కు.ని పాట్లు
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కనీస వసతులు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులలు పడ్డారు. శుక్రవారం నిర్వహించిన కుట్టు, కోత లేని కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (డబల్ పంక్చర్ ల్యాప్రోస్కోపిక్) శిబిరానికి మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నిలువ నీడ లేక చెట్ల కిందనే పడిగాపులుకాసారు.
ఆపరేషన్లు మధ్యాహ్నం 1 గంటల సమయంలో ప్రారంభించడంతో వారు ఆకలితో అలమటించారు. ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు పడుకునేందుకు వసతీ లేకపోవడంతో కొందరు నేలమీద, చెట్ల నీడనే పడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 101 మందికి వైద్యులు ఆపరేషన్ చేశారు.