బిట్రగుంట, న్యూస్‌లైన్: బోగోలు మం డలం కప్పరాళ్లతిప్పలోని సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్‌అండ్ ప్రొహిబిషన్‌శాఖ సూపరింటెండెంట్ కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడిషనల్ సూపరింటెండెంట్ రవికుమార్‌రెడ్డి సహా ఏడుగురు సీఐలు, 80 మంది సిబ్బంది సుమారు నాలుగు గంటల పాటు తిప్పను జల్లెడ పట్టారు. తెల్లవారు జామున 5.45 నుంచి ఉద యం 10 గంటల వరకూ అణువణువూ గాలించారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న 2 వేల లీటర్ల సారా ఊటను ధ్వం సం చేయడంతో పాటు 70 లీటర్ల కాపుసారాను స్వాధీనం చేసుకున్నారు.
పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బట్టీలను ధ్వంసం చేశారు. సారా తయారీకి విని యోగించే పాత్రలు, ప్లాస్టిక్ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎక్సైజ్ యంత్రాంగమంతా పదికి పైగా వాహనాల్లో వచ్చి మునుపెన్నడూ లేని విధం గా తిప్పలో మోహరించడంతో స్థానికం గా కలకలం నెలకొంది. ముందస్తు స మాచారం, పక్కా వ్యూహంతో వేకువనే తిప్పకు చేరుకున్న అధికారులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించారు. అ నుమానితుల ఇళ్లు, సారా స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేయడంతో త యారీదారులు సరుకును వది లేసి పరారయ్యారు.
ఊటను ధ్వంసం చేసి సారాను స్వాధీనం చేసుకున్న తరువాత అధికారులు స్థానికులతో చర్చిం చా రు. సారా తయారీదారుల జాబితా అంతా తమ వద్ద ఉందని నిందితులు తప్పించుకునే అవకాశమే లేదని స్ప ష్టం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ సారా తయారీ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులపై స్థానికులకు అవగాహన కలిగించారు. స్వచ్ఛందంగా సారా తయారీకి స్వస్తి పలకాలని సూచించారు. అధికారుల హెచ్చరికలు పెడ చెవిన పెట్టి సారా తయారీని కొనసాగిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట కావలి ఎక్సైజ్ సీఐ రామారావు, పలువురు సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.
‘ఎక్సైజ్’ మెరుపుదాడులు
Published Sun, Dec 8 2013 5:44 AM | Last Updated on Wed, Apr 3 2019 5:51 PM
Advertisement
Advertisement