payal shankar
-
టార్గెట్ ‘హైడ్రా’.. బీజేపీ నేతల కొత్త ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన హైడ్రా చర్చనీయాంశంగా మారింది. చెరువుల పరిరక్షణ, ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్క్ష్యంగా హైడ్రా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రా పనితీరుపై ప్రతిపక్షాలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సామాన్యుల నివాసాలను మాత్రమే టార్గెట్ చేస్తూ హైడ్రా.. కొత్త డ్రామాలకు తెరతీసిందంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక బీజేపీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు.ఇక నుంచి నగరంలోని చెరువులన్నింటినీ తిరిగి ఎఫ్టీఎల్, బఫర్జోన్లను ఆక్రమించి కట్టిన కట్టడాల వివరాలను బీజేపీ నేతలు సేకరించనున్నారు. ఇందులో భాగంగా ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలు రోజుకు ఒకరు ఒక్కో చెరువును పరిశీలించనున్నారు. ఈ సందర్భంగా ఆక్రమణలకు గురైన వివరాలన్నింటినీ హైడ్రాకు అందజేస్తారు. ఇక, వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఒత్తిడి పెంచుతారని ఆ పార్టీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చెప్పుకొచ్చారు.తాజాగా బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. చెరువులను కబ్జా చేసి నిర్మాణం చేసిన భవనాలను కూల్చడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. హైడ్రా పక్షపాత ధోరణిపైనే మాకు అనుమానాలు ఉన్నాయి. అభివృద్ధి పేరుతో దాదాపు పాతిక చెరువులను రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా బాబులకు ప్రభుత్వం కట్టబెట్టింది. చెరువు మధ్యలో నుంచే రోడ్ల నిర్మాణం జరిగింది. వీరికి ఎలాంటి నోటీసులు జారీ కాలేదు. హైడ్రా చిత్తశుద్ధితో పని చేయడం లేదు. సల్కం చెరువులో కట్టిన ఫాతిమా కాలేజీకి నోటీసులు ఇచ్చారా?. ఒకవేళ ఇచ్చినట్లయితే వాటిని ఇంత వరకు ఎందుకు బహిర్గతం చేయలేదు. మజ్లిస్ నేతల జోలికి వెళ్లడానికి హైడ్రాకు, రాష్ట్ర ప్రభుత్వానికి సాహసం లేదా? నానక్‌రామ్‌గూడలో చెరువులను మీనాక్షి బిల్డర్లు, వంశీరాం బిల్డర్లు చెరువులో నిర్మాణాలు చెపట్టారు. వారిపై చర్యలెందుకు లేవని ప్రశ్నించారు. పేదలపై మాత్రమే హైడ్రా తన ప్రతాపాన్ని చూపిస్తున్నదని, పెద్దల కబ్జాల వివరాలన్నింటినీ సమర్పించి ఒత్తిడి పెంచుతామని అన్నారు. ఒకవేళ చర్యలు తీసుకోని పక్షంలో హైకోర్టును ఆశ్రయిస్తామని వార్నింగ్ ఇచ్చారు. -
మాకెందుకు రుణమాఫీ కాలేదు
సాక్షి, నెట్వర్క్: రుణమాఫీ జరగలేదంటూ రైతులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. పలుచోట్ల బ్యాంకుల వద్ద బారులుదీరి మాకెందుకు రుణమాఫీ కాలే దంటూ బ్యాంకు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ⇒ సిద్దిపేట జిల్లా తోటపల్లిలో రైతులు ఇండియన్ బ్యాంక్ సిబ్బందిని బయటకు పంపి బ్యాంకును మూసివేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ బ్యాంక్ పరిధిలో 1,300 మంది రైతులుంటే కేవలం 400 మందికి మాత్రమే మాఫీ అయ్యిందని మండిపడ్డారు. నాలుగు గంటల పాటు ఆందోళన కొనసాగగా, లీడ్ బ్యాంక్ మేనేజర్ హరిప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ⇒ మెదక్ మండల పరిధిలో అత్యధికంగా రైతులు ఆటోనగర్‌లోని ఎస్బీఐ ఏడీబీ బ్యాంకులో రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ వివరాలు తెలుసుకునేందుకు వచ్చే రైతుల రద్దీ పెరగ్గా, బ్యాంకు అధికారులు రోజూ కొందరికి టోకెన్లు ఇచ్చి వివరాలు చెబుతున్నారు. ఆదివారం సెలవు, సోమవారం రాఖీపౌర్ణమి కావడంతో బ్యాంకుకు రైతులు పెద్దగా రాలేదు. మంగళవారం పెద్ద ఎత్తున తరలివచ్చిన రైతులు రోడ్డువెంట బారులు తీరారు. ఈ క్రమంలో చిన్నపాటి వర్షం పడుతున్నా, లెక్క చేయకుండా వరుసలోనే నిలబడ్డారు. ⇒ ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతువేదికల్లో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్ల వద్ద, బ్యాంకుల వద్ద రైతులు బారులు దీరుతున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ యూనియన్ బ్యాంకుకు మంగళవారం రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ‘సారూ.. జర మా ఖాతా చూడండి. ఎందుకు మాఫీ కాలేదో చెప్పండి’ అంటూ వేడుకున్నా రు. మరోవైపు వరంగల్ జిల్లా సంగెం మండలంలోని గవిచర్ల వద్ద, మహబూబాబాద్ జిల్లా బయ్యారం, నర్సింహులపేటలలో, జనగామ కలెక్టరేట్ ఎదుట ధర్నాలు నిర్వహించారు. జనగామ జిల్లా దేవరుప్పులలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ⇒ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో అన్నదాతలు మంగళవారం పెద్ద ఎత్తున ధర్నా చేశారు. భూషణరావుపేట గ్రామానికి చెందిన రైతు ముస్కు సాగర్‌రెడ్డి పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన కథలాపూర్ ఎస్సై నవీన్‌కుమార్ రైతు చేతిలో నుంచి పురుగుల మందు డబ్బాను లాక్కు న్నారు. పంటల సాగుకు చేసిన అప్పు పెరిగిపోయిందని, రుణమాఫీ కాలేదని సాగర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మల్లాపూర్ మండలంలోని రాఘవపేటకు చెందిన రైతు సోమ శ్రీనివాస్ తన ఇంట్లోనే ఆమరణ నిరాహార దీక్షకు దిగాడు. రైతు శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన భార్య సోమలత పేరిట ముత్యంపేట ఇండియన్ బ్యాంక్‌లో రూ.1.21 లక్షల రుణం ఉందని, మాఫీకి అన్ని అర్హతలూ ఉన్నా, కాలేదన్నారు. ⇒ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహారాష్ట్ర బ్యాంకు ఎదుట బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆధ్వర్యంలో రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గుడిహ త్నూర్ మండల కేంద్రంలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై బీజేపీ శ్రేణులు రాస్తారోకో చేశారు. అనంతరం సీఎం దిష్టిబొమ్మ దహనం చేశారు.మాకు రుణమాఫీ కాలేదు⇒ ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులకు రైతుల ఫిర్యాదు⇒ రూ.2 లక్షలకుపైగా రుణం ఉన్నవారు బ్యాంకులు ⇒ సందర్శించే షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తమకు రుణమాఫీ కాలేదని, మాఫీలో అనేక సమస్యలు ఉన్నాయని రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని 566 రైతు వేదికల రైతులతో మంగళవారం నిర్వహించిన ‘రైతు నేస్తం’ వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమం ద్వారా అధికారులకు ఈ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఖమ్మం, నిజామాబాద్, నాగర్‌కర్నూల్, జనగామ, కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్‌తోపాటు పలు రైతు వేదికలకు చెందిన రైతులు పంట రుణ మాఫీలో సమస్యలు ఉన్నాయని తెలిపారు.ఈ సందర్భంగా వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు, సంచాలకులు గోపి పంట రుణాల మాఫీ పథకానికి సంబంధించిన వివిధ ఫిర్యాదులపై స్పష్టత ఇచ్చారు. రఘునందన్‌రావు మాట్లాడుతూ, కుటుంబ సమూహానికి సంబంధించిన సమస్యలకు ప్రభుత్వం విధివిధానాలను జారీ చేస్తుందని తెలిపారు. కుటుంబ రుణ మొత్తాలు రూ. 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న సందర్భాల్లో రైతులు బ్యాంకులను సందర్శించేందుకు ప్రభుత్వం ప్రత్యేక షెడ్యూల్‌ను ప్రకటిస్తుందని తెలిపారు. ఇంకా రుణమాఫీ పొందని రైతులు ఆధార్ కార్డులకు సంబంధించిన సమాచారం, బ్యాంక్ డేటాలో తప్పులు, పట్టా పాస్ పుస్తకాల సమస్యలు, పేరు సరిగ్గా లేకపోవడం మొదలైన ఫిర్యాదు లను మండల స్థాయిలో సమర్పించవచ్చని సూచించారు.పంట రుణమాఫీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు పరిష్కారమయ్యే వరకు అన్ని పని దినాల్లో మండల స్థాయిలో నియమించబడిన నోడల్ అధికారులు అందు బాటులో ఉంటారని తెలిపారు. అర్హులైన ప్రతి రైతులు రుణమాఫీ ప్రయో జనం పొందుతారని తెలిపారు. ఫిర్యా దుల స్వీకరణకు నిర్దిష్ట కటాఫ్ తేదీ లేనందున రుణాల మాఫీ పథకానికి సంబంధించిన ఫిర్యాదులు పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు రైతులు ఎప్పుడైనా తమ ఫిర్యాదులను సమర్పించవచ్చన్నారు. మండల స్థాయిలో నోడల్ అధికారు లను నియమించాలని, రైతుల పట్ల సానుభూతితో వ్యవహరించాలని వ్యవసాయ సంచాలకులు గోపి కిందిస్థాయి అధికారులను కోరారు. అన్ని పని దినాలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పంట రుణా ల మాఫీ ఫిర్యాదులకు హాజరు కావాలని అధికారులను ఆదేశించారు. -
ఇన్‌చార్జీలకు సవాలే..
సాక్షి, ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థితో పాటు ఇన్‌చార్జీగా వ్యవహరిస్తున్న నేతలకు కూడా గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా రాష్ట్ర మంత్రి సీతక్క వ్యవహరిస్తుండగా బీజేపీ ఇన్చార్జిగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పా యల్ శంకర్ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికీ ఇన్చార్జీ నియామకం చేపట్టలేదు. బీజేపీ సిట్టింగ్ సీటులో మళ్లీ గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తుండగా కాంగ్రెస్ ఈ సెగ్మెంట్లో పాగా వేస్తామన్న వి శ్వాసం వ్యక్తం చేస్తోంది. బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఓటర్ల ఆదరణ తమకే అమితంగా ఉందంటూ విజయంపై భరోసాగా ఉంది. మొ త్తంగా ఈ ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ స్పీడ్.. బీజేపీ అభ్యర్థిగా గొడం నగేష్‌ను ఖరారు చేయడంతో పాటు పార్లమెంట్ ఇన్‌చార్జీగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్‌ను నియమించడంలో మిగితా పార్టీలకంటే ముందుంది. ఈ పార్టీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే సమావేశాలు పూర్తి చేసింది. ఇక మండలాల వారీగా సమావేశాల నిర్వహణ ప్రారంభించింది. కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజకవర్గం మినహా మిగితా అన్ని నియోజకవర్గాల్లో సమావేశాలు పూర్తి చేసింది. ఈనెల 7న అక్కడ కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీ నియోజకవర్గాల వారీగా సమావేశాల నిర్వహణలో అభ్యర్థితో పాటు ఇన్చార్జీ పాయల్ శంకర్ ఆదిలాబాద్‌లో మినహా మిగితా నియోజకవర్గాల్లో పాల్గొనడం లేదు. అయి తే కాంగ్రెస్‌లో అభ్యర్థితో పాటు ఇన్చార్జీ సీతక్క ప్ర తీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇన్చార్జీ నియామకమే లేదు.. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కును ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు పార్లమెంట్ ఇన్‌చార్జీగా పార్టీ పరంగా ఎవరినీ నియమించలేదు. అయితే మాజీ మంత్రి జోగు రామన్నను ఇన్‌చార్జీగా నియమించే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం సాగుతోంది. ఈ నెల 5 తర్వాత ఈ విషయంలో నిర్ణయం వెలువడవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఈ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఇప్పటివరకు కేవలం బోథ్ నియోజకవర్గంలోనే ఈ పార్టీ సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్, ఆసిఫాబాద్‌లో మినహా మిగితా అన్నిచోట్ల ఓటమి చవి చూసింది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓట్ల పరంగా మిగితా అన్ని పార్టీలకంటే బీఆర్ఎస్ ముందుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పలువురు సీనియర్ నాయకులు పార్టీని వీడడం, నియోజకవర్గాల్లో క్యాడర్‌కు దిశానిర్దేశం చేసే నేతలు లేకపోవడం మైనస్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఎలాంటి ఎత్తుగడలతో ముందుకెళ్తుందనేది వేచి చూడాల్సిందే. ఇవి చదవండి: ‘పొలంబాట’న కేసీఆర్.. సెంటిమెంట్ జిల్లాపై స్పెషల్ ఫోకస్! -
ఔరంగజేబులంతా ఏకమైనా కానీ ఆ నలుగురినే.. : బండి సంజయ్
ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఔరంగజేబులంతా ఏకమై బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు యత్నించినా ధీటుగా ఎదుర్కొని ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర ఆదిలాబాద్ ప్రజలదని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆపార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడతోపాటు ఆదిలాబాద్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ శిరస్సు వంచి వందనాలు చెబుతున్నానన్నారు. జిల్లా ప్రజలదెబ్బకు బీఆర్ఎసోళ్లు ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారన్నారు. రాంమందిర్ నిర్మాణం కోసం తపించిన కరసేవకులను కాల్చి చంపిన ములాయం సింగ్ గతేమైందో, బతుకేమైందే ప్రజలు గ్రహించాలన్నారు. అయోధ్యలోనే రాముడు పుట్టారా అనిప్రశ్నించే నాకొడుకులా భవిష్యత్తును ఖతం చేస్తామని, అలాంటి పార్టీలకు భవిష్యత్తే లేకుండా చేస్తామన్నారు. నిర్మల్ జిల్లాలో రాంజీగోండ్ చరిత్రను తెరమరుగు చేసేందుకు వెయ్యి ఊడలమర్రి వద్ద సమాధి చేసిన బీఆర్ఎస్ను ప్రజలు సమాధి చేశారన్నారు. కాంగ్రెస్ మే ల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందన్నారు. వెయ్యి ఊడల మ ర్రి వద్ద రాంజీగోండ్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దేశం కోసం పాటుపడుతున్న నరేంద్ర మోదీకి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బహుమతి గా అందించాలన్నారు. ఎంపీ సీటును గెలిపిస్తే ఆది లాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామన్నా రు. మరోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ఏర్పడబోతుందని, అధికారం చేపట్టిన వెంటనే ఆది లాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్‌కు మోదీతో శంకుస్థాప న చేయిస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. రాష్ట్రంలో ఖజానా లేదని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లేది కొత్త స్క్రాచ్ రుచి చూసేందుకే తప్పా.. ఎలాంటి పొత్తుల కోసం కాదన్నారు. కేసీఆర్‌కు ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారని ప్రశ్నించా రు. ఎన్నికలకు ముందు సొంత వాహనాలు లేని చంద్రశేఖర్‌రావుకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హిందువులు ఓటు బ్యాంక్‌గా మారకపోవడంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయామని, దేశానికి కావాల్సింది రామ రాజ్య మా.. రజాకార్ల రాజ్యమా అనేది ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో యాత్ర ఇన్చార్జి పల్లె గంగారెడ్డి, జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, జిల్లా అధ్యక్షుడు ప తంగే బ్రహ్మానంద్, మాజీఎంపీ రమేశ్ రాథోడ్, మా జీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, పార్లమెంట్ కన్వీ నర్ బోయర్ విజయ్, లోక ప్రవీణ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లాలామున్నా, వేదవ్యాస్, నాయకులు రాజేశ్‌బాబు, అభినవ్ సర్దార్, సుహాసినిరెడ్డి పాల్గొన్నారు. అధికారం పోయినా.. తీరుమారలే.. ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నను ప్రజలు ఓడించి ఆ పార్టీని అధికారం లేకుండా చేసినా ఇంకా అధికారంలో ఉన్నట్లే మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని ఆదిలాబా ద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. వంద మంది రామన్నలు వచ్చినా ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ గెలవడం ఖాయమన్నారు. ఆదిలాబా ద్–ఆర్మూర్, ఆర్మూర్–పఠాన్‌చెరు వరకు 316 కిలో మీటర్ల దూరం ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయిందని, ఇందు కోసం రూ.7,313 కోట్లు కేంద్రం కేటాయించిందని పేర్కొన్నారు. ఆదిలాబాద్–గడ్చందూర్ రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తయిందని, రూ.1.75 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ విషయం తెలియని జోగు రామన్న రాజకీయ లబ్ధి కోసం రైల్వే సాధన సమితి పేరిట డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో పనిచేసిన ఎంపీలకు పిట్‌లైన్ అంటే తెలియదని, ఆదివాసీ బిడ్డగా దాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఢిల్లీలో మోదీ ఉండాల్సిందే.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేళ్లలో ప్రధాని మోదీ ప్ర పంచానికే నాయకత్వం వహించే దిశగా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారన్నారు. గల్లీ లో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలని ప్రజ లంతా కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ లోనూ బీజేపీ గెలవడం ఖాయమన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారన్నారు. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికై నా న్యాయం చేసిందా అని ఆయన ప్రశ్నించారు. ‘బండి’కి ఘన స్వాగతం.. బీజేపీ పార్టీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించిన బండి సంజయ్‌కు నేరడిగొండ మండలం రోల్మామడ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. క్రేన్ సాయంతో గజ మాల వేశారు. నేరడిగొండలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడినుంచి ఇచ్చోడకు చేరుకోగా పార్టీ శ్రేణుల స్వాగతం అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గుడిహత్నూర్‌లో ఓ స్వామిజీ నివాసంలో భోజనం చేసి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మావల బైపాస్ వద్ద బండి సంజయ్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి 5కిలోమీట ర్ల మేర బైక్ ర్యాలీగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ప్రధానవీధులగుండా అంబేద్కర్ చౌక్ కు యాత్ర చేరుకోగా, పార్టీ శ్రేణులు ఆయన ను భుజాలపై ఎత్తుకొని స్వాగతం పలికారు. ఇవి చదవండి: మేడారంలో నేడు అసలు ఘట్టం ఆవిష్కరణ! -
బీజేఎల్పీ నేత ఎవరు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ శాసనసభాపక్షనేత ఎన్నికపై ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. శాసనసభ బడ్జెట్ సమావేశాలు దగ్గరపడుతున్నా, బీజేపీ నేతలు ఎటూ తేల్చలేకపోతున్నారు. గత డిసెంబర్లోనే కేంద్రహోంమంత్రి అమిత్‌షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడే బీజేఎల్పీ నేత ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుందని అంతా భావించారు. అయితే అప్పుడు తగిన సమయం లేకపోవడంతో తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కొద్దిరోజులకు బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఎమ్మెల్యేల నుంచి అభిప్రాయసేకరణ నిర్వహించారు. ఢిల్లీలో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చించాక బీజేఎల్పీ నేతను ప్రకటిస్తామన్నారు. ఇది జరిగి కొద్దిరోజులు గడుస్తున్నా బీజేఎల్పీనేత ఎవరన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీజేఎల్పీనేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై రాజకీయంగా, పార్టీలో చర్చనీయాంశమవుతోంది. శాసనసభ కార్యకలాపాలపై అవగాహన, వివిధ అంశాలపై విషయ పరిజ్ఞానం, రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, అసెంబ్లీ వేదికపై చోటుచేసుకునే ఆయా పరిణామాలకు తగ్గట్టుగా చురుగ్గా స్పందించగలిగే వారికి ఈ బాధ్యతలు అప్పగించాలనే అభిప్రాయంతో పార్టీ నేతలున్నట్టు సమాచారం. ► వరుసగా మూడుసార్లు గెలవడంతోపాటు నగరం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎమ్మెల్యే టి.రాజాసింగ్ ఈ పదవి కోరుకుంటున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు సీఎం అభ్యర్థులను ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డితోపాటు పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, పైడి రాకేష్‌రెడ్డిలు కూడా బీజేఎల్పీ నేత పదవిని ఆశిస్తున్నారు. ► గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే బీసీ నేతను సీఎం చేస్తామని నాయ కత్వం ప్రకటించిందని, కనీసం బీజేఎల్పీ నేతగా బీసీ ఎమ్మెల్యేకు అవకాశం కల్పించాలనే డిమాండ్ కూడా పార్టీలో అంతర్గతంగా వినిపిస్తోంది. ► ఈ నెల 8న బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఆ తర్వాత జరిగే బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశానికి వివిధ రాజకీయపక్షాల తరఫున నేతలు హాజరై ఎన్ని రోజులు సభ నిర్వహించాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే నాటికి లేదా బీఏసీ భేటీ జరిగే నాటికి బీజేఎల్పీనేతను ఎన్నుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే బీఏసీ భేటీకి శాసనసభాపక్షం ఎవరో ఒకరిని నామినేట్ చేసినా సరిపోతుందని, అందువల్ల దానితో బీజేఎల్పీనేత ఎన్నికకు ముడిపెట్టాల్సిన అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. -
'నమ్మకాన్ని నిలబెట్టుకుంటా..' : ఎమ్మెల్యే పాయల్ శంకర్
సాక్షి, ఆదిలాబాద్: ‘నన్ను ఆదరించి గెలిపించిన ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి చేస్తా. ప్రజా సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన కార్యాచరణపై త్వరలోనే అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి యాక్షన్ ప్లాన్ రూపొందిస్తా. ఆదిలాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతీ వార్డులో స్వయంగా పర్యటించి కాలనీవాసుల సమస్యలు తెలుసుకుంటా. ఎమ్మెల్యే నిధులతో పాటు అవసరమైతే కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకువస్తానని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఎమ్మెల్యేతో సోమవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ఫోన్‌ఇన్ నిర్వహించగా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వందలాది మంది ఫోన్ చేసి సమస్యలను ఎమ్మెల్యేకు నివేదించారు. వాటిని ఓపిగ్గా ఆలకించిన ఆయన పరిష్కారానికి కృషి చేస్తానని వారికి భరోసా కల్పించారు. ప్రశ్న: మున్సిపల్ పరిధిలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. అంబేద్కర్‌చౌక్, గాంధీచౌక్, ఎన్టీఆ ర్ చౌక్ ప్రాంతాల్లో తోపుడు బండ్లు రోడ్డుకు దగ్గరగా ఉంచడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి..? (చంద్రశేఖర్, రిటైర్డ్ టీచర్, న్యూహౌసింగ్ బోర్డు) ఎమ్మెల్యే: పట్టణంలో ఈ సమస్య ఉన్నది వాస్తవమే. గత పాలకుల హయాంలో రోడ్లు ఇరుకుగా నిర్మించారు. దీంతో చిరు వ్యాపారులు తో పుడు బండ్లను రోడ్లపైకి తీసుకొచ్చి విక్రయాలు జరిపిస్తున్నారు. సమస్య పరిష్కారానికి ట్రాఫిక్ పోలీసులు, మున్సిపల్ అధికారులతో మాట్లాడుతాను. ప్రశ్న: తిర్పెల్లి కాలనీ సమీపంలో జాతీయ రహదా రిపై మురుగునీరు ప్రవహించడంతో పాటు గుంతలు ఉన్నాయి. దీంతో ప్రయాణం ఇబ్బందికరంగా మారుతోంది. (కళ్యాణ్, శ్రీరాంకాలనీ) ఎమ్మెల్యే: మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేసి సమస్య పరిష్కరించేలా చూస్తాను. ప్రశ్న: టాక్లీ నుంచి బేల వరకు గల రోడ్డు గుంతలతో అధ్వానంగా మారింది. మహారాష్ట్రకు చెంది న లంబాడాలు బేలలోని పలు గ్రామాలకు వలసవచ్చి రెవెన్యూ అధికారులకు ముడుపులిచ్చి అడ్డదారిన ఎస్టీ ధ్రువీకరణ పత్రం పొందుతూ ఆదివాసీలకు అన్యాయం చేస్తున్నారు.. (సంతోష్, టాక్లీ) ఎమ్మెల్యే: ఆర్అండ్బీ, రెవెన్యూ శాఖల అధికారులతో త్వరలోనే సమీక్ష నిర్వహించి వాటి పరిస్థితులను తెలుసుకుంటాను. అలాగే నకిలీ ధ్రువీ కరణ పత్రాలను జారీచేయకుండా రెవెన్యూ అధికారులను ఆదేశిస్తా. ప్రశ్న: నాకు నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రిలో బ్రెయిన్ సర్జరీ జరిగింది. రూ.10లక్షలు ఖర్చైంది. ఉన్న ప్లాటు అమ్మేశాను. సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకుని ఏడాది గడిచినా సాయం అందలేదు. (సాయికుమార్, హౌసింగ్‌బోర్డు ) ఎమ్మెల్యే: కొత్త ప్రభుత్వం మార్గదర్శకాలు జారీచేశాక వాటి ప్రకారం ఆర్థిక సాయమందించేందుకు తప్పకుండా కృషి చేస్తాను. ప్రశ్న: రాత్రి సమయంలో వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి వెళితే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లమని అక్కడి వైద్యులు సూచిస్తున్నారు. (హిదాయత్ పఠాన్, బొక్కల్గూడ) ఎమ్మెల్యే: రిమ్స్ డైరెక్టర్‌తో మాట్లాడి, రాత్రి డ్యూటీలో డాక్టరేవరున్నారో, అక్కడి సమస్యలేంటో తెలుసుకుని ఇంకోసారి జరుగకుండా తగు చర్యలు తీసుకుంటాను. ప్రశ్న: ఆదిలాబాద్ రూరల్ మండలం అంకాపూర్ పంచాయతీ పరిధిలో కొత్తగా ఏర్పడిన చిన్నమారుతిగూడలో తాగునీరు, రోడ్లు, కరెంట్ వంటి వసతుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. సౌకర్యాలు కల్పించేలా చూడాలి.(గణపతి, సురేష్, సిడాం మారుతీ, చిన్నమారుతీగూడ, అంకాపూర్) ఎమ్మెల్యే: త్వరలోనే మండల అధికారులతో కలిసి గ్రామాన్ని సందర్శిస్తాను. అక్కడి సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి సాధ్యమైనంతవరకు కృషి చేస్తాను. ఇప్పటికే పాయల్ పౌండేషన్ ద్వారా బోరు వేయించాము. ప్రశ్న: మాకు ప్రభుత్వమిచ్చిన ప్లాట్లలో సీపీఐ నాయకులు గుడిసెలు వేయించారు. వాటిని తొలగించాలని కమిషనర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. (గాలిపెల్లి నాగన్న, మావల) ఎమ్మెల్యే: మున్సిపల్ అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకునేలా చూస్తాను. ఈ నెల చివరిలోగా సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. ప్రశ్న: ప్రభుత్వం మహాలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నప్పటికీ మా పల్లెకు బస్సులు రావడం లేదు..? (సురేష్, అంకాపూర్ జీపీ) ఎమ్మెల్యే: ఈ విషయమై ఆర్టీసీ అధికారులతో త్వరలోనే సమీక్ష నిర్వహిస్తాం. రహదారి సౌకర్యం ఉండి ఆర్టీసీ సదుపాయం లేని గ్రామాలకు బస్సులు నడిపించేలా చర్యలు చేపడతాం. అన్ని గ్రామాలకు బస్సులు వచ్చేలా చూస్తాను. ప్రశ్న: టీచర్స్ కాలనీలోని అడాణేశ్వర్ మందిర్ ప్రాంతంలో రహదారి, నీటి సమస్య తీవ్రంగా ఉంది..? (మధుకర్, టీచర్స్‌కాలనీ) ఎమ్మెల్యే: మీ కాలనీ సమస్యలు ఇదివరకే నా దృష్టి కి వచ్చాయి. ఇటీవలే మున్సిపల్ అధికారులతో మాట్లాడాను. రోడ్ల నిర్మాణంతోపాటు నీటి సరఫరా అయ్యేలా చర్యలు చేపడతాం. ప్రశ్న: పట్టణంలో ఫుట్‌పాత్‌లను ఆక్రమించారు. దీంతో పాదాచారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను పరిష్కరించాలి.. (కేతిరెడ్డి గంగారెడ్డి, కై లాస్‌నగర్) ఎమ్మెల్యే: ఈ విషయమై పోలీసు, మున్సిపల్ అధి కారులతో సమీక్ష నిర్వహిస్తాం. వారం పది రో జుల్లో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపడతాం. సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం. ఆక్రమణల విషయమై, వీధి వ్యాపారుల సముదాయం గురించి కూడా రివ్యూచేస్తాం. ప్రశ్న: మా కాలనీలో సమస్యలు ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. రహదారి సమస్యతో సతమతం అవుతున్నాం... (రాంరెడ్డి, టీచర్స్ కాలనీ) ఎమ్మెల్యే: త్వరలోనే వార్డును విజిట్ చేసి సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తా. ప్రశ్న: మా కాలనీతో పాటు మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో పారిశుధ్యం లోపించింది. దీంతో జనం రోగాల బారిన పడుతున్నారు..?(శ్రీనివాస్, శాంతినగర్) ఎమ్మెల్యే: పట్టణంలోని శాంతినగర్‌తో పాటు అన్ని వార్డుల్లో పారిశుధ్య సమస్య తలెత్తకుండా మున్సిపల్ అధికారులను ఆదేశిస్తాం. అదనపు సిబ్బందిని సైతం నియమించైనా సమస్యను పరిష్కరిస్తాం. ప్రశ్న: కాలనీకి సంబంధించిన మురుగు నీరంతా నా ఇంటి ముందు వచ్చి చేరుతోంది. వాసన భరించలేకపోతున్నాం. మున్సిపల్ అధికారుల కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు..( కార్తికేయ, కేఆర్కే కాలనీ) ఎమ్మెల్యే: మున్సిపల్ అధికారులతో మాట్లాడతాం. కేఆర్కే కాలనీలో క్షేత్రస్థాయిలో పర్యటించి ఏ సమస్యలు తలెత్తకుండా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తాం. కాలనీవాసులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. ప్రశ్న: కాలనీలో ఎవరైన మరణించినప్పుడు అంతి మ యాత్ర కోసం అవస్థలు ఎదురవుతున్నా యి. శ్మశానవాటిక లేకపోవడంతో రోడ్డు పక్క న దహన సంస్కారాలు చేయాల్సి వస్తోంది.. ?(దోని జ్యోతి, శ్రీరాంకాలనీ) ఎమ్మెల్యే: కాలనీలో శ్మశానవాటిక ఏర్పాటు కోసం అధికారులతో మాట్లాడతాం. దీనికి సంబంధించి స్థల సేకరణ చేపట్టి నిర్మాణం కోసం కృషి చేస్తా. ప్రశ్న: మా గ్రామానికి వెళ్లే రోడ్డు ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో చాలా ఇబ్బందవుతుంది. కొత్త రోడ్డు నిర్మించాలి (రవీందర్, చిచ్దరి ఖానాపూర్) ఎమ్మెల్యే: సంబంధిత శాఖల అధికారులతో మాట్లా డి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకుంటా. త్వరలోనే రోడ్డును కూడా పరిశీలిస్తా. ఇవి చదవండి: ఇటు సీతక్కకు, అటు దుద్దిళ్లకు సవాలుగా లోక్‌సభ ఎన్నికలు! -
రంగులు మారిన రాజకీయం
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది నానుడి. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుంది. ఇంతకాలం మాటలతో దాడులు చేసుకున్న వారే ఎన్నికల వేళా ఎంచక్కా కలిసిపోతున్నారు. శత్రుత్వాన్ని మరిచి కలిసే ప్రచారానికి కూడా వెళ్తున్నారు. అందుకే..సినిమాలో రాజకీయాలన్నాక ఇవన్నీ కామన్ తమ్మీ..అని ఓ డైలాగ్ ఉంది. ఈ మాట కూడా నిజమే. రాజకీయాల్లో ఎవరెవరు శత్రువులు..ఎవరికి ఎవరు మిత్రులు..అని చెప్పడం నేటి రోజుల్లో అసాధ్యం. ముథోల్‌లో అన్నదమ్ముల సవాల్ భైంసా : ముథోల్ నియోజకవర్గంలో ప్రస్తుతం అన్నదమ్ముల మధ్య సవాల్ మొదలైంది. భోస్లే నారాయణరావుపటేల్ 1994, 1999, 2004,2009 ఎన్నికల్లో ముథోల్ స్థానం నుంచి పోటీ చేసే సమయంలో ఆయన సోదరులు పవార్ రామారావుపటేల్, భోస్లే మోహన్రావుపటేల్లు వెన్నంటి ఉండి ప్రచార బాధ్యతలు నిర్వహించేవారు. ముథోల్ నియోజకవర్గంలో పటేల్ కుటుంబమంటే ముగ్గురు అన్నదమ్ములని చెప్పేవారు. ఒకప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ముగ్గురు సోదరులకు తెలిసే జరిగేవి. వ్యాపార పరమైన, రాజకీయపరమైన, కుటుంబపరమైన నిర్ణయాలన్నీ ముగ్గురు సోదరులు ఏకాభిప్రాయంతోనే తీసుకునేవారు. 2018 ఎన్నికల్లో.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ఇద్దరు సోదరులు ముథోల్ టిక్కెట్టును ఆశించారు. కాంగ్రెస్ టిక్కెట్ రామారావుపటేల్‌కు కేటాయించారు. దీంతో ఆయన సోదరుడు, మాజీ ఎమ్మెల్యే భోస్లే నారాయణరావు పటేల్ ఎన్సీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో రామారావుపటేల్ కాంగ్రెస్ పార్టీ తరఫున తన గెలుపునకు కృషి చేస్తున్నారు. మరోవైపు ఆయన సోదరుడు భోస్లే నారాయణరావు పటేల్, తన సోదరుడు భోస్లే మోహన్రావుపటేల్తో కలిసి మరోసారి ముథోల్ సీటు తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం ముమ్మరం చేశారు. ఒకప్పుడు కలిసున్న ఈ కుటుంబం ఈ ఎన్నికల్లో ఇలా రెండు పార్టీల నుంచి పోటీ చేసి గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతూ ముందుకు వెళ్తున్నారు. ఎక్కడ చూసినా ఇప్పుడు ఈ సోదరుల ముచ్చటే వినిపిస్తోంది. నాటి గురుశిష్యులు..నేటి ప్రత్యర్థులు ఆదిలాబాద్‌టౌన్: గత కొన్నేళ్లుగా జోగు రామన్న, పాయల్ శంకర్ మధ్య సాన్నిహిత్యం పెరిగి అనుబంధం ఏర్పడింది. ఏ రాజకీయ కార్యక్రమమైనా ఇద్దరు కలిసి చేపట్టేవారు. ఎక్కడికి వెళ్లినా రామన్న వెంటే రాంబంటులా పాయల్ ఉండే వారు. అయితే ఒకప్పుడు గురుశిష్యులైన టీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న, బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ ప్రస్తుతం శాసనసభ ఎన్నికల బరిలో ప్రత్యర్థులుగా ఉన్నారు. ఇందులో జోగురామన్న గురువైతే.. పాయల్ శంకర్ శిష్యుడు. అయితే ఇప్పటి వరకు రెండుసార్లు ప్రత్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేయగా, ముచ్చటగా మూడోసారి బరిలో ఉన్నారు. ఈ సారి గెలుపు ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. రెండుసార్లు ఎన్నికల బరిలో.. జైనథ్ మండలం దీపాయిగూడ గ్రామానికి చెందిన జోగు రామన్న రాజకీయ ప్రస్థానం సర్పంచ్ నుంచి మొదలైంది. 1995లో టీడీపీ నుంచి ఎంపీటీసీగా గెలుపొందిన ఆయనకు జైనథ్ మండల పరిషత్ అధ్యక్ష పదవి కోసం ఒక ఎంపీటీసీ అవసరం ఏర్పడింది. ఆ మండలంలో 11 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ఐదు స్థానాలు గెలువగా, కాంగ్రెస్ మూడు, సీపీఐ, జనతాదళ్, స్వతంత్య్ర అభ్యర్థి ఒక్కోచోట గెలుపొందారు. ఆ సమయంలో స్వతంత్య్ర అభ్యర్థిగా అదే మండలం అడకు చెందిన పాయల్ శంకర్ నిరాల ఎంపీటీసీ సభ్యుడిగా గెలుపొంది మద్దతు ఇవ్వడంతో 1995లో రామన్న ఎంపీపీగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి అనుబంధం ఏర్పడింది. గతంలో పార్టీ కార్యకలాపాలన్నీ పాయల్‌కే.. జోగు రామన్న 2000లో జైనథ్ జెడ్పీటీసీగా, 2005లో మరోమారు జడ్పీటీసీగా టీడీపీ తరపున విజయం సాధించారు. ఇదే సమయంలో 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేసి ద్వితీయ స్థానంలో నిలిచారు. 2009లో ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా రామన్న గెలుపొందారు. ఇటు పాయల్ శంకర్ మళ్లీ అడ సర్పంచ్‌గా, ఆయన సతీమణి నిరాల ఎంపీటీసీ సభ్యురాలిగా గెలుపొంది పార్టీలో వివిధ పదవులు చేపట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ వస్తున్నారు. రామన్న వెంటనే పాయల్ శంకర్ ఉంటూ ఎన్నికల్లో పార్టీ కార్యకలాపాలన్నీ చక్కదిద్దుతూ చూసుకునేవారు. ఒకవిధంగా చెప్పాలంటే రామన్నకు కుడిభుజమని చెప్పుకునేవారు. నమ్మిన బంటు కావడంతో ఆయన కార్యకలాపాలను పర్యవేక్షించి రామన్న గెలుపు కోసం కృషి చేశారు. అనంతరం జోగు రామన్న జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేసి ఆ స్థానం నుంచి పాయల్ శంకర్‌కు టిక్కెట్ ఇప్పించారు. టీడీపీ తరఫున 2009లో జైనథ్ జెడ్పీటీసీగా పాయల్ గెలుపొందారు. 2012లో ఆదిలాబాద్ అసెంబ్లీకి ఉప ఎన్నికల్లో తొలిసారి గురు శిష్యుల మధ్య పోటీ ఆరంభమైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఇద్దరూ పోటీపడ్డారు. ప్రస్తుత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున రామన్న, బీజేపీ నుంచి శంకర్ పోటీ చేస్తున్నారు. -
ఖాళీ దిశగా ‘దేశం’
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కేడర్ చాలావరకు పార్టీకి దూరం అయింది. తాజాగా, తెలంగాణపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యతిరేక వైఖరి, పార్టీలో ఆధిపత్య పోరుతో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్ టీడీపీకి గుడ్‌బై చెబుతున్నారు. ఈ మేరకు బుధవారం ఆయన స్వగ్రామమైన బజార్హత్నూర్ మండలం జాతర్లలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల అభిప్రాయ సేకరణ చేసిన అనంతరం, టీడీపీకి రాజీనామా చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించారు. కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరుతానని కూడా వెల్లడించారు. చంద్రబాబు టీ-బిల్లును అడ్డుకునేందుకు చేసిన ఒత్తిళ్లు, కార్యకర్తల అభిమతం మేరకు పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. బీజేపీ వైపు ‘పాయల్’ చూపు.. ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి పాయల్ శంకర్ కూడా తెలుగుదేశం పార్టీకి అధికారికంగా రాజీనామా చేసేందుకు ముహూర్తం చూసుకుంటున్నారు. బుధవారం నియోజకవర్గంలోని జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల నాయకులతో ఆదిలాబాద్‌లోని ఓ హోటల్లో సమావేశమయ్యారు. ఇప్పటికే పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన త్వరలోనే తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించి, బీజేపీలో చేరే అవకాశాలున్నాయి. తెలంగాణ బిల్లుకు లోక్‌సభ ఆమోద ముద్ర పడిన వెంటనే జిల్లా రాజకీయ ముఖచిత్రంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ బిల్లు విషయమై ఇన్నాళ్లు వేచి చూసే ధోరణితో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా టీడీపీని వీడుతున్నారు. ఎంపీ రాథోడ్ రమేష్‌తో విభేదాలు ఆదిలాబాద్ ఎంపీ రాథోడ్ రమేష్, బోథ్ ఎమ్మెల్యే గొడాం నగేష్‌ల మధ్య ఆధిపత్య పోరు చాలాకాలంగా కొనసాగుతోంది. ఈ ఇద్దరు పార్టీలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించారు. ఎంపీ నెల రోజుల క్రితం చేపట్టిన పల్లెనిద్ర విషయంలో కూడా వీరి మధ్య ఉన్న విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ అంతర్గత సమావేశాల్లో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నగేష్ వ్యతిరేకించినట్లు చర్చ జరిగింది. మరోవైపు ఎంపీ రమేశ్ బోథ్ నియోజకవర్గంలో నగేష్ వ్యతిరేక వర్గాన్ని పెంచి పోషించారనే విమర్శలు ఉన్నాయి. తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి ఆ వర్గం నాయకులకు పనులు ఇవ్వడం వంటివి చేశారు. ఒక్కో సందర్భంలో ఇరువురు పరస్పరం చంద్రబాబుకు ఫిర్యాదులు చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. బుధవారం నగేష్ జాతర్లలో నిర్వహించిన ఈ సమావేశానికి రాథోడ్ రమేష్ వర్గం నాయకులకు, కార్యకర్తలు దూరంగా ఉన్నారు. ఈ సమావేశానికి వెళ్లవద్దని ఢిల్లీలో ఉన్న రాథోడ్ రమేష్ తన వర్గం నేతలకు ఫోన్లు చేసి చెయడం స్థానికంగా చర్చనీయాంశమమైంది. బోథ్‌కు టీడీపీ అభ్యర్థి కరువు నగేష్ టీడీపికి గుడ్‌బై చెప్పడంతో బోథ్ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. నాలుగు పర్యాయాలు నగేష్ టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఆయన తండ్రి రామారావు కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. దీంతో ఇక్కడ నగేష్‌కు ప్రత్యామ్నయంగా నియోజకవర్గ స్థాయి నాయకులుగా ఎవరూ తెరపైకి రాలేదు. ద్వితీయ శ్రేణి నాయకులుగా ఎదగకుండా నగేష్ ముందునుంచి జాగ్రత్త పడ్డారనే విమర్శలున్నాయి. మొత్తం మీద ఇక్కడ, ఇప్పుడు ఆ పార్టీకి అభ్యర్థి ప్రశ్నార్థకంగా తయారైంది. మరో నియోజకవర్గ ఇన్చార్జి కూడా.. తూర్పు జిల్లాకు చెందిన మరో నియోజకవర్గ ఇన్చార్జి కూడా టీడీపీకి రాజీనామా చెప్పాలనే యోచనలో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్న ఆయనతో టీఆర్ఎస్ పార్టీ నేతలు సంప్రదింపులు జరిపారు. ఆయన కూడా నియోజకవర్గ కార్యకర్తలు, నేతలతో ఒకటి, రెండు రోజుల్లో సమావేశం నిర్వహించే అవకాశాలున్నాయి. వారి మనోభావాల మేరకు నిర్ణయం తీసుకోనున్నారు.