ముధోల్‌లో బీజేపీకి పట్టు.. బీఆర్ఎస్పై అసంతృప్తి?
ఈ ఎమ్మెల్యే మాకోద్దంటూ స్థానిక ప్రజలు, ప్రజా ప్రతినిదులు సైతం తిరగబడుతున్నారు. ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మార్చాలంటున్నారు. మార్చకపోతే మాదారి మేము చూసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అయినా అధిష్టానం ఆయనకే మరోసారి బీఆర్ఎస్ టికెట్ కట్టబెట్టింది. దాంతో ముధోల్ గులాబీ దళంలో అసంతృప్తి ఛాయలు కనిపిస్తున్నాయట. మరి అధికార పార్టీలోని అసంతృప్తి సెగ కమలం పార్టీకి అనుకూలంగా మారుతుందా? ముథోల్ గడ్డపై కాషాయ జెండా ఎగురుతుందా? మాజీ మంత్రి వేణుగోపాల్ ఛారి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల రంగంలో దిగుతారా? ముధోల్ గడ్డ ఎన్నికల సమరంపై సాక్షి స్పెషల్ రిపోర్టు.
నిర్మల్ జిల్లాలో ముథోల్ నియోజకవర్గం ఉంది. ఇది ఒకప్పడు కాంగ్రెస్ కంచుకోట. ఇప్పుడు ఆ కాంగ్రెస్ కోట గులాబీ సామ్రాజ్యంగా మారింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ అధిక్యతతో గత అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజయం సాధించారు. మళ్లీ రికార్డు స్థాయిలో మెజారిటీ సాధించి సత్తా చాటాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తహతహలాడుతున్నారు. నియోజకవర్గంలో ముథోల్, బైంసా రూరల్, బైంసా పట్టణం, కుబీర్, కుంటాల, లోకేశ్వరం, బాసర మండలాలు ఉన్నాయి. వీటిలో 2,26,725 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా నియోజకవర్గంలో మున్నూరు కాపు, ముస్లిం, లంబడా, మరాఠ ఓట్లు ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల మద్దతుతో గడ్డేన్నగారి విఠల్ రెడ్డి 2014లో కాంగ్రెస్ నుండి గెలుపోందారు. మారిన రాజకీయ పరిస్థితులతో బీఆర్ఎస్లో చేరారు.
ముచ్చటగా మూడోసారి.. ముధోల్‌పై బీఆర్ఎస్ కన్ను!
2018లో జరిగిన ఎన్నికలలో 83,933 ఓట్లతో 46 శాతం ఓట్లు సాధించారు. బీజేపీ నుండి పోటీ చేసిన రమాదేవి 40,602 ఓట్లతో 22 శాతం ఓట్లు సాధించారు. రమాదేవిపై 43,331 మేజారీటీ రికార్డు స్థాయిలొ విజయం సాధించారు విఠల్ రెడ్డి. మళ్లీ ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని తహతహలాడుతున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గ్రామీణ ప్రాంతంలో రోడ్డు రవాణా సౌకర్యాలు కల్పించారు. అదే విధంగా ముథోల్, బైంసా అసుపత్రులలో బెడ్ల సంఖ్య పెంచి రోగులకు వైద్య సేవలు మేరుగుపరిచారు. పల్సికర్ రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌తో ముంపుకు గురైనా గుండేగామ్ గ్రామస్తులకు పరిహరం మంజూరు చేయించారు.
అదే విధంగా బాసర మాస్టర్ ప్లాన్ కోసం యాబై కోట్లు మంజూరు చేయించారు. అభివృద్ధి పథకాలతో పాటు విఠల్ రెడ్డి ప్రజల్లో సౌమ్యుడిగా మంచి పేరుంది. కానీ అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న అభివృద్ధి చేసింది అణువంత మాత్రమే అనే విమర్శలు ఏదుర్కోంటున్నారు. ప్రాణహిత చేవేళ్ల 28వ ప్యాకేజీతో నియోజకవర్గంలో సాగునీటి కోసం అప్పట్లో కాల్వలు తవ్వారు. గత కాంగ్రెస్ హయంలో ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అదేవిధంగా కాల్వలు కనిపిస్తున్నాయి. 28 ప్యాకేజీ పనులు పురోగతి లేదు. రైతులకు సాగునీరు అందడం లేదు. అదేవిధంగా గుండేగామ్ ప్రజలకు పునరావాసం క్రింద నిధులు మంజూరైనా బాధితులకు పరిహరం అందలేదు.
బీఆర్ఎస్పై అసంతృప్తి
పైగా బాధితులు కోరిన విధంగా పరిహరం ఇవ్వడం లేదని ఎమ్మెల్యే తీరుపై బాధితులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బాసర టేంపుల్ సిటీ అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మాటలు కోటలు దాటుతున్నాయి. నిధుల మంజూరుతో అనువంత కూడా అభివృద్ధి జరగడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే బాసర ట్రిపుల్ ఐటి వివాదాల పుట్టగా మారింది. స్థానిక ఎమ్మెల్యేగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం అయ్యారని ఎమ్మెల్యే తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. విఠల్‌రెడ్డి వైఫల్యాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది. సమస్యలపై అట్టిముట్డనట్లుగా ఉండే ఎమ్మెల్యే తీరు ప్రజలకు నచ్చడం లేదట. దీనితో పాటు పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది. ఎకంగా స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు తిరుగుబాటు సమావేశం నిర్వహిస్తున్నారు.
పార్టీ పదవులు, మార్కేట్, బాసర అమ్మవారి ఆలయం పదవులు భర్తి చేయని ఎమ్మెల్యేను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమదారి తాము చూసుకుంటామని పార్టీకి అల్టీమేటమ్ జారీ చేశారట. అయితే విఠల్ రెడ్డిపై ప్రజల్లో వ్యతిరేకతతో పాటు ముథోల్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఉంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గంలో బీజేపీ పట్టుందని నిరూపితమైంది. దీనికి తోడు బైంసా మున్సిపల్లో ఎంఐఎంకి పట్టుంది. ఎళ్లుగా మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుని పాలన సాగిస్తోంది. ఎంఐఎం పాలనకు వ్యతిరేకంగా హిందూ సానుభూతి ఓటర్లు బీజేపీకి మద్దతు పలుకుతుండటం విశేషం. ఇక్కడ బీజేపీ కంటే హిందు వాహిని బలంగా ఉంది. ఇక్కడి నుండి రెండు సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు బీజేపీ అభ్యర్థి రమాదేవి.
గెలుపు ధీమాతో కమలం?
అయితే బీజేపీకి నియోజకవర్గంలో ఊపు పెరిగింది. బండి సంజయ్ పాదయాత్ర నియోజకవర్గంలో పార్టీకి బలాన్ని పెంచింది. గెలుపు ఖాయమనే బావన పార్టీ నాయకులలో పెరిగింది. ఒకవైపు సంజయ్ పాదయాత్రకు తోడు కాంగ్రెస్ మాజీ డీసీసీ అధ్యక్షుడు రామరావు పటేల్, మోహన్ రావు పటేల్ పార్టీలో చేరారు. రమాదేవితో పాటు ఈ ఇద్దరు కూడ టిక్కెట్ కోసం పోటీ పడుతున్నారట. పార్టీ అభ్యర్థులుగా ప్రకటించకపోయినా ప్రజల్లోకి ముగ్గురు వెళ్లుతున్నారు. ప్రజల మద్దతు కూడ గడుతున్నారట ఎన్నికలలో పోటీ చేసి విఠల్ రెడ్డిపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్దమవుతున్నారట ముగ్గురు. టిక్కెట్ కోసం సాగిస్తున్నా పోరు పార్టీని బలహీనం చేస్తోందట. ఏవరికి వారు పోటీ పడి ఈ ముగ్గురు నాయకులు పార్టీని బలహీనం చేస్తున్నారని కార్యకర్తలు దాల్చిన. ఈ ముగ్గురు కలిసి పార్టీ టిక్కెట్ ఇచ్చిన అభ్యర్థి కోసం పనిచేయకపోతే ఓటమి తప్పదని పార్టీ వర్గాలే ధ్రువీకరిస్తున్నాయి.
రామారావు పటేల్ కాంగ్రెస్ వీడటంతో ఆ పార్టీకి పోటీ చేసే అభ్యర్థి కరువయ్యారు. ద్వితీయ శ్రేణి నాయకులే పోటీ దిక్కు అన్నట్టు చందంగా మారింది. బలమైన అభ్యర్థి కోసం పార్టీ పెద్దలు అన్వేషణ సాగిస్తున్నారు. వేణుగోపాల్ చారికి బీఆర్ఎస్ టిక్కెట్ దక్కకపోతే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమైందట. బీజేపీ టిక్కెట్ పంచాయితీ తనకు అనుకూలంగా ఉందని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అంచనా వేసుకుంటున్నారట. బీజేపీ టిక్కెట్ పోరు, ఎంఐఎం మద్దతు అభిస్తే సంక్షేమ పథకాలతో విజయం సాధించడం ఖాయమని భావిస్తున్నారు ఎమ్మెల్యే. బీజేపీ మాత్రం హిందూ ఓటు బ్యాంకు, ఎంఐఎం వ్యతిరేక ఓట్లు, సర్కార్ వైఫల్యాలు విజయానికి చెరువచేస్తాయని అంచనా ఉంది. ఈసారి ఆరునూరైనా ముథోల్ గడ్డపై కమలం జెండా ఎగురడం ఖాయమంటున్నారట ఆ పార్టీ నాయకులు. మరి ఈమూడు పార్టీల్లో ఏవరు విజయం సాదిస్తారో చూడాలి.