sudden checking
-
చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు, ఇద్దరి అరెస్ట్
తిరుపతి: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లురు మండలం తానా చెక్ పోస్టుపై ఏసీబీ దాడులు నిర్వహిస్తోంది. ఆ చెక్ పోస్ట్ వద్ద ఉన్న ఉద్యోగులు, కొందరు అనుమానితులను తనిఖీ చేశారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చెక్ పోస్ట్ వద్ద అనధికారికంగా ఉన్న రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వాటీజ్ దిస్
డీఆర్ఓపై జేసీ రజత్‌కుమార్ చిర్రుబుర్రు ►కలెక్టరేట్లో పోస్టర్లు, గోడరాతలపై గరం ►సాయంత్రం వేళ ఆకస్మిక తనిఖీ సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ‘వాటీజ్ దిస్. ఎన్నిసార్లు చెప్పాలండీ. గోడలపై ఈ రాతలేమిటీ? అడ్డదిడ్డంగా ఆ వాహనాల పార్కింగే ంటీ? మెయిన్ గేట్ ముందు బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పాగా, ఇప్పటివరకు ఎందుకు చేయలేదు. ఐయామ్ సారీ. మీ పద్ధతి బాగాలేదండి’ అని జాయింట్ కలెక్టర్-1 రజత్‌కుమార్ సైనీ మంగళవారం జిల్లా రెవెన్యూ అధికారి సూర్యారావుపై చిర్రుబుర్రులాడారు. సాయంత్రం వేళ ఆకస్మికంగా కలెక్టరేట్ ఆవరణను పరిశీలించిన జేసీ.. పరిశుభ్రత పాటించకపోవడంపై డీఆర్ఓ సహా ‘బీ’సెక్షన్ సూపరింటెండెంట్ నర్సింహరావుకు క్లాస్ తీసుకున్నారు. గోడలపై కార్యాలయాల పేర్లు ఉండడం, ప్రధాన గేటు ముందర అటవీ వస్తువుల విక్రయానికి సంబంధించిన ఫ్లెక్సీలు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ‘స్నేహా’ బిల్డింగ్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో తుప్పుపట్టిన వాటిని ఇంకా తొలిగించకపోవడంపై చిరాకు పడ్డారు. కొత్త బోర్డు ఏర్పాటు చేయమని ఎన్నిసార్లు చెప్పాలండీ. ఎందుకు ఆలస్యం చేస్తున్నారో నాకర్థం కావడంలేదని పెదవివిరిచారు. -
పీహెచ్సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
నిర్మల్(మామడ), న్యూస్‌లైన్ : మామడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అహ్మద్ బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. సీనియర్ అసిస్టెంట్ నిసార్ అహ్మద్ రిజిష్టర్‌లో సంతకం చేసి ఆస్పత్రిలో లేకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించారు. నిర్మల్ ఎస్టీవో కార్యాలయానికి వెళ్తున్నాడని చెప్పడంతో కలెక్టర్ అక్కడికి ఫోన్ చేశారు. అక్కడికి రాలేదని చెప్పడంతో సీనియర్ అసిస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండర్ ముత్తన్న సెలవు పత్రం లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై మండిపడ్డారు. మహిళా ఆరోగ్య పర్యవేక్షకురాలు అరుంధతి శుక్రవారమూ కూడా రిజిష్టర్‌లో సంతకం చేసి ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. నిర్వహణ తీరుపై అసంతృప్తి ఆరోగ్య కేంద్రం నిర్వహణ తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసూతి కేసులు ఎందుకు నమోదు కావడం లేదని ప్రశ్నించారు. పనితీరు మెరుపడాలని వైద్యులు సందీప్, శంభులకు సూచించారు. అనంతరం మండల పరిషత్ కా ర్యాలయంలో అధికారులతో సమావేశమయ్యా రు. ఉపాధి హామీ కార్యాలయం తనిఖీ చేసి కూలీలు, జాబ్‌కార్డుల వివరాలపై ఏపీవో జయదేవ్‌ను అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్ కార్యాలయ రికార్డులు పరిశీలించారు. మ్యూటేషన్లు తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారి కుమారస్వామి, తహశీ ల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో పాల్గొన్నారు. -
‘ఎక్సైజ్’ మెరుపుదాడులు
బిట్రగుంట, న్యూస్‌లైన్: బోగోలు మం డలం కప్పరాళ్లతిప్పలోని సారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు శనివారం మెరుపు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్‌అండ్ ప్రొహిబిషన్‌శాఖ సూపరింటెండెంట్ కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో అడిషనల్ సూపరింటెండెంట్ రవికుమార్‌రెడ్డి సహా ఏడుగురు సీఐలు, 80 మంది సిబ్బంది సుమారు నాలుగు గంటల పాటు తిప్పను జల్లెడ పట్టారు. తెల్లవారు జామున 5.45 నుంచి ఉద యం 10 గంటల వరకూ అణువణువూ గాలించారు. సారా తయారీకి సిద్ధంగా ఉన్న 2 వేల లీటర్ల సారా ఊటను ధ్వం సం చేయడంతో పాటు 70 లీటర్ల కాపుసారాను స్వాధీనం చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన బట్టీలను ధ్వంసం చేశారు. సారా తయారీకి విని యోగించే పాత్రలు, ప్లాస్టిక్ డ్రమ్ములు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎక్సైజ్ యంత్రాంగమంతా పదికి పైగా వాహనాల్లో వచ్చి మునుపెన్నడూ లేని విధం గా తిప్పలో మోహరించడంతో స్థానికం గా కలకలం నెలకొంది. ముందస్తు స మాచారం, పక్కా వ్యూహంతో వేకువనే తిప్పకు చేరుకున్న అధికారులు పకడ్బందీగా తనిఖీలు నిర్వహించారు. అ నుమానితుల ఇళ్లు, సారా స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేయడంతో త యారీదారులు సరుకును వది లేసి పరారయ్యారు. ఊటను ధ్వంసం చేసి సారాను స్వాధీనం చేసుకున్న తరువాత అధికారులు స్థానికులతో చర్చిం చా రు. సారా తయారీదారుల జాబితా అంతా తమ వద్ద ఉందని నిందితులు తప్పించుకునే అవకాశమే లేదని స్ప ష్టం చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ సారా తయారీ కారణంగా ఎదురయ్యే ఇబ్బందులపై స్థానికులకు అవగాహన కలిగించారు. స్వచ్ఛందంగా సారా తయారీకి స్వస్తి పలకాలని సూచించారు. అధికారుల హెచ్చరికలు పెడ చెవిన పెట్టి సారా తయారీని కొనసాగిస్తే పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట కావలి ఎక్సైజ్ సీఐ రామారావు, పలువురు సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.