అంతర్జాతీయ స్థాయిలో ‘కల్కి 2’: స్వప్న, ప్రియాంక | Prabhas Kalki producers on sequel: Swapna and Priyanka | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ స్థాయిలో ‘కల్కి 2’: స్వప్న, ప్రియాంక

Published Tue, Nov 26 2024 12:20 AM | Last Updated on Tue, Nov 26 2024 12:20 AM

Prabhas Kalki producers on sequel: Swapna and Priyanka

‘‘కల్కి 2’ సినిమా పనులు ఇప్పటికే మొదలయ్యాయి.. ప్రీప్రొడక్షన్  వర్క్స్‌ శరవేగంగా జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు స్వాప్న దత్, ప్రియాంక దత్‌ చెప్పారు. ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్ , కమల్‌ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్‌ అండ్‌ సైన్స్ ఫిక్షన్  మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్‌ అశ్విన్  దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌పై సి.అశ్వనీదత్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ లో విడుదలై, ఘనవిజయం సాధించింది.

‘కల్కి సినిమాటిక్‌ యూనివర్స్‌’లో భాగంగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానుందని చిత్రయూనిట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా) వేడుకల్లో మెయిన్ స్ట్రీమ్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని ప్రదర్శించారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్వాప్నదత్, ప్రియాంక దత్‌ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా ప్రీప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. 

తొలి పార్టు చిత్రీకరణ టైమ్‌లోనే 30 నుంచి 35 శాతం ‘కల్కి 2’ షూటింగ్‌ పూర్తయింది. అయితే ఈ సినిమాలోని ప్రధాన నటీనటుల షూటింగ్‌ కాల్షీట్స్‌ ఫైనలైజ్‌ కావాల్సి ఉంది. తొలి పార్టులో మదర్‌ రోల్‌ చేసిన దీపికా పదుకొనే ‘కల్కి 2’లోనూ మదర్‌ రోల్‌ చేస్తారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్‌ చేస్తాం’’ అని పేర్కొన్నారు ‘కల్కి 2’ చిత్రీకరణ వచ్చే ఏడాది ్రపారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement