నిర్మల్(మామడ), న్యూస్‌లైన్ : మామడ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ అహ్మద్ బాబు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులు పరిశీలించారు. సీనియర్ అసిస్టెంట్ నిసార్ అహ్మద్ రిజిష్టర్‌లో సంతకం చేసి ఆస్పత్రిలో లేకపోవడంతో సిబ్బందిని ప్రశ్నించారు. నిర్మల్ ఎస్టీవో కార్యాలయానికి వెళ్తున్నాడని చెప్పడంతో కలెక్టర్ అక్కడికి ఫోన్ చేశారు. అక్కడికి రాలేదని చెప్పడంతో సీనియర్ అసిస్టెంట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండర్ ముత్తన్న సెలవు పత్రం లేకుండా విధులకు గైర్హాజరు కావడంపై మండిపడ్డారు. మహిళా ఆరోగ్య పర్యవేక్షకురాలు అరుంధతి శుక్రవారమూ కూడా రిజిష్టర్‌లో సంతకం చేసి ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
నిర్వహణ తీరుపై అసంతృప్తి
ఆరోగ్య కేంద్రం నిర్వహణ తీరుపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రసూతి కేసులు ఎందుకు నమోదు కావడం లేదని ప్రశ్నించారు. పనితీరు మెరుపడాలని వైద్యులు సందీప్, శంభులకు సూచించారు. అనంతరం మండల పరిషత్ కా ర్యాలయంలో అధికారులతో సమావేశమయ్యా రు. ఉపాధి హామీ కార్యాలయం తనిఖీ చేసి కూలీలు, జాబ్‌కార్డుల వివరాలపై ఏపీవో జయదేవ్‌ను అడిగి తెలుసుకున్నారు. తహశీల్దార్ కార్యాలయ రికార్డులు పరిశీలించారు. మ్యూటేషన్లు తక్కువగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకాధికారి కుమారస్వామి, తహశీ ల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో పాల్గొన్నారు.
పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
Published Fri, Jan 10 2014 2:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement