సంక్రాంతికి డబుల్‌ ధమాకా | Big Good News For Prabhas Fans, Maruthi Movie First Look Poster And Kalki 2898 AD Update On Sankranthi 2024 - Sakshi
Sakshi News home page

Prabhas Upcoming Movies: సంక్రాంతికి డబుల్‌ ధమాకా

Published Sat, Dec 30 2023 12:27 AM | Last Updated on Sat, Dec 30 2023 11:44 AM

Kalki 2898 AD Trailer: Big Good News for Prabhas Fans - Sakshi

ప్రభాస్‌ అభిమానులకు శుభవార్త. ఈ సంక్రాంతికి తన ఫ్యాన్స్‌కు డబుల్‌ ధమాకా ఇవ్వనున్నారాయన. మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. కాగా ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌ లుక్‌ను సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్‌ చేయనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ‘‘డైనోసార్‌ డార్లింగ్‌గా ఎలా మారాడో తెలుసుకునేందుకు రెడీగా ఉండండి.

సంక్రాంతి రోజున ఫస్ట్‌ లుక్, టైటిల్‌ అనౌన్స్‌ చేస్తున్నాం’’ అంటూ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ‘ఎక్స్‌’లో షేర్‌ చేసింది. ‘‘రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న చిత్రమిది. ఈ సినిమాలో ప్రభాస్‌ ఒక కొత్త లుక్‌లో, క్యారెక్టర్‌లో కనిపిస్తారు. ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు ఒక స్పెషల్‌ మూవీ ఇవ్వాలనే ఆశయంతో మారుతి ఈ సినిమా చేస్తున్నారు’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: వివేక్‌ కూఛిబొట్ల.

కల్కి కోసం కొత్త ప్రపంచం
‘‘ఇండియాలో సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రాలు ఎక్కువ రాలేదు. ‘కల్కి 2898 ఏడీ’ వైవిధ్యమైన సినిమా. ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్‌ ఫ్యూచరిస్ట్‌ సినిమాల్లో అక్కడి సిటీలు భవిష్యత్‌లో ఎలా ఉంటాయో చూశాం. ఇండియా ఫ్యూచర్‌ సిటీలు ఎలా ఉంటాయో ‘కల్కి 2898 ఏడీ’లో చూస్తారు. ఈ సినిమా కోసం కొత్త ప్రపంచం సృష్టించాం’’ అన్నారు నాగ్‌ అశ్విన్‌.

ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దీపికా పదుకోన్, దిశా పటానీ ఇతర కీలక పాత్రల్లో సి. అశ్వినీదత్‌ నిర్మిస్తున్నారు. కాగా ఐఐటీ బాంబేలో జరిగిన ఓ కార్యక్రమంలో ‘కల్కి 2898 ఏడీ’ ప్రత్యేక కంటెంట్‌ను ప్రదర్శించారు. ఈ సందర్భంగా నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ– ‘‘కల్కి’లో ప్రభాస్, అమితాబ్, కమల్‌హాసన్, దీపికాగార్లు తమ అభిమానులు అమితంగా ఆనందపడే పాత్రల్లో కనిపిస్తారు. ప్రత్యేకించి ఈ మూవీలో ఫ్యూచర్‌ ప్రభాస్‌ని చూస్తారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ ప్రకటిస్తాం’’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement