ముధోల్ నియోజకవర్గం
ముధోల్ నియోజకవర్గంలో సిటింగ్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి రెండోసారి భారీ ఆదిక్యతతో గెలిచారు. ఆయన తన సమీప ప్రత్యర్ది బిజెపికి చెందిన పడకంటి రమాదేవీపై 43364 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. కాంగ్రెస్ ఐ అభ్యర్దిగా పోటీచేసిన రామారావు పటేల్ పవార్‌కు 36396 ఓట్లు వచ్చి మూడో స్థానంలో ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని నియోజకవర్గాలలో బిజెపి, కాంగ్రెస్ ఐలు గట్టి పోటీ లో ఉండడంతో ఓట్ల చీలిక టిఆర్‌ఎస్‌కు బాగా కలిసి వచ్చినట్లు కనిపిస్తుంది. విఠల్ రెడ్డికి 83703 ఓట్లు రాగా, రమాదేవికి 40339 ఓట్లు వచ్చాయి. విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలిచి, కొంతకాలానికి టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు.
విఠల్ రెడ్డి తండ్రి గడ్డెన్న ముదోల్ నుంచి గతంలో ఆరుసార్లు గెలిచారు. విఠల్ రెడ్డి సామాజికవర్గ పరంగా రెడ్డివర్గం వారు. సీనియర్ నేత, కేంద్రంలోను, రాష్ట్రంలోను మంత్రిగా పనిచేసిన ఎస్.వేణుగోపాలాచారి ముధోల్‌లో 2014లో ఓడిపోవడం విశేషం. 2009లో టిడిపి తరపున పోటీచేసి గెలుపొందిన వేణుగోపాలాచారి ఆ తర్వాత టిఆర్‌ఎస్ లో చేరారు. 2009లో ప్రజారాజ్యం తరపున పోటీచేసి ఓడిపోయిన జి.విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసి విజయం సాధించారు.
ఎన్నికలైన కొద్ది కాలానికే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చే యకుండానే అధికార టిఆర్‌ఎస్ లో చేరారు.ఆయనపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ స్పీకర్‌కు పిటిషన్ ఇచ్చింది. అది విచారణ కాకముందే మళ్లీ ఎన్నికలు వచ్చాయి. 2018లో టిఆర్‌ఎస్ నుంచి గెలిచారు. ముదోల్‌లో పదిసార్లు రెడ్డి సామాజికవర్గం నేతలు ఎన్నిక కాగా ఒకసారి బ్రాహ్మణ, రెండుసార్లు ఇతరులు గెలిచారు. ప్రముఖ వాణిజ్యవేత్త అయిన నారాయణరావు పటేల్ 1994లో ఇక్కడ నుంచి టిడిపి పక్షాన గెలవగా, 1999లో ఓడిపోయారు.
2004లో ఈయన టిఆర్‌ఎస్ తరుఫున గెలిచారు. కాని ఆ తరువాత కాలంలో టిఆర్‌ఎస్ అసమ్మతి నేతగా మారిపోయారు. టిఆర్‌ఎస్ విప్ ఉల్లఘించి పదవిని కోల్పోయిన తొమ్మిది మంది ఎమ్మెల్యేలలో ఈయన ఒకరు. అయితే నారాయణరావు పటేల్ స్పీకర్ తీర్పు రావడానికి ఒకరోజు ముందే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసారు. 2009లో ముధోల్ లో గెలిచిన వేణుగోపాలాచారి గతంలో నిర్మల్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందితే, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు గెలిచారు.
రాష్ట్రంలో చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లోను, కేంద్రంలో దేవేగౌడ, ఐకె గుజ్రాల్ మంత్రివర్గాలలో పనిచేశారు. ముధోల్‌లో కాంగ్రెస్, కాంగ్రెస్ ఐలు కలిసి ఏడు సార్లు, టిడిపి మూడుసార్లు, టిఆర్‌ఎస్ రెండుసార్లు గెలవగా, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. ఆదిలాబాదు జిల్లాలోనే అత్యధికంగా ఆరుసార్లు గెలిచిన జి.గడ్డెన్న ముధోల్ నుంచి ఆరుసార్లు గెలవగా అందులో ఒకసారి ఏకగ్రీవం కావడం విశేషం. ఈయన కోట్ల మంత్రివర్గంలో కూడా పనిచేశారు. గడ్డెన్న 1967లో ఇండిపెండెంటుగా గెలవగా, ఆ తరువాత కాంగ్రెస్ పక్షాన రెండుసార్లు, 1983 నుంచి మూడుసార్లు కాంగ్రెస్ ఐ తరుపున విజయం సాధించారు. గోపిడి గంగారెడ్డి 1952లో నిర్మల్‌లో సోషలిస్టుగా, 1957లో ఇండిపెండెంటుగా, 1962లో కాంగ్రెస్ తరుఫున గెలిచారు.
ముధోల్ గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment