పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థితో పాటు వారికి గెలుపు ప్రతిష్టాత్మకమే
కాంగ్రెస్‌కు సీతక్క.. బీజేపీకి పాయల్ శంకర్
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాల నిర్వహణలో ముందంజ
వెనుకబడ్డ బీఆర్‌ఎస్
ఇప్పటికీ ఇన్‌చార్జీ నియామకం.. సమావేశాల ఊసే లేదు
సాక్షి, ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థితో పాటు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న నేతలకు కూడా గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా రాష్ట్ర మంత్రి సీతక్క వ్యవహరిస్తుండగా బీజేపీ ఇన్‌చార్జిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పా యల్ శంకర్ ఉన్నారు. బీఆర్‌ఎస్ పార్టీలో ఇప్పటికీ ఇన్‌చార్జీ నియామకం చేపట్టలేదు. బీజేపీ సిట్టింగ్ సీటులో మళ్లీ గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ ఈ సెగ్మెంట్‌లో పాగా వేస్తామన్న వి శ్వాసం వ్యక్తం చేస్తోంది. బీఆర్‌ఎస్ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్ల ఆదరణ తమకే అమితంగా ఉందంటూ విజయంపై భరోసాగా ఉంది. మొ త్తంగా ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి.
బీజేపీ, కాంగ్రెస్ స్పీడ్..
బీజేపీ అభ్యర్థిగా గొడం నగేష్‌ను ఖరారు చేయడంతో పాటు పార్లమెంట్ ఇన్‌చార్జీగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను నియమించడంలో మిగితా పార్టీలకంటే ముందుంది. ఈ పార్టీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే సమావేశాలు పూర్తి చేసింది. ఇక మండలాల వారీగా సమావేశాల నిర్వహణ ప్రారంభించింది. కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజకవర్గం మినహా మిగితా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తి చేసింది.
ఈనెల 7న అక్కడ కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నియోజకవర్గాల వారీగా సమావేశాల నిర్వహణలో అభ్యర్థితో పాటు ఇన్‌చార్జీ పాయల్ శంకర్ ఆదిలాబాద్‌లో మినహా మిగితా నియోజకవర్గాల్లో పాల్గొనడం లేదు. అయి తే కాంగ్రెస్‌లో అభ్యర్థితో పాటు ఇన్‌చార్జీ సీతక్క ప్ర తీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొంటున్నారు.
ఇన్‌చార్జీ నియామకమే లేదు..
బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు పార్లమెంట్ ఇన్‌చార్జీగా పార్టీ పరంగా ఎవరినీ నియమించలేదు. అయితే మాజీ మంత్రి జోగు రామన్నను ఇన్‌చార్జీగా నియమించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఈ నెల 5 తర్వాత ఈ విషయంలో నిర్ణయం వెలువడవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
కాగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు కేవలం బోథ్ నియోజకవర్గంలోనే ఈ పార్టీ సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్, ఆసిఫాబాద్‌లో మినహా మిగితా అన్నిచోట్ల ఓటమి చవి చూసింది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్ల పరంగా మిగితా అన్ని పార్టీలకంటే బీఆర్‌ఎస్ ముందుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడడం, నియోజకవర్గాల్లో క్యాడర్‌కు దిశానిర్దేశం చేసే నేతలు లేకపోవడం మైనస్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్తుందనేది వేచి చూడాల్సిందే.
ఇవి చదవండి: ‘పొలంబాట’న కేసీఆర్.. సెంటిమెంట్ జిల్లాపై స్పెషల్ ఫోకస్!
Comments
Please login to add a commentAdd a comment