1.73 లక్షల మందికి పోలియో చుక్కలు | Polio drops to 1.73 lakh kids | Sakshi
Sakshi News home page

1.73 లక్షల మందికి పోలియో చుక్కలు

Published Mon, Jan 19 2015 5:42 AM | Last Updated on Sat, Sep 2 2017 7:55 PM

1.73 లక్షల మందికి పోలియో చుక్కలు

1.73 లక్షల మందికి పోలియో చుక్కలు

హొసూరు : పల్స్‌పోలియో కార్యక్రమంలోభాగంగా ఆదివారం క్రిష్ణగిరి జిల్లాలో 1.73 వేల మంది పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లా కలెక్టర్ టి.పి.రాజేష్ ఆదివారం ఉదయం బర్గూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రిష్ణగిరి ఎంపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యులు పాల్గొన్నారు. జిల్లాలోని 10 పంచాయతీ సమితుల్లో 881 పోలియో శిబిరాలను ఏర్పాటు చేశారు.  

క్రిష్ణగిరి, హొసూరు మున్సిపాలిటీల్లో 70 శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు, వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, శ్రీలంక శరణార్థుల శిబిరాల్లో పోలియో చుక్కలు వేసేందుకు మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో 2 లక్షల 35 వేల పోలియో చుక్కలను సిద్ధంగా ఉంచుకొన్నారు. వైద్య శాఖ, విద్యాశాఖ, స్వచ్ఛంద సంస్థలకు చెందిన 3804 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బస్టాండులు, రైల్వేస్టేషన్‌లలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. ఐదేళ్ల వయసు పిల్లలకు పోలియో చుక్కలను వేశారు.
 
హొసూరులో...
హొసూరు మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండులో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో మున్సిపల్ చైర్మన్ బాలక్రిష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాము పోలియో చుక్కలను వేసి శిబిరాన్ని ప్రారంభించారు. క్రిష్ణగిరి బస్టాండులో మున్సిపల్ చైర్మన్ తంగముత్తు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక వైద్య కేంద్రాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో  పోలియో చుక్కలు వేసే కార్యక్రమం చేపట్టారు.  
 
పల్స్ పోలియో ప్రారంభం
సింధనూరు టౌన్ : తాలూకాలోని గొరేబాళ్ గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఉప తహశీల్దార్ హనుమంతప్ప ఆదివారం ప్రారంభించారు. గ్రామంలోని అంగన్‌వాడీ 4వ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సభ్యుడు ఎం.అమరేశ్, శామిద్‌సాబ్, శరణప్ప, ఆశా కార్యకర్తలు శశికళ, అంగన్‌వాడీ కార్యకర్తలు శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు. తాలూకాలోని సాలగుందా గ్రామ పంచాయతీలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. తాలూకా పంచాయతీ సభ్యురాలు గౌరమ్మ శరణబసవ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు హులిగెమ్మ, తిమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
 
పల్స్ పోలియోకు శ్రీకారం
సింధనూరు టౌన్ : 19వ వార్డులో పల్స్ పోలియో కార్యక్రమానికి నగరసభ సభ్యుడు శరణబసవ గొరేబాళ్ ఆదివారం శ్రీకారం చుట్టారు. శరణబసవేశ్వర కాలనీ, ప్రాథమిక పాఠశాలలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమంలో ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేసి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రముఖులు యమనప్ప, అంగన్‌వాడీ కార్యకర్త ఉమ తదితరులు పాల్గొన్నారు. 6వ వార్డులో నగరసభ సభ్యుడు హాజిమస్తాన్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో ఎఫ్‌ఏ హణగి, అంగన్‌వాడీ కార్యకర్త శాంభవి, హజిరాబేగం తదితరులు పాల్గొన్నారు.
 
పోలియో చుక్కలు తప్పనిసరి
చెళ్లకెర రూరల్ : పిల్లలను అంగవైకల్యం నుంచి కాపాడేందుకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే టి.రఘుమూర్తి తెలిపారు. ఆయన ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పిల్లలకు పోలియో చుక్కలు వేసి, పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ అనేక పథకాలను జారీ చేసిందన్నారు.

పిల్లల ఉత్తమ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పోషకులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తెలిపారు. తాలూకా ఆరోగ్య అధికారి ప్రేమసుధ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. 32,106 మందికి పోలీయో వేయించామన్నారు. 226 బూత్‌లకు 458 మంది సిబ్బందిని నియమించామన్నారు. కార్యక్రమంలో పురసభ అధ్యక్షుడు ఎం.మంజునాథ్, తిప్పేస్వామి, ఆరోగ్య సహాయకులు తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement