నిండుగా మందులు.. కనిపించని సిబ్బంది | There is no staff at the primary health center | Sakshi
Sakshi News home page

నిండుగా మందులు.. కనిపించని సిబ్బంది

Published Mon, Jul 10 2017 5:46 AM | Last Updated on Tue, Sep 5 2017 3:42 PM

నిండుగా మందులు.. కనిపించని సిబ్బంది

నిండుగా మందులు.. కనిపించని సిబ్బంది

ఆత్మకూరు(ఎం) : మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కుక్కకాటు, తేలుకాటు, పాముకాటు మందులు అందుబాటులో ఉన్నాయి. సిబ్బందే లేరు. సాక్షి ఆదివారం ఆస్పత్రులను సందర్శించింది. 2016 ఆగష్టు నుంచి ఇప్పటి వరకు 387 మంది ఇందుకు సంబంధించి రోగులకు చికిత్సను అందించారు. కుక్కకాటుకు ఏఆర్‌వీ 40 వాయిల్స్, తేలు కాటుకు హైడ్రోజోల్‌కాటిజోన్‌ 60 వాయిల్స్, యాంటీ స్నేక్‌కు సంబంధించి రెండు వాయిల్స్‌ అందుబాటులో ఉన్నాయి.   

నిధులకు హాజరుకాని డాక్టర్లు, సిబ్బంది
మోత్కూరు : మోత్కూరులోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేళకు డాక్టర్లు, సిబ్బంది రాకపోవడంతో రోగులు ఆస్పత్రి ఆవరణలో  నిరీక్షించాల్సి వస్తోంది.  వచ్చినా సమావేశాలని వెళ్లడంతో రోగులకు వైద్య సేవలు అందడం లేదు. కాగా పాముకాటు, తేలుకాటు, కుక్కకాటు అత్యవసర మందులు అందుబాటులోఉన్నాయి. డయేరియా, మలేరియా, అతిసార సంబంధించిన మం దులకు ఎలాంటి కొరతా లేదు.

పాము కాటుతో మృతి చెందిన వారి వివరాలు
ఆలేరు : మందులు అందుబాటులో ఉన్నా కొందరు పాము కాటుతో సంవత్సర కాలంలో కొందరు మృతి చెందారు. 2017 మే 27న ఆలేరు పట్టణంలో నితిన్‌ అనే బాలుడు నిద్రిస్తున్న సమయంలో కట్లపాము కాటేయడంతో చనిపోయాడు.
∙2017జూన్‌ 8çన తుర్కపల్లి మండలం మాదాపూర్‌లో సిద్దెంకి మౌనికను కట్లపాము కాటు వేసింది. సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
∙2017 జూలై 5న మోటకొండూరు మండలం మాటూర్‌కి చెందిన అంబాల మణికంఠ పాముకాటుకు గురై మృతి చెందాడు.  
∙2016 జూన్‌ 08 తుర్కపల్లి మండలం మదాపూర్‌లో బీడీ కార్మికురాలి కుమార్తె భవ్యశ్రీ(7) పాముకాటుకు గురై చికిత్స పొందుతూ చనిపోయింది.
∙2016 జూన్‌ 11 న ఆత్మకూరు(ఎం) మండలం టీ.రేపాక గ్రామంలో సుశీల అనే మహిళ వ్యవసాయ బావివద్ద పనులు చేస్తుండగా తేలుకాటుకు గురై చికిత్స పొందుతూ మరణించింది.
∙2016 యాదగిరిగుట్ట మండలం మల్లాపురం పరిధిలోని పిట్టలగూడెంలో  బాలిక పాముకాటుతో మరణించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement