పేదోడి కడుపు నింపడమే కాంగ్రెస్‌కు తెలుసు : మంత్రి సీతక్క | - | Sakshi
Sakshi News home page

పేదోడి కడుపు నింపడమే కాంగ్రెస్‌కు తెలుసు : మంత్రి సీతక్క

Published Mon, Mar 4 2024 1:50 AM | Last Updated on Mon, Mar 4 2024 8:44 AM

- - Sakshi

కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు

జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క

బోథ్‌ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారం

ఆదిలాబాద్‌: పేద కుటుంబాల కడుపు నింపడమే కాంగ్రెస్‌ పార్టీకి తెలుస ని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్‌ శాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క అన్నారు. కష్టపడ్డ ప్రతీ కార్యకర్తను పార్టీ గు ర్తుంచుకుంటుందన్నారు. పదవులు పొందిన నాయకులు ప్రజ లకు సేవ చేయాలన్నారు. బోథ్‌ మార్కెట్‌ కమిటీ పాలకవర్గ ప్ర మాణస్వీకార కార్యక్రమం మండలకేంద్రంలోని పరిచయ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

పాలకవర్గ సభ్యులు బాధ్యతగా వ్యవహరిస్తూ రైతులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌, 200యూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నామన్నారు. పేద కుటుంబా లను ఆర్థికంగా ఆదుకునే కాంగ్రెస్‌ పార్టీని రానున్న ఎంపీ ఎన్నికల్లోనూ గెలిపించాలన్నారు. బోథ్‌ రెవెన్యూ డివిజన్‌, ఫైర్‌స్టేషన్‌ ఏ ర్పాటు, సొనాల మండలంలో నూతన కార్యాలయాలు, కొత్త పో స్టుల మంజూరు కోసం కేబినెట్‌లో ప్రస్తావిస్తానని తెలిపారు. ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు మాట్లాడుతూ.. ప్రజల్లో ఉంటేనే పార్టీ అవకాశం కల్పిస్తుందన్నారు. ఇందుకు తానే ఉదాహరణ అని అన్నారు.

నూతన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బొడ్డు గంగారెడ్డి మా ట్లాడుతూ, రైతుల పక్షాన ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ముందుగా జిల్లా మార్కెటింగ్‌ అధికారి శ్రీనివాస్‌ నూత న పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆడె గజేందర్‌, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సత్తు మల్లేశ్‌, తెలంగాణ కాంగ్రెస్‌ కి సాన్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ అడ్డి భోజా రెడ్డి, బజార్‌హత్నూర్‌ జెడ్పీటీసీ నర్సయ్య, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భూపల్లి శ్రీధర్‌, కిసాన్‌ సెల్‌ రాష్ట్ర నాయకుడు శ్రీకాంత్‌రెడ్డి, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు ప్రపూల్‌రెడ్డి, మహమూద్‌ఖాన్‌, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, రైతు సంఘాల నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం ద్వారానే సంక్షేమం..
కాంగ్రెస్‌ ప్రభుత్వం ద్వారనే ప్రజా సంక్షేమం జరుగుతుందని మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని విద్యానగర్‌ కాలనీలో గృహజ్యోతి పథకాన్ని ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి గృహజ్యోతి పథకం ప్రారంభించినట్లు తెలిపారు. రెండు వందల యూనిట్లలోపు విద్యుత్‌ వినియోగించుకునే వారికి జీరో బిల్లు ల ద్వారా లబ్ధి చేకూరుస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఖానా పూర్‌ ఎమ్మెల్మే వెడ్మ బొజ్జు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మహిముద్‌ఖాన్‌, వైస్‌ ఎంపీపీ జాలైజాకు, ఎస్‌ఈ జైవంత్‌రావు, డీఈ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

నిండు జీవితానికి రెండు చుక్కలు..
చిన్నారుల నిండు జీవితానికి.. రెండు చుక్కల మందు వేయించాలని మంత్రి సీతక్క అన్నారు. ఆదివారం బోథ్‌కు వె ళ్తుండగా మార్గమధ్యలో మండలకేంద్రంలో పల్స్‌ పోలియోకేంద్రా న్ని సందర్శించి చిన్నారులకు పోలియోచుక్కలు వేశారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. మంత్రిని కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి గజేందర్‌ శాలువాతో సత్కరించారు. వారివెంట ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నాయకులు మల్లేశ్‌, ఏఎంసీ ఉపాధ్యక్షుడు వసంత్‌రావు, బోథ్‌ బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు ప్రపుల్‌చందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: నేడు తెలంగాణకు ప్రధాని మోదీ.. షెడ్యూల్‌ ఇలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement