vital reddy
-
బాసరలో మంత్రి సీతక్క పూజలు..
ఆదిలాబాద్: బాసర సరస్వతి అమ్మవారిని రాష్ట్ర గిరిజన, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదివారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి మాజీ ఎమ్మెల్యేలు విఠల్‌రెడ్డి, నారాయణ్‌రావుపాటిల్ స్వాగతం పలి కారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అతకుముందు బాసరలోని పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సీతక్క సమావేశం నిర్వహించారు. మంత్రివెంట ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, నాయకులు ఉన్నారు. కదిలి పాపహరేశ్వరాలయంలో.. మండలంలోని శ్రీమాతాన్నపూర్ణ పాపహరేశ్వర స్వామిని ఆదివారం రాష్ట్రమంత్రి సీతక్క దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. మంత్రికి ఆలయ పరిసరాలు, విశిష్టతను అర్చకులు వివరించారు. డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, కాంగ్రెస్ నాయకులు ఆత్రం సుగుణ, ఆత్రం భాస్కర్, నాయకులు రాజారెడ్డి, రమణ, విద్యాసాగర్‌రెడ్డి, పరుశురాం, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రావు పాటిల్ ఉన్నారు. ఇవి చదవండి: బీఆర్ఎస్ పాలన దోచుకోవడం.. దాచుకోవడమే.. : కోదండరామ్ -
నర్సాపూర్‌ను శాసించిన మదన్‌రెడ్డి వంశస్తులు!
సాక్షి, మెదక్: కౌడిపల్లి అడ్డాగా.. నర్సాపూర్ గడ్డపైరాజకీయాలను శాసించిన చిలుముల వంశం సుదీర్ఘ రాజకీయ చరిత్రకు నేటి నుంచి తెరపడనుందా... అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నర్సాపూర్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన శాసనసభ ఎన్నికల్లో కౌడిపల్లికి చెందిన చిలుముల వంశస్తులు పోటీ చేస్తూ వచ్చారు. కానీ ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేకు టికెట్ దక్కపోవడం చర్చనీయాంశంగా మారింది. విఠల్‌రెడ్డితో మొదలుకొని.. దివంగత మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకులు చిలుముల విఠల్‌రెడ్డి నర్సాపూర్ రాజకీయాలను శాసించారు. 1952లో నర్సాపూర్ నియోజవర్గం ఏర్పడింది. 1957లో జరిగిన మొదటి ఎన్నికల్లో సీపీఐ తరపున కౌడిపల్లికి చెందిన విఠల్‌రెడ్డి పోటీ చేశారు. 1957 నుంచి 2004 వరకు 11సార్లు శాసనభకు ఎన్నికలు జరగగా విఠల్‌రెడ్డి పోటీలో ఉన్నారు. అయిదు సార్లు గెలుపొంది ప్రజాసేవ చేశారు. అనంతరం 2009లో మహాకూటమి ఏర్పడడంతో సీపీఐ తరఫున విఠల్‌రెడ్డి కుమారుడు చిలుముల కిషన్‌రెడ్డి పోటీలో నిలిచి ఓటమి చెందారు. అనంతరం 2014, 2018 ఎన్నికల్లో విఠల్‌రెడ్డి తమ్ముడి కుమారుడు చిలుముల మదన్‌రెడ్డి బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి గెలుపొందారు. అంతకుముందు మదన్‌రెడ్డి తెలుగుదేశం తరఫున రెండు సార్లు పోటీచేసి ఓటమి చెందారు. కాంగ్రెస్ నుంచి దక్కేదెవరికో.. ప్రస్తుతం మదన్‌రెడ్డికి పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో చేరిన మాజీ మంత్రి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డికి టికెట్ ఇచ్చి బీఫామ్ అందజేశారు. టికెట్ రాదని చర్చకు వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పలుమార్లు ఎమ్మెల్యే మదన్‌రెడ్డిని పార్టీలోనికి రావాలని ఆహ్వానించినట్లు చర్చ జరిగింది. రెండురోజుల క్రితం విఠల్‌రెడ్డి కోడలు బీఆర్ఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా మాజీ మహిళా అధ్యక్షురాలు సుహాసిని కిషన్‌రెడ్డి, ఆమె కొడుకు చిలప్‌చెడ్ మండల మాజీ జెడ్పీటీసీ శేషసాయిరెడ్డిని మైనంపల్లితోపాటు కాంగ్రెస్ నాయకులు పార్టీలోనికి ఆహ్వానించారు. దీంతో నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ చిలుముల వంశస్తులకు ఇస్తారా.. అని చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ సైతం నర్సాపూర్ టికెట్ కేటాయించకపోవడంతో ఏదైనా జరగవచ్చని జనం అంటున్నారు. ఇవి చదవండి: కోడ్‌ను ఉల్లంఘిస్తే.. చర్యలు తప్పవు! : భారత ఎన్నికల కమిషన్.. -
బోల్సాలో కలెక్టర్ పర్యటన!
నిర్మల్: భారీ వర్షం, వరదలకు ముంపునకు గురైన బోల్సా గ్రామంలో కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి శుక్రవారం పర్యటించారు. నీట మునిగిన ఇళ్లను, కొతకు గురైన రోడ్లను పరిశీలించారు. వరదలతో నష్టపోయిన బాధితుల వివరాలు సేకరించి వారికి పరిహారం అందేలా చూస్తామన్నారు. విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. ముంపు బాధితులకు బియ్యం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి మాట్లాడుతూ కొతకు గురైన రోడ్లుకు మరమ్మతు చేపట్టేలా చూస్తామని తెలిపారు. సంబంధిత అధికారులతో పంట నష్టం సర్వే నిర్వహించి బాధితులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. వారివెంట డీఎల్పీవో శివకృష్ణ , మాజీ ఎంపీపీ బాశెట్టి రాజన్న, నాయకులు పోతారెడ్డి, పంచాయతీ కార్యదర్శి గోపీనాథ్, గ్రామస్తులు ఉన్నారు. భారీ వాహనాలను అనుమతించొద్దు అర్లి వంతెన నుంచి భారీ వాహనాలను అనుమతించొద్దని కలెక్టరు వరుణ్‌రెడ్డి సూచించారు. హవర్గ గ్రామ సమీపంలోని అర్లి వంతెనను శుక్రవారం పరిశీలించారు. వంతెనకు వీలైనంత త్వరగా మరమ్మతులు పూర్తిచేసి రాకపోకలను పునరుద్ధరించాలని అధికారులకు సూచించారు. సుద్దవాగు పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ సరిత, ఎంపీడీవో సోలమాన్‌రాజ్, విద్యుత్ ఏఈ శివకుమార్, ఆర్‌ఆండ్‌బీ డీఈ కొండయ్య, స్థానిక సర్పంచ్ భూజంగ్‌రావు ఉన్నారు. -
Mudhol : ముధోల్ నియోజకవర్గం చరిత్ర ఇది
ముధోల్ నియోజకవర్గం ముధోల్ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రెండోసారి భారీ ఆదిక్యతతో గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ది బిజెపికి చెందిన పడకంటి రమాదేవీపై 43364 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన రామారావు పటేల్ పవార్‌కు 36396 ఓట్లు వచ్చి మూడో స్థానంలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలలో బిజెపి, కాంగ్రెస్ ఐలు గట్టి పోటీ లో ఉండడంతో ఓట్ల చీలిక టిఆర్ఎస్కు బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తుంది. విఠల్ రెడ్డికి 83703 ఓట్లు రాగా, రమాదేవికి 40339 ఓట్లు వచ్చాయి. విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచి, కొంతకాలానికి టిఆర్ఎస్లో చేరిపోయారు. విఠల్ రెడ్డి తండ్రి గడ్డెన్న ముదోల్ నుంచి గతంలో ఆరుసార్లు గెలిచారు. విఠల్ రెడ్డి సామాజికవర్గ పరంగా రెడ్డివర్గం వారు. సీనియర్ నేత, కేంద్రంలోను, రాష్ట్రంలోను మంత్రిగా పనిచేసిన ఎస్.వేణుగోపాలాచారి ముధోల్‌లో 2014లో ఓడిపోవడం విశేషం. 2009లో టిడిపి తరపున పోటీచేసి గెలుపొందిన వేణుగోపాలాచారి ఆ తర్వాత టిఆర్ఎస్ లో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీచేసి ఓడిపోయిన జి.విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి విజయం సాధించారు. ఎన్నికలైన కొద్ది కాలానికే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చే యకుండానే అధికార టిఆర్ఎస్ లో చేరారు.ఆయనపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చింది. అది విచారణ కాకముందే మళ్లీ ఎన్నికలు వచ్చాయి. 2018లో టిఆర్ఎస్ నుంచి గెలిచారు. ముదోల్లో పదిసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు ఎన్నిక కాగా ఒకసారి బ్రాహ్మణ, రెండుసార్లు ఇతరులు గెలిచారు. ప్రముఖ వాణిజ్యవేత్త అయిన నారాయణరావు పటేల్ 1994లో ఇక్కడ నుంచి టిడిపి పక్షాన గెలవగా, 1999లో ఓడిపోయారు. 2004లో ఈయన టిఆర్ఎస్ తరుఫున గెలిచారు. కాని ఆ తరువాత కాలంలో టిఆర్ఎస్ అసమ్మతి నేతగా మారిపోయారు. టిఆర్ఎస్ విప్ ఉల్లఘించి పదవిని కోల్పోయిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ఈయన ఒకరు. అయితే నారాయణరావు పటేల్ స్పీకర్ తీర్పు రావడానికి ఒకరోజు ముందే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. 2009లో ముధోల్ లో గెలిచిన వేణుగోపాలాచారి గతంలో నిర్మల్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందితే, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు గెలిచారు. రాష్ట్రంలో చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లోను, కేంద్రంలో దేవేగౌడ, ఐకె గుజ్రాల్ మంత్రివర్గాలలో పనిచేశారు. ముధోల్‌లో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఏడు సార్లు, టిడిపి మూడుసార్లు, టిఆర్ఎస్ రెండుసార్లు గెలవగా, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. ఆదిలాబాదు జిల్లాలోనే అత్యధికంగా ఆరుసార్లు గెలిచిన జి.గడ్డెన్న ముధోల్ నుంచి ఆరుసార్లు గెలవగా అందులో ఒకసారి ఏకగ్రీవం కావడం విశేషం. ఈయన కోట్ల మంత్రివర్గంలో కూడా పనిచేశారు. గడ్డెన్న 1967లో ఇండిపెండెంటుగా గెలవగా, ఆ తరువాత కాంగ్రెస్ పక్షాన రెండుసార్లు, 1983 నుంచి మూడుసార్లు కాంగ్రెస్ ఐ తరుపున విజయం సాధించారు. గోపిడి గంగారెడ్డి 1952లో నిర్మల్‌లో సోషలిస్టుగా, 1957లో ఇండిపెండెంటుగా, 1962లో కాంగ్రెస్ తరుఫున గెలిచారు. ముధోల్ గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
బాసరలో ఘనంగా వసంత పంచమి వేడుకలు
భైంసా: నిర్మల్ జిల్లా బాసరలో జ్ఞాన సరస్వతి అమ్మవారి జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. మాఘశుద్ధ పంచమి రోజున సరస్వతీక్షేత్రంలో వసంత పంచమి జరుçపుకొన్నారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల నుంచే ఆలయంలో పూజలు జరిగాయి. గురువారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సరస్వతి అమ్మవారి జన్మదినం సందర్భంగా వేలాదిగా భక్తులు బాసరకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున అక్షరాభ్యాస పూజలు జరిపించారు. వెంకటేశ్వర సేవాసమితి సభ్యులు, అఖిల భారత పద్మశాలి సంఘంతోపాటు పలువురు వ్యక్తులు బాసర వచ్చిన భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. బాసర ట్రిపుల్ఐటీకి చెందిన 50 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఆలయంలో సేవలు అందించారు. ఉదయం నుంచి రాత్రి వరకు బాసర భక్తజనంతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనానికి 4 గంటలు, అక్షరాభ్యాసానికి ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పట్టింది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిరావడంతో వృద్ధులు, చిన్న పిల్లలు ఇబ్బందిపడ్డారు. -
మంథని లిఫ్ట్ పనుల్లో అలసత్వం ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: మంథని లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా సాగునీరు అందిస్తామని ప్రభుత్వం పదేపదే చెప్తున్నా పనులు ఎందుకు ముందుకు సాగడం లేదని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అక్బరుద్దీన్ ఒవైసీ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. కమిటీ సభ్యులు రవీంద్రనాయక్, విఠల్‌రెడ్డి, అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సాగునీటి గురిం చిన చర్చ జరిగింది. జీవో 111కు సంబంధించి హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పరీవాహక ప్రాంతంపై కమిటీ అక్బరుద్దీన్ వివరాలు కోరారు. దీంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెరువుల పరిస్థితి, మిషన్ కాకతీయలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు తీసుకున్న చర్యల గురించి పీఏసీ చర్చించింది. సాగునీటి ప్రాజెక్టుల గేట్ల నిర్వహణ సరిగా లేదంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో కడెం, నాగార్జునసాగర్, సరళాసాగర్, మూసీ ప్రాజె క్టు మరమ్మతు, నిర్వహణ వివరాలను కమిటీ చైర్మన్ కోరారు. కాగా కాళేళ్వరం ప్రాజెక్టు లాగా ఇతర ప్రాజెక్టుల పనులు త్వరితగతిన ఎందుకు పూర్తి చేయడం లేదని శ్రీధర్‌బాబు ప్రశ్నించారు. ఏఐబీపీ కింద ఎస్ఆర్ఎస్పీ రెండో దశ, దేవాదుల వరద కాలువ పనుల్లో ఆలస్యం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రశ్నిం చారు. కాగా, హుజూరాబాద్ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిగా టీపీసీసీ ఎవరిని నిర్ణయించినా వారి గెలుపు కోసం కృషి చేస్తానని శ్రీధర్‌బాబు అన్నారు. -
అట్టుడికిన భైంసా
నిర్మల్/భైంసా, సాక్షి, హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణం సోమవారం అట్టుడికిపోయింది. 2 వర్గాల మధ్య తలెత్తిన చిన్న వివాదం రాళ్ల దాడులు, వాహనాల ధ్వంసం, గృహ దహనాలకు దారితీసింది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకూ ఈ దాడులు కొనసాగాయి. దీంతో పట్టణంలో భీతావహ వాతావరణం ఏర్పడింది. అగ్గిరాజేసిన వివాదం... భైంసాలోని కోర్బా గల్లీలో ఆదివారం రాత్రి ఓ వర్గానికి చెందిన యువకుడు బైక్‌పై పెద్ద శబ్దం చేస్తూ ఇష్టానుసారంగా వెళ్లడంతో స్థానికులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వెళ్లిపోయిన అతను కాసేపటికి తన వర్గం వారిని వెంటబెట్టుకొని వచ్చి ఒక వర్గానికి చెందిన ఇళ్లు, ఆస్తులు లక్ష్యంగా రాళ్ల దాడికి పాల్పడ్డారు. పలు ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఓ ఇల్లు పూర్తిగా కాలిపోగా 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. అల్లరిమూకలు 24 ద్విచక్ర వాహనాలు, ఓ కారు, ఆటో మరికొన్ని వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఇళ్లలోంచి సిలిండర్లు, వస్తు సామగ్రిని రోడ్డుపై పడేసి తగులబెట్టారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన దాడులు సోమవారం పట్టణమంతా విస్తరించాయి. ఒక వర్గం చేసిన దాడికి మరో వర్గం వారు ప్రతీకారంతో ప్రతి దాడులకు దిగారు. అల్లరి మూకలను కట్టడి చేసేందుకు వచ్చిన నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజుతోపాటు భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావు, సీఐ వేణుగోపాలరావు, ముథోల్ ఎస్సై అశోక్, ఐదుగురు కానిస్టేబుళ్లు సైతం రాళ్ల దాడిలో గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో నార్త్ జోన్ ఐజీ నాగిరెడ్డి, సీఐడీ ఐజీ ప్రమోద్ కుమార్, రామగుండం పోలీసు కమిషనర్ సత్యనారాయణ, సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల ఎస్పీలు విష్ణు వారియర్, శ్వేతారెడ్డి, రాహుల్ హెగ్డే హుటాహుటిన భైంసా చేరుకున్నారు. ఆదిలాబాద్, కామారెడ్డి, మంచిర్యాల, సిరిసిల్ల, రామగుండం, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించారు. సోమవారం సాయంత్రం ఆర్ఏఎఫ్ దళాలు రావడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. భైంసాలో బుధవారం వరకు 144 సెక్షన్ విధించారు. బిక్కుబిక్కుమంటూ.. కొన్నేళ్లపాటు ప్రశాంతంగా ఉన్న పట్టణం ఉద్రిక్తంగా మారడంతో భైంసావాసులు భయంభయంగా గడుపుతున్నారు. 100 మందికిపైగా మహిళలు, పిల్లలు ప్రార్థనా మందిరంలో తలదాచుకున్నారు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచినీళ్లు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. తమ కళ్ల ముందే ఇళ్లు, ఆస్తులు, ధ్వంసం కావడంతో పలువురు నిరాశ్రయులయ్యారు. పలువురు ఇళ్లకు తాళాలు వేసి బంధువుల ఊళ్లకు వెళ్లిపోయారు. బాధితులను ఆదుకుంటాం: కలెక్టర్ దాడులు జరిగిన ప్రాంతాల్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, నిర్మల్ కలెక్టర్ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ భాస్కర్‌రావు పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులను ఆదుకుంటామన్నారు. డీజీపీ ఆగ్రహం! తొలి నుంచీ సున్నిత ప్రాంతమైన భైంసాలో మున్సిపల్ ఎన్నికల వేళ హింస చెలరేగడంపై డీజీపీ మహేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఘటన పూర్వాపరాలతో పూర్తి నివేదిక సమర్పించాలని నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజును డీజీపీ ఆదేశించారని సమాచారం. భైంసా ఎన్నిక వాయిదా వేయాలి: బీజేపీ భైంసా మున్సిపాలిటీ ఎన్నికను వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డికి బీజేపీ విజ్ఞప్తి చేసింది. శాంతియుత వాతావరణంలో, స్వేచ్ఛగా మరో తేదీన ఎన్నిక నిర్వహణకు చర్యలు తీసుకోవా లని కోరింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లు ఇంద్రసేనారెడ్డి బృందం సోమవారం నాగిరెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించింది. దాడులు ఎంఐఎం పనే: కె.లక్ష్మణ్ నిర్మల్ జిల్లా భైంసాలో ఎంఐఎం గూండాలు హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులకు పాల్పడ్డారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపించారు. రాష్ట్రంలో మత కలహాలు సృష్టించేందుకు టీఆర్ఎస్, ఎంఐ ఎం కుట్రపన్నుతున్నట్లు ఘటనలు రుజువు చేస్తున్నాయన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: ఒవైసీ బైంసా ఘటన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సీఎం కేసీఆర్, డీజీపీలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్వీట్ చేశారు. నిర్మల్‌లో జరిగిన తబ్లిక్ ఇజ్తేమాకు వెళ్లొస్తున్న వారిపై దాడి జరగడం అమానుషమన్నారు. -
నాన్న లేని లోటు ఎప్పటికీ తీరనిది..
‘నేను దేవుడిని నమ్ముతా.. ప్రతీ గురువారం సాయిబాబా గుడికి వెళ్తా.. వేంకటేశ్వరస్వామి మా ఇంటిదైవం.. సొంతూరు దేగాం అంటే ఎంతో ఇష్టం.. ఎక్కడికి వెళ్లినా రాత్రికి ఇక్కడికే వచ్చేస్తా.. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఇప్పటికీ నన్ను ఆత్మీయులు, స్నేహితులు వకీల్ సాబ్ అనే పిలుస్తుంటారు. కుటుంబ బాధ్యతలు నా భార్య చూసుకుంటుంది.. నాన్న లేని లోటు ఎప్పటికీ తీరనిది..’ అంటూ ‘పర్సనల్ టైం’లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భైంసా (ముథోల్): మాది భైంసా మండలం దేగాం గ్రామం. అమ్మానాన్న గడ్డెన్న–రాజవ్వ. మేము ఆరుగురం సంతానం. అందులో నేను మూడో వాడిని. అక్క భోజవ్వ, రెండో అక్క కిష్టవ్వ, తర్వాత నేను పుట్టా ను. నా తర్వాత చెల్లె లక్ష్మి, తమ్ముడు గోపాల్‌రెడ్డి, చిన్నతమ్ముడు సూర్యకాంత్‌రెడ్డి జన్మించారు. నా చదువు దేగాం, భైంసాలోని ప్రభుత్వ పాఠశాలలో సాగింది. ఎల్ఎల్బీ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తిచేశా. తర్వాత జస్టిస్ సుభాషన్‌రెడ్డి వద్ద ప్రాక్టీస్ ప్రారంభించా. ఆయన ఇటీవలే మరణించడం నన్ను కలిచి వేసింది. న్యాయవాద వృత్తిలో ఆయనే నా గురువు. ఆయన వద్ద ప్రాక్టీస్ చేశాక భైంసా, నిర్మల్, హైదరాబాద్ కోర్టులో న్యాయవాదిగా కొనసాగాను. నాన్న గడ్డెన్న మా కుటుంబానికి ఎప్పుడు దూరంగా ఉండేవారు. అమ్మ రాజవ్వనే మా బాగోగులు చూసేది. చిన్నతనంలో పక్కనే ఉన్న చేన్లకు వెళ్లి పని చేసేవాళ్లం. చిన్నప్పటి నుంచి సింపుల్‌గా ఉండడం అలవాటైపోయింది. అప్పట్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువు పూర్తిచేశాను. దైవచింతన, గుడులకు ఎక్కువగా వెళ్తా.. విద్యార్థి దశ నుంచే ఆధ్యాత్మికంగా గడపడం నాకు ఇష్టం. గురువారం ఎక్కడ ఉన్నా సాయిబాబా గుడికి వెళ్లి దర్శించుకుంటా. ఇక చదువుల తల్లి సరస్వతీ అమ్మవారిని ఎంతో పూజిస్తా. వేంకటేశ్వరస్వామి మా ఇంటిదైవం. ఆధ్యాత్మికంగా గడపడం ఎంతో ఇష్టం. కాని ఎక్కువ సమయం ప్రజలమధ్యే ఉంటాను. ఎమ్మెల్యేగా గెలిచాక మహాదేవుని మందిరాలు, హనుమాన్ ఆలయాలు, జగదంబాదేవి ఆలయాలు చాలానే దర్శించుకున్నాను. దైవం అంటే ఎంతో ఇష్టం. ఎక్కడికి వెళ్లినా గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకుంటాను. అది కూడా సామాన్యులతో కలిసి వెళ్లడమే ఇష్టం. ఆలయాల్లో వీఐపీ దర్శనాలంటే నచ్చవు. దేవుడి ముందు అందరూ సమానమన్నదే నా ఆలోచన. కుటుంబ బాధ్యత ఆవిడదే.. ఎల్ఎల్బీ పూర్తయ్యాక న్యాయవాద వృత్తిలో ఉన్న సమయంలోనే లక్ష్మితో వివాహం జరిగింది. మాకు ఇద్దరు సంతానం. పెద్ద కూతురు సులోచనను దేగాంలో అక్క కొడుకు అప్పం శ్రీనివాస్‌రెడ్డికి ఇచ్చి వివాహం చేశా. కొడుకు వెంకట్రాంరెడ్డికి కామోల్ గ్రామానికి చెందిన అక్షయతో పెళ్లి జరిపించా. నా తల్లి రాజవ్వ, భార్య లక్ష్మి, కోడలు అక్షయ ముగ్గురిది భైంసా మండలం కామోల్ గ్రామం. నాకు ఇద్దరు మనుమళ్లు. వ్యవసాయంతోపాటు కుటుంబ బాధ్యతలను నా భార్య చూసుకుంటుంది. ఇప్పటికీ పంటపొలాలకు వెళ్లి వస్తుంది. ఏటా పంటలు వేయడం, కోయడం అన్ని ఆమే చూసుకుంటుంది. ప్రజల మధ్య ఉండడం ఇష్టం.. సామాన్య జీవితం గడపడమే ఎంతో ఇష్టం. ఏసీలో ఉండడం నచ్చదు. ఇప్పటికీ ఫ్యాన్ కిందే నిద్రపోతాం. ఇంట్లోనూ హంగు ఆర్భాటాలు నచ్చవు. మా సొంత గ్రామం దేగాంలో నాన్న కట్టిన ఇంట్లో నా తమ్ముళ్లతో కలిసి ఉంటాను. ఎంత రాత్రి అయినా దేగాంలోని సొంతింటికే వెళ్లి అక్క డే నిద్రపోతాను. నా తముళ్లు గోపాల్‌రెడ్డి, సూర్యకాంత్‌రెడ్డి ఇప్పటికీ వ్యవసాయం చేస్తారు. శుభకార్యాలు ఉన్నా, గుడులకు వెళ్లాలన్నా, ఊర్లకు వెళ్లాలన్నా మా కుటుంబ సభ్యులెవరైనా బస్సు ల్లోనే ప్రయాణం చేస్తారు. రక్త సంబంధీకులు, బందువుల శుభకార్యాలకు మా కుటుంబీకులే వెళ్తుం టారు. సామాన్యుల శుభకార్యాలు ఉంటే నేను తప్పకుండా హాజరవుతాను. నేను ప్రయాణించే వాహనం సాదాగా ఉందని మార్చాలంటూ పదేపదే చెబుతుంటారు. కాని అలాంటి వాహనంలోనే వెళ్లడమే నాకు ఇష్టం. చాలా సార్లు మారుమూల గ్రామాలకు ద్విచక్రవాహనాలపైనే వెళ్తుంటా. అక్కడ వారితో కలిసిపోతా. నా దగ్గరికి ఎవరైనాసాయం కోరి వస్తే కచ్చితంగా చేసిపెడుతాను. నాన్న మరణం కలిచివేసింది.. ప్రజా సేవ కోసం మా తండ్రి గడ్డెన్న భైంసాలో ఉండేవారు. ఆయనలేని లోటు ఎప్పటికీ తీరనిది. ఆయన వారసత్వమే మాకు వచ్చింది. మాకు ఉన్నా లేకున్నా సామాన్యుల కోస మే మేమున్నామని అలాగే కలిసిపోతున్నాం. ఇష్టా ఇష్టాలు.. ప్రాణం ఉన్నంత వరకు ప్రజల కోసం సామాన్య జీవితం గడపడమే నాకు ఇష్టం. చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సినిమా థియేటర్‌కు కూడా వెళ్లలేదు. జేసుదాస్, మహ్మద్‌రఫీ, కిశోర్‌కుమార్, ఘంటసాల ఇలా వారు పాడిన అలనాటి పాటలు జర్నీలో విం టుంటాను. మాంసాహారం అంటే కొంచెం ఇష్టం. నా భార్యకు, నాకు, నా కుటుంబానికి, నా అక్కలు, తమ్ముళ్లు, చెల్లెలు ఇలా ఎవరికైనా సామాన్య జీవితం గడపడమే ఇష్టం. సింపుల్‌గా పల్లెల్లోనూ ఉంటూ ఇప్పటికీ వ్యవసాయం చేస్తూనే ఉన్నారు వారంతా. వ్యవసాయ పనులు చూసుకుంటా మంత్రిగారి కోడలన్న ఆలోచన కూడా మాకు లేకపోయేది. ఇప్పుడు మా వారు ఎమ్మెల్యేగా రెండు సార్లు గెలిచారు. అయినా మాకు అలాంటి ఆలోచనలే రావు. ఎప్పటిలాగే ఉండడం మాకు తెలుసు. తెలిసిన వారంతా హైదరాబాద్‌లో ఉండాలని చెబుతుంటారు. దేగాం విడిచి పెట్టి వెళ్లడం నాకు నచ్చదు. ఆయన ఎప్పుడూ ప్రజలతో బిజీగా ఉంటారు. కుటుంబ బాధ్యతలు నేను చూసుకుంటాను. ఉన్న వ్యవసాయ పనులు చేయిస్తాను. ఎక్కడికి వెళ్లాలన్న బస్సులోనే వెళ్లివస్తాను. తెలిసినవారు కారులో పోదామన్న అలాంటిది ఇష్టం ఉండదు. న్యాయవాద వృత్తిచేసే సమయం నుంచే ఎక్కువగా ప్రజల మధ్య ఉండేవారు. ఇప్పటికీ ఆయన ప్రజలతోనే ఉంటారు. – గడ్డిగారి లక్ష్మి, ఎమ్మెల్యే సతీమణి -
మరో వివాదంలో టీఆర్ఎస్ నేత
సాక్షి, హైదరాబాద్: అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్ తరచూ ఏదో ఒక వివాదంలో నిలుస్తున్నారు. చైతన్యపురి కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. వైన్ షాప్ టెండర్లకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన లక్కీ డ్రాలో తన కొడుకు యశ్వంత్ రెడ్డి పేరు మీద మూసారాంబాగ్‌లో ఒక వైన్స్ షాప్‌ను దక్కించుకున్నారు. ఈ క్రమంలో స్థానికంగా ఉంటున్న లిక్కర్ వ్యాపారి విజయ్ భాస్కర్ రెడ్డితో కలిసి వ్యాపారం కొనసాగిస్తానని నమ్మబలికి వ్యాపారంలో వాటా నిమిత్తం అతని వద్ద రూ.15 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తీరా ఇప్పుడు వాటా ఇవ్వకపోవడమేగాక తీసుకున్న డబ్బులు అడిగినా తిరిగి ఇవ్వడం లేదు. తన కుమారులు, తన అనుచరులతో అతని ఇంటిపై రెక్కీ నిర్వహించడంతో పాటు శుక్రవారం రాత్రి వ్యాపారం ముగించుకుని ఇంటికి వస్తున్న విజయ్‌భాస్కర్ రెడ్డిపై విఠల్‌రెడ్డి అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. 'నీవు విఠల్‌రెడ్డి పై కేసు పెడతావా, మమ్మల్నే ఇచ్చిన డబ్బులు అడుగుతావా' అంటూ నిలదీశారు. నీకు ప్రాణం మీద ఆశ లేదా అంటూ బెదిరింపులకు పాల్పడడంతో బాధితుడు విజయ్‌భాస్కర్‌రెడ్డి కార్పొరేటర్ విఠల్‌రెడ్డి, అతని కుమారులు యశ్వంత్ రెడ్డి, మణికాంత్ రెడ్డిలతో తనకు ప్రాణభయం ఉందని, తనకు న్యాయం చేసి వారిపై చర్యలు తీసుకోవాలని మలక్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో తనకు మాముళ్లుగా రూ. 10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు రద్దు చేయిస్తానంటూ ఓ ఇంటి యజమానిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా భవన నిర్మాణపు పనులు చేస్తున్న కూలీలపై దాడికి కూడా పాల్పడ్డాడు. దీంతో భవన యజమాని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 324, 341, 385, 447, 506 సెక్షన్ల కింద కార్పొరేటర్ విఠల్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... నగరంలోని కొందరు కార్పొరేటర్లు అక్రమ దందాకు పాల్పడుతూ ప్రభుత్వ ప్రతిష్టను దిగజారుస్తున్నారనే విమర్శలొస్తున్నాయి. -
సాదాసీదాగా..
ఆదిలాబాద్ అర్బన్ : మొదటిసారిగా నిర్వహించిన జిల్లా పరిషత్ స్థాయీ సంఘాల సమావేశాలు సాదాసీదాగా కొనసాగాయి. కొత్త ప్రజాప్రతినిధులు.. కొత్త బాధ్యతలు.. మొదటిసారి కమిటీ అధ్యక్షులు.. ఇలా అంతా కొత్తకొత్తగా అన్నట్లు సాగింది. సమావేశాలు జిల్లా పరిషత్‌లోని చైర్పర్సన్ చాంబర్లో మంగళవారం జరిగాయి. ఆయా కమిటీల అధ్యక్షుల ఆధ్వర్యంలో సమీక్షలు నిర్వహించారు. మొత్తం ఏడు స్థాయీ సంఘాలు ఉండగా.. ఉదయం 11 గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగాయి. ప్రణాళిక, ఆర్థిక స్థాయి కమిటీ, గ్రామీణాభివ ృద్ధి కమిటీ, వ్యవసాయ కమిటీ, విద్య, వైద్య సేవల కమిటీ, మహిళా సంక్షేమ కమిటీ, సాంఘిక సంక్షేమ కమిటీ, పనుల స్థాయి కమిటీలు ఉన్నాయి. కాగా, జిల్లా పరిషత్ చైర్పర్సన్ వల్లకొండ శోభారాణి, కమిటీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆరు స్థాయీ సంఘ సమావేశాలు జరుగగా, వ్యవసాయ కమిటీ స్థాయీ సంఘ సమావేశం జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ మూల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశాలకు కమిటీ జెడ్పీ సభ్యురాళ్లు అధ్యక్షులుగా వ్యవహరించారు. కాగా.. మొదటిసారి నిర్వహించిన ఈ సమావేశాలకు ముఖ్యనేతలు గైర్హాజరయ్యారు. పనుల కమిటీలో ఉన్న నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి తప్ప ఇతర శాసన, పార్లమెంట్, మంత్రి, మండలి సభ్యులు హాజరుకాకపోవడం గమనార్హం. కాగా, స్థాయి సంఘాల సమావేశంలో కమిటీ సభ్యులు చర్చించినా అంశాలు మండల స్థాయి సమస్యలు కావడం శోచనీయం. జిల్లా స్థాయి సమస్యలు చర్చకు రావడం లేదని అధికారులు చర్చించుకోవడం విశేషం. కాగా కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు జిల్లా స్థాయి అధికారులు సమాధానాలు ఇస్తూ అంశాలపై చర్చించారు. ఈ సమావేశాల్లో జిల్లా పరిషత్ సీఈవో అనితాగ్రేస్, జిల్లా అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు. స్థాయి సంఘాల వారీగా... గ్రామీణాభివ ృద్ధి కమిటీ : ఈ స్థాయి కమిటీకి అధ్యక్షులుగా జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి నిర్వహించగా.. ఆమె ఆధ్వర్యంలోనే కమిటీ సమీక్ష జరిగింది. బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి, వడ్డీ లేని రుణాలు, మార్కెటింగ్, పింఛన్లు, ఉన్నతి, వికలాంగుల సంక్షేమంపై చర్చించారు. జిల్లాలో 122 మంది వికలాంగులకు పోలియో వ్యాధికి శస్త్ర చికిత్సలు మొదటి సారిగా చేయించామన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ రెవెన్యూ భూములకు చెందిన 1,07,936 కేసులు నమోదు కాగా, 1,00,472 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. జిల్లాలో పది పాలశీతలీకరణ కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం నాలుగు పని చేయడం లేదని వివరించారు. హెల్త్ నూట్రిషీయన్ ద్వారా 2042 మంది బాలింతలు లబ్ధిపొందుతున్నారని వివరించారు. బంగారుతల్లి పథకం కింద ఇప్పటి వరకు 14,158 మందిని నమోదు చేశామన్నారు. జిల్లాలోని పర్యాటక అభివ ృద్ధి పనులపైనా చర్చించారు. కాగా, పింఛన్లు అర్హులకు సైతం రావడం లేదని, నడవలేని వారు సైతం ఉన్నారని, వారి కుటుంబ సభ్యులకు నెలనెలా పింఛన్ ఇచ్చేలా చూడాలని కమిటీ సభ్యులు చైర్పర్సన్ ద ృష్టికి తెచ్చారు. వ్యక్తిగత మరుగుదొడ్లు సొంత డబ్బులతో నిర్మించుకున్నా ఇప్పటి వరకు బిల్లులు చెల్లించలేదన్నారు. ఉపాధి పనులకు సంబంధించి ఇప్పటి వరకు కూలీ డబ్బులు చెల్లించని దుస్థితి నెలకొందని వివరించారు. దీంతో పాటు వివిధ 13 అంశాలను ఈ కమిటీలో సమీక్షించారు. ప్రణాళిక, ఆర్థిక స్థాయి కమిటీ.. : ఈ కమిటీకి జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి అధ్యక్షులుగా వ్యవహరించారు. సాధించిన ప్రగతి అంశాలపై చర్చించారు. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ సభ్యులుగా ఉన్నారు. ఆర్థిక స్థితిగతులపై సమీక్షించారు. వ్యవసాయ కమిటీ : ఈ కమిటీకి అధ్యక్షుడిగా జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి వ్యవహరించారు. వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన అంశాలను చర్చించారు. వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, హార్టికల్చర్, మార్కెటింగ్, ఆత్మ, ఇతర అంశాలు చర్చించారు. ముఖ్యంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదని, భూమి రైతులకు పరిహారం ఇస్తున్నారని, దీన్ని నిలుపుదల చేసి రైతులకు మేలు చేయాలని సభ్యులు కమిటీ ద ృష్టికి తెచ్చారు. 30 శాతం మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆదర్శ రైతుల వల్ల పూర్తి స్థాయిలో వారు చెప్పిన పేర్లు పరిహారం జాబితాలో ఉన్నాయని కమిటీ ద ృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం రైతులు రుణాల మాఫీకి, రీ షెడ్యూల్‌కు, నష్ట పరిహారానికి నోచుకోవడం లేదని కమిటీ సభ్యులు వివరించారు. కోటపల్లి మండలంలోని సిర్పా గ్రామంలో అనుమతులు లేకుండా ఎరువులు విక్రయిస్తున్నారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. దీంతో ఆ ఏరియాలో 200 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిందని జేడీఏ రోజ్‌లీల ద ృష్టికి తెచ్చారు. అనంతరం ఒక్కో శాఖపై సమీక్షించారు. విద్య, వైద్య సేవల కమిటీ : ఈ కమిటీకి జెడ్పీ చైర్‌పర్సనే అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఎనిమిది అంశాలపై చర్చ జరిగింది. పాఠశాలల్లో కంప్యూటర్ విద్య మూలనపడిందని, పాఠశాలల్లో కంప్యూటర్ నిర్వహణ కొత్త సంస్థకు అప్పగించేందుకు రాష్ట్ర స్థాయికి పంపాలని సభ్యులు కమిటీ ద ృష్టికి తెచ్చారు. భీమిని మండల వైద్యాధికారి కార్యాలయంలో ఒకే డాక్టర్ ఉన్నారని, అక్కడ స్థానికంగా ఉండే డాక్టర్‌ను నియమించాలన్నారు. రిమ్స్ ఆస్పత్రిలో డెంగ్యూ వ్యాధికి మెడిసిన్ దొరుకుతుందా.. అని అధికారులను ప్రశ్నించారు. లక్షలు ఖర్చు చేస్తూ ఇతర జిల్లాలో వైద్యం చేయించుకున్నారని చెప్పారు. సిర్పూర్(టి)లోని ఆస్పత్రిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నా.. అత్యవసర సమయానికి ఒక్క డాక్టర్ కూడా అందుబాటులో ఉండరని చెప్పారు. మహిళా సంక్షేమ కమిటీ.. : కుంటాల జెడ్పీటీసీ సభ్యురాలు రాథోడ్ విమల అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఈమె ఆధ్వర్యంలో ఏడు అంశాలపై చర్చ జరిగింది. అంగన్వాడీ భవనాలు కావాలని, జైనూర్‌లో పనిచేస్తున్న సూపర్వైజర్, అంగన్వాడీ వర్కర్లు ఇంత వరకు తెలియడం లేదని జెడ్పీటీసీ సభ్యులు కమిటీ ద ృష్టికి తెచ్చింది. పౌష్టికాహారం వివరాలు ఇంత వరకు తెలియదని భైంసా జెడ్పీటీసీ సభ్యుడు తెలిపారు. సాంఘిక సంక్షేమ కమిటీ.. : ఈ కమిటీకి అధ్యక్షురాలిగా ఖానాపూర్ జెడ్పీటీసీ సభ్యురాలు తాళ్లపెల్లి సునిత ఉన్నారు. మొత్తం ఎనిమిది అంశాలపై చర్చ జరిగింది. ఎస్సీ, బీసీ కులాలకు చెందిన ప్రగతి అంశాలపై చర్చించారు. సాంఘిక, వెనుకబడిన తరగతుల పాఠశాలల్లో ఇంత వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని, హాస్టల్ విద్యార్థులకు బెడ్‌షీట్ ఇవ్వలేదని సభ్యులు కమిటీ ద ృష్టికి తెచ్చారు. గురుకుల పాఠశాలల్లో, వసతి గ ృహాల్లో సోలార్ వెలుగులు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు కోరారు. కస్తూరిబా బాలిక విద్యాలయాల్లో నాణ్యత లేని కూరగాయలు కొని విద్యార్థులకు పెడుతున్నారని చెప్పారు. పనుల స్థాయి కమిటీ.. : ఈ కమిటీకి జెడ్పీ చైర్పర్సన్ శోభారాణి అధ్యక్షులు. కమిటీలో ఉన్న మొత్తం 26 అంశాలపై చర్చించారు. ఒక్కో అంశానికి ఐదు నిమిషాల చొప్పున సమయం కేటాయించారు. పనుల స్థాయి కమిటీ సమీక్షల్లో పెండింగ్‌లో ఉన్న పనులు ప్రధానంగా చర్చించారు. రోడ్లు, భవనాలు, పంచాయతీ రాజ్ శాఖ ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. మండల స్థాయిలో జరిగిన సర్వసభ్య సమావేశాలకు సైతం 50 శాతం మంది మండల స్థాయి అధికారులు హాజరుకావడం లేదనినిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి కమిటీ ద ృష్టికి తెచ్చారు. ముఖ్యంగా పనులు పూర్తైపెండింగ్లో ఉన్న వివిధ బిల్లులు, భవన ప్రారంభోత్సవాలు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. భవనాలు పూర్తి చేసి తాళాలు వేసుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం ఒక్కో అంశంపై చర్చించారు.