. దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఆ వ్యక్తి ఏం మాట్లాడారో తెలియదు కానీ పలువురు ప్రభాస్‌ ఫ్యాన్స్‌ మాత్రం అతనిపై దాడి చేశారు. చెంపపై గట్టిగా కొడుతూ రచ్చ రచ్చ చేశారు. ఆ వ్యక్తి మహేశ్‌ అభిమాని అని.. ప్రభాస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో దాడి చేశారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈవెంట్‌లో ఓ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతోనే ఇలా చేశారని మరికొంత మంది చెబుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement