నిర్మల్: ఎన్నికల సమరానికి బీఆర్‌ఎస్ సై అంటోంది. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచేదెవరో ఇప్పటికీ ఖరారైపోయింది. ఇక వారితో తలపడేదెవరో తేలాల్సి ఉంది. గులాబీదళం నుంచి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి(నిర్మల్), గడ్డిగారి విఠల్‌రెడ్డి(ముధోల్), భూక్య జాన్సన్‌నాయక్(ఖానాపూర్) పోటీచేయనున్నారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన ప్రత్యర్థులైన బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది ఇంకా స్పష్టత లేదు.
నిర్మల్‌లో అభ్యర్థులు దాదాపు ఖరారైనట్లే ఉన్నా.. ముధోల్, ఖానాపూర్ నియోజకవర్గాలు చాలా క్రిటికల్‌గా ఉన్నాయి. రెండు పార్టీల్లో పోటాపోటీగా ఆశావహులు ఉండటంతో ఆ రెండు నియోజకవర్గాలే కీలకంగా మారాయి. కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుండగా, బీజేపీ ఇప్పటికే కొన్ని పేర్లను ఫైనల్ చేసి పరిశీలిస్తోంది. ఈ రెండు పార్టీలూ ఇప్పటి వరకు ఇంకా అభ్యర్థుల పేర్లను మాత్రం బయటపెట్టలేదు. ఈ పార్టీలతోపాటు ఈసారి బీఎస్పీ బలమైన పోటీ ఇచ్చే అభ్యర్థుల కోసం ప్రయత్నిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment