Special Guest For Prabhas Adipurush Telugu Movie Pre-Release Event - Sakshi
Sakshi News home page

ఆదిపురుష్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌.. భారీ అయోధ్య సెట్‌..స్పెషల్‌ గెస్ట్‌ ఎవరంటే?

Published Mon, Jun 5 2023 6:55 PM | Last Updated on Mon, Jun 5 2023 7:11 PM

Adipurush Pre Release Event Highlights and Special Guest Details - Sakshi

భారతీయ చలనచిత్ర చరిత్రలో తొలిసారిగా ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను యుగయుగాలకు గుర్తుండిపోయే స్థాయిలో నిర్వహించనున్నారు. అది మరేదో సినిమాకి కాదు పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ రాఘవుడిగా నటించిన చిత్రం ఆదిపురుష్‌కి. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు మేకర్స్‌.

ఈ ప్రమోషన్స్‌లో భాగంగా తిరుపతిలో పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే ముఖ్య అతిథి మరెవరో కాదు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలకు ప్రసిద్ధి చెందిన మత గురువు, యోగి సన్యాసి అయిన చిన జీయర్ స్వామి. ఆయన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యి చిత్రయూనిట్‌కు ఆశీర్వాదాలు ఇవ్వనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో జరగబోతున్న మరికొన్ని విషయాల గురించి కూడా చెప్పుకోవాలి.

చరిత్రలో తొలిసారిగా ఈ ఈవెంట్‌లో ప్రభాస్ 50 అడుగుల హోలోగ్రామ్ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. రాముడు, వెంకటేశ్వర స్వామి.. విష్ణుమూర్తి అవతారాలు కాబట్టి తిరుపతిలో అయోధ్య భారీ సెట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆదిపురుష్, రామాయణం పాటలకు ఈ ఈవెంట్‌లో 100 మంది డ్యాన్సర్లు, 100 మంది గాయకులు ప్రదర్శన ఇవ్వనున్నారు. మరో చెప్పుకోదగిన విషయం ఏంటంటే ఈ ఈవెంట్‌కు డైరెక్టర్‌ ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ లెవెల్ లో జరగనున్న ఈ కార్యక్రమానికి లక్ష పైచిలుకు జనాలు వస్తారని భావిస్తున్నారు. యాంకర్‌ ఝాన్సీ హోస్ట్‌గా వ్యవహరించే ఈ భారీ ఈవెంట్‌ను శ్రేయాస్ మీడియా ప్లాన్ చేస్తోంది.

చదవండి: నటుడితో విభేదాలు.. 19 ఏళ్ల బంధానికి బ్రేక్‌.. మరొకరితో ప్రేమలో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement