ఆరోగ్య కేంద్రానికి.. అనారోగ్యం.! | Illness to the health center.! | Sakshi
Sakshi News home page

ఆరోగ్య కేంద్రానికి.. అనారోగ్యం.!

Published Tue, Apr 12 2016 1:17 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

Illness to the health center.!

మందులున్నా వైద్యం అంతంతమాత్రమే
వంతుల వారీగా డాక్టర్ల విధులు

పట్టించుకోని అధికారులు, పాలకులు

 

అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే చందంగా ఉంది మండలంలోని ఒడితల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిస్థితి. సిబ్బంది కొరతతో రోగులు అవస్థలు పడుతున్నారు. ఉన్న డాక్టర్లు కూడా వంతుల వారీగా విధులు నిర్వహిస్తుండడంతో రోగులకు సరైన వైద్యం అందడం లేదు. ఉన్నతాధికారులు చూసీ చూడనట్లు ఉంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   ఆస్పత్రిలో ఖాళీ పోస్టులను నియమించి మెరుగైన వైద్యం అందించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.           - చిట్యాల

 

ఆస్పత్రిలో రోగులకు బెడ్స్, సరిపడ మం దులు, అన్ని రకాల సౌకర్యాలు ఉన్నా రోగులను చూసే నాథుడు లేడు. ఎనిమిది నెలల క్రితం ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్‌రావు పదోన్నతిపై వెళ్లారు. చెల్పూర్ పీహెచ్‌సీ డాక్టర్ పద్మజా రాణిని ఇన్‌చార్జీగా నియమి ంచారు. ఆమె అప్పుడప్పుడు రావడం వల న ఆసుపత్రి నిర్వహణ గాడితప్పింది. అయి తే గత రెండు నెలల క్రితం హుజూరాబాద్ కు చెందిన డాక్టర్ జడల శ్రీనివాస్‌ను నియమించారు. ఈ డాక్టర్‌తోనైన ఆస్పత్రి నిర్వహణ బాగుంటుందనుకుంటే వారానికి బు ధ, శుక్రవారాలలో రెండు రోజుల పాటు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని ఆయా గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. వైద్యసిబ్బంది కొరత రోగులకు శాపంగా మారింది. ఫస్ట్ ఏఎన్‌ఎం పోస్టులు -3, ల్యాబ్ టెక్నీషన్, స్టాఫ్ నర్సు, హెల్త్ అసిస్టెంట్ -2, నైట్ వాచ్‌మెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అధి కారులు స్పందించి ఖాళీ పోస్టులను భర్తీచేసి రోగులకు మెరుగైన వైద్యం అందించాలని    కోరుతున్నారు.

 

వైద్య శిబిరం నిర్వహించాలి

దవాఖానకు పోతే డాక్టర్ ఉండడం లే దు. ఏఎన్‌ఎం మా త్రమే వచ్చిపోతుం ది. మా గ్రామంలో  ఇప్పటివరకు వైద్య శిబిరం నిర్వహించలేదు. ఇప్పటికైన సార్లు స్పందించి మా గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటుచేసి రోగులకు పరీక్షలు జరిపి మందులివ్వాలి.  - ఊయ్యాల రమ, నైన్‌పాక

 

అవగాహన కల్పించాలి
వ్యాధులపై ప్రజలలో అవగాహన లేదు. ఆరో గ్య సూత్రాలు పాటించేలా అవగాహన కల్పించాలి. సెకండ్ ఏఎన్‌ఎంలు తప్ప గ్రామానికి ఎవరూ రావడం లేదు. వైద్యులు, సిబ్బంది కలిసి ప్రజలకు వ్యాధులపై అవగాహన సదస్సులు నిర్వహించాలి.  - దాసారపు నరేష్,  తిర్మాలాపూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement