Swapna
-
వీణా రావుకి ఈ అవకాశం రావడం అదృష్టం: నిర్మాత సుప్రియ
‘‘నా తొలి సినిమాని అశ్వినీదత్‌గారి బేనర్లోనే చేయాలి. కానీ అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగార్జునగారు డైరెక్టర్‌గా తొలి అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరూ నాకు చిరస్మరణీయులు. వారి కుటుంబం నుంచి వచ్చి, మహిళా శక్తులుగా ఎదిగారు సుప్రియ, స్వప్నా దత్. నేను కథానాయికగా పరిచయం చేస్తున్న తెలుగు అమ్మాయి వీణా రావు ఫస్ట్ లుక్ దర్శన్‌ని సుప్రియ, స్వప్న విడుదల చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను వీణా రావు మంచి కూచిపూడి డ్యాన్సర్. తనకి ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉండాలి’’ అని డైరెక్టర్ వైవీఎస్ చౌదరి అన్నారు. తారక రామారావు హీరోగా, తెలుగు అమ్మాయి వీణా రావుని హీరోయిన్గా పరిచయం చేస్తూ వైవీఎస్ చౌదరి ఓ సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే.న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌పై యలమంచిలి గీత ఈ చిత్రం నిర్మిస్తున్నారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో వీణా రావు ఫస్ట్ దర్శన్‌ని నిర్మాతలు సుప్రియ యార్లగడ్డ, స్వ΄్నా దత్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా స్వప్నా దత్ మాట్లాడుతూ– ‘‘వీణారావు చాలా అందంగా ఉంది. తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రావాల్సిన సమయం ఇది. చౌదరి అన్న ఈ విషయంలో ఓ అడుగు ముందుకేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు.సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ– ‘‘వైవీఎస్ చౌదరిగారు డైరెక్టర్‌గా తీసిన తొలి చిత్రం ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చూసిన తర్వాత తాతగారు (అక్కినేని నాగేశ్వరరావు) చాలా సంతోషపడ్డారు. కొత్తవారిని పరిచయం చేయడంలో ఆయనెప్పుడూ ముందుంటారు. వీణా రావుకి ఈ అవకాశం రావడం అదృష్టం’’ అని చెప్పారు. ‘‘వీణా రావు ఫస్ట్ దర్శన్‌ని లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నగార్లకు థ్యాంక్స్’’ అన్నారు యలమంచిలి గీత. ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి. -
అంతర్జాతీయ స్థాయిలో ‘కల్కి 2’: స్వప్న, ప్రియాంక
‘‘కల్కి 2’ సినిమా పనులు ఇప్పటికే మొదలయ్యాయి.. ప్రీప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి’’ అని నిర్మాతలు స్వాప్న దత్, ప్రియాంక దత్ చెప్పారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్ , కమల్ హాసన్ , దీపికా పదుకొనె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించిన మైథలాజికల్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌పై సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జూన్ లో విడుదలై, ఘనవిజయం సాధించింది.‘కల్కి సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా వచ్చిన ‘కల్కి 2898 ఏడీ’కి సీక్వెల్‌గా ‘కల్కి 2’ రానుందని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గోవాలో జరుగుతున్న 55వ ఇఫీ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా) వేడుకల్లో మెయిన్ స్ట్రీమ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘కల్కి 2898 ఏడీ’ సినిమాని ప్రదర్శించారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు స్వాప్నదత్, ప్రియాంక దత్ బదులిస్తూ.. ‘‘ప్రస్తుతం ‘కల్కి 2’ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తొలి పార్టు చిత్రీకరణ టైమ్‌లోనే 30 నుంచి 35 శాతం ‘కల్కి 2’ షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాలోని ప్రధాన నటీనటుల షూటింగ్ కాల్షీట్స్ ఫైనలైజ్ కావాల్సి ఉంది. తొలి పార్టులో మదర్ రోల్ చేసిన దీపికా పదుకొనే ‘కల్కి 2’లోనూ మదర్ రోల్ చేస్తారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తాం’’ అని పేర్కొన్నారు ‘కల్కి 2’ చిత్రీకరణ వచ్చే ఏడాది ్రపారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
ప్రెజర్ నుంచి ప్లెజర్‌కు...
పోటీ పరీక్షల ఒత్తిడి, ఉద్యోగంలో పని ఒత్తిడి, సంసార జీవితంలో ఆర్థిక సమస్యల ఒత్తిడి, వ్యాపారంలో నష్టాల ఒత్తిడి... ‘ఒత్తిడి’ రాక్షస పాదాల కింద ఎన్నో జీవితాలు నలిగిపోతున్నాయి. అయితే ఒత్తిడి అనేది తప్పించుకోలేని పద్మవ్యూహమేమీ కాదు. ఒత్తిడిని చిత్తు చేసే వజ్రాయుధం, ఔషధం సంగీతం అని తెలిసిన స్వప్నరాణి... ఆ ఔషధాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు, గృహిణుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమందికి చేరువ చేస్తోంది. మరోవైపు మరుగునపడిన జానపదాలను వెలికి తీస్తూ ఈ తరానికి పరిచయం చేస్తోంది. ‘సంగీతం ఈ కాలానికి తప్పనిసరి అవసరం’ అంటుంది.నిజామాబాద్‌కు చెందిన స్వప్నరాణి సంగీతం వింటూ పెరిగింది. సంగీతం ఆమె అభిరుచి కాదు జీవనవిధానంగా మారింది. యశ్వంత్రావ్ దేశ్‌పాండే దగ్గర హిందుస్తానీ సంగీతంలో డిప్లమా, పాలకుర్తి రామకృష్ణ దగ్గర కర్ణాటక సంగీతంలో డిప్లమా చేసింది. తిరుపతిలోని పద్మావతి విశ్వవిద్యాలయంలో సంగీతంలో ఎంఏ, పీహెచ్డీ చేసింది. ఉత్తర తెలంగాణలో సంగీతంలో పీహెచ్డీ చేసిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందింది.‘ఇందూరు జానపద సంగీతంలో శాస్త్రీయ ధోరణులు’ అనే అంశంపై పరిశోధన చేసింది. తన పరిశోధనలో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఆరువందలకు పైగా జానపద పాటలను సేకరించింది. సంగీతం అనేది నిలవ నీరు కాదు. అదొక ప్రవాహ గానం. ఆ గానాన్ని సంగీత అధ్యాపకురాలిగా విద్యార్థులకు మాత్రమే కాదు వయో భేదం లేకుండా ఎంతోమందికి చేరువ చేస్తోంది స్వప్నరాణి.స్వప్నరాణి దగ్గర సంగీత పాఠాలు నేర్చుకోవడానికి కనీస అర్హత ఏమిటి?‘నాకు సంగీతం నేర్చుకోవాలని ఉంది’ అనే చిన్న మాట చాలు.నిజామాబాద్‌లోని ప్రభుత్వ జ్ఞానసరస్వతి సంగీత, నృత్య పాఠశాలలో అసిస్టెంట్ లెక్చరర్‌గా పనిచేస్తున్న డాక్టర్ తిప్పోల్ల స్వప్నరాణి ‘నాకు వచ్చిన సంగీతంతో నాలుగు డబ్బులు సంపాదించాలి’ అనే దృష్టితో కాకుండా ‘నాకు వచ్చిన సంగీతాన్ని పదిమందికి పంచాలి’ అనే ఉన్నత లక్ష్యంతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది.స్వప్నరాణి దగ్గర పాఠాలు నేర్చుకున్న వారిలో కాస్తో కూస్తో సంగీత జ్ఞానం ఉన్నవారితో పాటు బొత్తిగా స ప స లు కూడా తెలియని వారు కూడా ఉన్నారు.స్వప్న శిష్యుల్లో సాధారణ గృహిణుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు ఎంతోమంది ఉన్నారు.‘సంగీతం గురించి వినడమే కానీ అందులోని శక్తి ఏమిటో తెలియదు. స్వప్న మేడమ్ సంగీత పాఠాల ద్వారా ఆ శక్తిని కొంచెమైనా తెలుసుకునే అవకాశం వచ్చింది. స్ట్రెస్ బస్టర్ గురించి ఏవేవో చెబుతుంటారు. నిజానికి మనకు ఏ కాస్త సంగీతం వచ్చినా ఒత్తిడి అనేది మన దరిదాపుల్లోకి రాదు’ అంటుంది ఒక గృహిణి.‘సంగీతం నేర్చుకోవాలనేది నా చిన్నప్పటి కల. అయితే రకరకాల కారణాల వల్ల ఆ కల కలగానే మిగిలిపోయింది. రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్నాను. ఈ టైమ్‌లో సంగీతం ఏమిటి అనుకోలేదు. స్వప్నగారి పాఠాలు విన్నాను. నా కల నెరవేరడం మాట ఎలా ఉన్నా... సంగీతం వల్ల ఒత్తిడికి దూరంగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను’ అంటుంది ఒక ప్రభుత్వ ఉద్యోగి.ఇప్పటికి ఐదుసార్లు శతగళార్చన కార్యక్రమాలు నిర్వహించిన స్వప్న ‘సహస్ర గళార్చన’ లక్ష్యంతో పనిచేస్తోంది. ‘రాగం(నాదం), తాళంలో శృతిలయలు ఉంటాయి. నాదంలో 72 ప్రధాన రాగాలు ఉంటాయి. ఏ శబ్దం ఏ రాగంలో ఉండాలో ట్రాక్ తప్పకుండా ఉండాలంటే నేర్చుకునేవారిలో ఏకాగ్రత, నిబద్ధత తప్పనిసరిగా ఉండాలి. ఒక దీక్షలా అభ్యసిస్తేనే సంగీతంలో పట్టు సాధించడం సాధ్యమవుతుంది’ అంటుంది స్వప్నరాణి.భవిష్యత్తుకు సంబంధించి స్వప్నరాణికి కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. తన విద్యార్థులను ప్రతి ఏటా పుష్య బహుళ పంచమి రోజున తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువాయూరులో జరిగే త్యాగరాజ ఆరాధనోత్సవాలకు సంసిద్ధం చేయడం వాటిలో ఒకటి. భవిష్యత్తులో సహస్ర గళార్చన కార్యక్రమాలు ఎక్కువగా చేసే లక్ష్యంతో శిష్యులను తీర్చిదిద్దుతుంది.సంగీతం... ఈ కాలానికి తప్పనిసరి అవసరం‘సంగీతం మనకు ఏం ఇస్తుంది?’ అనే ప్రశ్నకు ఒక్క మాటల్లో జవాబు చెప్పలేం. సంగీతం అనేది తీరని దాహం. ఎంత నేర్చుకున్నా నేర్చుకోవాల్సింది ఎంతో ఉంటుంది. పాఠశాల విద్యార్థుల నుంచి ఉద్యోగుల వరకు ఎంతోమంది ఒత్తిడి గురవుతున్నారు. అందుకే ఈ కాలానికి సంగీతం అనేది తప్పనిసరి అవసరం.సంగీతం వినడమే కాదు నేర్చుకోవడం కూడా గొప్ప అనుభవం. నా పరిశోధనలో భాగంగా మరుగున పడిన ఎన్నో జానపదాలను సేకరించిన వాటిని ఈ తరానికి పరిచయం చేస్తున్నాను.– స్వప్నరాణి– టి భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ -
అమ్మలకు అమ్మలు
‘మాతృత్వం’ వరుసలో నిలిచే మరో గొప్ప మాట... మిడ్వైఫ్. ‘మిడ్వైఫరీ’ అనేది ఉద్యోగం కాదు. పవిత్ర బాధ్యత. అటువంటి పవిత్ర బాధ్యతను తలకెత్తుకున్న సూర్ణపు స్వప్న, నౌషీన్ నాజ్ అంకితభావంతో పనిచేస్తున్న మిడ్వైఫరీ నర్స్‌లలో ఒకరు. జపాన్ లో ప్రత్యేక శిక్షణ కోసం మన దేశం నుంచి ఏడుగురు మిడ్ వైఫరీ నర్సులు ఎంపికయ్యారు. వారిలో కొత్తగూడెం ఆస్పత్రిలో పని చేస్తోన్న సూర్ణపు స్వప్న, వరంగల్ సీకేయం ఆస్పత్రిలో పనిచేస్తున్న నౌషీన్ నాజ్ ఉన్నారు. నవంబరు 12 నుంచి 24 వరకు జపాన్‌లో జరిగే లీడర్షిప్ ట్రైనింగ్ప్రోగ్రామ్లో వీరు పాల్గొంటున్నారు.తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్‌కు చెందిన స్వప్న తండ్రి సోమయ్య కమ్యూనిస్టు. ఆపదలో ఉన్నవారికి సేవ చేయాలని ఎప్పుడూ చెబుతుండేవాడు. ఆయన ప్రభావం వల్లనే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. తొలి పోస్టింగ్ కోసం ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్‌ను ఎంచుకుంది. యూనిసెఫ్ సహకారంతో హైదరాబాద్‌లో ప్రముఖ మెటర్నిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏడాదిన్నర పాటు డిప్లొమా ఇన్ మిడ్వైఫరీ శిక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 మందిని ఎంపిక చేసింది. అందులో స్వప్న ఒకరు.భద్రాచలం ఏజెన్సీలో...డిప్లొమా ఇన్ మిడ్‌వైఫరీలో నేర్చుకున్న నైపుణ్యాలను సార్థకం చేసుకునే అవకాశం స్వప్నకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పని చేసేప్పుడు వచ్చింది. ‘మా బ్యాచ్‌లో మొత్తం ముగ్గురం ఈ ఆస్పత్రికి వచ్చాం. అప్పుడు ఇక్కడ సగటున 70 శాతం వరకు సీ సెక్షన్ పద్ధతిలో ప్రసవాలు జరుగుతుండేవి. శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం మొదలుపెట్టాం. ముందుగా క్షేత్రస్థాయిలో ఆశ వర్కర్లకు సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాం.ఆ తర్వాత కాన్పు సులువుగా అయ్యేందుకు అవసరమైన వ్యాయామాలు ఎలా చేయాలి, మందులు ఎలా తీసుకోవాలి... మొదలైన విషయాల గురించి గర్భిణులకు ఎప్పటికప్పుడు చెబుతూ వారితో ఆత్మీయంగా కలిసిపోయేవాళ్లం. మేము పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఏడాది వ్యవధిలోనే ఈ ఆస్పత్రిలో సీ సెక్షన్లు 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గిపోయాయి. వైద్యపరంగా అత్యవసరం అనుకున్న వారికే సీ సెక్షన్లు చేసేవారు. ఈ ఆస్పత్రిలో ఒకే నెలలో 318 సాధారణ ప్రసవాలు చేసి రికార్డు సృష్టించాం’ అంటుంది స్వప్న. భద్రాచలం ఆస్పత్రిలో స్వప్న బృందం తీసుకొచ్చిన మార్పునకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించింది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెంముఖ కవళికలతోనే...భద్రాచలంలో పని చేస్తున్నప్పుడు ఒడిషాకు చెందిన ఆదివాసీ మహిళ కాన్పు కోసం వచ్చింది. మన దగ్గర కాన్పు చేయాలంటే బెడ్ మీద పడుకోబెడతాం. కానీ ఆ ఆదివాసీ మహిళ కింద కూర్చుంటాను అని చెబుతోంది. మా ఇద్దరి మధ్య భాష సమస్య ఉంది. ముఖకవళికలతోనే ఆమెకు ఎలా కంఫర్ట్‌గా ఉంటుందో కనుక్కుని బెడ్ మీదనే కూర్చునే విధంగా ఒప్పించి సాధారణ ప్రసవం చేయించాను. ఒకరోజు ఆస్పత్రికి వచ్చేసరికి ఒక గర్భిణీ స్పృహ కోల్పోయి ఉంది.బీపీ ఎక్కువగా ఉంది. పదేపదే ఫిట్స్ వస్తున్నాయి. హై రిస్క్ కేసు. బయటకు రిఫర్ చేద్దామంటే మరో ఆస్పత్రికి చేరుకునేలోగా తల్లీబిడ్డలప్రాణాలు ప్రమాదంలో పడతాయి. మేము తీసుకున్న శిక్షణ, నేర్చుకున్న నైపుణ్యం, అనుభవంతో భద్రాచలం ఆస్పత్రిలోనే గైనకాలజిస్ట్ సాయంతో నార్మల్ డెలివరీ చేశాం. ఆస్పత్రికి వచ్చేప్పుడు స్పృహలో లేని మహిళ తిరిగి వెళ్లేప్పుడు తన బిడ్డతో నవ్వుతూ వెళ్లడాన్ని చూడటం మాటలకు అందని సంతోషాన్ని ఇచ్చింది. నా వృత్తి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.– సూర్ణపు స్వప్నమరచిపోలేని జ్ఞాపకాలుహైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు ఎస్ఐ పరీక్షలకు సిద్ధమవుతున్న లావణ్య అనే గర్భవతి మమ్మల్ని సంప్రదించింది. సిజేరియన్ అయితే పోలీసు ఉద్యోగం రావడం కష్టమవుతుందనడంతో ఆమె చేత కొన్ని ఎక్సర్సైజులు చేయించాను. ఎదురుకాళ్లు ఉన్న పాప గర్భంలో సరైన స్థితికి వచ్చేలా చూశాను. నొప్పులు రావడం లేదని టెన్షన్ పడితే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేలా కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు రకరకాల వ్యాయామాలు చేయించి సాధారణ ప్రసవం అయ్యేలా చేశాను.వరంగల్ జిల్లా నెక్కొండకి చెందిన స్వప్న ఎత్తు తక్కువగా ఉండడంతో చాలా మంది సాధారణ ప్రసవం కాదని అంటుండేవారు. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ క్లాస్‌లు విన్నాక ఆమెలోని భయాలు తొలగిపోయాయి. సాధారణ ప్రసవం అయ్యింది. దుబాయ్‌లో ఉంటున్న నా చెల్లెలు సైన్తా నాష్ తొలి రెండు కాన్పులు సిజేరియన్ అయ్యాయి. మూడో కాన్పుకు సంబంధించి ఫోన్ ద్వారా నాతో మాట్లాడుతూ నేను చెప్పిన విధంగా వ్యాయామాలు చేసేది. చెల్లికి సాధారణ ప్రసవం కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది.– నౌషీన్ నాజ్‘ప్రసవం అనేది తల్లికి పునర్జన్మ’ అంటారు. స్వప్న, నౌషీన్ నాజ్‌లు గతంలో తీసుకున్న శిక్షణ ఎంతోమంది తల్లులకు అండగా నిలవడానికి, ప్రతికూల పరిస్థితుల్లో ఎంతోమందిప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడింది. జపాన్‌లోని లీడర్షిప్ప్రోగ్రామ్ ద్వారా వీరు మరెన్నో నైపుణ్యాలను సొంతం చేసుకోనున్నారు. ఆ నైపుణ్యాల ‘పుణ్యం’ ఊరకే పోదు. ఆపదలో ఉన్న ఎంతోమంది తల్లులకుప్రాణవాయువు అవుతుంది.‘వైద్యులకు వైద్యసేవలు అందించే నైపుణ్యమే కాదు ఆత్మస్థైర్యాన్నిచ్చే శక్తి కూడా ఉంటుంది’ అని తాత డాక్టర్ వారీజ్ బేగ్ చెప్పిన మాటలు హనుమకొండకు చెందిన నౌషీన్ నాజ్ మనసులో బలంగా నాటుకు΄ోయాయి. తాత మాటల స్ఫూర్తితో మెడిసిన్ ఎంట్రెన్స్ రాసింది కానీ సీటు రాలేదు. అయినా నిరాశపడకుండా హైదరాబాద్‌లోని ‘మెడిసిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్’లో జీఎన్ఎం కోర్సు చేరింది. ఆ తర్వాత మైనారిటీ కోటాలో ఎంబీబీఎస్ సీటు వచ్చినా కోర్సును కొనసాగించి నర్సింగ్ వృత్తిలో అత్యుత్తమ సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించింది.మాతా శిశు మరణాలను తగ్గించడంలో భాగంగా 1500కు పైగా సాధారణ ప్రసవాలలో సహాయం అందించింది. భయంతో వచ్చే తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ΄ాటు సాధారణ ప్రసవం కోసం వ్యాయామాలు నేర్పిస్తుంటుంది. వరంగల్‌లో నిర్వహించిన ఆబ్స్టెక్టిక్స్ ఎమర్జెన్సీ(ఎంవోఎస్, మామ్స్) వర్క్‌షాప్‌లో యూకే నుంచి వచ్చిన మిడ్ వైఫరీ నర్సులు సాధారణ ప్రసవాలపై ఇక్కడి వైద్యులకు శిక్షణ ఇచ్చారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని ‘నేషనల్ మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ గురించి తెలునుకొని అర్హత పరీక్షలు రాసి ఎంపికైంది నౌషీన్. మిడ్వైఫరీ కోర్సులో బెస్ట్ స్టూడెంట్‌గా ఎంపికైంది. హైదరాబాద్‌లోని నీలోఫర్, కింగ్ కోఠి, వనస్థలిపురం మెటర్నిటీ ఆసుపత్రులలో పనిచేసింది. వాటర్ బర్త్, బ్రీచ్ బర్త్ డెలివరీల గురించి తెలుసుకొని వ్యాయామాల ద్వారా సాధారణ ప్రసవాలు చేయించింది. బ్రీచ్బర్త్ డెలివరీలలో చాలామంది తల్లుల గర్భంలో ΄ాపలు ఎదురుకాళ్లతో ఉంటారు. వ్యాయామం ద్వారా తలపైకి, కాళ్లు కిందకు వచ్చేలా చేసి సాధారణ ప్రసవం అయ్యేలా చేసేది. ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంఏ సైకాలజీ కోర్సు చదువుతోంది. ‘తల్లుల మానసిక స్థితి తెలుసుకునేందుకు ఈ చదువు ఉపయోగపడుతుంది’ అంటుంది నౌషీన్. – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్ -
నైపుణ్యమే సంపద
‘జీవితంలోని ప్రతి దశలోనూ గైడ్ చేస్తూ నా ఎదుగుదలకు దోహదపడిన వారు ఎంతో మంది ఉన్నారు. వారందరూ నాకు గురువులే..’ అంటూ పరిచయం చేసుకున్నారు వనమల స్వప్న. హైదరాబాద్ లోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్’ లో అసోసియేట్ ఫ్యాకల్టీగా ఉన్న వనమల స్వప్నకు ఇటీవల నేషనల్ ఎంట్రప్రెన్యూర్ అవార్డు వచ్చింది. గురువారం రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’తో తన విజయానందాన్ని పంచుకున్నారు. ‘‘సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం శిక్షణా తరగతులను నిర్వహించడంలో 18 ఏళ్ల అనుభవం ఉంది. 12 ఏళ్లుగా మేనేజ్మెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎమ్ఎస్ఎమ్ఇ’లో వర్క్ చేస్తున్నాను. స్పెషలైజేషన్ ఇంక్చువ ప్రాపర్టీ రైట్స్ ఇన్ఛార్జిగానూ వర్క్ చేస్తున్నాను.వారధిగా.. సాయంబిజినెస్ చేయాలని, రాణించాలనే ఆలోచన చాలా మందిలో ఉంటుంది. కానీ, సరైన నైపుణ్యాలు ఉండవు. అలాగే, ప్రభుత్వం నుంచి వచ్చే స్కీమ్స్ గురించి కూడా తెలియవు. స్కిల్స్‌తో పాటు వ్యాపార అవకాశాలు, లోన్లు, ప్రభుత్వ పథకాలను ఎలా ఉపయోగించుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి.. అనే విషయాల్లో సాయం చేస్తాం. మా అకాడమీ నుంచి వివిధ రకాల స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో ఇప్పుడు నాలుగు స్కీమ్స్‌తో నిరుద్యోగ యువత, మహిళలకు ఎంట్రప్రెన్యూర్షిప్ స్కిల్స్ డెవలప్మెంట్ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. నాలుగేళ్ల నుంచి మల్టీమీడియా, ఫ్యాషన్, బ్యూటీ.. వంటి రంగాలలో దాదాపు 4000 మంది యువతకు శిక్షణ ఇచ్చాం. స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్, ప్రైవేట్, పబ్లిక్ సెక్టార్స్‌లోని వాళ్లకూ స్కిల్ ట్రెయినింగ్స్ ఇస్తున్నాం. మంచి రేటింగ్ త్రీ స్టార్స్ రేటింగ్ రావడంతో ఎమ్ఎస్ఎన్మి ఇన్నోవేటివ్ స్కీమ్ కింద సివిల్ సర్వెంట్స్‌కు శిక్షణ ఇవ్వడానికి మా ఇన్స్టిట్యూట్కు అప్రూవల్ వచ్చింది. వివిధ రంగాలలో నిపుణులైన వారు కూడా శిక్షణ తరగతులకు హాజరవుతుంటారు. తాము సృష్టించిన ఉత్పత్తులను ప్రదర్శించడానికి వేదికలను కూడా ఏర్పాటు చేస్తుంటాం. ఇటీవల శిక్షణ తీసుకుంటున్న వారిలో మహిళల శాతం ఎక్కువగా ఉంటోంది. దీంతో 55 స్కిల్ప్రోగ్రామ్స్ మహిళలకే పరిచయం చేస్తున్నాం. జిల్లా, గ్రామీణ స్థాయి మహిళలకు కూడా 60 స్కిల్స్ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాం. ప్రతి రోజూ సవాళ్లే దేశవ్యాప్తంగాప్రోగ్రామ్స్, శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడానికి ఆయా ్రపాంతాలకు వెళ్లినప్పుడు కాలేజీలు, యూనివర్శిటీల సాయం తీసుకుంటాం. అక్కడ చాలా వరకు శిక్షణకు కావల్సిన సరంజామా ఉండదు. దీంతో ప్రతీదీ సవాల్‌గానే ఉంటుంది. ముఖ్యంగా టెక్నాలజీకి సంబంధించిన శిక్షణ ఇచ్చేటప్పుడు సమస్యలు ఎదురవుతుంటాయి. దీంతో ఏ లోపం లేకుండా ముందస్తుగానే ΄్లాన్ చేసుకుంటాం. ఇటీవల సైబర్‌సెక్యూరిటీకి సంబంధించి కాకినాడ ప్రభుత్వ కాలేజీలో, డిజిటల్ మార్కెట్‌కు సంబంధించి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం వారితో కలిసి వర్క్ చేశాం. ఫ్యాషన్ రంగానికి సంబంధించి ఇండోర్ ఫ్యాషన్ ఇన్సిట్యూట్తో కలిసి వర్క్ చేశాం. 2023–24 సంవత్సరానికి గాను 200కు పైగా ప్రోగ్రామ్స్ చేశాం. ట్రైనింగ్ క్లాసులకు ప్రిపేర్ అవడం,ప్రోగ్రామ్స్‌ని నిర్వహించడం, జనాల్లోకి రీచ్ అయ్యేలా చేయడం ఓ పెద్ద ప్రణాళిక. కుటుంబ మద్దతునేను పుట్టింది తెలంగాణలోని సిద్దిపేట. మా నాన్నగారి ఉద్యోగరీత్యా రామగుండంలో చదువుకున్నాను. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంజనీరింగ్ చేశాను. మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్, మాకు ఇద్దరు పిల్లలు. మహిళగా నా వర్క్‌లో రాణించాలంటే కుటుంబం స΄ోర్ట్ ఉండాలి. మా పేరెంట్స్ ఉన్న అపార్ట్మెంట్లోనే నేనూ ఇల్లు తీసుకోవడంతో పిల్లలకు సంబంధించి ఒత్తిడి తక్కువగా ఉంటుంది. హైదరాబాద్‌లోని అడిక్‌మెట్ నుంచి రోజూ నా ప్రయాణం ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కో దశలో నన్ను గైడ్ చేయడానికి వచ్చారు. వారంతా నాకు గురువులే’ అంటూ తెలిపారు స్వప్న. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన న్యాయమూర్తి
సింగరేణి (కొత్తగూడెం): నల్లగొండ జిల్లా మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జి టి.స్వప్న ఆదివారం రాత్రి కొత్తగూడెం ప్రభ ుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. కొత్తగూడెంలోని బూడిదగడ్డ బస్తీకి చెందిన న్యాయవాది శాంత కుమార్తె అయిన స్వప్నకు మిర్యాలగూడ మండలం నిడమనూరుకు చెందిన దాసరి కార్తీక్‌తో వివాహం జరిగింది.ప్రస్తుతం నల్లగొండ జిల్లా మున్సిఫ్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వర్తిస్తున్న స్వప్న.. ప్రసవం కోసం కొత్తగూడెంలోని పుట్టింటికి వచ్చారు. ఉన్నత విద్యనభ్యసించి, న్యాయమూర్తిగా కొనసాగుతున్న ఆమె.. కార్పొరేట్ స్థాయి వైద్యం చేయించుకునే స్థోమత ఉన్నా సామాన్య ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో కొత్తగూడెంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో చేరగా ఆదివారం రాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సేవలు ఉపయోగించుకోవాలని, పూర్తి నమ్మకంతో వైద్యం పొందాలని సూచించారు. తనకు వైద్యసేవలందించిన డాక్టర్ సాగరిక, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. -
టాలీవుడ్ యాంకర్ అరుదైన ఘనత
ప్రముఖ యాంకర్, హీరోయిన్ స్వప్న చౌదరి అరుదైన ఘనత సాధించింది. పదేళ్లుగా యాంకరింగ్ రాణిస్తోన్న స్వప్న చౌదరికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ఈ సందర్భంగా ఆమెకు అవార్డ్ అందజేశారు. తనకి ఈ అవార్డ్ రావడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు.తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందని స్వప్న చౌదరి అన్నారు. ఈ సందర్భంగా వారి తల్లిదండ్రులకు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. పదేళ్లుగా యాంకరింగ్‌లో రాణిస్తూ దాదాపు 2500 పైగా ఈవెంట్స్‌లో పాల్గొన్నారు. అంతేకాకుండా నమస్తే సెట్ జీ , మిస్టరీ సినిమాల్లో హీరోయిన్గా నటించారు.బిగ్ బాస్ సీజన్- 8లో పాల్గొనడమే తన కోరికని స్వప్న చౌదరి అన్నారు.శబరి నిర్మాతకు అవార్డ్టాలీవుడ్ యువ నిర్మాత శబరి మహేంద్ర నాధ్ కు అరుదైన అవార్డ్ దక్కింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో శబరి చిత్రాన్ని ఆయన నిర్మించారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఏకకాలంలో సుమారు మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవరిస్తున్న సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ అవార్డ్‌తో నా బాధ్యత మరింత పెరిగిందని శబరి మహేంద్ర నాధ్ అన్నారు. -
సీఎం జగన్,షర్మిల పై సజ్జల కామెంట్స్ జర్నలిస్ట్ స్వప్న విశ్లేషణ
-
ఉన్నది పాయె.. ఉంచుకున్నది పాయె బాబు వెన్నుపోటుకు బలి
-
విశాఖ డ్రగ్స్ కంటైనర్ పై జర్నలిస్ట్ స్వప్న సంచలన విషయాలు
-
జయప్రకాశ్ నారాయణ్ కు జర్నలిస్ట్ స్వప్న దిమ్మదిరిగే కౌంటర్
-
13 ఏళ్లుగా '108 అంబులెన్స్' రూపంలో.. వెంటాడిన మృత్యువు!
వరంగల్: 108.. ఈ నంబర్ వినగానే మృత్యువు దారిదాపుల్లో ఉన్న వారి ప్రాణాలు లేచి వస్తాయి. ఈ వాహనం.. వివిధ ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన ఎంతో మందిని మృత్యువు అంచుల నుంచి కాపాడుతోంది. అయితే అదే వాహనం.. తన వద్దే ఈఎంటీగా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగిని బలితీసుకుంది. ఆ ఉద్యోగిని విషయంలో మృత్యువు 13 ఏళ్ల నుంచి వెంటాడుతోంది. రెండు సార్లు రోడ్డు ప్రమాదాలకు గురి చేసింది. ఫలితంగా అందరికీ ప్రాణదాతగా ఉన్న 108 వాహనం తమ ఉద్యోగి పాలిట మృత్యుశకటంగా మారి బలితీసుకున్న ఘటన సహా ఉద్యోగులు, బాధిత ఉద్యోగి కుటుంబీకులను తీవ్ర విషాదంలోకి నెట్టింది. మొదటి నుండి ఇలా.. దివంగత నేత వైఎస్సార్ 108 వాహనాలు ప్రారంభించిన తొలిరోజులు.. 2007లో హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన సూదమళ్ల స్వప్న ఈఎంటీగా విధుల్లో చేరారు. విధుల్లో చురుకుగా ఉండే స్వప్న ఉత్తమ పనితీరుతో సహా ఉద్యోగులు, ఉన్నతాధికారుల ప్రశంసలతోపాటు పలు అవార్డులు అందుకున్నారు. విధుల్లో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా ఆలేరు, హనుమకొండ, ఏటూరునాగారం, తాడ్వాయి, పరకాల తదితర ప్రాంతాల్లో పనిచేశారు. 108 వాహనంలో 108 ప్రసవాలు చేసి రికార్డు సృష్టించారు. ఇలా హుషారుగా సాగుతున్న స్వప్న జీవితానికి, తన సంతోషానికి కారణమైన 108 వాహనమే ఈ విషాదానికి కారణమైంది. 2010 సంవత్సరంలోలో 108 వాహనంలో కేయూసీ పాయింట్ వద్ద విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఓ ప్రమాద ఘటనా స్థలికి వెళుతుండగా కేయూసీ– హసన్‌పర్తి రోడ్డులో తమ 108 వాహనం ఘొర ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వప్న హైదరాబాద్‌లో చికిత్స పొందింది. అయితే మెదడులో తీవ్ర గాయం కావడంతో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పారు. ఒకటికి మూడుసార్లు ఆపరేషన్లు చేశారు. అయినా పూర్తిగా కోలుకోలేకపోయింది. ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యపరిస్థితి పూర్తిగా దిగజారడంతో మళ్లీ విధుల్లో చేరింది. కరోనా కాలంలో రెట్టించిన ఉత్సాహంతో విధుల్లో చేరింది. తన పునర్జన్మ కరోనా బాధితుల కోసమే అంటూ ధైర్యంగా పనిచేసింది. కానీ స్వప్న విషయంలో విధి వెక్కిరించింది. 108 రూపంలో వెంటాడుతున్న మృత్యువు మరోసారి దెబ్బతీసింది. 2021లో పరకాల 108 వాహనంలో పనిచేస్తూ ఓ క్షతగాత్రుడిని ఎంజీఎం తరలించి వెళ్తోంది. ఈ క్రమంలో 108 వాహనం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఫలితంగా తను పనిచేస్తున్న వాహనం రెండోసారి మృత్యుశకటమై ఆసుపత్రి పాలు చేసింది. నాటి నుంచి స్వప్న మంచానికే పరిమితమైంది. కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురికావడంతో సహా ఉద్యోగులు తమకు తోచిన మేర ఆర్థిక సాయం చేశారు. దీంతో మరోమారు వారం క్రితం తను పనిచేసిన...తనను మృత్యుకూపంలోకి నెట్టిన 108వాహనంలో హైదరాబాద్‌లోని ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా స్వప్న తిరిగి రాలేదు. ఆదివారం కనిపించని లోకాలకు తరలింది. అదే సంస్థ వాహనంలో విగతజీవిగా వచ్చింది. 13 ఏళ్లు స్వప్నను వెంటాడి వధించిన మృత్యువు తోటి ఉద్యోగులు, కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదం నింపింది. ఉద్యోగి కాదంటున్న యాజమాన్యం సుమారు దశాబ్దకాలం పాటు తమ సంస్థలో పని చేసి విధుల్లో ప్రమాదానికి గురై మృతి చెందిన స్వప్ర.. ప్రస్తుతం ఆ సంస్థకు కానిది అయింది. ఎందుకంటే కొద్ది రోజుల కిత్రం సంస్థ పేరును ‘గ్రీన్ హెల్త్ సర్వీస్’గా మార్చారు. మార్చిన తరువాత గతంలో ఉన్న ఉద్యోగుల నుంచి బయోమెట్రిక్, ఇతర సమాచారం తీసుకుని నమోదు చేసుకున్నారు. ఆ సమయంలో స్వప్న మంచానికే పరిమితమైంది. దీంతో తమ సంస్థలో పనిచేస్తున్నట్లు కొత్త ఐడీ నంబర్ ఉంటేనే గుర్తింపు ఇస్తామని సంస్థ చెపుతోందని సహా ఉద్యోగులు, కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇది అన్యాయమని వారు వాపోతున్నారు. కుటుంబ పరిస్థితి అంతంత మాత్రమే.. కడు పేద కుటుంబంలో ఉన్న స్వప్న ఒంటరిగా ఉంటోంది. తన అక్కకు ముగ్గురు సంతానం. ఇందులో ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అక్కకు భర్త లేడు. దీంతో వారిలో ఒక కూతురును స్వప్న పెంచుకోవడంతోపాటు అక్క కుటుంబ బాధ్యతలు తనే చూస్తోంది. స్వప్న మృతితో ఇప్పుడు తమకు ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని ఆ కుటుంబం రోదిస్తోంది. దశాబ్దానికి పైగా 108లో సేవలందించి అందరికీ దూరమైన స్వప్న విషయంలో ప్రభుత్వం స్పందించాలని సహా ఉద్యోగులు, కుటుంబీకులు కోరుతున్నారు. సంస్థకూడా ఉద్యోగిగా గుర్తించి పరిహారం అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. స్వప్న విషయంలో సంస్థ గుర్తింపు ఇవ్వడానికి సాంకేతిక కారణాలు చూపినా అందులో ఉన్న ఉద్యోగులు మానవత్వం చాటుకున్నారు. సంస్థ రాష్ట్ర బాధ్యుడు ఖలీద్ సూచన మేరకు జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్ ఆధ్వర్యంలో స్వప్న అంత్యక్రియలకు ఆదివారం రూ. 10 వేలు అందించారు. మిగతా విషయాలు తమ పరిధిలో లేవన్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇవి చదవండి: ప్రాణం పోస్తారనుకుంటే.. తీశారు! -
సెల్యూట్ టు కల్నల్ స్వప్న రాణా
‘ఉమెన్ ఆఫ్ ఇంపాక్ట్’ సిరీస్‌లో భాగంగా కల్నల్ స్వప్న రాణా అసా«ధారణ ప్రయాణానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌పై ఆన్లైన్ కమ్యూనిటీలో ప్రశంసల జల్లు కురుస్తోంది. కంగనా రనౌత్‌లాంటి బాలీవుడ్ నటీమణులు రాణా జీవిత కథను తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని చిన్న గ్రామంలో పుట్టిన స్వప్న వ్యవసాయ పనులు చేసింది. బస్సు ఎక్కడానికి డబ్బులు లేక నడుచుకుంటూనే కాలేజీకి వెళ్లేది. కష్టపడుతూనే చదువుకుంది. ‘హిమాచల్‌ప్రదేశ్ యూనివర్శిటీ’లో ఎంబీఏలో చేరిన స్వప్న ఆ తరువాత సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేరవుతూనే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి సెలెకై్టంది. ఆ తరువాత చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ తీసుకుంది. 2004లో లెఫ్టినెంట్‌గా నియమితురాలైంది. ప్రస్తుతం ఈశాన్యరాష్ట్రాల్లో ఆర్మీ సర్వీస్ కార్ప్స్ బెటాలియన్‌కు కమాండింగ్ ఆఫీ సర్గా విధులు నిర్వహిస్తున్న స్వప్న రాణా ప్రతిష్ఠాత్మక మైన అవార్డ్లు ఎన్నో అందుకుంది. -
నేను రాసిన పాటలోని పదాలు సీఎం జగన్ నోట రావడం ఈ జన్మకు ఇది చాలు
-
మహిళల ముఖాల్లో చిరునవ్వులు చూడటమే సీఎం జగన్ లక్ష్యం
-
నన్ను మోసం చేశారు
-
ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా?
తాండూరు: ఏమ్మా.. మీ ఎమ్మెల్యేను ఈ సారి గెలిపిస్తారా? అని సీఎం కేసీఆర్ తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్నపరిమళ్‌ను ప్రశ్నించారు. బుధవారం తాండూరులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు వెళ్లిన ముఖ్యమంత్రికి చైర్పర్సన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. ఈ సారి ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని గెలిపిస్తారా అని చైర్‌పర్సన్‌ను అడగగా.. ఖచ్చితంగా గెలిపిస్తాం సార్ అని ఆమె సమాధానం ఇచ్చారు. కాగా గడిచిన మూడేళ్ల కాలంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి, చైర్పర్సన్ స్వప్నకు మధ్య గొడవ తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. వాటన్నింటిని పక్కనపెట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పనిచేయాలని గతంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చైర్‌పర్సన్‌ను సముదాయించారు. దీంతో ఎమ్మెల్యే గెలుపే లక్ష్యంగా ఆమె ఎన్నికల ప్రచారం సైతం చేస్తున్నారు. -
కోమాలో భర్త, భార్య దారుణ హత్య.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: నగరంలోని చంపాపేట్‌లో వివాహిత స్వప్న హత్య కేసు తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, ఈ కేసులో పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. దర్యాప్తులో భాగంగా స్వప్న హత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. తెర మీదకు ప్రియుడు సతీష్ పేరు రావడంలో కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి వివరాల ప్రకారం.. మృతురాలు స్వప్న గతంలో సతీష్ అనే యువకుడిని ప్రేమించింది. కాగా, స్వప్నకు ప్రేమ్ అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే స్వప్న వివాహం జరిగిన తరువాత కూడా మాజీ ప్రియుడు సతీష్‌తో కాంటాక్ట్‌లోనే ఉన్నది. సతీష్ చంపాపేట్‌లోని స్వప్న ఇంటికి తరుచూ వస్తూ పోతూ ఉండేవాడు. ఈ విషయం ప్రేమ్‌కు తెలియడంతో సతీష్‌తో ఇటీవల గొడవలు జరిగాయి. అయితే, నిన్న(శనివారం) ఉదయం 11:30 గంటలకు చంపాపేట్‌లోని స్వప్న ఇంటికి సతీష్ తన స్నేహితులతో కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న సతీష్.. స్వప్నను దారుణంగా హత్య చేశాడు. అనంతరం, స్వప్న భర్త ప్రేమ్‌ను రెండవ అంతస్తు నుండి కిందకు నెట్టేసాడు. ఈ క్రమంలో ప్రేమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రేమ్ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమ్ కుమార్ వాంగ్మూలాన్ని తీసుకుంటే కేసును ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా అతను స్పృహలోకి ఎప్పుడు వస్తాడో తెలియరాలేదు. ఈ క్రమంలో స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం... భార్యా భర్తలు మృతి -
అవయవదానంతో ఇద్దరికి పునర్జన్మ
లబ్బీపేట(విజయవాడతూర్పు) : ఎన్టీఆర్ జిల్లా వెల్వడం గ్రామానికి చెందిన లక్ష్మమ్మ బ్రెయిన్ డెడ్‌కు గురికాగా.. ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేసి ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్టు అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. ఈ నెల 11న అవయవదానం చేయగా.. మూడేళ్లు, నాలుగేళ్లుగా డయాలసిస్ చేయించుకుంటూ జీవనం సాగిస్తున్న ఇద్దరికి, దాత నుంచి సేకరించిన కిడ్నీలను ట్రాన్స్‌ప్లాంట్ చేసినట్లు డాక్టర్ విట్టల్, డాక్టర్ స్వప్న తెలి పారు. ఆస్పత్రి ప్రాంగణంలో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ఒకే రోజు ఏకకాలంలో రెండు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేయడం అరుదైన ఘటనగా చెప్పారు. యూరాలజిస్టులు డాక్టర్ ప్రశాంత్‌కుమార్, డాక్టర్ ధీరజ్, డాక్టర్ మురళీకృష్ణ పాల్గొన్నారు. -
ఆయనకిద్దరితో పెళ్లి.. ఆరు ముళ్లు.. పద్నాలుగు అడుగులు!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘‘మూడే ముళ్లు... ఏడే అడుగులు.. మొత్తం కలిపి నూరేళ్లు...’’ ఓ సినీ గేయ రచయిత అన్న మాటలను ఈయన సరిగ్గా డబుల్ చేశాడు. ఒకే రోజు ఇద్దరికీ.. ఒక్కొక్కరికి మూడు ముళ్లు.. వెరసి ఆరు ముళ్లు వేసి పద్నాలుగు అడుగులు నడిచాడు. ఇక కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే పిల్లలు.. చందంగా పెళ్లి సమయానికే ఇద్దరు వధువులూ ఒకరు మగ బిడ్డతో.. ఒకరు ఆడ బిడ్డతో పెళ్లి పీటలపై కూర్చొని సదరు పెళ్లి కొడుకుతో తాళి కట్టించుకున్నారు. ఈ చిత్రమైన పెళ్లి’ళ్లు’భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం ఎర్రబోరు గ్రామంలో జరిగాయి. పూర్వాపరాలిలా.. గ్రామానికి చెందిన సత్తిబాబు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ శారీరకంగా ఒకటి కావడంతో స్వప్నకుమారి గర్భం దాల్చింది. విషయం ఆమె ఇంట్లో తెలియడంతో పెళ్లి చేసుకునేందుకు సత్తిబాబు ఓకే అన్నాడు. కానీ స్వప్నకి తెలియకుండా సత్తిబాబు కుర్నపల్లికి చెందిన సునీతతోనూ మరో ప్రేమ కథ నడిపాడు. ఈమెనూ గర్భవతిని చేశాడు. ఇరువురు యువతుల తల్లిదండ్రులతో పాటు కుల పెద్దలూ రంగంలోకి దిగారు. తాను ఇద్దరినీ ప్రేమించానని, ఇరువురినీ పెళ్లి చేసుకుంటానని సత్తిబాబు చెప్పగా, యువతులూ అంగీకరించడంతో పరస్పర అంగీకారంతో ఒకే చోట కాపురం పెట్టాడు. గతేడాది జూలైలో స్వప్నకుమారి పాపకు జన్మనివ్వగా, సెప్టెంబర్‌లో సునీతకు బాబు పుట్టాడు. కాగా తన పెళ్లి ఘనంగా జరగలేదని భావించిన సత్తిబాబు..ఈనెల 9న గురువారం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక వరుడు, ఇద్దరు వధువుల పేర్లతో పెళ్లి పత్రిక అచ్చు వేయించి బంధుమిత్రులందరికీ పంచాడు. సోషల్ మీడియాలో ఈ పెళ్లికార్డు వైరల్‌గా మారింది. సత్తిబాబు పెళ్లి ముచ్చట ఆరు ముళ్లు, పద్నాలుగు అడుగులతో ముగిసింది. -
ఆయనకు ఇద్దరితో పెళ్లి.. ఒకే ముహూర్తానికి.. వైరల్‌గా శుభలేఖ
చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని ఓ గిరిజన గ్రామానికి చెందిన వ్యక్తి ఒకే ముహూర్తానికి ఇద్దరు వధువుల మెడలో తాళిబొట్టు కట్టనున్నాడు. కుర్నపల్లి గ్రామపంచాయతీకి చెందిన కోయ గిరిజనుడు, వ్యవసాయ కూలీ మడివి సత్తిబాబు అదే గ్రామానికి చెందిన సునీతతో పాటు దోశిళ్లపల్లికి చెందిన స్వప్నకుమారిని ప్రేమించాడు. ఈ క్రమంలో స్వప్నతో వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చయించగా.. విషయం తెలుసుకున్న సునీత నిలదీసింది. ఇరువురికీ సర్దిచెప్పేందుకు పెద్దలు ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో సత్తిబాబు ఇద్దరితోనూ ఎర్రబోరులో ఏడాది క్రితం కాపురాన్ని ప్రారంభించాడు. ప్రస్తుతం సునీత, స్వప్నకు ఒక్కో సంతానం ఉన్నారు. కోయ గిరిజనుల్లో కొన్ని తెగల వారు కొంత కాలం కలిసి కాపురం చేశాక వివాహం చేసుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో వివాహ విషయాన్ని నలుగురికి తెలిసేలా విందు ఏర్పాటు చేయాలని తల్లిదండ్రులు, పెద్దలు సూచించారు. దీంతో సత్తిబాబు గురువారం ఉదయం 7.04 గంటలకు ఇద్దరితో కల్యాణ ముహూర్తమని శుభలేఖలు అచ్చు వేయించి బంధువులకు పంచాడు. దీంతో ఈ కార్డు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. -
హిజ్రా ప్రాణం తీసిన ప్రేమ: స్వప్నతో నిషాంత్ వివాహం.. తల్లిదండ్రులకు తెలిసి..
సాక్షి, మీర్పేట్: ప్రేమించి పెళ్లిచేసుకున్న వ్యక్తి వదిలివెళ్లాడని మనస్తాపానికి గురై ఓ హిజ్రా ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాచలానికి చెందిన మొదపూరపు గుణ అలియాస్ స్వప్న (హిజ్రా) (24) కొంత కాలంగా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందనవనం జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎంలోని ఓ ఫ్లాట్‌లో స్నేహితులతో కలిసి ఉంటోంది. మూడు నెలల క్రితం నల్లగొండ జిల్లా నిడమనూరుకి చెందిన బైక్ మెకానిక్ గోశెట్టి నిషాంత్‌తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి రెండు నెలల క్రితం ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇంట్లో పూజ ఉంది రమ్మని వారం క్రితం తండ్రి నుంచి ఫోన్ రావడంతో నిషాంత్ ఊరికి వెళ్లొస్తానని చెప్పివెళ్లాడు. హిజ్రాను వివాహం చేసుకున్నాడని తల్లిదండ్రులకు తెలిసి కొడుకును తిరిగి హైదరాబాద్ రానివ్వలేదు. నిషాంత్ విషయాన్ని స్వప్నకు ఫోన్ చేసి చెప్పాడు. ఆదివారం ఆమె వాళ్ల ఊరికి వెళ్లి చూడగా ఇంటికి తాళం ఉంది. దీంతో నిడమనూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిషాంత్, వారి తల్లిదండ్రులను పిలిపించగా స్వప్న తనకు ఇష్టం లేదని చెప్పడంతో మనస్తాపానికి గురైంది. రాత్రి నందనవనంలోని రూమ్‌కి వచ్చింది. సోమవారం ఉదయం ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహేందర్‌రెడ్డి, ఎస్ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు. చదవండి: (పిల్లలను ఇంట్లో వదిలి వివాహిత అదృశ్యం) -
గోల్డు స్మగ్లింగ్ ఉగ్రవాద చర్యే, వారికి బెయిల్ ఇవ్వొద్దు
కొచ్చీ: బంగారాన్ని అక్రమంగా దిగుమతి చేయడం దేశ భద్రత, ఆర్థిక స్థిరత్వానికి ముప్పేనని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) కేరళ హైకోర్టుకు తెలియజేసింది. 2019 నవంబర్ నుంచి 2020 జూన్ వరకు స్వప్నా సురేష్‌తోపాటు మరికొందరు యూఏఈ నుంచి 167 కిలోల బంగారాన్ని భారత్‌లోకి అక్రమంగా రవాణా చేశారని, వారిది ముమ్మాటికీ ఉగ్రవాద చర్యేనని తేల్చిచెప్పింది. గోల్డు స్మగ్లింగ్ కోసం ‘దౌత్య’ మార్గాలను ఉపయోగించుకున్నారని, ఈ వ్యవహారం భారత్–యూఏఈ మధ్య సంబంధాలను దెబ్బతీస్తుందని తెలిసి కూడా తప్పుడు పనికి పాల్పడ్డారని ఆక్షేపించింది. ఈ నేరం చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం(యూఏపీఏ) కిందకు వస్తుందని ఎన్ఏఐ స్పష్టం చేసింది. స్వప్నాసురేష్‌తోపాటు ఇతర నిందితులకు ఎట్టిపరిస్థితుల్లోనూ బెయిల్ మంజూరు చేయొద్దని న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. స్వప్నా సురేష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను ఎన్ఐఏ కోర్టు గతంలోనే కొట్టివేసింది. ఈ మేరకు ఉత్తర్వు జారీ చేసింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ స్వప్నాసురేష్ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ ఎన్ఐఏ శుక్రవారం కేరళ హైకోర్టులో తన వాదనలు వినిపించింది. బంగారం స్మగ్లింగ్ కోసం నిందితురాలు పెద్ద కుట్ర పన్నారని, కొందరు వ్యక్తులను నియమించుకొని, ఉగ్రవాద ముఠాను తయారు చేశారని ఆక్షేపించింది. నిధులు సేకరించి మరీ 167 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నారని గుర్తుచేసింది. ఇందుకోసం తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్ జనరల్ కార్యాలయ దౌత్యవేత్తల పేర్లను వాడుకున్నారని తెలిపింది. నిందితులను బెయిల్‌పై విడుదల చేస్తే దర్యాప్తుపై అది తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని వెల్లడించింది. గత ఏడాది జూలై 5న తిరువనంతపురం ఎయిర్‌పోర్టులో 15 కిలోల బంగారం పట్టుబడిన సంగతి తెలిసిందే. యూఏఈ కాన్సులేట్ చిరునామాతో వచ్చిన సంచిలో ఈ బంగారం దొరికింది. అధికారులు తీగ లాగడంతో స్వప్నా సురేష్‌తో సహా మొత్తం ఏడుగురు నిందితులు మొత్తం 167 కిలోల బంగారాన్ని యూఏఈ నుంచి స్మగ్లింగ్ చేసినట్లు తేలింది. -
'అన్నీ మంచి శకునములే' అంటోన్న నందినీ రెడ్డి
'ఏక్ మినీ కథ' సినిమాతో హిట్ కొట్టిన కుర్ర హీరో సంతోష్ శోభన్. ఈ మూవీ సక్సెస్‌తో జోష్ మీదున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో క్రేజీ మూవీతో ముందుకు వస్తున్నాడు. నందినీ రెడ్డి దర్వకత్వంలో ఓ మూవీ సైన్ చేసినట్లు గతంలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రూమర్స్‌ను నిజం చేస్తూ నందినీ రెడ్డి ఈ ప్రాజెక్టును అఫిషియల్‌గా అనౌన్స్ చేసింది. తాను డైరెక్ట్ చేసిన ఓ బేబీ సినిమా రెండేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తన కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేయడం సంతోషంగా ఉందని నందినీ రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది. ఇక ఈ సినిమాకు 'అన్నీ మంచి శకునములే' అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్ . స్వప్న సినిమా, మిత్ర వింద మూవీస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. సంతోష్ శోభన్‌కు జంటగా మళవిక నాయర్ హీరోయిన్గా నటించనుంది. మిక్కీ జె మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే హీరో సంతోష్ శోభన్.. మారుతి దర్శకత్వంలో ఓ ప్రాజెక్టుకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. మెహ్రీన్ హీరోయిన్గా నటించనుంది. -
ఓటీటీలోకి ఆర్జీవీ.. మే15న తొలి సినిమా స్ట్రీమింగ్
కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఓటీటీ బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ ప్లాట్‌ఫాంలకు ఆదరణ బాగా పెరిగిపోయింది. మహమ్మారి వల్ల ప్రజలు థియేటర్లకు వెళ్లేందుకు జంకుతు ఇంట్లోనే చిన్న స్క్రీన్‌పై సినిమా చూసేందుకు ఆసక్తి చూపడంతో కొత్తకొత్త ఓటీటీ యాప్‌లు పుట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఓటీటీ బాట పట్టాడు. వ్యాపారవేత్త సాగర్ మచనూరు ఆరంభించిన స్పార్క్ అనే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోని ఓ థియేటర్లో ఆర్జీవీ సినిమాలు విడుదల అవుతాయి. తొలి సినిమాగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘డీ-కంపెనీ’ మే 15న ఇందులో స్ట్రీమింగ్ కానుంది. ఓటీటీలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆర్జీవీకి దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి సురేశ్ బాబు, పూరి జగన్నాథ్, మంచు లక్ష్మీ, అడవి శేషు, బాలీవుడ్ హీరో రిషితేష్ దేశ్ముఖ్తో సహా పలువురు హీరో హీరోయిన్లు, నటీనటులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఇప్పటికే తెలుగులో ఆహా పేరుతో నిర్మాత అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫాంను స్థాపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ సైతం కొత్తగా ఓటీటీ సంస్థలను స్థాపించాలని సన్నాహాలు చేస్తునట్లు టాలీవుడ్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.