Primary Health Center
-
వాట్సప్ లో లంచాల దందా..
-
బైక్ హెల్మెట్ ధరించి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్.. ఎందుకంటే..
భువనేశ్వర్: ఒడిశాలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక డాక్టర్ హెల్మెట్ ధరించి పేషేంట్లకు ట్రీట్మెంట్ ఇస్తూ కనిపించారు. అంతకుముందు రోజున ఆ హాస్పిటల్ పైకప్పు నుండి పెళ్లలు ఊడి పడటమే అందుక్కారణమని చెబుతున్నారు అక్కడి సిబ్బంది. ఒడిశా బాలంగిర్ జిల్లా దండముండ హాస్పిటల్లో స్లాబు పెచ్చులు పెచ్చులుగా ఊడి కింద పడుతోంది. ఇదే ఆసుపత్రిలో కాంపౌండరుగా పనిచేస్తోన్న సుమంత నాయక్ సోమవారం పెద్ద ప్రమాదం నుండే తప్పించుకున్నాడు. ఖప్రాకోల్ బ్లాకులో విధులు నిర్వర్తిస్తుండగా తన పక్కన హఠాత్తుగా పైనుండి పెచ్చులు ఊడి పడ్డాయని తెలిపాడు. మెడికల్ వార్డులో తనతోపాటు మరికొంతమంది పేషేంట్లు ఉండగా ఈ సంఘటన జరిగిందని అదృష్టవశాత్తు తమకు ఏమీ కాలేదని, అందుకే బైక్ హెల్మెట్ ధరించే డ్యూటీకి రావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. అతడిలాగే ఆసుపత్రి సిబ్బందిలో చాలా మంది భయంతో హెల్మెట్లు ధరించి విధులకు హాజరయ్యారు. వారితోపాటే ఈ డాక్టర్ కూడా హెల్మెట్ ధరించుకుని పేషేంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ దర్శనమిచ్చారు. ఆయన కూర్చున్న పైభాగంలో కూడా స్లాబు పెచ్చు ఊడిపోయిన దృశ్యం వీడియోలో చూడవచ్చు. ఇక్కడే ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తోన్న బాలకృష్ణ పురోహిత్ మాట్లాడుతూ.. సరైన మెయింటెనెన్స్ లేక బిల్డింగ్ శిథిలావస్థకు వచ్చిందని పై అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని, ఇదే నిర్లక్ష్యం కొనసాగితే రాను రాను మరింత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొంటాయని అన్నారు. ఇక్కడి సిబ్బంది మాట్లాడుతూ ఐదేళ్ల క్రితమే నిర్మించిన అవుట్ పేషేంట్ వార్డులో పరిస్థితి మరీ దారుణంగా ఉందని.. నాసిరకమైన నిర్మాణం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇది కూడా చదవండి: అజిత్ పవార్ కట్టప్ప - శరద్ పవార్ బాహుబలి As seen in the infrastructural realities of rural #Odisha A doctor is shown treating patients inside a medical facility in Bolangir while donning a helmet out of fear of falling concrete from the floor. Numerous issues need to be brought up, but because to babus' carelessness,… pic.twitter.com/sA40Wc3Q1q — Sashmita Behera (@incsashmita) July 6, 2023 -
పీహెచ్‌సీల్లో సత్వర చికిత్సలు
సాక్షి, హైదరాబాద్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సత్వరంగా వైద్య చికిత్సలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. గతంలో పోల్చితే పీహెచ్‌సీల్లో మార్పు కనిపిస్తోందనీ ఇది మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పీహెచ్‌సీల్లో సమర్థవంతంగా వైద్య సేవలు అందించగలిగితే బోధనాసుపత్రులపై ఒత్తిడి తగ్గుతుందన్నారు. ప్రజలకు సేవ చేసే వైద్య సిబ్బందిని ప్రభుత్వం తప్పనిసరిగా గుర్తిస్తుందని హామీనిచ్చారు. సోమ వారం ఆయన అన్ని జిల్లాల వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశాలు, ఏఎన్ఎంలు మంచిగా పనిచేస్తున్నారని కొనియాడారు. గ్రా మాల పరిధిలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యంపై ఆశాలు, ఏఎన్ఎంలు అవగాహన పెంచుకోవాలని సూచించారు. త్వరలోనే గర్భిణీల కోసం న్యూట్రిషన్‌కిట్లను అందజేస్తామనీ, క్షేత్రస్థాయి వైద్యసిబ్బంది జాగ్రత్తగా పంపిణీ చేయాలని మంత్రి సూచించారు. కాగా, గర్భిణీలకు అందుతున్న వైద్యసేవల పై ఆరా తీసేందుకు మంత్రి హరీశ్‌రావు వీ డియో లేదా టెలీ కాన్ఫరెన్స్ పద్ధతిలో నేరు గా వారితో మాట్లాడాలని నిర్ణయించారు. -
సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ విధుల్లోకి..
కారంచేడు: కరోనా బాధితులకు వైద్యం చేస్తూ తానూ ఆ వ్యాధి బారిన పడి ఊపిరితిత్తులు దెబ్బతిని ప్రాణాపాయ స్థితిలో ఉన్న కారంచేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ నర్తు భాస్కరరావు సీఎం జగన్ సాయంతో చికిత్స చేయించుకుని ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి విధుల్లో చేరారు. గుంటూరు జిల్లా నల్లపాడు రీజినల్ ట్రైనింగ్ సెంటర్(ఆర్టీసీ)కి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఏపీ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ డి.రామిరెడ్డి నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన కోవిడ్–19 సమయంలో కారంచేడు పీహెచ్సీ నుంచి సుమారు 10 వేల కోవిడ్ టెస్ట్‌లు చేసి.. అదే కరోనా కోరలకు చిక్కి ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు. ఊపిరితిత్తుల మార్పిడి తప్పనిసరని, అందుకు సుమారు రూ.2 కోట్ల వరకూ ఖర్చవుతుందని హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ వైద్యులు చెప్పారు. దీంతో ఆయన భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి విజ్ఞప్తి మేరకు ఐఎంఏ వైద్యులు, ఐఆర్‌ఐఏ వైద్యులు, కార్డియాలజీ, అనస్థీషియా అసోసియేషన్, గుంటూరు మెడికల్ కాలేజ్ ఓల్డు స్టూడెంట్స్, కారంచేడుకు చెందిన ప్రజలు, ఎన్ఆర్ఐలు, అనేక మంది దాతల సహకారంతో సుమారు రూ.50 లక్షలు సిద్ధం చేశారు. డాక్టర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు అప్పటి మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్‌ల సహకారంతో సీఎంను కలిసి వైద్యానికి అయ్చే ఖర్చు విషయమై విజ్ఞప్తి చేయగా.. వెంటనే స్పందించిన సీఎం జగన్.. భాస్కరరావు వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. దీంతో వెంటనే ఆయనకు ప్రభుత్వం నుంచి విడుదలైన రూ.1.50 కోట్లతో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. అప్పటి నుంచి ఆయన వైద్యుల సూచనతో ఇంటి వద్దే ఉండి చికిత్స పొందుతున్నారు. ఈ నెల 21న తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలిపి, తాను మళ్లీ విధుల్లో చేరతానని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వెంటనే ఆయనకు ఉత్తర్వులు వెలువడ్డాయి. -
YSR Urban Health Clinics: పట్నవాసుల శ్రేయస్సుకు పట్టం
నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనేది ఒకప్పటి మాట. వైద్యులు ఉండేవారు కాదు. వసతులు శూన్యం. ఫలితంగా పేద రోగులు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడేవారు. కానీ వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారింది. ప్రజల ఆరోగ్యానికి సర్కారు అమిత ప్రాధాన్యం ఇస్తోంది. హాస్పిటళ్లలో అత్యాధునిక వసతులు సమకూర్చింది. దీనికితోడు ప్రతి 25 వేల మంది ప్రజలకు ఓ ప్రాథమిక కేంద్రం ఉండాలనే సదాశయంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కొత్తగా 50 వైఎస్సార్ అర్బన్ హెల్త్ సెంటర్లను మంజూరు చేసింది. ఇప్పటికే 32 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అర్బన్ పీహెచ్‌సీలుగా మార్చి స్పెషాలిటీ వైద్యం అందించేలా సకల సౌకర్యాలూ కల్పించింది. ఫలితంగా రోగులకు మెరుగైన సేవలందుతున్నాయి. గుంటూరు మెడికల్: సీఎంగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టగానే వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు. పట్టణ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో గుంటూరు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న 32 పట్టణ ఆరోగ్య కేంద్రాలను అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు(అర్బన్ పీహెచ్‌సీలు)గా మార్చారు. వీటిల్లో అన్ని వసతులనూ సమకూర్చారు. స్పెషాలిటీ వైద్యమూ అందించేలా చర్యలు చేపట్టారు. దీనికోసం స్పెషాలిటీ వైద్యుల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టింది. అన్ని కేడర్ల వైద్యసిబ్బంది నియామకాలనూ పూర్తిచేసింది. వీటిల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యసిబ్బంది ఉచిత సేవలు అందిస్తున్నారు. పట్టణంలో ప్రతి ఇంటికీ పది నిమిషాల నడక దూరంలో అర్బన్ హెల్త్ సెంటర్ ఉండాలనే లక్ష్యంతో ప్రతి 25వేల జనాభాకూ ఓ కేంద్రం చొప్పున ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 50 అర్బన్ పీహెచ్‌సీలను కొత్తగా ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవి కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. గుంటూరుకు మహర్దశ గుంటూరు నగరంలో గతంలో మంగళదాస్‌నగర్, ఎల్బీనగర్, ఐపీడీకాలనీ, శ్రీనివాసరావుతోట, ఎన్జీవో కాలనీ, మల్లికార్జునపేట, బొంగరాలబీడు, ఇజ్రాయిల్‌పేట, పాతగుంటూరు, లాంచస్టర్రోడ్, కేవీపీకాలనీ, తుఫాన్‌నగర్, గుండారావుపేలో మొత్తం 13 ఆరోగ్య కేంద్రాలు ఉండేవి. ప్రస్తుతం వాటిని ఆధునికీకరించడంతోపాటు కొత్తగా 17 అర్బన్ పీహెచ్‌సీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఆర్.అగ్రహారం, బృందావన్గార్డెన్స్, ముత్యాలరెడ్డినగర్, రాజీవ్‌గాంధీనగర్, శారదాకాలనీ, గుంటూరువారితోట, నాజ్‌సెంటర్, లాలాపేట, సుద్దపల్లిడొంక, రెడ్డిపాలెం, గోరంట్ల, అడవితక్కెళ్లపాడు, పెదపలకలూరు, నల్లపాడు, చౌడవరం, ఏటుకూరు, మారుతీనగర్‌లలో కొత్త ఆరోగ్య కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కొన్ని కేంద్రాలు నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక్కో ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి రూ.80 లక్షలు ప్రభుత్వం విడుదల చేసింది. వైద్యులు, వైద్య సిబ్బంది నియామకాలు పూర్తిచేసింది. రోగులు, వారి సహాయకులు కూర్చునేందుకు అవసరమైన కుర్చీలు, బల్లలు, కార్యాలయ నిర్వహణ కోసం అవసరమైన బీరువాలు సమకూర్చింది. ఆపరేషన్ లైట్స్, శస్త్రచికిత్సల టేబుళ్లతోపాటు మొత్తం 104 రకాల వైద్యపరికరాలను ఈ ఆరోగ్య కేంద్రాలకు పంపింది. ప్రతికేంద్రంలో ఆపరేషన్ థియేటర్ గతంలో 50వేల నుంచి 60వేల జనాభా ఉన్న ప్రాంతాలకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం ఉండేది. ఇప్పుడు 25వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేంద్రం ఏర్పాటు కానుంది. కిలో మీటరు నుంచి కిలో మీటరున్నర దూరంలో పది నిమిషాలు నడవగానే వైద్యశాల వచ్చేలా ఈ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒక్కో కేంద్రంలో మెడికల్ ఆఫీసర్, ఇద్దరు స్టాఫ్‌నర్సులు, ఒక ఫార్మాసిస్టు, ఒక ల్యాబ్‌టెక్నీషియన్, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, 4వ తరగతి ఉద్యోగి ఉండేలా నియామకాలు చేపట్టింది. స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు చెవి, ముక్కు, గొంతు వైద్యులు, మానసిక వ్యాధి నిపుణులు, చర్మవ్యాధి నిపుణులు, ప్రసూతి వైద్య నిపుణులు, ఎముకలు, కీళ్ల వైద్య నిపుణులు, జనరల్ సర్జరీ వైద్య నిపుణులనూ నియమించింది. ప్రతి కేంద్రంలో ఆపరేషన్ థియేటర్ ఏర్పాటు చేసింది. అర్బన్ హెల్త్ సెంటర్లలోనే మైనర్ శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు చేపట్టింది. కాన్పులూ చేసేలా ప్రణాళిక... అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లలో వైద్య సిబ్బందితోపాటుగా స్పెషాలిటీ వైద్యులనూ నియమించాం. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు సత్వరమే అందుతున్నాయి. ఈ కేంద్రాల్లోనే కాన్పులూ చేసేలా ఆపరేషన్ థియేటర్లు నిర్మించాం. పదినిమిషాల నడక దూరంలోనే వైద్యశాల ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం శుభపరిణామం. – డాక్టర్ జి.శోభారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి. ఇదో చారిత్రక ఘట్టం ఉమ్మడి గుంటూరు జిల్లాలో కొత్తగా మంజూరైన 50 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు చురుగ్గా సాగుతున్నాయి. పలు ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలు ఇప్పటికే పూర్తయ్యాయి. ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. కలెక్టర్ వేణుగోపాలరెడ్డి, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి చేకూరి ఈ నిర్మాణాల పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ప్రతి 25వేల మంది జనాభాకు ఓ వైద్యశాల నిర్మించడం నిజంగా ఓ చారిత్రక ఘట్టం. – డాక్టర్ చుక్కా రత్నమన్మోహన్, ఎన్హెచ్ఎం డీపీఎంఓ సేవలు భేష్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు స్థానే ఇప్పుడు వైఎస్సార్ అర్బన్ ప్రైమరీ హెల్త్‌కేర్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ కేంద్రాల్లో సేవలు బాగున్నాయి. ఉచిత వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. మంచిమంచి డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు. చక్కగా చూస్తున్నారు. మందులూ ఉచితంగా ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. – కొండూరు లలితమ్మ, ముత్యాలరెడ్డినగర్ -
పోచంపల్లి పీహెచ్‌సీకి జాతీయ స్థాయి గుర్తింపు
భూదాన్‌పోచంపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. కార్పొరేట్ ఆస్పత్రులకు ఏ మాత్రం తీసిపోకుండా రోగులకు నాణ్యమైన వైద్యసేవలందిస్తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నందుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇటీవల నేషనల్ క్వాలిటీ అనాలసిస్‌కు చెందిన కేంద్ర ప్రతినిధుల బృందం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. జాతీయ స్థాయి ఎంపిక ఇలా.. జాతీయ వైద్య ఆరోగ్య సంస్థ చేపట్టిన 14 రకాల కార్యక్రమాల అమలు, ఆస్పత్రి పరిపాలనా విభాగం పనితీరు, వివిధ ఆరోగ్య పరీక్షల నిర్వహణ–నాణ్యత, రోగులకు అందిస్తున్న సేవలు, రికార్డులు–ఫార్మసీ నిర్వహణ, డెలివరీ ప్రొటోకాల్స్, అనంతరం తల్లీబిడ్డలకు అందిస్తున్న సేవలను సైతం పరిగణనలోకి తీసుకుంటారు. అన్ని ప్రమాణాలు పాటించిన పీహెచ్‌సీలను జాతీయస్థాయి క్వాలిటీ అస్యూరెన్స్ ఇస్తారు. కాగా పోచంపల్లి పీహెచ్సీ, పరిధిలోని 9 హెల్త్ సబ్‌సెంటర్ల ద్వారా మండలంలోని 52వేల మందికి వైద్య సేవలందిస్తున్నది. గర్భిణులు, పిల్లలకు ఇమ్యునైజేషన్ విజయవంతంగా నిర్వహిస్తున్నది. జిల్లాలో అత్యధికంగా ఒక్క ఏడాదిలో పోచంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 750 సాధారణ ప్రసవాలు జరిగాయి. ఇలా జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాలతో పనిచేస్తున్నందుకుగాను పోచంపల్లి పీహెచ్‌సీకి జాతీయ స్థాయి లభించింది. అదనపు నిధులు వస్తాయి పోచంపల్లి పీహెచ్సీ 2017లో ‘కాయకల్ప’అవార్డుకు ఎంపికైంది. గతంలో పీహెచ్‌సీని సందర్శించిన స్టేట్ క్వాలిటీ అనాలిసిస్ బృందం, నేషనల్‌కు ప్రతిపాదనలు పంపడంతో కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. ఇలా జాతీయస్థాయికి ఎంపికైన పీహెచ్‌సీకి ఏటా రూ.2లక్షల నుంచి 3లక్షల వరకు అదనపు నిధులు వస్తాయి. –డాక్టర్ యాదగిరి, మండల వైద్యాధికారి -
ఇక వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో ప్రతి రెండు వేల జనాభాను ఒక యూనిట్‌గా తీసుకుని అక్కడి పరిస్థితులకు అనుగుణంగా విలేజ్ క్లినిక్‌ను అందుబాటులో ఉంచాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ అందుబాటులో ఉండాలన్నారు. అందులో బీఎస్సీ నర్సింగ్ చదివిన స్టాఫ్ అందుబాటులో ఉండాలని చెప్పారు. విలేజ్ క్లినిక్ అనేది రెఫరల్ పాయింట్లా ఉండాలని, ప్రతి రోగికి ప్రాథమిక వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎవరికైనా ఏదైనా జరిగితే విలేజ్ హెల్త్ క్లినిక్‌లో ఉచితంగా ప్రాథమిక వైద్యం అందుతుందనే భరోసా కల్పించేలా వీటిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇక్కడికొచ్చే రోగులకు రూపాయి కూడా ఖర్చు కాకుండా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. చిన్న ఆరోగ్య సమస్యలకు ఇక్కడే వైద్యమందితే దూరం వెళ్లే ఇబ్బందులు తప్పుతాయని, విలేజ్ క్లినిక్‌లోనే మందులు అందిస్తే రోగులు సంతృప్తి వ్యక్తం చేస్తారన్నారు. బోధనాసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికొక బోధనాసుపత్రి ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులతో అన్నారు. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 25 బోధనాసుపత్రులు ఉంటే ప్రజలకు స్పెషాలిటీ సేవలు మరింత చేరువవుతాయని చెప్పారు. మంచి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళుతున్నామని, ఈ క్రమంలో చిన్న చిన్న సమస్యలు ఎదురైనా వాటిని పరిష్కరించుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11 టీచింగ్ ఆసుపత్రులు ఉన్నాయని, మరో 7 వైద్య కళాశాలలకు డీపీఆర్‌లు సిద్ధమవుతున్నాయని ఈ సందర్భంగా సీఎంకు ఆ శాఖ అధికారులు వివరించారు. బోధనాసుపత్రులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, డాక్టర్లు, నర్సుల కొరతను అధిగమించాలని సీఎం సూచించారు. ప్రతి టీచింగ్ ఆసుపత్రిలో డెంటల్ ఎడ్యుకేషన్ కూడా ఉండేలా చూడాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో దంత వైద్య పరీక్షలు రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదివే విద్యార్థులందరికీ ‘డా.వైఎస్సార్ చిరునవ్వు’ ద్వారా ఉచితంగా దంత వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రతి విద్యార్థికి టూత్‌పేస్ట్, బ్రష్‌ను ఉచితంగా ఇవ్వాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో దంత వైద్య పరీక్షలు జరగాలని, 60 లక్షల మంది చిన్నారులను స్క్రీనింగ్ చేయడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు దీనిపై అధ్యయనం చేయాలని, ప్రస్తుతం కంటి వెలుగు కార్యక్రమం ఎలా జరుగుతోందో పరిశీలించాలన్నారు. కంటి వెలుగు తరహాలోనే ‘డా.వైఎస్సార్ చిరునవ్వు’ కార్యక్రమం కూడా సజావుగా సాగేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్భంగా కంటి వెలుగు కార్యక్రమం అమలుపై ఆరా తీశారు. అవ్వాతాతలకు కళ్లద్దాలు ఇస్తున్నారా.. అని అడిగారు. జూలై 8న ‘డా.వైఎస్సార్ చిరునవ్వు’ కార్యక్రమాన్ని ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. సమీక్షలో మంత్రి ఆళ్ల నాని, వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ -
టీకా వికటించి చిన్నారి మృతి
మోపాల్: నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం శ్రీరాంనగర్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోగల శివలాల్ తండాలో శనివారం టీకా వికటించి ఓ చిన్నారి మృతి చెందింది. తండాలో శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఇమ్యూనైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. అరుణ, హన్మాన్ సింగ్ దంపతుల తమ చిన్న కూతురు చిన్నారి (3 నెలలు)కి పోలియో రాకుండా చుక్కలు వేసి, టీకాలు ఇచ్చారు. ఇంటికి చేరుకున్న వెంటనే చిన్నారి ముక్కులో నుంచి రక్తం వచ్చింది. వైద్య సిబ్బంది వచ్చేలోపే చిన్నారి మృతి చెందింది. డీఎంహెచ్‌వో సుదర్శనం విచారణ చేపట్టారు. ఎస్సై సతీష్ కేసు నమోదు చేసి, చిన్నారికి ఇచి్చన టీకాలు, చుక్కల మందును సీజ్ చేశారు. అనంతరం చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. -
నవజాత శిశువు మాయం : రణరంగంగా ఆసుపత్రి
సాక్షి, పట్నా: బిహార్‌లో ఆసుపత్రులలో వరుసగా వివాదాస్పద సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇస్లాంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నవజాత శిశువు కనిపించకుండా పోయిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. నలందాకు చెందిన ఇస్లాంపూర్ వాసులు తమ బంధువును ప్రసవం కోసం ఆసుపత్రికి తీసు కొచ్చారు. గత రాత్రి ఆ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ శిశువు కనిపించకుండా పోవడంతో బంధువులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఒక మహిళ తమ బిడ్డను అపహరించుకుపోయిందని ఆరోపిస్తున్నఆందోళనకు దిగడంతో ఘర్షణకు దారితాసింది. విచక్షణ ఆసుపత్రిపై రాళ్ల దాడికి దిగారు.. ఆసపత్రి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో ఆసుపత్రి పరిసర ప్రాంతం రణరంగంగా మారిపోయింది. #WATCH Bihar: Relatives of a woman, who had come to Primary Health Centre in Islampur of Nalanda for delivery of her child last night, pelted stones at & vandalised the property after the child was allegedly stolen by another woman, from the hospital. pic.twitter.com/MDlSUmjNzl — ANI (@ANI) June 29, 2019 -
పసిపాపను బలిగొన్న ఇంజెక్షన్
ఇల్లందకుంట(హుజూరాబాద్): ఇంజెక్షన్ వికటించి 45 రోజుల చిన్నారి బుధవారం మృతి చెందింది. కరీంనగర్ జిల్లా ఇల్లందకుంటలో నివాసముంటున్న అప్పాల విజయ్–హారిక దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. పెద్ద కూతురు రియా. చిన్నమ్మాయి 45 రోజుల పసికందు. రోజూ అంగన్వాడీ సెంటర్లో సరుకులు తీసుకునేందుకు తల్లి హారిక వెళ్తుంది. ఈ క్రమంలో బుధవారం ఇల్లందకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే ఆశ కార్యకర్త చిన్నారికి ఇంజెక్షన్ ఇవ్వాలని, తీసుకురావాలని తెలిపింది. దీంతో తల్లి హారిక పాపను ఆస్పత్రికి వెళ్లింది. మొదట సులోచన అనే ఆశ కార్యకర్త పోలియో చుక్కలను వేసింది. తర్వాత రెండో ఏఎన్ఎంలు సునీత, అరుణ పెంటావ్యాక్సినేషన్ చేశారు. అప్పటికి పాప ఏడుస్తుండటంతో ఏమీ కాదంటూ ఇంజెక్షన్ చేశారు. ఇంటికి తీసుకొచ్చాక కొద్దిసేపటికి∙పాపలో చలనం లేకపోవడంతో వెంటనే ప్రభుత్వాసుపత్రికి తీసు కెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి చనిపోయినట్లు వైద్యులు చెప్పారు. తన పాప మృతికి కారణం వైద్య సిబ్బందే అంటూ కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నేతలు, గ్రామస్తులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో సిబ్బంది అక్కడి నుంచి పరారయ్యారు. చిన్నారి మృతికి కారణమైన వైద్య సిబ్బందిని తొలగించాలంటూ ఇల్లందకుంట ప్రధాన దారిపై గ్రామస్తులు 2 గంటలపాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని జమ్మికుంట సీఐ ప్రశాంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, మూడేళ్ల క్రితం తన పెద్ద కూతురు లక్కీ(రియా)కి కూడా ఇదే ఆస్పత్రిలో ఇంజెక్షన్ వికటించిందని, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపా యం తప్పిందని తండ్రి విజయ్ తెలిపారు. -
పనిచేసే చోటే ప్రసవం
గజ్వేల్: ప్రభుత్వాస్పత్రిలోనే కాన్పులు జరపాలన్న సర్కార్ లక్ష్యానికి ఓ మహిళా డాక్టర్ ఆదర్శంగా నిలిచారు. విధులు నిర్వహిస్తున్న చోటే సాధారణ మహిళల మాదిరిగా కాన్పు చేయించుకొని పాపకు జన్మనిచ్చారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గైనకాలజిస్ట్‌గా పనిచేస్తున్న త్రివేణి.. ఏడాదిగా డిప్యుటేషన్‌పై గజ్వేల్ ప్రభుత్వాస్పత్రిలో హైరిస్క్ మానిటరింగ్ సెంటర్ (ప్రసూతి కేంద్రం)లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గర్భిణిగా ఉన్న ఆమె తాను పనిచేస్తున్న ఆస్పత్రిలోనే కాన్పు చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఆలోచనను భర్త డాక్టర్ రాము సైతం ఏకీభవించారు. రాము ములుగు మండలం సింగన్నగూడ పీహెచ్సీలో చిన్న పిల్లల వైద్యుడిగా పనిచేస్తున్నారు. భార్య కాన్పు కోసం సోమవారం గజ్వేల్ ప్రసూతి కేంద్రానికి తీసుకొచ్చారు. సాయంత్రం త్రివేణి ఆపరేషన్ ద్వారా పాపకు జన్మనిచ్చారు. ఆమెతో పాటు సోమవారం మొత్తం 17 డెలివరీలు జరగ్గా.. అందులో 10 మందికి ఆపరేషన్లు, మిగిలిన వారికి నార్మల్ డెలివరీలు చేశారు. త్రివేణి, పాప ప్రస్తుతం ఆస్పత్రిలోనే వైద్యం పొందుతున్నారు. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు డాక్టర్ రాముకు ఫోన్లో అభినందనలు తెలిపారు. ప్రభుత్వ వైద్యంపై నమ్మ కాన్ని పెంచేందుకు తాము చేస్తున్న ప్రయత్నానికి అండగా నిలిచారంటూ ప్రశంసించారు. అధికారులు, నేతలు త్రివేణికి అభినందనలు తెలపడమే కాకుండా కేసీఆర్ కిట్‌ను అందించారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ వాకాటి కరుణ సైతం అభినందించారు. -
కట్టలు తెగిన ఆగ్రహం
♦ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతో గర్భిణి మృతి ♦ అవగాహనారాహిత్యంతో చికిత్స ♦ ధర్మాజీగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ♦ వద్ద బాధితులు, గ్రామస్తుల ఆందోళన లింగపాలెం: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, సిబ్బంది నిర్లక్ష్యంతో నిండు గర్భిణి మృతిచెందిన ఘటన లింగపాలెం మండలం ధర్మాజీగూడెంలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆదివారం సంచలనం కలిగించింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మఠంగూడెం గ్రామ శివారు సుందరరావుపేట గ్రామానికి చెందిన దేవరపల్లి తంబి భార్య విఘ్నేశ్వరి (23)కి నెలలు నిండటంతో శనివారం ఉదయం ధర్మాజీగూడెం పీహెచ్‌సీకి తీసుకువచ్చా రు. సాయంత్రం 4 గంటల నుంచి పురు టి నొప్పులు రావడంతో స్టాఫ్ నర్సులు జ్యోతి, దుర్గ, గంగా వైద్యం మొదలు పెట్టారు. అప్పటి నుంచి రాత్రంతా విఘ్నేశ్వరి నొప్పులు భరించింది. ఈ సమయంలో విఘ్నేశ్వరి బాధను చూడలేక భర్త తం బి, కుటుంబసభ్యులు ఆమెను చింతలపూడి ఆస్పత్రికి తీసుకువెళతామని అడిగినా నర్సులు అంగీకరించలేదు. అవగా హనరాహిత్యంతో వైద్యసేవలు అందించారు. వైద్యాధికారి బి.మోజెస్ వినయ్‌కుమార్ గర్భిణిని కనీసం పట్టించుకోలేదు. ఆది వారం ఉదయం 9 గంటలకు వైద్యాధి కారి ఆస్పత్రికి వచ్చినా కనీసం వచ్చి చూడలేదు. ఈ క్రమంలో ఉదయం 10 గంటల సమయంలో విఘ్నేశ్వరికి నర్సులు సీజేరియన్ చేసే ప్రయత్నంలో తీవ్ర రక్తస్రావమై మృతిచెందింది. విషయం తెలిసిన వైద్యాధికారి మోజెన్ సెల్‌ఫోన్ స్విచ్ఛాప్ చేయడంతో పాటు అందుబాటులో లేరు. ముగ్గురు నర్సులు పీహెచ్‌సీలోని ఒక గదిలో గడివేసుకుని దాక్కున్నారు. విషయం తెలిసిన సుందరరావుపేట ప్రజలు పెద్ద ఎత్తున పీహెచ్‌సీకి తరలివచ్చి ఆందోళన చేశారు. డీఎంహెచ్ఓకు విషయాన్ని తెలియజేశారు. ఏలూరు–చింతలపూడి రహదారిపై ధర్నాకు దిగా రు. ఎస్సై వి.క్రాంతికుమార్ వీరితో చ ర్చించారు. జిల్లా వైద్యారోగ్య శాఖ నుంచి విచారణాధికారిగా కె.సురేష్‌బాబు ఇక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. డాక్టర్ మోజెస్ మద్యం సేవించి, గుట్కాలు నములుతూ ఆస్పత్రిలో తిరుగుతుం టారని స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే పీతల సుజాత విషయాన్ని కలెక్టర్‌కు చెప్పడంతో ఆయన విచారణాధికారితో ఫోన్లో మాట్లాడారు. డాక్టర్ మోజెస్ వినయకుమార్‌ను సస్పెం డ్ చేస్తూ క్రిమినల్ చర్యలకు ఆదేశించినట్టు తెలిసింది. తహసీల్దార్ బి.సోమశేఖరరావు, ధర్మాజీగూడెం సర్పంచ్ ఉప్పలపాటి వరప్రసాద్, సొసైటీ అధ్యక్షుడు గారపాటి బుజ్జియ్య, సీఐ రాజేష్ తది తరులు బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వైద్యాధి కారి, సిబ్బందిపై కేసు నమోదు చేసి విఘ్నేశ్వరి మృతదేహన్ని ఏ లూరు ప్రభుత్వాస్పత్రికి తరలిం చినట్టు ఎస్సై చెప్పారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే.. ధర్మాజీగూడెం ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతోనే నా భార్య కన్నుమూసింది. ఆస్పత్రిలో దాదాపు 17 గంటలపాటు నరకయాతన అనుభవించింది. సరైన వైద్యం అందలేదు. డాక్టర్ సరిగా స్పందించలేదు. సిబ్బంది అవగాహనలేమితో కాన్పు చేయలేక ప్రాణం పోగొట్టారు. – తంబి, మృతురాలి భర్త కనీసం డాక్టర్ పట్టించుకోలేదు నొప్పులు ఎక్కువగా వచ్చి నరకయాతన పడుతుంది విఘ్నేశ్వరిని పంపించండి అని ప్రాధేయపడినా నర్సులు ఒప్పుకోలేదు. డాక్టర్‌ను వచ్చి చూడమన్నా చూడకుండా వెళ్లిపోయారు. కనీసం డాక్టర్ వచ్చి చూసి రిఫర్ చేసినా విఘ్నేశ్వరి బతికేది. – చిట్లూరి ఝాన్సీరాణి, మృతురాలి వదిన -
వదల బొమ్మాళీ..నిన్నొదల
‘చేతబడి’ప్రభావిత గ్రామాల్లో కోహెడ మండలం ఒకటి. ఇక్కడ 21 గ్రామాలకు కలిపి ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, 8 ఉప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. పీహెచ్‌సీకి రోజుకు సగటున 90 మంది వరకు ఔట్ పేషెంట్లు వస్తారు. ఇంతమందికి ఉన్న ఒక్క వైద్యురాలే వైద్యం చేయాలి. పిల్లలు, యువకులు, వృద్ధులు ఎవరు వచ్చినా రోగాలు ఏవైనా ఆ డాక్టరే చూడాలి, ఉన్న కాసిని మందులే ఇవ్వాలి. లేకపోతే పైఆస్పత్రులకు వెళ్లాలంటూ రిఫర్ చేయాల్సిన పరిస్థితి. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి పీహెచ్‌సీలోనూ ఇదే పరిస్థితి. దీంతో తగిన వైద్యం అందక గ్రామీణులు, గిరిజనులు భూత వైద్యులు, మంత్రగాళ్లను ఆశ్రయిస్తున్నారు. మరింతగా మూఢ నమ్మకాల్లో కూరుకుపోతున్నారు.. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని ‘మంత్రతంత్రాలు’పట్టిపీడిస్తున్నాయి.. గ్రామీణ, గిరిజన ప్రాంతాలను ‘దెయ్యాలు, భూతాలు’కకావికలం చేస్తున్నాయి.. రోజురోజుకూ ప్రజల్లో మూఢ నమ్మకాలు మరింతగా చుట్టుముడుతున్నాయి.. రోజూ ఏదో ఒక చోట ‘చేతబడి, బాణామతి’పేరిట దారుణ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.. పసిపిల్లలకు జ్వరం రావడం దగ్గరి నుంచి పొలాల్లో రైతులకు పాముకాటు దాకా అన్నింటికీ మంత్రగాళ్లను, భూత వైద్యులనే ఆశ్రయిస్తున్నారు. ఏ చిన్న వ్యాధి వచ్చినా వారి దగ్గరికే వెళుతున్నారు.. గ్రామాల్లో ప్రజలకు తగిన వైద్యం అందకపోవడం, ఆర్థిక, సామాజిక నేపథ్యం, మూఢ నమ్మకాలు, భూత వైద్యులు, మంత్రగాళ్లు జనాలను మరింతగా గారడీ చేస్తూ, భయపెడుతూ తమదారికి తెచ్చుకుంటుండడం వంటివన్నీ ఈ పరిస్థితికి కారణంగా మారుతున్నాయి. ఈ మంత్రతంత్రాల అపవాదు కారణంగానే జూలై 10న కరీంనగర్ జిల్లా కందుగులలో గంట కొమురయ్య దంపతులు, ముగ్గురు బిడ్డలను హత్య చేసి, ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో కరీంనగర్, జనగామ, సిద్దిపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్ జిల్లాల్లోని పలు గ్రామాల్లో ‘సాక్షి’ ప్రత్యేక పరిశీలన జరిపింది. అక్కడ ప్రజల ఆర్థిక సామాజిక నేపథ్యం, ప్రజావైద్యం అందుతున్న తీరు, మూఢ నమ్మకాల పరిస్థితులను పరిశీలించింది. దాదాపు మూడు రోజుల పాటు జరిగిన ఈ పరిశీలన సందర్భంగా అధిక శాతం జనం మంత్రతంత్రాలు, చేతబడి, భూతవైద్యులపై నమ్మకాన్ని వ్యక్తపరచడం ఆందోళన కరం. ఇదో మాయల తంత్రం హుస్నాబాద్ మండలం బల్లూనాయక్ తండాకు చెందిన మాయేందర్ (పేరు మార్చాం) అనే వ్యక్తి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి కొందరు యువకుల నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశాడు. మోసపోయిన వారు కొద్దిరోజులుగా ఇంటికొచ్చి గొడవ చేస్తున్నారు. దీంతో మాయేందర్ తల్లిదండ్రులు తమ కుమారుడికి ఎవరో చేతబడి చేసి చెడుమార్గం పట్టిస్తున్నారని భావించి.. అతడిని తీసుకుని ముల్కనూర్ గ్రామంలోని ఓ ఎరుకల సాని వద్దకు వెళ్లారు. ఆమె మాయేందర్పై పాలోళ్లే చేతబడి చేయించారని చెప్పింది. హుస్నాబాద్ మండలం చౌటపల్లిలోని ఓ మంత్రగాడి వద్దకు తీసుకెళ్లాలని సలహా ఇచ్చింది. దీంతో వారు తమ కుమారుడిని తీసుకుని ఆ మంత్రగాడి వద్దకు వెళ్లారు. ఎద్దు తొక్కని ఇసుక.. ఏడు బావుల నీళ్లు.. కోహెడ మండలం సముద్రాలలో మరో ఘటన కనిపించింది. ఇటీవల వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ప్రభావంతో రైతుల బోర్లలో నీళ్లు తగ్గుతున్నాయి. చెంచరు చేరుపల్లి గ్రామానికి చెందిన శ్రీమన్‌రావు (పేరు మార్చాం) అనే రైతు బోరు కూడా అడుగంటి పోయింది. కానీ శ్రీమన్‌రావు ఏదో అనుమానం పెట్టుకుని సముద్రాల గ్రామంలోని ఉస్మాన్‌ఖాన్ అనే మంత్రగాడి వద్దకు వచ్చాడు. ఉస్మాన్‌ఖాన్ దివ్యదృష్టితో చూసినట్లుగా చేసి... పక్కనున్న పొలం యజమానే ‘మంత్రాలు’చేయించాడని చెప్పాడు. ఆ దుష్టశక్తిని తరిమేసి, బోరులోకి మళ్లీ నీళ్లు మళ్లించటానికి క్షుద్ర పూజ చేయాలన్నాడు. ఇందుకోసం ఎద్దు తొక్కని ఇసుక, ఏడు బావుల నీళ్లు, పసుపు కలిపిన బియ్యం, నల్ల వక్కలు, ఆరు నిమ్మకాయలు తెచ్చుకోవాలని చెప్పాడు. ఆ సామగ్రి తెచ్చాక ఏవేవో పూజలు చేసి.. వాటిని మూట కట్టి ఇచ్చాడు. వాటిని బోరులో, పంట పొలంలో చల్లితే పాతాళగంగ మళ్లీ పైకి వస్తుందని చెప్పి పంపించాడు. ఈ మంత్రగాడు పసిపిల్లలకు విరోచనాలు, జలుబు, జ్వరం, పెద్దలకు స్వైన్‌ఫ్లూ, కేన్సర్ వంటి వ్యాధులకు కూడా భూత వైద్యం చేస్తాడని.. ప్రతి గురువారం, ఆదివారం చాలా మంది జనం వస్తుంటారని స్థానికులు చెబుతున్నారు. ఎన్నో విధాలుగా.. పసిపిల్లలు మూత్రం పోయడానికి ఇబ్బంది పడడం దగ్గరి నుంచి పెద్దల అనారోగ్య సమస్యల వరకు చాలా మంది భూత వైద్యులను ఆశ్రయిస్తున్నారు. ఇక గ్రామాల్లో కొన్ని వర్గాల వారిని చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి బాణామతిని సాకుగానూ ఉపయోగించుకుంటున్నారు. వారిపై మంత్రతంత్రాల ఆరోపణలు చేసి.. నిర్దోషిగా రుజువు చేసుకోవడానికి వేడి నూనెలో చేతులు పెట్టడం, కాలుతున్న గడ్డపార పట్టుకోవాలని చెప్పడం వంటి పరీక్షలు పెడుతున్నారు. ఒంట్లో మేకులు పీకగలరు! నల్లగొండ జిల్లా గుండ్లపల్లికి చెందిన కాశమ్మ (65) ఒంటరిగా జీవిస్తోంది. ఇటీవల కీళ్ల నొప్పులు రావడంతో ముగ్గురు భూత వైద్యుల వద్దకు వెళ్లింది. దీనిపై ఆమెను పలకరిస్తే... ‘‘డిండి సర్కారు దవాఖానకు (పీహెచ్సీ)కి పోతే మందు గోలీలు ఇచ్చారు. నెల రోజులు మింగినా నొప్పులు తగ్గలేదు. చెర్వుగట్టు గ్రామంలో మంత్రాలు వేస్తారంటే అక్కడికి వెళ్లిన. మా పాలోళ్లే మంత్రాలు చేశారని ఆ మంత్రపాయన చెప్పిండు. నిమ్మకాయలు మంత్రించి ఇచ్చిండు. నాలుగు అమావాస్యలు వెళితే పాణం కొద్దిగా కుదురుకుంది. తర్వాత మా చెల్లె కల్వకుర్తి (నాగర్‌కర్నూలు జిల్లా)కి తీసుకపోయింది. అక్కడి భూత వైద్యురాలు కూడా నాకు ఎవరో చేతబడి చేశారని, మట్టి బొమ్మను చేసి కీళ్లకు మొలలు గుచ్చారని చెప్పింది. నా ఒంటి మీద గుచ్చిన మొలలను గుర్తుపట్టి ఆమె పంటితో పీకేసింది. ఆరు మొలలు ఎల్లినయ్. నిమ్మకాయలు మంత్రించి ఇచ్చి, వారం వారం రమ్మని చెప్పింది. ఇప్పుడు మంచిగనే అనిపిస్తోంది..’’అంటూ చెప్పింది. పోలీసు కేసులకే పరిమితం మంత్రాలు, చేతబడి, బాణామతి అనేవి వైద్య విజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో రోగికి మనోధైర్యం కల్పించడం కోసం మొదలైన ప్రక్రియలనీ.. కానీ అవి సంస్కృతిలో భాగమై వస్తున్నాయని సామాజికవేత్తలు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఈ మంత్రతంత్రాల సమస్యను కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తోందని అంటున్నారు. పోలీసు రికార్డులను బట్టి ప్రతి జిల్లాలో ఏటా సగటున 15 నుంచి 20 కేసుల వరకు మంత్రాలు, చేతబడి, బాణామతి, చెర్దుబాటు పేరుతో నమోదవుతున్నాయి. ఇక పోలీసుస్టేషన్ వరకు రాకుండా జరుగుతున్న ఘటనలు 100 నుంచి 150 వరకు ఉంటాయని చెబుతున్నారు. పోలీసు లు కూడా నేరం జరిగిన తరువాత వెళ్లి కేసులు నమోదు చేయడానికే పరిమితమవుతున్నారని స్పష్టం చేస్తున్నారు. ఏప్రిల్‌లో సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సుదర్శన్, ఆయన భార్య రాజేశ్వరిని స్థానికులు మంత్రాల నెపంతో హత్య చేశారు. ఈ ఘటనకు రెండు రోజుల ముందు నుంచే వారిని బంధించి ఉంచారు. దీనిపై వారి కుమారుడు శ్రీధర్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం. ఆస్పత్రులున్నా.. సౌకర్యాలేవి? రాష్ట్రంలో ఐదు వేల మందికి ఒకటి చొప్పున ఒక ఉప వైద్య కేంద్రం, 30 వేల మంది జనా భాకు ఒక పీహెచ్సీ, లక్ష మంది జనాభాకు ఒక సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) ఉన్నాయి. మొత్తంగా 10,760 గ్రామా లుండగా... పీహెచ్‌సీలు 930, సీహెచ్‌సీలు 125 మాత్రమే ఉన్నాయి. ఇక 4,500 ఉప కేంద్రాలున్నా వాటిలో వైద్యులుం డరు, ఏఎన్ఎంలే ఉంటారు. వాటిలో తగిన వైద్య సేవలు అందుబాటులో ఉండవు. పీహెచ్ సీల్లో ఉండే ఒక రిద్దరు వైద్యులు.. రోగులంద రికీ వైద్యసేవలు అందించే పరిస్థితి లేదు. అంటే కేవలం 10% గ్రామాలకే వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక ఉన్న ఆస్పత్రులనూ వైద్యుల కొరత వేధిస్తోంది. వైద్యులు, నర్సులు కలిపి వెయ్యి వరకు ఖాళీలున్నాయి. వైద్యులు ఉన్నచోట వారు వస్తారో రారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజావైద్యం దిక్కులేకే.. ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజావైద్యాన్ని విస్మరించిన ఫలితంగానే పల్లెల్లో బాణామతి, చేతబడుల వంటి మూఢనమ్మకాలు మరింతగా పెరిగిపోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మూఢ నమ్మకాలకు తోడు ప్రజలకు ప్రభుత్వ వైద్యం, మందులు సరిగా అందుబాటులో లేకపోవటంతో వారు భూత వైద్యులను ఆశ్రయిస్తున్నారు. దీనికి సాంస్కృతిక నేపథ్యం కూడా కొంత తోడయింది. అసలు సగటున ప్రతి నాలుగు ఊళ్లకు ఓ పేరుపొందిన మంత్ర వైద్యుడు ఉండగా.. సగటున పది గ్రామాలకు కలిపి కూడా ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లేకపోవడం గమనార్హం. ప్రజలు పది ఇరవై కిలోమీటర్ల దూరం వెళ్లి వైద్యం పొందాల్సిన పరిస్థితి. ఉన్న ప్రభుత్వాస్ప త్రుల్లోనూ వైద్యులు, మందుల కొరత వేధిస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రసూతి కేంద్రాలను మెరుగు పరిచింది. కానీ సాధారణ రోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, మొండి వ్యాధులను పసిగట్టి వైద్యం చేసే పరిస్థితి లేదు. పేదల ఆర్థిక స్థితికి అనుగుణంగా చవక మందులు అందుబాటులో లేవు. ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి.. ‘‘రుజువులకు అందని ఓ అభూత కల్పనను జనంపైకి ప్రయోగించి వారి అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్న ప్రక్రియ బాణామతి. ఈ నెపంతో దళిత, గిరిజన కుటుంబాలపై దాడులు జరుగుతున్నాయి. ఆర్థిక నేపథ్యం, ప్రజా వైద్యం అందుబాటులో లేకపోవటం వల్లే ప్రజలు ఇంకా మంత్రాలను నమ్ముతున్నారు. దీనిని రాష్ట్ర ప్రభుత్వం కేవలం శాంతి భద్రతల సమస్యగానే చూస్తోంది. మూఢ నమ్మకాల నిర్మూలన కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలి..’’ – తాటి రమేశ్, జన విజ్ఞాన వేదిక కన్వీనర్ -
నిండుగా మందులు.. కనిపించని సిబ్బంది
ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్కకాటు, తేలుకాటు, పాముకాటు మందులు అందుబాటులో ఉన్నాయి. సిబ్బందే లేరు. సాక్షి ఆదివారం ఆస్పత్రులను సందర్శించింది. 2016 ఆగష్టు నుంచి ఇప్పటి వరకు 387 మంది ఇందుకు సంబంధించి రోగులకు చికిత్సను అందించారు. కుక్కకాటుకు ఏఆర్వీ 40 వాయిల్స్, తేలు కాటుకు హైడ్రోజోల్‌కాటిజోన్ 60 వాయిల్స్, యాంటీ స్నేక్కు సంబంధించి రెండు వాయిల్స్ అందుబాటులో ఉన్నాయి. నిధులకు హాజరుకాని డాక్టర్లు, సిబ్బంది మోత్కూరు : మోత్కూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేళకు డాక్టర్లు, సిబ్బంది రాకపోవడంతో రోగులు ఆస్పత్రి ఆవరణలో నిరీక్షించాల్సి వస్తోంది. వచ్చినా సమావేశాలని వెళ్లడంతో రోగులకు వైద్య సేవలు అందడం లేదు. కాగా పాముకాటు, తేలుకాటు, కుక్కకాటు అత్యవసర మందులు అందుబాటులోఉన్నాయి. డయేరియా, మలేరియా, అతిసార సంబంధించిన మం దులకు ఎలాంటి కొరతా లేదు. పాము కాటుతో మృతి చెందిన వారి వివరాలు ఆలేరు : మందులు అందుబాటులో ఉన్నా కొందరు పాము కాటుతో సంవత్సర కాలంలో కొందరు మృతి చెందారు. 2017 మే 27న ఆలేరు పట్టణంలో నితిన్ అనే బాలుడు నిద్రిస్తున్న సమయంలో కట్లపాము కాటేయడంతో చనిపోయాడు. ∙2017జూన్ 8çన తుర్కపల్లి మండలం మాదాపూర్‌లో సిద్దెంకి మౌనికను కట్లపాము కాటు వేసింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ∙2017 జూలై 5న మోటకొండూరు మండలం మాటూర్‌కి చెందిన అంబాల మణికంఠ పాముకాటుకు గురై మృతి చెందాడు. ∙2016 జూన్ 08 తుర్కపల్లి మండలం మదాపూర్‌లో బీడీ కార్మికురాలి కుమార్తె భవ్యశ్రీ(7) పాముకాటుకు గురై చికిత్స పొందుతూ చనిపోయింది. ∙2016 జూన్ 11 న ఆత్మకూరు(ఎం) మండలం టీ.రేపాక గ్రామంలో సుశీల అనే మహిళ వ్యవసాయ బావివద్ద పనులు చేస్తుండగా తేలుకాటుకు గురై చికిత్స పొందుతూ మరణించింది. ∙2016 యాదగిరిగుట్ట మండలం మల్లాపురం పరిధిలోని పిట్టలగూడెంలో బాలిక పాముకాటుతో మరణించింది. -
పేరుకే ఇరవైనాలుగు గంటల ఆస్పత్రి
♦ నానాటికీ పెరుగుతున్న రోగుల సంఖ్య ♦ విధులు నిర్వహిస్తున్న ఒకే వైద్యాధికారి ♦ అవస్థలు పడుతున్న రోగులు కెరమెరి: కెరమెరి ప్రాథమిక ఆరోగ్యకేంద్రలో రోగులకు వైద్యం అందక నానా అవస్థలు పడుతున్నారు. వైద్య పరీక్షలు చేసే వారు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే వర్షాకాలం ఆపై వ్యాధుల కాలం.. మండలంలోని 64 గ్రామాలను హైరిస్క్ గ్రామాలుగా గుర్తించారు.ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఇద్దరున్నా పరిపోని వైనం.. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే వైద్యుడు సేవలు అందిస్తున్నాడు. ఆయన ఏదైన అత్యవసరమై బయటికి వెళ్తే రోగుల పరిస్థితి దేవుడెరుగు. వైద్యులు లేక పోవడంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రెండేళ్లేగా ఉన్నతీకరించి 24 గంటల ఆస్పత్రిగా మార్చారు. వాస్తవానికి నలుగురు వైద్యాధికారులు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్కరితోనే నెట్టుకొస్తున్నారు. ఎపిడమిక్ పీరియడ్ మండలాల్లో ఉన్న పరిస్థితిని తెలుసుకునేందుకు ప్రతీ వారం జిల్లా కేంద్రంలో ఒకటి రెండు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఉన్న ఒక్క వైద్యుడు వెళ్లి పోతే రోగుల పరిస్థితి ఏంటని ఒక సారి అధికారులు గమనించాలని స్థానికులు కోరుతున్నారు. భారమంతా స్టాఫ్ నర్స్లపైనే.. మండలంలో 8 సబ్ సెంటర్లు ఉన్నాయి. అందులో 10 మంది ఎన్ఎంలు విధులు నిర్వహిస్తున్నారు. అందులో ముగ్గురు రెగ్యూలర్ కాగా.. ఏడుగురు 2వ ఏఎన్ఎంలు ఉన్నారు. ఇద్దరు సూపర్వైజర్లు ఉండగా ఒకే ఒక్కడుగా హెల్త్ అసిస్టేంట్ ఉన్నాడు. పీహెచ్సీలో నలుగురు స్టాప్ నర్సులు ఉండాల్సి ఉండగా ముగ్గురే విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలో వైద్యాధికారి లేక పోయినా, ఫార్మసిస్ట్, ఎల్టీ లేకపోయినా స్టాప్ నర్సులపైనే భారం పడుతుంది. ఇటు డేలివరీలు చేయడం, రోగులకు వైద్య పరీక్షలు చేయడం, మాత్రలు ఇవ్వడం లాంటి వన్ని వారు చేయక తప్పడం లేదు. మే నెలలో 39 డెలివరీలు ఆస్పత్రిలో జరగ్గా.. ఈ నెల 29 వరకు 33 ప్రసూతిలు జరిగాయి. ఈ విషయమై జిల్లా అధికారులకు చెప్పినప్పటికీ అసలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండలవాసులు ఆరోపిస్తున్నారు. సరే..! ఆలోచిస్తాం.. ఉన్న వైద్యున్ని ఇతర చోటికి పంపించడంతో ఇబ్బంది కలగక తప్పదు. ప్రత్యాన్మాయ చర్యల గురించి ఆలోచిస్తాం. వైద్యులు కూడా ఎక్కడ అధికంగా లేరు. వైద్యాధికారితో మాట్లాడి సమస్య పరిష్కరమయ్యే దిశగా చర్యలు తీసుకుంటాం. – సుబ్బారాయుడు, జిల్లా వైద్యాధికారి. -
కాటి పక్కన.. కనం..
16 ఏళ్లుగా ఒక్క కేసూ నమోదు కాని ఆస్పత్రి నెలవారీ చికిత్సకు ఓకే.. ప్రసవం మాత్రం ప్రైవేటులోనే.. ఇదీ మహబూబ్‌నగర్ జిల్లా ఎదిర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దుస్థితి సాక్షి,మహబూబ్‌నగర్: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) పక్కనే శ్మశానాలు ఉండటం ఎదిర గ్రామ ప్రజలకు శాపంగా మారింది. పీహెచ్సీ పక్కన సమాధులు ఉండడం.. అందు లో ప్రసవాలు చేయించుకుంటే మంచి జరగదనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు. మహబూబ్‌నగర్ మున్సి పాలిటీలో విలీనమైన ఎదిర గ్రామ పంచాయతీలో 16 ఏళ్లS క్రితం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఖర్చు చేసి నిర్మించారు. పీహెచ్సీ పరిధిలో 13 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. పీహెచ్‌సీతో పాటు సబ్సెంటర్లను కలుపుకొని ఒక వైద్యాధికారి, మరో 38 మంది సిబ్బంది, 92 మంది ఆశా కార్యకర్తలు సేవలు అందిస్తున్నారు. ఇంతమంది వైద్యసేవల కోసం ఉన్నా కనీసం ఒక్క కాన్పు కూడా పీహెచ్సీలో జరగట్లేదు. అటుగా వెళ్లేందుకు నిరాకరిస్తున్న ప్రజలు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండటంతో పీహెచ్సీలో అన్నివిభాగాల పోస్టులు, పూర్తి స్థాయిలో సిబ్బంది ఉన్నారు. వైద్య సదుపాయాలు అన్నీ ఉన్నా.. పక్కనే సమాధులు ఉండడం వల్ల గర్భం దాల్చిన నాటి నుంచి నెలలు నిండే వరకు నెలవారీ చికిత్స చేయించుకుంటున్న గర్భిణులు కాన్పులు చేయించుకోవడానికి మాత్రం వెళ్లడం లేదు. జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. కేవలం ఎదిర గ్రామస్తులే కాకుండా పీహెచ్సీ పరిధిలో మిగతా 17 గ్రామాల గర్భిణులు కూడా ఇక్కడ ప్రసవాలు చేయించుకున్న దాఖ లాలు లేవు. ప్రభుత్వం ప్రతినెలా కనీసం 10 నుంచి 15 ప్రసవాలు అయినా ప్రతి పీహెచ్సీలో జరగాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు ఎదిర పీహెచ్సీలో ఒక్క ప్రసవం కూడా జరగలేదు. శ్మశానాల విషయంలో ఆశా వర్కర్లు ఇంటింటికి తిరిగి చెబుతున్నా.. ప్రయోజనమూ ఉండటంలేదు. దీంతో పీహెచ్సీ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చేసేదేమీ లేక స్థాని కంగా నెలకొన్న పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అవగాహన కల్పిస్తున్నాం పీహెచ్సీ పక్కన సమాధులు ఉన్నందుçన కాన్పులు చేయించుకోవడానికి ఏ ఒక్క గర్భిణీ ముందుకు రావట్లేదనే విషయం నిజం. ప్రజల్లో నాటుకుపోయిన మూఢనమ్మకాలను తొలగించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకు అనుగుణంగా ఏఎన్ఎం, ఆశా వర్కర్లతో ఇంటింటికి తిరిగి ప్రచారం చేయిస్తున్నాం. ఇప్పుడిప్పుడే జనంలో కాస్త మార్పు వస్తోంది. డెలివరీలు కాకపోయినా.. మిగతా టెస్టులు చేయించుకుంటున్నారు. కొన్ని రకాల ట్రీట్మెంట్లు కూడా అందిస్తున్నాం. త్వరలో కాన్పులు జరిగేలా కృషి చేస్తాం. – శ్రీనివాస్, డీఎంహెచ్‌వో, మహబూబ్‌నగర్ -
ఒకే రోజు మూడు ప్రసవాలు
రూరల్ జిల్లాలో రికార్డు సృష్టించిన సంగెం పీహెచ్సీ జన్మించిన వారిలో ముగ్గురూ మగ శిశువులే! సంగెం : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో శనివారం ఒకే రోజు ముగ్గురు గర్భిణులకు వైద్యులు ప్రసవాలు చేశారు. గతంలో ఎన్నడూ లేని వి ధంగా ఒకేరోజు మూడు ప్రసవాలు జరగడం జిల్లాలో రికార్డు కాగా, వైద్యాధికారులు, సిబ్బందిని పలువురు అభినందించారు. గర్భిణులైన గాంధీనగర్ గ్రామానికి చెందిన చిర్రబోయిన రాధిక, గవిచర్ల గ్రామానికి చెందిన కెనసాలపు మమత శుక్రవారం సాయంత్రం పీహెచ్సీలో చేరారు. వీరిలో మమత రాత్రి 12.05కు, రాత్రి 2.15 గంటలకు రాధిక మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇక తెల్లవారుజామున తీగరాజుపల్లికి చెందిన అజ్మీరా కవిత మొదటి కాన్పు కోసం రాగా ఉదయం 8.05కు మగ బిడ్డకు జన్మనిచ్చింది. వైద్యాధికారి డాక్టర్ శంకేసి శిరీష్‌కుమార్, స్టాఫ్ నర్సులు సునిత, అనిల్ చికిత్స చేయగా.. వైద్యాధికారి డాక్టర్ సుధీర్‌బాబు అభినందించారు. ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సంగెం పీహెచ్సీలో 37 ప్రసవాలు జరిగాయని వైద్యాధికారులు తెలిపారు. -
వైద్యుల కోసం రాస్తారోకో
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న వైద్యులు ప్రజలకు సకాలంలో సేవలు అందించడంలేదని నిరసిస్తూ.. విద్యార్థి సంఘాలు రొడ్డెక్కాయి. స్థానికంగా వైద్య సదుపాయం లేకపోవడంతో పాటు.. విషజ్వరాలు విజృంభిస్తున్న సమయంలో వైద్యులు అందుబాటులో లేకపోవడంతో.. విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. అదిలాబాద్ జిల్లా వాంకిడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది విధులు సక్రమంగా నిర్వర్తించకపోవడంతో.. స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతుండటంతో.. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. వాంకిడి బస్టాండ్ సమీపంలో.. రాస్తారోకో నిర్వహించడంతో.. హైదరాబాద్-నాగ్‌పూర్ రహదారి పై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం వాటిల్లింది. -
వైద్యసేవలందేనా?
పీహెచ్సీ నిర్మాణానికి నిధులు మంజూరు నాలుగేళ్లైనా పూర్తికాని వైనం వైద్యసేవల కోసల గ్రామీణుల ఎదురుచూపులు గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్యసేవలందించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి భవన నిర్మాణం చేపట్టింది. అయితే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా నాలుగేళ్లుగా నిర్మాణంపూర్తికాలేదు. అధికారులు కూడా చర్యలు తీసుకోకపోవడంతో నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోంది. తమకు మరింత దగ్గరలో వైద్యసేవలు పొందవచ్చకున్న గ్రామీణుల ఆశలు నెరవేరేలా కనబడటంలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోహీర్:మండలంలోని బిలాల్పూర్ గ్రామంలో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పనులు ప్రారంభించి నాలుగేళ్లవుతున్నా ఇంతవరకు నిర్మాణం పూర్తికాలేదు. వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయనుకొన్న ప్రజల ఆశలు ఆవిరవుతున్నాయి. బిలాల్పూర్ గ్రామంలో 2011-12 ఆర్థిక సంవత్సరంలో పీహెచ్సీ నిర్మాణం కోసం రూ. 48 లక్షలు మంజూరైయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ విభాగం అధికారులకు పనుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. అదే సంవత్సరంలో టెండరు ప్రక్రియ పూర్తయి పనులు ప్రారంభించారు. దీంతో మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఎంతో సంబరపడ్డారు. పనులకు శంకుస్థాపన చేయకుండానే పనులు ప్రారంభించారని అప్పటి అధికార పార్టీ నాయకులు కినుక వహించి సంబంధిత శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో పనులకు బ్రేక్ పడింది. అప్పటి నుంచి పనులు కొనసాగించిన దాఖాలు లేవని స్థానికులు చెబుతున్నారు. మిగిలిన పనులు పూర్తిచేస్తే భవనం వినియోగంలోకి వస్తుంది. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని వాపోతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అందుబాటులోకి వస్తే స్థానిక బిలాల్పూర్తో పాటు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మనియార్‌పల్లి, మాణిక్యనాయక్ తండా, బడంపేటతో బాటు కర్ణాటకలోని శివరాంపురం ప్రజలకు సైతం వైద్యసేవలందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయా గ్రామాల ప్రజలు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కోహీర్కు రావాల్సి వస్తోంది. ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేస్తే దిగ్వాల్ పీహెచ్‌సీపై భారం తగ్గుతుంది. మరింత మెరుగైన వైద్యసేవలు అందే అవకావం ఉంది. ప్రస్తుతం దిగ్వాల్ పీహెచ్సీ ద్వారా మండలంలోని 20 గ్రామ పంచాయతీలు ఆరు ఆమ్లెట్ గ్రామాల సబ్సెంటర్లను నియంత్రించాల్సి వస్తోంది. భవనంతోపాటు రోడ్డు నిర్మాణం చేపట్టాలి పీహెచ్సీ భవన నిర్మాణానికి గ్రామ కంఠంలో స్థలం అందుబాటులో లేకపోవడంతో గ్రామానికి దూరంగా ఉన్న ప్రభుత్వ స్థలం కేటాయించి నిర్మాణంచేపట్టారు. అయితే ఈ పీహెచ్‌సీకి బిలాల్పూర్ ప్రజలు రావాలంటే రహదారి సౌకర్యం లేదు. అలాగే మనియార్‌పల్లి, మాణిక్యనాయక్ తండావాసులకు కూడా ఇబ్బందే. వీరు వచ్చే మార్గం బండి కచేరలు, గుంతలమయం. ఆరోగ్య కేంద్రంతోపాటు రోడ్లను సైతం నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. జాప్యం తగదు. బిలాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణంలో జాప్యం జరుగుతోంది. అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తిచేయకుంటే కాంట్రాక్ట్ రద్దు చేసి కొత్త కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాల్సి ఉండగా ఆ దిశగా ప్రయత్నాలు జరగడంలేదు. ఇప్పటికైన నిర్మాణంపై దృష్టిసారించి పనులను వెంటనే పూర్తి చేయించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వినియోగంలోకి తీసుకురావాలి. - శ్రీనివాస్, మనియార్‌పల్లి వైద్యం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. వైద్య సేవల నిమిత్తం మండల కేంద్రమైన కోహీర్ ప్రభుత్వ సివిల్ ఆస్పత్రిని వెళ్లడానికి వ్యయప్రయాసకు గురికావాల్సి వస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో వైద్యసేవలందర మృత్యువాతపడుతున్నారు. పీహెచ్సీ భవన నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేసి వినియోగంలోకి తేవాలి. - రాజు, ఎంపీటీసీ, బిలాల్పూర్. సహనం నశిస్తోంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర జాప్యంపై సహనం నశిస్తోంది. త్వరితగతిన పనులను పూర్తి చేయించాలని ప్రజలు మాపై ఒత్తిడి తెస్తున్నారు. సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోవడంలేదు. ఫోన్ ద్వారా కాంట్రాక్టర్‌ను సంప్రదించినా ఫలితం లేకుండాపోతోంది. వైద్యఆరోగ్య శాఖ, ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పనులను పూర్తి చేయించాలి. - పంతులు అశోక్, సర్పంచ్, బిలాల్పూర్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే బిలాల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణంలో జాప్యం జరుగుతుంది. కాంట్రాక్టర్ పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. సంబంధిత శాఖ అధికారులకు లేఖద్వారా తెలియజేశాం. సాధ్యమైనంత తొందరగా నిర్మాణం పూర్తి చేసి అప్పగించాలని కోరాం. అమర్‌సింగ్, జిల్లా వైద్యాధికారి. -
ఇదేనా మహిళా ‘సంక్షేమం’?
లావేరు: లావేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సలు చేసుకున్న బాలిం తలు నరకయాతన అనుభవించారు. ఒకే బెడ్‌పై ఇద్దరిని ఉంచడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సరైన సౌకర్యాలు కల్పించకపోవడంపై వైద్యసిబ్బందిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. లావే రు పీహెచ్సీలో మంగళవారం కుటుంబ సంక్షేమ శస్త్రచికిత్సల శిబిరం నిర్వహిం చారు. 23 మందికి శస్త్రచికిత్సలు చేశా రు. వీరిని ఒక్కొక్క బెడ్‌పై ఉంచి వైద్యు లు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. అయి తే లావేరు పీహెచ్సీలో నాలుగు బెడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఒకే బెడ్‌పై ఇద్దరిని చొప్పున ఉం చారు. అప్పటికే శస్త్రచికిత్స కారణంగా తీవ్ర నొప్పులతో బాధపడుతున్న బాలి ంతలు ఇలా ఒకేబెడ్‌పై ఇద్దరేసి చొప్పున ఉండటంతో ఇబ్బందులు పడ్డారు. ప్ర భుత్వ ఆస్పత్రుల్లో సంక్షేమ శస్త్రచికిత్స లు చేసుకుంటే సురక్షితమని ప్రచారం చేస్తున్న పాలకులు తగిన సౌకర్యాలు కల్పించకపోవడంపై అన్ని వర్గాల నుంచీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పదేళ్లుగా ఆపరేషన్లు బంద్
నిరుపయోగంగా పీహెచ్సీ ఆపరేషన్ థియేటర్ పట్టించుకోని ఆరోగ్య శాఖ అధికారులు నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయక పదేళ్లవుతోంది. జనాభా పెరుగుదల నియంత్రణపై గంటల తరబడి మాట్లాడే అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల నిర్వహణకు కావాల్సిన అన్ని వసతులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నా సర్జన్ లేకపోవడంతో థియేటర్ నిరుపయోగంగా మారింది. మండల పరిధిలోని వివిధ గ్రామాల నుంచి దాదాపు 150 నుంచి 200 మంది రోగులు ప్రతి రోజు పీహెచ్‌సీలకు వైద్య పరీక్షల నిమిత్తం వస్తుంటారు. నెలలో 30 నుంచి 35 మంది గర్భిణిలు కాన్పుల కోసం పీహెచ్‌సీకి వస్తుంటారు. అయితే పదేళ్లుగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం లేదు. దీంతో చాలా మంది మహిళలు ఉటూర్ ప్రభుత్వ ఆస్పత్రి లేదా ఆదిలాబాద్ రిమ్స్‌కు వెళ్లి ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. పీహెచ్సీలో మొత్తం నాలుగురు డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం ఇద్దరు వైద్యులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బందిలో ముగ్గురు స్టాఫ్ నర్సులు, ఒక వోపీ ఏఎన్ఏం, ఇద్దరు సూపర్వైజర్లు, ఏడుగురు ఏఎన్ఏంలు విధులు నిర్వహిస్తున్నారు. వసతులు లేక రోగుల ఇక్కట్లు మండల కేంద్రంలోని పీహెచ్సీలో కనీస సౌకర్యాలు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రోగులు పడుకునేందుకు కనీసం బెడ్డు, దుపట్లు కూడా లేకపోవడం గమనార్హం. ఆస్పత్రిలో కేవలం ఆరు పడకలు మాత్రమే ఉండడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ల్యాబ్ టెక్నీషియన్లు ఇద్దరు ఉండాల్సి ఉండగా ఒకరు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పరీక్షల నిమిత్తం వచ్చే రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పీహెచ్సీలో ఫార్మసిస్ట్ పోస్టు ఖాళీగా ఉండడంతో ప్రత్యేక అంబులెన్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఫార్మసిస్ట్‌ను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోనే నార్నూర్ ఆతి పెద్ద మండలం అయినప్పటికీ పీహెచ్సీలో సిబ్బంది కొరత వేధిస్తోంది. -
ఆరోగ్య కేంద్రానికి.. అనారోగ్యం.!
మందులున్నా వైద్యం అంతంతమాత్రమే వంతుల వారీగా డాక్టర్ల విధులు పట్టించుకోని అధికారులు, పాలకులు అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే చందంగా ఉంది మండలంలోని ఒడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి. సిబ్బంది కొరతతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఉన్న డాక్టర్లు కూడా వంతుల వారీగా విధులు నిర్వహిస్తుండడంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఉన్నతాధికారులు చూసీ చూడనట్లు ఉంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో ఖాళీ పోస్టులను నియమించి మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. - చిట్యాల ఆస్పత్రిలో రోగులకు బెడ్స్, సరిపడ మం దులు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా రోగులను చూసే నాథుడు లేడు. ఎనిమిది నెలల క్రితం ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్‌రావు పదోన్నతిపై వెళ్లారు. చెల్పూర్ పీహెచ్సీ డాక్టర్ పద్మజా రాణిని ఇన్‌చార్జీగా నియమి ంచారు. ఆమె అప్పుడప్పుడు రావడం వల న ఆసుపత్రి నిర్వహణ గాడితప్పింది. అయి తే గత రెండు నెలల క్రితం హుజూరాబాద్ కు చెందిన డాక్టర్ జడల శ్రీనివాస్‌ను నియమించారు. ఈ డాక్టర్‌తోనైన ఆస్పత్రి నిర్వహణ బాగుంటుందనుకుంటే వారానికి బు ధ, శుక్రవారాలలో రెండు రోజుల పాటు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. వైద్యసిబ్బంది కొరత రోగులకు శాపంగా మారింది. ఫస్ట్ ఏఎన్ఎం పోస్టులు -3, ల్యాబ్ టెక్నీషన్, స్టాఫ్ నర్సు, హెల్త్ అసిస్టెంట్ -2, నైట్ వాచ్మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధి కారులు స్పందించి ఖాళీ పోస్టులను భర్తీచేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు. వైద్య శిబిరం నిర్వహించాలి దవాఖానకు పోతే డాక్టర్ ఉండడం లే దు. ఏఎన్ఎం మా త్రమే వచ్చిపోతుం ది. మా గ్రామంలో ఇప్పటివరకు వైద్య శిబిరం నిర్వహించలేదు. ఇప్పటికైన సార్లు స్పందించి మా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి రోగులకు పరీక్షలు జరిపి మందులివ్వాలి. - ఊయ్యాల రమ, నైన్పాక అవగాహన కల్పించాలి వ్యాధులపై ప్రజలలో అవగాహన లేదు. ఆరో గ్య సూత్రాలు పాటించేలా అవగాహన కల్పించాలి. సెకండ్ ఏఎన్ఎంలు తప్ప గ్రామానికి ఎవరూ రావడం లేదు. వైద్యులు, సిబ్బంది కలిసి ప్రజలకు వ్యాధులపై అవగాహన సదస్సులు నిర్వహించాలి. - దాసారపు నరేష్, తిర్మాలాపూర్ -
వైద్య సేవలకు ఆటంకమైన ‘కోడ్’
డెప్యూటేషన్ సిబ్బందితో నెట్టుకొస్తున్న పొన్నెకల్లు ఆరోగ్య కేంద్రం తాడికొండ : మండలంలోని పొన్నెకల్లు గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాదాపు అందరూ డెప్యూటేషన్లపై వచ్చిన వైద్య సిబ్బంది కావటంతో రోగులకు సేవలు కరువయ్యాయి. ఐదేళ్ళ క్రితం తుళ్ళూరు పీహెచ్సీలో పని చేసిన వైద్య సిబ్బందితో పొన్నెకల్లులో నూతనంగా ప్రాథమిక వైద్యశాలను ఏర్పాటు చేశారు.ఎక్కువమంది ఇతర ప్రాంతాల్లో పని చేస్తున్న సిబ్బందిని డెప్యూటేషన్‌పై ఇక్కడ నియమించారు. దీంతో వైద్య సిబ్బంది పొరుగు ప్రాంతాల నుంచి విధులకు హాజరు కావట్లేదు. ఇది రోగులకు ఇబ్బందిగా మారింది. ఇప్పటివరకు మెడికల్ అధికారి పోస్టు భర్తీ కాలేదు. డెప్యూటేషన్‌పై డాక్టర్ ఎన్. దివ్యశ్రీ రోజూ ఆస్పత్రిలో ఓపీ చూసుకుంటూ అదనంగా 104 వాహనం ద్వారా సేవలు అందించేందుకు ఆయా గ్రామాలకు వెళ్తున్నారు. ఇలా రెండు వైపులా విధులు నిర్వహించటం ఇబ్బందిగా మారింది. అలాగే, సీహెచ్‌వో, ఫార్మసిస్ట్‌లు కూడా డెప్యూటేషన్లపై వచ్చి ఇక్కడ సేవలందిస్తున్నారు. డీడీవో కోడ్ రాకపోవటంతో.. ప్రాథమిక వైద్యశాల ఏర్పాటు చేసి ఐదేళ్ళు దాటినా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి డీడీవో (డిస్పర్స్‌మెంట్ డ్రాయింగ్ ఆఫీసర్) కోడ్ రాలేదు. దీంతో అందరూ డెప్యూటేషన్పైనే వచ్చిన వారు కావటంతో సకాలంలో సేవలు అందించలేకపోతున్నారు. ఆస్పత్రిలో మందుల కొరత లేకున్నా సిబ్బంది సమయ పాలన పాటించడం లేదు. కొన్నాళ్లుగా తుళ్ళూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డ్రాయింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డీడీఓ కోడ్ అమల్లోకి తెస్తే పోస్టులు భర్తీ చేసి మండల ప్రజానీకానికి మెరుగైన వైద్య సేవలు అందుతాయని పలువురు భావిస్తున్నారు. -
ఆస్పత్రి అధోగతి
ఇది వెంకటాపురం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. మండలంలోని 12 గ్రామాలకు ఏకైక దిక్కరుున ఈ పీహెచ్సీలో సమస్యలు అనేకం. పీహెచ్సీ ఆవరణ అంతా పిచ్చిమొక్కలతో అడవిని తలపిస్తోంది. ఇక ఆస్పత్రి ఎదుట పెద్ద పాముల పుట్ట. అందులో నుంచి అప్పుడప్పుడు విషసర్పాలు బయటకు వస్తుండడంతో సిబ్బంది, ఆస్పత్రికి వచ్చే ప్రజలు భయూందోళనకు గురవుతున్నారు. ఇక్కడ సిబ్బంది సేవలు కూడా అంతంతమాత్రంగానే ఉన్నారుు. మరుగుదొడ్లు, తాగునీటి సమస్య షరా మామూలే. ఆస్పత్రి ఆవరణలో ఆరు మరుగుదొడ్లు ఉన్నా అందులో మూడే పని చేస్తున్నారుు. తాగునీటి ట్యాంకును గత ఆరు నెలలుగా శుభ్రం చేసిన నాథుడే లేడు. దీంతో ఈ పీహెచ్‌సీకి వచ్చే పేద రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. - వెంకటాపురం -
కు.ని పాట్లు
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులలు పడ్డారు. శుక్రవారం నిర్వహించిన కుట్టు, కోత లేని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (డబల్ పంక్చర్ ల్యాప్రోస్కోపిక్) శిబిరానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నిలువ నీడ లేక చెట్ల కిందనే పడిగాపులుకాసారు. ఆపరేషన్లు మధ్యాహ్నం 1 గంటల సమయంలో ప్రారంభించడంతో వారు ఆకలితో అలమటించారు. ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు పడుకునేందుకు వసతీ లేకపోవడంతో కొందరు నేలమీద, చెట్ల నీడనే పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 101 మందికి వైద్యులు ఆపరేషన్ చేశారు.