ఆదిలాబాద్: బాసర సరస్వతి అమ్మవారిని రాష్ట్ర గిరిజన, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణ్‌రావుపాటిల్ స్వాగతం పలి కారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతకుముందు బాసరలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సీతక్క సమావేశం నిర్వహించారు. మంత్రివెంట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నాయకులు ఉన్నారు.
కదిలి పాపహరేశ్వరాలయంలో..
మండలంలోని శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వర స్వామిని ఆదివారం రాష్ట్రమంత్రి సీతక్క దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రికి ఆలయ పరిసరాలు, విశిష్టతను అర్చకులు వివరించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, కాంగ్రెస్ నాయకులు ఆత్రం సుగుణ, ఆత్రం భాస్కర్, నాయకులు రాజారెడ్డి, రమణ, విద్యాసాగర్‌రెడ్డి, పరుశురాం, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రావు పాటిల్ ఉన్నారు.
ఇవి చదవండి: బీఆర్‌ఎస్ పాలన దోచుకోవడం.. దాచుకోవడమే.. : కోదండరామ్
Comments
Please login to add a commentAdd a comment