కీసర, న్యూస్‌లైన్: నాగారం, దమ్మాయిగూడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరిరోజు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. నాగారం గ్రామంలో మంగళవారం కౌకుట్ల అనంతరెడ్డి, అన్నంరాజు అర్చన సర్పంచ్‌కు నామినేషన్లు దాఖలు చేశారు. 49 మంది వార్డు స్థానాలకు నామినేషన్లు సమర్పించారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 13 నామినేషన్లు, 18 వార్డు స్థానాలకు గాను 154 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి మధుసుదన్ తెలిపారు. బుధవారం నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు.
దమ్మాయిగూడలో...
దమ్మాయిగూడలో మొత్తం 83 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం సర్పంచ్ స్థానానికి ఇండిపెండెంట్‌గా స్వప్న నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 3 నామినేషన్లు, 16 వార్డు స్థానాలకు గాను 80 నామినేషన్లు అందినట్లు ఎన్నికల అధికారి కె.శ్రీనివాస్ తెలిపారు.
జవహర్‌నగర్‌లో మొత్తం 276 నామినేషన్లు
జవహర్‌నగర్: జవహర్‌నగర్‌లో మంగళవారం చివరిరోజు వివిధ పార్టీల నాయకులు తమ అభ్యర్థులతో కలిసి పెద్ద ఎత్తున బ్యాండ్‌మేలాలతో వెళ్లి నామినేషన్లు వేశారు. జవహర్‌నగర్ దళిత నాయకుడు యాకస్వామి వార్డు అభ్యర్థులతో కలిసి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయగా, టీడీపీ సర్పంచ్ అభ్యర్థి వెంకటాపురం రాంచందర్ (చందు) టీడీపీ రాష్ట్ర నాయకుడు మల్లారెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి నక్క ప్రభాకర్‌గౌడ్, గ్రామ నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించి వార్డు అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేశారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 23 మంది, 20 వార్డులకు గాను 253 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
శంషాబాద్‌లో...
శంషాబాద్: శంషాబాద్ మేజర్ గ్రామపంచాయతీ నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగిసింది. మొత్తం 20 వార్డులకుగాను 162 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ స్థానానికి మొత్తం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. వార్డు సభ్యులకు తీవ్ర పోటీ నెలకొంది. 1వార్డు జనరల్ స్థానానికి అత్యధికంగా 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 2వ వార్డులో 14 నామినేషన్లు దాఖలయ్యాయి.
టీడీపీ నేత నామినేషన్
టీడీపీ బలపర్చిన అభ్యర్థిగా ఆ పార్టీ నాయకుడు రాచమల్ల దాసు జనసందోహంతో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు ఆర్. గణేష్‌గుప్తా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుక్కవేణుగోపాల్, తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీపామల్లేష్, ఎంపీటీసీ అభ్యర్థులు డి. వెంకటేష్‌గౌడ్, వై.సురేష్‌గౌడ్, జహంగీర్‌ఖాన్.వై కుమార్ తదితరులున్నారు.
ముగిసిన పంచాయతీ నామినేషన్ల ఘట్టం
Published Tue, Apr 1 2014 11:46 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement