K.srinivas
-
మార్కెట్ ఫీజు వసూలు లక్ష్యం రూ.20 కోట్లు
నెల్లూరు(అగ్రికల్చర్): వ్యవసాయ మార్కెట్ కమిటీలకు రావాల్సిన సెస్ వసూలుపై దృష్టిపెడుతున్నామని, ఈ ఏడాది రూ.20కోట్లు లక్ష్యంగా నిర్దేశించినట్లు వ్యవసాయ మార్కెటింగ్ రీజినల్ జాయింట్ డెరైక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక ఏసీ కూరగాయల మార్కెట్ సమీపంలోని ఆ శాఖ ఏడీఎం కార్యాలయంలో అధికారులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014-15 సంవత్సరానికి జిల్లాలోని 11 మార్కెట్ కమిటీలకు రూ.19 కోట్లు లక్ష్యం నిర్దేశించగా ఇప్పటివరకు రూ.13 కోట్లు వసూలైనట్లు తెలిపారు. వీలైనంతవరకు మార్చి 31లోపు వసూళ్లు పూర్తిచేయాలని ఆదేశించామన్నారు. అదేవిధంగా 2015-16 లక్ష్యం రూ.20కోట్లుగా నిర్దేశించినట్లు తెలిపారు. జిల్లాలో అధిక సెస్ వరిపంటపై వస్తుందన్నారు. ఈ ఏడాది సుబాబుల్, యూకలిప్టస్ కర్రలు 77 వేలటన్నుల ఉత్పత్తి కాగా రూ.33 లక్షలు ఫీజు కమిటీలకు వచ్చిందన్నారు. ఈ పంటలను సాగు చేసే రైతులు సంబంధిత పత్రాలతో మార్కెట్ కమిటీల గుర్తింపు కార్డులను పొందాలని సూచించారు. రొయ్యలను స్థానికంగా విక్రయించాలంటే రూ.0.50, ఎగుమతికి రూ.0.25 మార్కెట్ సెస్ చెల్లించాలన్నారు. మార్కెట్ కమిటీలకు అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలను తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపుతున్నట్లు తెలిపారు. వసూలు అయిన ఫీజులో 20 శాతం యార్డులలో రైతులకు మౌలిక వసతుల కల్పనకు, మిగతా మొత్తం రైతుబంధు పథకం రుణ మంజూరుకు, ఇతర అవసరాలకు ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర లభించేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్ట్టం చేశారు. ఇప్పటికే ధాన్యం మద్దతు ధరను నిర్ణయించినట్లు తెలిపారు. వరి ఏ గ్రేడు రకానికి క్వింటాల్‌కు రూ.1400, సాధారణ రకానికి రూ.1360, కందికి రూ.4350, పెసరకు రూ.4600, మినుముకు రూ.4350, శనగకు రూ.3100, సుబాబుల్ టన్ను రూ.4400, యూకలిప్టస్ టన్ను రూ.4600గా మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మద్దతు ధర లభించని రైతులు ధాన్యాన్ని గోదాములలో నిల్వ చేసుకుని, ధాన్యం విలువలో 75 శాతం రుణంగా రైతుబంధు పథకంలో అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ రుణానికి ఆరు నెలల కాలపరిమితికి వడ్డీ లేదని, ఆ తరువాత 12 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ పథకంలో రుణ మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచినట్లు చెప్పారు. నాయుడుపేట, కోవూరు, కావలి, సూళ్లూరుపేట, వాకాడు మార్కెట్ కమిటీల పరిధిలో రూ.3.5కోట్ల రుణాలను మంజూరు చేశామన్నారు. ఏడీఎం అనితాకుమారి, నెల్లూరు సెక్రటరీ గౌష్‌బాషా, చాముండేశ్వరి పాల్గొన్నారు. -
ముగిసిన పంచాయతీ నామినేషన్ల ఘట్టం
కీసర, న్యూస్‌లైన్: నాగారం, దమ్మాయిగూడ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం నామినేషన్ల ఘట్టం ముగిసింది. చివరిరోజు జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. నాగారం గ్రామంలో మంగళవారం కౌకుట్ల అనంతరెడ్డి, అన్నంరాజు అర్చన సర్పంచ్‌కు నామినేషన్లు దాఖలు చేశారు. 49 మంది వార్డు స్థానాలకు నామినేషన్లు సమర్పించారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 13 నామినేషన్లు, 18 వార్డు స్థానాలకు గాను 154 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి మధుసుదన్ తెలిపారు. బుధవారం నామినేషన్ల పరిశీలన ఉంటుందన్నారు. దమ్మాయిగూడలో... దమ్మాయిగూడలో మొత్తం 83 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం సర్పంచ్ స్థానానికి ఇండిపెండెంట్‌గా స్వప్న నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 3 నామినేషన్లు, 16 వార్డు స్థానాలకు గాను 80 నామినేషన్లు అందినట్లు ఎన్నికల అధికారి కె.శ్రీనివాస్ తెలిపారు. జవహర్‌నగర్‌లో మొత్తం 276 నామినేషన్లు జవహర్‌నగర్: జవహర్‌నగర్‌లో మంగళవారం చివరిరోజు వివిధ పార్టీల నాయకులు తమ అభ్యర్థులతో కలిసి పెద్ద ఎత్తున బ్యాండ్మేలాలతో వెళ్లి నామినేషన్లు వేశారు. జవహర్‌నగర్ దళిత నాయకుడు యాకస్వామి వార్డు అభ్యర్థులతో కలిసి సర్పంచ్ స్థానానికి నామినేషన్ వేయగా, టీడీపీ సర్పంచ్ అభ్యర్థి వెంకటాపురం రాంచందర్ (చందు) టీడీపీ రాష్ట్ర నాయకుడు మల్లారెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి నక్క ప్రభాకర్‌గౌడ్, గ్రామ నాయకులతో భారీ ర్యాలీ నిర్వహించి వార్డు అభ్యర్థులతో కలిసి నామినేషన్ వేశారు. మొత్తం సర్పంచ్ స్థానానికి 23 మంది, 20 వార్డులకు గాను 253 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. శంషాబాద్‌లో... శంషాబాద్: శంషాబాద్ మేజర్ గ్రామపంచాయతీ నామినేషన్ల స్వీకరణ మంగళవారంతో ముగిసింది. మొత్తం 20 వార్డులకుగాను 162 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సర్పంచ్ స్థానానికి మొత్తం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. వార్డు సభ్యులకు తీవ్ర పోటీ నెలకొంది. 1వార్డు జనరల్ స్థానానికి అత్యధికంగా 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 2వ వార్డులో 14 నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ నేత నామినేషన్ టీడీపీ బలపర్చిన అభ్యర్థిగా ఆ పార్టీ నాయకుడు రాచమల్ల దాసు జనసందోహంతో అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలలో ర్యాలీ నిర్వహించిన అనంతరం పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ సమర్పించారు. ఆయన వెంట తెలుగుయువత జిల్లా అధ్యక్షుడు ఆర్. గణేష్‌గుప్తా, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుక్కవేణుగోపాల్, తెలుగుమహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దీపామల్లేష్, ఎంపీటీసీ అభ్యర్థులు డి. వెంకటేష్‌గౌడ్, వై.సురేష్‌గౌడ్, జహంగీర్‌ఖాన్.వై కుమార్ తదితరులున్నారు. -
రన్నరప్ శ్రీనివాస్
విశాఖపట్నం, న్యూస్‌లైన్: జాతీయ ఇంటర్ స్టేట్ క్యారమ్ చాంపియన్‌షిప్ పురుషుల విభాగంలో కె.శ్రీనివాస్ రన్నరప్‌గా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీనివాస్ పీఎస్పీబీకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. స్థానిక కేపీఆర్ కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం జరిగిన ఫైనల్లో శ్రీనివాస్ 10-23, 15-11, 10-20తో యోగేశ్ డోంగ్రే (విదర్భ) చేతిలో పరాజయం పొందాడు. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో రియాజ్ అక్బర్ అలీ (ఎయిరిండియా) 25-10, 10-25, 25-2తో ఎండీ గుఫ్రాన్ (ఎయిరిండియా)పై విజయం సాధించాడు. మహిళల విభాగం ఫైనల్లో రష్మీ కుమారి (పీఎస్‌పీబీ) 19-12, 24-2తో వినీత (పీఎస్‌పీబీ)పై నెగ్గి టైటిల్ దక్కించుకుంది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో కవిత సోమంచి (ఆర్బీఐ) 22-25, 25-22, 25-14తో తూబా సెహర్పై గెలిచింది. వెటరన్ పురుషుల విభాగంలో బాలకోటయ్య (తమిళనాడు) 16-23, 25-12తో బాబులాల్ శ్రీమల్ (మహారాష్ట్ర)పై నెగ్గి టైటిల్ సాధించాడు. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో నరేష్ రాథోడ్ (ఎంపీఎస్సీబీ) జేఐకు చెందిన అన్సార్ సలీం అక్బర్‌పై గెలుపొందాడు. వెటరన్ మహిళల విభాగం ఫైనల్లో శోభా కామత్ (మహారాష్ట్ర) 25-10, 24-4తో ప్రభా నాయుడు (చండీగఢ్)ను ఓడించి ప్రథమ స్థానంలో నిలిచింది. మరోవైపు పార్వతి రమాభట్ (కర్ణాటక) 25-0, 24-4తో వీఎస్ దేశ్కర్ (ఆర్బీఐ)పై నెగ్గి మూడో స్థానంలో నిలిచింది. -
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏర్పాటు
హైదరాబాద్, న్యూస్‌లైన్: తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ఏర్పాటైంది. రాష్ట్ర విభజన ఖరారైనందున తెలంగాణ యూనియాన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ సంఘాన్ని(టీయూడబ్ల్యూజే) ఏర్పాటు చేసినట్లు ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్ తెలిపారు. ఇది ఐజేయూకు అనుబంధంగా పనిచేస్తుందని చెప్పారు. ఆదివారమిక్కడ బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో దేవులపల్లి అమర్ ఈ వివరాలు వెల్లడించారు. సంఘం నేతలు వీరే..: టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శిగా కె.విరహత్ అలీ, అధ్యక్షుడిగా నంగనూరి శేఖర్, 10 జిల్లాల నుంచి 25 మంది సభ్యులను ఎంపిక చేసినట్లు అమర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం టీయూడబ్ల్యూజే సంఘాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఏపీయూడబ్ల్యూజే, టీయూడబ్ల్యూజే కలసి పాత్రికేయుల సంక్షేమం కోసం పనిచేస్తాయని చెప్పారు. ఈ సమావేశంలో ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు కె.అమర్నాథ్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సోమసుందర్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఎక్సైజ్’ మెరుపుదాడులు
బిట్రగుంట, న్యూస్‌లైన్: బోగోలు మం డలం కప్పరాళ్లతిప్పలోని సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్‌అండ్ ప్రొహిబిషన్‌శాఖ సూపరింటెండెంట్ కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడిషనల్ సూపరింటెండెంట్ రవికుమార్‌రెడ్డి సహా ఏడుగురు సీఐలు, 80 మంది సిబ్బంది సుమారు నాలుగు గంటల పాటు తిప్పను జల్లెడ పట్టారు. తెల్లవారు జామున 5.45 నుంచి ఉద యం 10 గంటల వరకూ అణువణువూ గాలించారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న 2 వేల లీటర్ల సారా ఊటను ధ్వం సం చేయడంతో పాటు 70 లీటర్ల కాపుసారాను స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బట్టీలను ధ్వంసం చేశారు. సారా తయారీకి విని యోగించే పాత్రలు, ప్లాస్టిక్ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎక్సైజ్ యంత్రాంగమంతా పదికి పైగా వాహనాల్లో వచ్చి మునుపెన్నడూ లేని విధం గా తిప్పలో మోహరించడంతో స్థానికం గా కలకలం నెలకొంది. ముందస్తు స మాచారం, పక్కా వ్యూహంతో వేకువనే తిప్పకు చేరుకున్న అధికారులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించారు. అ నుమానితుల ఇళ్లు, సారా స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేయడంతో త యారీదారులు సరుకును వది లేసి పరారయ్యారు. ఊటను ధ్వంసం చేసి సారాను స్వాధీనం చేసుకున్న తరువాత అధికారులు స్థానికులతో చర్చిం చా రు. సారా తయారీదారుల జాబితా అంతా తమ వద్ద ఉందని నిందితులు తప్పించుకునే అవకాశమే లేదని స్ప ష్టం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ సారా తయారీ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులపై స్థానికులకు అవగాహన కలిగించారు. స్వచ్ఛందంగా సారా తయారీకి స్వస్తి పలకాలని సూచించారు. అధికారుల హెచ్చరికలు పెడ చెవిన పెట్టి సారా తయారీని కొనసాగిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట కావలి ఎక్సైజ్ సీఐ రామారావు, పలువురు సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు. -
క్యారమ్ ‘చాంపియన్’ శ్రీనివాస్
గుర్గావ్: ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కె. శ్రీనివాస్ అంతర్జాతీయ క్యారమ్ టోర్నీలో మెరిశాడు. బుధవారం ఇక్కడ ముగిసిన ‘చాంపియన్ ఆఫ్ చాంపియన్స్’ అంతర్జాతీయ టోర్నీలో అతను విజేతగా నిలిచాడు. ఫైనల్లో శ్రీనివాస్ (భారత్) 13-25, 25-22, 25-14 స్కోరుతో చామిల్ కూరే (శ్రీలంక)పై విజయం సాధించాడు. ప్రస్తుత జాతీయ చాంపియన్ కూడా అయిన 20 ఏళ్ల శ్రీనివాస్, తాను పాల్గొన్న ఏడో అంతర్జాతీయ టోర్నీలో తొలిసారి టైటిల్ దక్కించుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో మొదటి గేమ్ 9 బోర్డుల పాటు సాగింది. ఆరంభంలో ఇద్దరూ సమ ఉజ్జీలుగా నిలిచినా నాలుగో బోర్డు తర్వాత చామిల్ ఒక్కసారిగా దూసుకుపోగా, శ్రీనివాస్ వెనుకబడిపోయాడు. రెండో గేమ్ 11 బోర్డులు కొనసాగింది. 9వ బోర్డు ముగిసే సరికి 23-22తో ఆధిక్యంలో నిలిచిన భారత ఆటగాడు, తర్వాతి రెండు బోర్డులు నెగ్గి గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో గేమ్‌లో పూర్తిగా శ్రీనివాస్ జోరు కొనసాగింది. చివరకు పదో బోర్డును గెలుచుకొని చాంపియన్‌గా అవతరించాడు. అంతకు ముందు జరిగిన సెమీ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ నిషాంత (శ్రీలంక)ను శ్రీనివాస్ 25-14, 25-16తో చిత్తు చేయడం విశేషం. మహిళల విభాగంలో వరల్డ్ చాంపియన్ రష్మీ కుమారి (భారత్) టైటిల్ సాధించింది. ఫైనల్లో ఆమె 22-08, 23-04తో ఎస్. ఇలవజకి (భారత్)పై ఘన విజయం సాధించింది.